Search
  • Follow NativePlanet
Share
» »మహాబలిపురం: దివ్యత్వాన్ని కనుగొనేందుకు మరియు విశ్రాంతికి అనువైన ప్రదేశం

మహాబలిపురం: దివ్యత్వాన్ని కనుగొనేందుకు మరియు విశ్రాంతికి అనువైన ప్రదేశం

గతకాలపు పల్లవ పాలకుడు నరసింహవర్మన్-Iకు నివాళిగా 'మహాబలిపురం' అనే పేరు వచ్చింది. అతను తన కాలంలో గొప్ప వస్తాదు కాబట్టి అతనికి మామల్లన్ అనే బిరుదు వచ్చింది. అందువల్లనే ఈ స్థలానికి మామల్లపురం అనే పేరు

మహాబలిపురం తమిళనాడులో ప్రసిద్ధ చారిత్రక పట్టణాల్లో ఒకటి. మహాబలిపురం లేదా మామల్లాపురం చెన్నై నుంచి 50 కిలోమీటర్ల దూరంలో నెలకొనివున్నది. ఇది ఒక చారిత్రక ప్రాముఖ్యత కల్గిన ఒక పట్టణం. కాంచీపురం ఉనికి ఆధారంగా ఈ పట్టణం పల్లవ రాజులు పరిపాలనా కాలంలో ప్రధాన ఓడరేవులలో ఒకటి అని తెలుసుకోవచ్చు.

కాంచీపురం గురించిన ఆసక్తికరమైన వాస్తవాలు: ఈ పట్టణం ప్రస్తుతం దాని చారిత్రక ప్రాధాన్యతా విషయాలే కాకుండా, వివిధరకాలైన ఆహారపదార్థాలను కూడా మీకు అందించేందుకు సిద్ధంగా ఉంది. విలక్షణమైన దక్షిణ భారతదేశ వంటకాలైన దోశెలు మరియు ఇడ్లీలు నుంచి ఇటాలియన్ వంటకలైన పాస్తాస్ మరియు పిజ్జాలు మొదలైనవి మీకు పేరుపేరునా అందించేందుకు సిద్ధంగా ఉంది.

మహాబలిపురం యొక్క చరిత్ర: మహాబలిపురం పురాతన కాలంలో పల్లవులకు సంబంధించిన నౌకాశ్రయం. పల్లవులు జయించిన అనేక రాజ్యాలలో దీనికి గొప్ప ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. వారు ప్రధానంగా భారతదేశం యొక్క తూర్పు తీర ప్రాంతాల్లో దాదాపు 500 సంవత్సరాలు అధికారంలో కొనసాగారు. చరిత్రకారులు ప్రకారం, పల్లవ రాజైన మహేంద్రవర్మ I(580-630కాలంలో) నిర్మించిన అందమైన స్మారక శిల్పకళాకట్టడాలకు ఇది ఒక సాక్షీభూతంగా నిలుస్తుంది. తర్వాత తన కుమారుడైన నరసింహవర్మ-I(630-668కాలంలో)మరియు వారి వారసులకు అనుసరించింది.

మహాబలిపురంలో గల దేవాలయాలు:

మహాబలిపురం అలియాస్ మామల్లపురం: గతకాలపు పల్లవ పాలకుడు నరసింహవర్మన్-Iకు నివాళిగా 'మహాబలిపురం' అనే పేరు వచ్చింది. అతను తన కాలంలో గొప్ప వస్తాదు కాబట్టి అతనికి మామల్లన్ అనే బిరుదు వచ్చింది. అందువల్లనే ఈ స్థలానికి మామల్లపురం అనే పేరు వచ్చిందని చెబుతారు. ఇంకొక చరిత్ర ఆధారం ఏమిటంటే 'మహాబలి' అనే రాజు ప్రజలను చాలా దయతో పరిపాలిస్తూ, ప్రజలను ప్రేమగా పరిపాలించేవారు అందువల్ల ఈ స్థలానికి 'మహాబలిపురం' అనే పేరు వచ్చిందని చెబుతారు.

