• Follow NativePlanet
Share
» »శివయ్య తన నెత్తి పై మట్టి తట్టలు మోసింది ఇక్కడే....

శివయ్య తన నెత్తి పై మట్టి తట్టలు మోసింది ఇక్కడే....

Posted By: Beldaru Sajjendrakishore

బోళాశంకరుడుగా పేరొందిన శివుడు భక్తులను ఇట్టే కరుణిస్తాడని ప్రతీతి. భక్తుల కష్టాన్ని తన కష్టంగా మర్చుకుని మారిని కాపాడటంలో ఎప్పుడూ ఆ గంగాధరుడు ముందుంటాడని పురాణ కథల వల్ల తెలుస్తుంది. ఈ క్రమంలో కొన్ని సార్లు స్వయంగా పరమశివుడు ఇబ్బందులు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆ ఘటనలన్నీ లోక కళ్యాణం కోసమే. అటు వంటి గాథే ప్రస్తుత తెలంగాణ రాష్ర్టంలోని ఆదిలాబాద్ జిల్లాలోని ఓ చిన్న గ్రామంలో చోటు చేసుకుంది. పల్లె దాహార్తిని తీర్చడానికి గంగాధరుడు స్వయంగా చెరువును తవ్వాడు. ఈ క్రమంలో మట్టి తట్టలను కూడా మోసాడు. ప్రస్తుతం ఈ క్షేత్రం ప్రముఖ పుణ్యక్షేత్రంగా మారింది. ఇక ప్రతి శివరాత్రికి అక్కడే ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి. ఆ సమయంలో స్వయంగా ఆ నీలకంఠుడు ఇక్కడకు పార్వతీ సమేతుడై వస్తాడని ప్రతీతి. మనం కూడా ఆ పుణ్యక్షేత్రం ఎక్కడ ఉందో, వెళ్లాలో తెలుసుకుందామా

1. ఇదీ క్షేత్రకథ...

1. ఇదీ క్షేత్రకథ...

Image source

చాలా కాలం క్రితం ప్రస్తుత ఆదిలాబాద్ జిల్లాలోని సిరిచెల్మ గ్రామంలో పిట్టయ్య, నిమ్మవ్వ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు. వారికి సంతానం లేదు. ఈ క్రమంలో వారి ఊరికి ఒక రోజు ఓ బాలుడు పశువులు కాస్తూ వచ్చాడు. ఆ బాలుడిని అనాధ అని పిట్టయ్య దంపతులు తెలుసుకుంటారు. అతనికి మల్లన్న అని పేరుపెట్టి పెంచుకుంటుండేవారు. బాలుడు ఆపదలో ఉన్న వారికి సాయం చేస్తూ అందరికీ తలలో నాలుకలా తయారయ్యాడు. ఇదిలా ఉండగా ఒక ఏడు ఆ గ్రామంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో తాగు నీటికి కూడా గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పరిస్థితి చూసిన మల్లన్న తాను ఒక రోజు లోపుల చెరువు నిర్మించి గ్రమం దాహార్తిని తీస్తానని గ్రామస్తులకు చెప్పాడు.

2. పలుగు పార చేతపట్టి...

2. పలుగు పార చేతపట్టి...

Image source

అన్నట్లుగానే పలుగు పార తీసుకుని చెరువు తవ్వడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో ఒక రోజు లోపు చెరువు తవ్వడం అసాధ్యం అని పేర్కొంటూ ప్రజలు ఎవరూ సాయం చేయడానికి ముందుకు రారు. అయినా వెరువక ఉదయం నుంచి రాత్రి పొద్దు పోయేంత వరకూ ఒక్కడే చెరువును తవ్వుతూ మట్టిని గంపలో నింపి దూరంగా పారేసి వచ్చేవాడు. రాత్రి మొత్తం ఈ ప్రక్రియ కొనసాగింది. ఉదయం గ్రామ ప్రజలు లేసి చూసే సమయానికి చెవురు తవ్వడం పూర్తి కాగా బాలుడు కనిపించలేదు. అదే సమయంలో చెరువు మధ్య భాగంగా ఒక లింగం కనిపించింది.

3. లింగం పై భాగం కొంత లోనికి వెళ్లి...

3. లింగం పై భాగం కొంత లోనికి వెళ్లి...

Image source

లింగం పై భాగాన కొంత భాగం లోనికి వెళ్లి కనిపించింది. రాత్రంతా మట్టి తట్టలు మోయడం వల్ల ఇలా ఏర్కపడిందని ప్రజలు భావించారు. దీంతో ప్రజలు ఆ భాలుడే పరమేశ్వరుడని భావించి పూజలు చేయడం ప్రారంభించారు. అదే రోజు కలలో పిట్టయ్య దంపతులకు మల్లన్న కలలో కన్పించి తనకు ఆలయం కట్టించాల్సిందిగా తెలిపాడు. దీంతో అక్కడ ఆలయం వెలిసింది. ఇదే మల్లికార్జున ఆలయంగా ప్రసిద్ధి చెందింది.

