Search
  • Follow NativePlanet
Share
» »అండ‌మాన్ దీవుల అందాలు చూసొద్దామా! (రెండో భాగం)

అండ‌మాన్ దీవుల అందాలు చూసొద్దామా! (రెండో భాగం)

గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో గుర్తింపు పొందిన హేవ్‌లక్ రాధానగర్ బీచ్, మెయిల్ ఐలాండ్, ఫోర్టే ఒక్కొక్కటిగా చుట్టేశాం.

అన్నివైపులా కొబ్బ‌రి చెట్ల‌తో కౌగిలించుకుని, రెండు వైపుల నుంచి ఉష్ట‌మండ‌ల అడ‌వితో క‌ప్ప‌బ‌డి ఉండే రాధానగ‌ర్ బీచ్ మ‌మ్మ‌ల‌ను ఎంతగానో ఆక‌ర్షించింది.

అండ‌మాన్ దీవుల అందాలు చూసొద్దామా! (రెండో భాగం)

అండ‌మాన్ దీవుల అందాలు చూసొద్దామా! (రెండో భాగం)

ఎక్కడి నుంచి చూసినా కనిపించే ఇసుక తిన్నెలు, చెవులకు ఇంపుగా వినిపించే అలల హొయలు మమ్మల్ని ఎంతగానో ఆకర్షించాయి. అండమాన్ దీవులలో ప్రధానంగా ఎనిమిది దీవులను సందర్శకులు వీక్షించేందుకు అనుకూలంగా ఉంటాయి.

విమానమార్గంలో అయితే వీక్షకులు ఫోర్ ప్లే ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి దీవులను చూసేందుకు షిప్పులు, ఎసిఫెరీస్ లు అందుబాటులో ఉంటాయి. ఫెరీస్‌లో రెండు వంద‌ల మందికి పైగా ప్రయాణం చేయవచ్చు. కుటుంబ స‌మేతంగా ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చేవారికి ఈ ఫెరీలు ఎంతో అనువుగా ఉంటాయి. స‌ముద్ర‌పు అల‌ల‌పై ప్ర‌యాణం మ‌న‌సును ఎంతో ఉల్లాసంగా ఉంచుతుంది.

సాహ‌స క్రీడ‌లకు అనువైన‌ది..

సాహ‌స క్రీడ‌లకు అనువైన‌ది..

అండమాన్ దీవులలో నెయిల్, హావలక్, రాజ్ ఐలాండ్, నార్త్ బే, జాలిబాయ్ ఐలాండ్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సెల్లార్ జైల్, జపాన్ బాంబింగ్ పాయింట్, క్యూబా అండర్ సీవాక్, అక్వేరియం మ్యూజియం, భారాతంగ్ ప్రాంతాలను పెద్దఎత్తున వీక్షకులు సందర్శిస్తారు. స్నార్కెలింగ్ స‌ముద్ర న‌డ‌క లాంటి సాహ‌స‌ క్రీడ‌ల‌కు అద్భుత‌మైన అవ‌కాశాలు క‌లిగిస్తాయి ఇక్క‌డి ప్ర‌దేశాలు. భారాతంగ్ ప్రాంతంలో అగ్ని పర్వతం ఉంది. మిలిటరీ

సెల్యూలార్ జైలు అనుమ‌తి మేరకు దూరం నుంచి ఈ పర్వతాన్ని తిలకించవచ్చు. ఇక్క‌డి పేరుగాంచిన జాతీయ ఉద్యాన‌వ‌నం సౌత్ బ‌ట్ట‌న్ ఉద్యాన‌వ‌నం. ఈ ర‌క్షిత ద్వీపం మొత్తం వైశాల్యం ఐదు కిలోమీట‌ర్లు. దీని ప‌క్క‌నే ఉన్న నార్త్ బ‌ట‌న్‌, మిడిల్ బ‌ట‌న్ ద్వీపాలు కూడా ఉద్యాన‌వ‌నాలే. ద‌క్షిణ అండ‌మాన్ ద్వీపం తీర ప్రాంతంలో రాణి ఝాన్సీ మెరైన్ జాతీయ పార్క్‌లో ఒక భాగంగా ఇవి ఉన్నాయి.

వివిధ రకాల ప్యాకేజీలు

వివిధ రకాల ప్యాకేజీలు

అండమాన్ మాల్దీవుల‌ను సందర్శించటానికి అనేక ప్రముఖ ట్రావెలింగ్ సంస్థలు ప్యాకేజీలను అందుబాటులో ఉంచాయి. అంతర్జాలం ద్వారా ఆయా సంస్థల వెబ్సైట్లను సందర్శించి, ప్యాకేజీలను బుక్ చేసుకోవచ్చు. నాలుగు రాత్రులు, ఐదు పగళ్ళు, పది పగళ్లు, పదకొండు రాత్రులు ఇలా అనేక ప్యాకేజీలు ఉన్నాయి. ప్రయాణంతో పాటు విడిది, ఆహారం ఇలా అన్ని విషయాలనూ ఆ సంస్థలే

చూసుకుంటాయి. నేరుగా వెళ్లదలిచే వారికి విడిది కోసం ఎలాంటి ఇబ్బందులూ ఉండవు. దీవులలో అనేకమైన స్టార్ విడిది గృహాలు, రెస్టారెంట్లు, హోటళ్ళు సాధారణ ధరల్లో అందుబాటులో ఉంటాయి. అలాగే, ఈ దీవులలో నార్త్, సౌత్, చైనీస్, జపనీస్ వంటి అనేకరకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి. సీ ఫుడ్‌ను ఇష్ట‌ప‌డేవారికి అండ‌మాన్ ప‌ర్య‌ట‌న ఎన్నో రుచుల‌ను ఆస్వాదించేందుకు అవ‌కాశం క‌ల్పిస్తుంది. బెంగాలీ, మలయాళం, తమిళం, ఆంధ్రా ప్రాంతాల నుంచి ఎక్కువమంది ప్రజలు సందర్శన కోసం వస్తుంటారు.

ఎప్పుడెప్పుడు వెళ్లాలి?

ఎప్పుడెప్పుడు వెళ్లాలి?

అండమాన్ దీవులకు సాధారణంగా వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉండే ఏ సీజ‌న్‌లోనైనా వెళ్లొచ్చు. జనవరి నుంచి మే చివరకు, జులై, ఆగస్టు,సెప్టెంబర్ నెలలలో ఈ దీవులు రద్దీగా ఉంటాయి. అలాగే, ఈ కాలంలో ప్యాకేజీ ధరలు అధికంగా ఉంటుంది.

ప్యాకేజీల ద్వారా సాధారణంగా టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఐదు రోజుల ప్యాకేజీకి ఒక్కో మనిషికి రూ.20 వేల వరకూ ఖర్చవుతుంది. అమేజింగ్ అండమాన్ కోరల్ టూర్స్ అండ్ ట్రావెల్స్, మేక్ మై ట్రిప్, దామస్కుక్, యాత్ర.కామ్ తదితర అనేక టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థలు అందుబాటులో ఉన్నాయి. ఐదవ రోజు మేం చెన్నెయి నుంచి బెంగళూరుకు చేరుకుని, అక్కడి నుంచి అనంతపురం తిరిగి చేరుకున్నాం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X