సందర్శించడానికి ఉత్తమ స్థలాలు: ఇక్కడ ఉన్న స్మారకాలు యునెస్కోలో ప్రపంచ వారసత్వ జాబితాలో ఉన్నట్లు కనుగొన్నారు.

మహాబలిపురంలో గల ఇతర దేవాలయాలు:

1: షోర్ టెంపుల్:

Mahabalipuram

ఈ దేవాలయంను బంగాళాఖాతం ఒడ్డున నరసింహవర్మన్-II నిర్మించారు.

2: ఐదు రథాలు: ఈ రథాలు అతిపెద్ద రాళ్ళతో శిల్పాలు బయటకు అగుపడే విధంగా నిర్మించారు. ఈ రథాలను మహాభారతంలోని పాండవుల నుండి ప్రేరణ పొంది వారి పేర్లతో నిర్మించారు. అవి వరుసగా ధర్మరాజ రథ, అర్జున రథ, భీమ రథ, నకులుడు-సహదేవుడు రథ మరియు ద్రౌపది రథ.

Mahabalipuram

3.మహాబలిపురం గుహలు: ఈ గుహలు ఇంకొక ఆకర్షణ. ఇవి తప్పకుండా చూడవలసినవి. ఇది మహాబలిపురంలో కొండ వైపు కేంద్రమధ్య భాగంలో ఉన్న గుహల కలగలుపుగా ఉంది.

Mahabalipuram

మహిషాసురమర్ధిని గుహ: ఈ గుహ చూస్తే చాలా ఆనందము కలుగుతుంది. వివిధ పౌరాణిక దృశ్యాలు వర్ణనలను కలిగివున్న శిల్పాలతో ప్రసిద్ధి చెందింది.

వరాహ గుహ: విష్ణువు రెండు అవతారాలలో ఒకటిఅయిన వరాహ అవతారం, భూదేవి మరియు అసురులు రాజు బలి యొక్క చిత్రాలు ఈ గుహ గోడలలో చిత్రించారు.

4.కృష్ణ మందిరం:

కృష్ణుడు ఇంద్రుని కోపం నుండి తన ప్రజలను రక్షించడానికి గోవర్థనగిరి పర్వతంను ఎత్తిన కథను వర్ణిస్తుంది.

అర్జునుని యొక్క పశ్చాత్తాపము: ఇక్కడ మహాభారతంలో శ్రీకృష్ణుని పాత్ర గురించి భారీ రాళ్ళతో చెక్కబడిన చెక్కడాలను చూడవచ్చు. ఇక్కడ 96 అడుగుల పొడవున మరియు 43 అడుగుల ఎత్తున చెక్కబడిన దేవతా విగ్రహాలే కాకుండా మానవులు, పక్షులు, మరియు జంతువులు చెక్కడాలను కూడా వివరిస్తుంది.

Mahabalipuram

5. బటర్ బాల్:

Mahabalipuram

ఈ మహాబలిపురంలో చాలా కలవరపెట్టే పర్యాటక ఆకర్షణ ఇది. బటర్ బాల్ ఒక మృదువైన వాలుపై సమతుల్య భారీ బౌల్డర్ గా ఉంది.

6. లైట్ హౌస్: లైట్ హౌస్ అనేది ఇక్కడ ప్రధాన ఆకర్షణల్లో ఒకటి. 1884 లో మొదటి లైట్ ప్రారంభించారు. ఇది 1904 లో పూర్తిగా ఫంక్షనల్ మారింది. భారతదేశంలో పురాతన లైట్ హౌస్ పల్లవ రాజు మహేంద్ర పల్లవ ద్వారా 640 ADలో నిర్మించారు. తర్వాత దాని స్థానంలో ఆధునిక నిర్మాణం జరిగింది.

Mahabalipuram

మహాబలిపురం ప్రసిద్ధ ఈస్ట్ కోస్ట్ రోడ్ ఉన్నది. అందుకే ఇక్కడ ఎవరైతే సముద్రతీరాలు ఇష్టపడతారో వారికి ఒక స్వర్గధామంగా ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X