Search
  • Follow NativePlanet
Share
» »మహాబలిపురం - మహా కళాకృతులు !

మహాబలిపురం - మహా కళాకృతులు !

పల్లవుల రాజధాని అయిన మహాబలిపురం ఒకప్పుడు ఎంతో అభివృద్ధి చెందిన ఓడ రేవు పట్టణం. కోరమాండల్ కోస్తా తీరంలోకల ఈ మహాబలిపురం లేదా మామల్లాపురం చెన్నై కి దక్షిణంగా 60 కి. మీ. ల దూరంలో కలదు. పల్లవులు పాలించిన ఈ నగరం బంగాళా ఖాత తీరంలో పర్యాటకులకు అనేక సుందర దృశ్యాలు చూపుతుంది. మహాబలిపురంలో ఇసుక కల బీచ్ లే కాదు అనేక శిల్ప కళా ఖండాలు కూడా పర్యాటకులను ఆశ్చర్య పరుస్తాయి.

పల్లవ రాజు మొదటి నరసింహ వర్మన్ పాలనలో మహాబలిపురం ను మామల్లాపురంగా పేరు మార్చారు. మామల్ల అంటే గొప్ప రేజిలర్ అని అర్ధం చెపుతారు. ఈ బిరుదును సాహసికుడైన రాజుకు ఇచ్చారు.

పల్లవులు గొప్ప కళాత్మక హృదయం కలవారు. మహాబలిపురంలోని కళా ఖండాలలో వారి కళాత్మకతలు కనపడతాయి. వెండిలా మెరిసే ఇసుక తిన్నెలు, నీలి సముద్రపు నీరు, నీడనిచ్చే వృక్షాలు, అన్నిటినీ మించే పురాతన శిల్పాలు కలసి ఈ ప్రదేశాన్ని ఒక గొప్ప పర్యాటక ప్రదేశంగా మార్చాయి.

పల్లవుల పాలన, మహాబలిపురం

పల్లవుల పాలన, మహాబలిపురం

పురాతత్వ శాస్త్ర వేత్తలు ఇక్కడకల శిల్ప కళా నైపుణ్యాలకు ఆశ్చర్యపడతారు. ఈ ప్రదేశంలో అధికంగా బౌద్ధ మత ప్రభావం కనపడుతుంది. అయినప్పటికీ ఇక్కడి శిల్పాలు బౌద్ధిజం ను అధిగమించి తమ హిందూత్వాన్ని చాటుతాయి. బౌద్ధ మత ప్రభావమైన ఏడు పగోడాలు ఇక్కడ కలవు. ఈ నిర్మాణాలను చూసి దేముల్లకే అసూయ కలిగిందని, అదే కారణంగా ఈ తీరంలో వారు వరదలు సృష్టించారని అనేక నిర్మాణాలు మునిగిపోయాయని చెపుతారు. 2004 లో వచ్చిన సునామి వరదలలో ఈ ప్రదేశంలో గతంలో మునిగిపోయిన మూడు అద్భుత తీర దేవాలయాలు బయట పడ్డాయి.

Jram23

పల్లవుల పాలన, మహాబలిపురం

పల్లవుల పాలన, మహాబలిపురం

పురాతనంగా 7 వ శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయం ను రెండవ నరసింహ వర్మన్ పునరుద్ధరించాడు. ఇక్కడ రెండు శివ టెంపుల్స్, రెండు విష్ణు టెంపుల్స్ మరియు అందంగా చెక్కబడిన శ్రీ నరసింహ మరియు దుర్గా మాత విగ్రహాలు కనుగొన్నారు. ప్రధానమైన, పెద్దదైన శ్రీ మహావిష్ణు విగ్రహం అనంతశయన రూపంలోకల దానిని భాగాలుగా, వివిధ ద్వారాల ద్వారా ఇక్కడ చూడవచ్చు.

seeveeaar

పల్లవుల పాలన, మహాబలిపురం

పల్లవుల పాలన, మహాబలిపురం

ఇక్కడ కల ఒక పెద్ద శిల్పం మహాభారత లేదా రామాయణ లోని సంఘటన సూచిస్తుంది. అది అర్జునుడి తపస్సు కావచ్చు లేదా గంగ భూమికి దిగి వచ్చిన సంఘటన కావచ్చు. నేటికే ఈ అంశం చరిత్రకారులను సంగ్దిధం లో ఉంచినది.