4. నంది పై పడే కిరణాలు లింగం పై...

4. నంది పై పడే కిరణాలు లింగం పై...

Image source

ఈ పుణ్యక్షేత్రంలో రెండు నందులు ఉంటాయి. ఒకటి గర్భగుడిలో ఉండగా మరొకటి ఆలయానికి 25 అడుగుల దూరంలో ఉంటుంది. సూర్యకిరణాలు ఈ విగ్రహం పై నుంచి పడి అటు తర్వాత గర్భగుడిలోని లింగం పై ప్రసురిస్తాయి. ఈ సుందర ద`ష్యాన్ని చూడాల్సిందే కాని మాటల్లో వర్ణించడానికి వీలుకాదు. ఈ ద`ష్యం కేవలం సంక్రాంతి సమయంలో ఎక్కువ సేపు కనిపిస్తుంది.

5.శివరత్రి రోజున ప్రత్యేక పూజలు...

5.శివరత్రి రోజున ప్రత్యేక పూజలు...

Image source

ఇక ప్రతి శివరాత్రికి అక్కడే ప్రత్యేక పూజలు కూడా జరుగుతాయి. ఆ సమయంలో స్వయంగా ఆ నీలకంఠుడు ఇక్కడకు పార్వతీ సమేతుడై వస్తాడని ప్రతీతి. దీంతో స్థానికంగానే కాకుండా చుట్టు పక్కల గ్రామల నుంచి కూడా అనేక మంది భక్తులు ఇక్కడకు వచ్చి పూజల్లో పాల్గొంటారు.

6. అద్భుత శిల్ప సంపద...

6. అద్భుత శిల్ప సంపద...

Image source

ఈ దేవాలయంలో అద్భుత శిల్ప సంపదను చూడవచ్చు. ఈ శిల్పాలు భారతీయ సంస్క`తి సంప్రదాయాలకు అద్ధం పడుతాయి. అంతే కాకుండా రామాయణ, మహాభారత కథలకు సంబంధిచిన చిత్రాలు చూడవచ్చు. జైన, బౌద్ధ శిల్పాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. దీంతో వేర్వేరు రాజులు కూడా ఈ క్షేత్రం అభివ`ద్ధికి దోహదం చేశారని చరిత్ర కారులు చెబుతున్నారు.

7. జలపాతాల్లో స్నానాలు చేయవచ్చు...

7. జలపాతాల్లో స్నానాలు చేయవచ్చు...

Image source

ఈ క్షేత్రానికి సమీపంలో అనేక జలపాతాలు ఉన్నాయి. కుంటాల జలపాతం ఇక్కడకు 38 కిలోమీటర్లు. అటు పై గాయిత్రీ జలపాతం కూడా దగ్గరే. ఇక ఇచ్చొడ నుంచి పొచ్చెర జలపాతానికి 19 కిలోమీటర్లు.

8.ఎలా వెళ్లాలి...

8.ఎలా వెళ్లాలి...

Image source

హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ కు పలు బస్సలు ఉన్నాయి. ఆదిలాబాద్ నుంచి ఇచ్చొడ 32 కిలోమీటర్లు. . ఇక ఇచ్చొడ నుంచి 15 కిలోమీటర్ల దూరంలోనే సిరిచెల్మ వస్తుంది. ఇక నిర్మల్ నుంచి సిరిచెల్మ 48 కిలోమీటర్లు.

9. ఏ ఏ పర్యాటక ప్రాంతాలను చూడవచ్చు...

9. ఏ ఏ పర్యాటక ప్రాంతాలను చూడవచ్చు...

Image source

ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 15 పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. కడలే పాపహరేశ్వర దేవాలయం, కాల్వాల్ అభయారణ్యం, పొచారం వాటర్ ఫాల్స్, శివరామ్ అభయారణ్యం, జైనాత్ టెంపుల్, బాసర, ప్రాణహిత అభయారణ్యం, సెయింట్ జోసఫ్ చర్చ్ తదితరాలు ముఖ్యమైనవి.

10. మరింత సమాచారం కోసం...

10. మరింత సమాచారం కోసం...

Image source

సిరిచెల్మలోని క్షేత్రంతో పాటు ఆదిలాబాద్ లోని పర్యాటక ప్రాంతాలు తదితర సమాచారం కోసం తెలంగాణ అధికారిక వెబ్ సైట్ http://www.telanganatourism.gov.in/ లేదా 04065696939 లేదా 180042546464 ను ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 8.30 గంటల మధ్య సంప్రదించవచ్చు.

Read more about: shiva తెలంగాణ

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి