Search
  • Follow NativePlanet
Share
» » వారంతా ఎందుకు ఇక్కడే చనిపోవాలనుకొంటారో తెలుసా?

వారంతా ఎందుకు ఇక్కడే చనిపోవాలనుకొంటారో తెలుసా?

చావు పుట్టుకులు ఎప్పటికీ బ్రహ్మ పదార్థాలే. ఈ విషయం పై ఒక్క హిందూ ధర్మంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక మతాల్లో అనేక విశిష్ట కథలు, ఆచారాలు ప్రచారంలో ఉన్నాయి. వీటిలో కొన్నింటికి గల కారణాలను ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు. పుట్టుక మన చేతిలో లేకపోయినా, చావు కొంత వరకూ మన నియంత్రణలో ఉంటుందనేది కాదనలేని సత్యం. హిందూ ధార్మం విషయానికి వస్తే మరణం ఈ సమయంలో ఇక్కడ వస్తే నేరుగా మనం స్వర్గానికి వెుతామని నమ్ముతారు. ఇలా చాలా మంది చనిపోవాలని భావించే ఒక ప్రాంతం గురించి పూర్తి వివరాలతో పాటు చుట్టు పక్కల ఉన్న దర్శనీయ స్థలాలు మీ కోసం....

వారణాశిలోని ఘాట్ లు

వారణాశిలోని ఘాట్ లు

P.C: You Tube

వారణాశిలోని గంగా తీరం అంతా స్నానఘట్టాలతో పాటు ఘాట్ లు ఉంటాయి. ఈ వారణాసిలో దాదాపు 84 ఘాట్ లు ఉన్నట్లు చెబుతారు. ఇక్కడ పరిత్ర స్నానాలతో పాటు దహన కాండలను నిర్వహిస్తారు.

అక్కడ ఏడాది పాటు దోచుకున్నా తరగని నిధి? అందుకే వందల ఏళ్ల నుంచి ఇప్పటికీ అన్వేషణఅక్కడ ఏడాది పాటు దోచుకున్నా తరగని నిధి? అందుకే వందల ఏళ్ల నుంచి ఇప్పటికీ అన్వేషణ

 వారణాశిలోని ఘాట్ లు

వారణాశిలోని ఘాట్ లు

P.C: You Tube
భారతదేశంలోని హిందువులే కాకుండా ప్రపంచంలోని ఇతర మతస్తులు కూడా ఎక్కువగా దర్శించే పుణ్యక్షేత్రాల్లో వారణాసి లేదా కాశీ మొదటి వరుసలో ఉంటుంది.

వారణాశిలోని ఘాట్ లు

వారణాశిలోని ఘాట్ లు

P.C: You Tube
ముఖ్యంగా ఇక్కడి కాశీ విశ్వేశ్వరుడిని, అన్నపూర్ణేశ్వరిని దర్శించుకోవడానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో ఇక్కడి ఘాట్ లను చూడటానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు.

వారణాశిలోని ఘాట్ లు

వారణాశిలోని ఘాట్ లు

P.C: You Tube
అందులోనూ మణి కర్ణికా ఘాట్ ను పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక్కడ మరణించిన వారికి మోక్షం ప్రసాదించమని లయకారకుడైన సాక్షాత్తు పరమశివుడు ఆ విష్ణువును కోరిన ప్రదేశం కాబట్టే దీనికి అంతటి ప్రాధాన్యత.

వారణాశిలోని ఘాట్ లు

వారణాశిలోని ఘాట్ లు

P.C: You Tube
అందువల్లే చాలా మంది ఇక్కడ మరణించాలని కోరుకొంటారు. ఈ మణికర్ణిక ఘాట్ లో చనిపోయిన వారి చెవిలో ఆ పరమశివుడు నేరుగా ఓ మంత్రం ఉపదేశిస్తుంటాడని అందువల్లే మోక్షం లభిస్తుందని చెబుతారు.

వారణాశిలోని ఘాట్ లు

వారణాశిలోని ఘాట్ లు

P.C: You Tube
ఇక ఈ మనికర్ణికాఘాట్ విషయానికి సంబంధించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. శివుడి సమక్షంలో విష్ణువు తన సుదర్శన చక్రంతో ఒక గోతిని తవ్వాడు.

వారణాశిలోని ఘాట్ లు

వారణాశిలోని ఘాట్ లు

P.C: You Tube
దానిని తన స్వేదంతో నింపుతుండగా విష్ణువు చెవి కుండలం అంటే మణికర్ణిక అందువలో పడింది. అందువల్లే దీనికి మణికర్ణికా ఘాట్ అని పేరు వచ్చినట్లు చెబుతారు.

వారణాశిలోని ఘాట్ లు

వారణాశిలోని ఘాట్ లు

P.C: You Tube
ఇదిలా ఉండగా పార్వతీదేవి తన చెవిపోగు అంటే మణి కర్ణిక ను ఈ ఘాట్ లో దాచిపెట్టి దానిని వెతకమని శివుడిని కోరినట్లు పురాణ కథనం. దీని వల్ల ఆ పరమశివుడు దేశ దిమ్మరి కాకుండా ఇక్కడే నిత్యం ఉంటాడని పార్వతి దేవి ఆలోచన.

వారణాశిలోని ఘాట్ లు

వారణాశిలోని ఘాట్ లు

P.C: You Tube
అందువల్లే ఈ మణికర్ణికా ఘాట్ లో పరమశివుడు నిత్యం ఉంటాడని చెబుతారు. అంతేకాకుండా దహనమైన శరీరం తాలూకు ఆత్మలను శివుడు స్వయంగా మణికర్ణిక కనిపించిందేమోనని అడుగుతాడని కూడా చెబుతారు.

