» »చరిత్రలో మాయమైన నగరాలు

చరిత్రలో మాయమైన నగరాలు

ఒకప్పుడు దిగువ పేర్కొనిన నగరాలు మధ్య యుగపు రాజుల పాలనలో అధికార విలువలతో విలసిల్లేవి. ఒక ప్రదేశం, లేదా ఒక వ్యక్తి ఏదైనప్పటికీ, కాలానికి తలొగ్గి తీరాల్సిందే. నేడు ఈ నగరాలు గత విభవాలకు ప్రతీకలు అయినప్పటికీ, ట్రావెలర్ లకు మంచి పర్యాటక స్థలాలు గా వున్నాయి.

చరిత్రలో మాయమైన నగరాలు

చరిత్రలో మాయమైన నగరాలు

విజయనగర

విజయనగర పట్టణం దాని వైభవోపేత రోజులలో సుమారు అయిదు లక్షల మంది ప్రజలను కలిగి వుంది. నేడు ఈ పట్టణ వైభవం అంతా హంపి శిధిలాలో చూడవచ్చు. ఇది ఒఇకప్పుదు ప్రపంచంలో పెకింగ్ - బీజింగ్ పట్టణాల తర్వాత రెండవ పెద్ద పట్టణంగా వుండేది. హంపి లోని శిధిలాలు నేడు ఒక వరల్డ్ హెరిటేజ్ ప్రదేశంగా మారాయి.

చరిత్రలో మాయమైన నగరాలు

చరిత్రలో మాయమైన నగరాలు

పూం పుహార్

పూమ్పుహార్ పుహార్ లేదా పూమ్పుహార్ తమిళనాడు లోని ఒక చిన్న టవున్. ఈ టవున్ ఒకప్పుడు ఎంతో వైభవోపేత పట్టణంగా విలసిల్లింది. కావేరి పుహుం పట్టినం పేరుతో ఈ పురాతన పోర్ట్ సిటీ తమిలక్కం లో చోళ రాజుల రాజ్యానికి రాజధానిగా వుండేది. 7 వ శతాబ్దపు శాసన లిఖితాలు ఈ టవున్ ఎన్నో పెద్ద భవనాలు కలిగి అభివృద్ధి చెందినా తవుంగా పేర్కొంటున్నాయి. చోళ రాజుల పట్టభిశేకాలు ఈ పట్టణంలోనే ప్రధానంగా జరిగాయి.

చరిత్రలో మాయమైన నగరాలు

చరిత్రలో మాయమైన నగరాలు

ముజిరిస్ ముసిరి

భారత దేశ నైరుతి భాగంలో ముజిరిస్ ముసిరి అని తమిళంలో అనబడే ఒక పురాతన సముద్ర రేవు పట్టణం సుమారు ఒకటవ శతాబ్దంలో వుండేది. అప్పటి సౌత్ ఇండియా లోని ప్రజలు ఈ రేవుపట్టణం ద్వారా ఫోయనిషి న్లు, ఈజిప్షియన్ లు గ్రీకులు, రోమన్ సామ్రాజ్యం లతో వ్యాపారాలు చేసారు. ఈ ముజిరిస్ పట్టణం అసలు సరిగ్గా ఎక్కడ వుందనేది చరిత్రకారులకు, పురావస్తు శాస్త్రవేత్తలకు నేటికీ తెలియదు. ఈ ప్రదేశం సుమారుగా కేరళ లో కోచిన్ కు ఉత్తరంగా 18 మైళ్ళ దూరంలో ప్రస్తుత క్రాగాన్ కోర్ కు సమీపంలో ఉండేదని భావిస్తారు.

Pic credit: Wiki Commons

చరిత్రలో మాయమైన నగరాలు

చరిత్రలో మాయమైన నగరాలు

లోథాల్

గుజరాత్ రాష్ట్రం లోని లోథాల్ పట్టణం పురాతన సింధు లోయ నాగరికతకు కేంద్రంగా విలసిల్లింది. ఈ ప్రదేశం నుండి పూసలు, రత్నాలు, మణులు, విలువైన బంగారు ఆభరణాలు వెస్ట్ ఆసియా మరియు ఆఫ్రికా దేశాలకు కూడా ఎగుమతి అయ్యేవి. ఈ పట్టన ప్రజలు రత్నాల ఆభరణాల తయారీలో నిపులుగా వుండేవారు. లోథాల్ పట్టణాన్ని ప్రపంచంలోనే మొదటి రేవు పట్టణం గా ప్రసిద్ధి చెందినది.

Pic credit: Wiki Commons

చరిత్రలో మాయమైన నగరాలు

చరిత్రలో మాయమైన నగరాలు

కాలిబంగాన్

కాలిబంగాన్ పట్టణం హరప్ప పూర్వచరిత్ర మరియుహరప్ప శిధిలాలు కలిగి వుంది. రాజస్తాన్ లోని గగ్గర్ నది దక్షిణపు భాగం లోని ప్రదేశాన్ని కాళీ బంగాన్ పట్టణం అనే వారు.సింధులోయ నాగరికతకు ఈ ప్రాంతం కేంద్ర బిందువని చరిత్ర చెప్తోంది. ఇక్కడ ప్రపంచపు మొట్ట మొదటి దున్నిన పొలం కనుగొన బడింది.

చరిత్రలో మాయమైన నగరాలు

చరిత్రలో మాయమైన నగరాలు

ద్వారక

శ్రీ కృష్ణుడి పాలనలో రాజధానిగా వున్న ఈ పట్టణం గుజరాత్ తీరంలో సముద్ర గర్భంలోకి మునిగిపోయింది. ఇక్కడ ఇప్పటికి కొన్ని అవశేషాలు కనపడతాయి. ద్వారక పట్టణం హిందువుల పవిత్ర చార్ ధాం పుణ్య క్షేత్రాలలో ఒకటి. దేశంలో అతి పురాతన మత పర పట్టణం. చరిత్ర మేరకు శ్రీ కృష్ణుడు ఈ నగరాన్ని నిర్మించాడని, ఆయన మరణం తర్వాత ఆ పట్టణాన్ని సముద్ర గర్భంలో మున్చివేశాడని చెపుతారు.

Pic credit: Wiki Commons

చరిత్రలో మాయమైన నగరాలు

చరిత్రలో మాయమైన నగరాలు

పట్టదక్కాల్

పట్టదక్కాల్ పట్టణం కర్ణాటక రాష్ట్రం లో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన ప్రదేశం. ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా చాళుక్యుల నాటి అనేక చారిత్రక స్మారకాలతో నేటికీ దీనికి గుర్తింపు కలదు.

చరిత్రలో మాయమైన నగరాలు

చరిత్రలో మాయమైన నగరాలు

డోలవీరా

స్థానికంగా డోలవీరా పట్టణాన్ని, కోటద టిమ్బా అని పిలుస్తారు. గుజరాత్ లోని ఈ పురావస్తు ప్రదేశంలో సింధు లోయ నాగరికతకు సంబంధించిన పురాతన శిధిలాలు కలవు. ఈ పురాతన అవశేషాలు క్రీ. పూ. 2650 - 1450 ల నాటివిగా చెపుతారు.