russavia

పల్లవుల పాలన, మహాబలిపురం

పల్లవుల పాలన, మహాబలిపురం

భారతీయ కొండ గుహల శిల్ప సంపదకు ఇది ఒక ఉదాహరణ. మహాబలి పురం ప్రధాన శిల్పాలకు రెండు కి. మీ. ల దూరంగా ఒక వరాహ కేవ్ టెంపుల్ కలదు. ఇక్కడ విష్ణుమూర్తి వరాహ అవతారంలో భూదేవిని ఎత్తటం కనపడుతుంది. టెంపుల్ ప్రవేశంలో అనేక స్తంభాలు కల మండపం వుంటుంది. టెంపుల్ గోడలు ఇతిహాస కావ్యాల నుండి కొన్ని దృశ్యాలు చెక్కబడి కనపడతాయి.

పల్లవుల పాలన, మహాబలిపురం

పల్లవుల పాలన, మహాబలిపురం

అయిదుగురు పంచ పాండవులు, మరియు ద్రౌపతి పేర్లపై ఒకే రాతిలో చెక్కబడిన రధాలు అతి పెద్దవి పిరమిడ్ నిర్మాణాలుగా కలవు. ఒకొక్క నిర్మాణం ఒక రధాన్ని పోలి వుంటుంది.

Sistak

పల్లవుల పాలన, మహాబలిపురం

పల్లవుల పాలన, మహాబలిపురం

ఈ రధాన్ని మూడు మెట్లుగా నిర్మించారు. ధర్మరాజ రధం పై గ్రాంథ మరియు నగరి లిపిలలో 16 శాసనాలు కలిగి వుంటుంది. దీనిపై అనేక దేముళ్ళు, గంధర్వుల చెక్కడాలు కూడా కలవు.

russavia

పల్లవుల పాలన, మహాబలిపురం

పల్లవుల పాలన, మహాబలిపురం

అర్జున రధం ధర్మరాజు రధానికి ముందే పూర్తి అయినట్లు కనపడుతుంది. ఇది అంతకు ముందు చెక్కిన కొయ్య రధం వలెనె వుంటుంది. అర్జున రధం ద్రౌపతి రధానికి పక్కనే వుంటుంది.

పల్లవుల పాలన, మహాబలిపురం

పల్లవుల పాలన, మహాబలిపురం

భీముడి రధం నలు చదర నిర్మాణం, భీముడి రధంలో సింహంపై స్తంభాలు మరియు లోపల ఒక గాలరీ వుంటాయి.


russavia

పల్లవుల పాలన, మహాబలిపురం

పల్లవుల పాలన, మహాబలిపురం

నకుల, సహదేవుల రధాలు చాలా నిరాడంబరంగా, ఆకర్షణీయంగా వుండి అధిక చెక్కడాలు లేకుండా వుంటాయి. అయితే, దీనికి పక్కనే ఒక పెద్ద ఏక శిలా ఏనుగు కలదు.


Sandip Nirmal

పల్లవుల పాలన, మహాబలిపురం

పల్లవుల పాలన, మహాబలిపురం

ద్రౌపతి యొక్క రధంలో దుర్గా మాత విగ్రహం వుంటుంది. ఈ రధం ఒక అందమైన గ్రామీణ గుడిసె వలే వుంటుంది. ఈ నిర్మాణాలలో చాల చోట్ల సింహం - ఏనుగుల బొమ్మలు కనపడతాయి.

Sharda Crishna

పల్లవుల పాలన, మహాబలిపురం

పల్లవుల పాలన, మహాబలిపురం

పల్లవ రాజుల పాలన ఎలా వుండేది ? పల్లవ రాజులు కాన్చిపురాన్ని నిజమైన సింహాల వలె పాలించారు, ప్రపంచానికి ఎంతో ఉత్తమమైన ద్రావిడ శిల్పసంపదాలను దర్శించే భాగ్యం కల్పించారు. పల్లవ సామ్రాజ్యంలో మహాబలిపురం ఒక ఉత్తమ ప్రదేశంగా వుండేది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X