వారణాశిలోని ఘాట్ లు

వారణాశిలోని ఘాట్ లు

P.C: You Tube
ఇక మణికర్ణికా ఘాట్ యజమాని హరిశ్చంద్రుడిని ఖరీదు చేసి ఇక్కడి ఘాట్ లో కాటికాపరిగా నియమించాడని చెబుతారు. ఆ ఘాట్ కే హరిశ్చంద్ర ఘాట్ అని పేరు.

 క్షుద్రశక్తులకు నిలయమైన ఆలయంలో రాత్రి పూట ఏమి జరుగుతుందో తెలుసా క్షుద్రశక్తులకు నిలయమైన ఆలయంలో రాత్రి పూట ఏమి జరుగుతుందో తెలుసా

వారణాశిలోని ఘాట్ లు

వారణాశిలోని ఘాట్ లు

P.C: You Tube
మణికర్ణికా ఘాట్ లోనే ఎక్కువ దహన సంస్కారాలు జరుగుతూ ఉంటాయి. అందువల్ల మణికర్ణికా ఘాట్ కు మహాశ్మశానమని కూడా పేరు. మొత్తంగా వారణాసిలో మిగిలిన ఘాట్ లతో పోలిస్తే ఈ మణికర్ణిక ఘాట్ ప్రాధాన్యత ఎక్కువ.

వారణాశిలోని ఘాట్ లు

వారణాశిలోని ఘాట్ లు

P.C: You Tube
కాశీ విశ్వశ్వరనాథ మందిరం పక్కనే ుణ్న దశాశ్వమేధ ఘాట్ వారణాశిలోని స్నాల ఘట్టాల్లో అతి పురాతనమైనది. బ్రహ్మ ఇక్కడ స్వయంగా పది అశ్వమేధ యాగాలు చేసి శివుడిని కొలిచాడని చెబుతారు.

వారణాశిలోని ఘాట్ లు

వారణాశిలోని ఘాట్ లు

P.C: You Tube
ప్రతి రోజూ సాయంకాలం పూజారులు ఇక్కడ అగ్ని పూజ చేసి శివుడిని, గంగమ్మను, సూర్యుడిని, అగ్నిని కొలుస్తారు. ఇక్కడ ప్రతి రోజూ నిర్వహించే హారతి నదిలో నుండి చూడటానికి యాత్రీకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అందుకు తగ్గట్లు పడవలు అందుబాటులో ఉంటాయి.

వారణాశిలోని ఘాట్ లు

వారణాశిలోని ఘాట్ లు

P.C: You Tube
మనమందిర్ ఘాట్ ను జైపూర్ రాజు మహారాజా జైసింగ్ నిర్మించారు. దీని వద్ద యాత్రా మందిరాన్ని నిర్మించాడు. ఇక్కడ భక్తులు సోమేశ్వరుడిని అర్చిస్తారు. అంబర్ రాజు మాన్ సింగ్ మానస సరోవర్ ఘాట్ ను ఇక్కడికి దగ్గర్లో నిర్మింపజేశాడు.

వారణాశిలోని ఘాట్ లు

వారణాశిలోని ఘాట్ లు

P.C: You Tube
ఘాట్ లతో పాటు ఇక్కడ పురాణ ప్రాధాన్యత కలిగిన ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది విశ్వనాథ మందిరం. దీని గోపురం పై బంగారు పూత కారణంగా దీనిని బంగారు మందిరం అని కూడా అంటారు.

వారణాశిలోని ఘాట్ లు

వారణాశిలోని ఘాట్ లు

P.C: You Tube
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఈ విశ్వేశ్వర లింగం ప్రధానమైనది. ఈ లింగ దర్శనం తక్కిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తులు విశ్వసిస్తారు. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని క్రీస్తుశకం 1780లో ఇండోర్ రాణి అహల్యాబాయ్ హోల్కర్ కట్టించారు.

వారణాశిలోని ఘాట్ లు

వారణాశిలోని ఘాట్ లు

P.C: You Tube
కాశీ విశ్వనాథాలయానికి సమీపంలో అన్నపూర్ణాదేవి ఆలయం ఉంది. విశ్వనాథుడిని దర్శించుకున్న తరువాత భక్తులు అన్నపూర్ణాదేవిని దర్శించుకోవడం అనాదిగా ఆచారంగా వస్తోంది. ఈ దేవాలయం లోపలే ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతోంది.

వారణాశిలోని ఘాట్ లు

వారణాశిలోని ఘాట్ లు

P.C: You Tube
కాశీలో ఉన్న పవిత్ర ఆలయాల్లో సంకట్ మోచన్ హనుమాన్ మందిరం కూడా ఒకటి. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని మదనమోహన మాలవీయ నిర్మించాడని చెబుతారు. ఇక్కడ హనుమంతుడికి మంగళ, శనివారాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

వారణాశిలోని ఘాట్ లు

వారణాశిలోని ఘాట్ లు

P.C: You Tube
ఇక్కడ ఇక్క భారత మాతా ఆలయం కూడా దర్శించదగినది. క్రీస్తుశంక 1936లో మహాత్మాగాంధీ చేత ఈ దేవాలయం ప్రారంభించబడింది. అదే విధంగా ఇక్కడ ఉన్న విర్లా మందిరం కూడా దర్శించదగినదే. బిర్లా కుటుంబంచేత ఈ దేవాలయం నిర్మించబడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X