Search
  • Follow NativePlanet
Share
» »అద్భుతం 111 అడుగుల ఎత్తు.. 8 అంతస్తుల శివలింగం..ఎక్కడ ఉందో తెలుసా?

అద్భుతం 111 అడుగుల ఎత్తు.. 8 అంతస్తుల శివలింగం..ఎక్కడ ఉందో తెలుసా?

శివ లింగము హిందూ మతంలో పూజింపబడే, శివుడిని సూచించే ఒక పవిత్ర చిహ్నం. సాంప్రదాయంలో లింగము శక్తి సూచికగా, దైవ సంభావ్యతగా పరిగణింపబడుతుంది. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కో క్షేత్రానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆయా శైవ క్షేత్రాల్లోని ఒక్కో శివలింగం ఒక్కో విశిష్టతను సంతరించుకుని సాక్షాత్కరిస్తూ ఉంటుంది. శివుడిని ఎక్కువగా లింగ రూపంలో పూజిస్తుంటాము.

శివలింగాలు ఒక్కో ప్రదేశంలో ఒక్కో రూపంలో ఉండవచ్చు, వివిధ రకాల ముద్రలుగల శివలింగాలు, రంగులు మారే శివలింగాలు, శివలింగాల పై భాగం నుండి నీరు ధారగా ప్రవహించే శివలింగాలు ఉన్నాయి. ఇంకా స్వయముగా వాటి అంతట అవే వెలసిన లింగాన్ని స్వయంగా భూ లింగమని , దేవతల చేత ప్రతిష్ఠింపబడిన శివలింగాన్ని దైవిక లింగములని, ఋషుల చేత ప్రతిష్ఠింపబడిన లింగాలను రుష్య లింగములని, మానవుల చేత నిర్మింపబడిన లింగములు మానుష లింగములు అని పిలుస్తారు. అలా మానవులచే నిర్మితమైన ఒక శివలింగం దేశంలోనే అత్యంత ఎత్తైన శివలింగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం...

తిరువనంతపురంలో కొలువైన మహా శివలింగం

తిరువనంతపురంలో కొలువైన మహా శివలింగం

గతంలో దేశంలో సుమారు 108 అడుగులన్న అతి పెద్ద శివలింగం కర్నాటకాలోని కోలార్ జిల్లాలోని కోటిలింగాల దేవాలయంలో ఉంది. అయితే ఇప్పుడు ఆ శివలింగ రికార్డ్ ను తిరువనంతపురంలో కొలువైన మహా శివలింగం అధిగమించినది.

దేశంలోనే అత్యంత ఎత్తైన శివలింగం

దేశంలోనే అత్యంత ఎత్తైన శివలింగం

ఈ శివ లింగం 111.2అడుగుల ఎత్తు ఉన్న 8 అంతస్తుల మహా లింగం..! దేశంలోనే కాదు ఈ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివలింగం కేరళ రాష్ట్రంలో తిరువనంతపురం జిల్లా చెంకాల్ లోని మహేశ్వరం శ్రీ శివపార్వతి ఆలయంలో ఈ శివలింగంను నిర్మించారు.

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో

ఈ లింగం నిర్మాణం ఈ మద్యకాలంలోనే పూర్తై భక్తులకు దర్శనమిస్తోంది. అంతే కాదు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కెక్కింది. జనవరి 10న లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులు ఈ ఆలయాన్ని సందర్శించి లింగం ఎత్తును కొలిచి,సంబందిత పత్రాలను పరిశీలించిన తర్వాత దేశంలోనే అత్యంత ఎత్తైన శివలింగంగా అధికారికంగా ప్రకటించారు.

శివలింగం యొక్క ప్రత్యేకతలు:

శివలింగం యొక్క ప్రత్యేకతలు:

స్థూపాకారంలో 8 అంతస్తుల్లో శివలింగాన్ని నిర్మించారు. అందులో ఆరు అంతస్తులు మానవదేహంలోని చక్రాలు లేదా శక్తి కేంద్రాలను(ములధార, స్వదిస్థానా, మణిపుర, అన్హా, విషుద్ధా, అజ్న)సూచిస్తాయి. దూరం నుండి చూస్తే పదంస్తుల భవనం వలె కనబడుతుంది.

గ్రౌండ్ ఫ్లోర్లో 108 శివలింగాలను ఏర్పాటు చేశారు

గ్రౌండ్ ఫ్లోర్లో 108 శివలింగాలను ఏర్పాటు చేశారు

గ్రౌండ్ ఫ్లోర్లో 108 శివలింగాలను ఏర్పాటు చేశారు. ఈ లింగాలకు భక్తులు పూజలు, అభిషేకాదులు చేయవచ్చు. అలాగే ఆలయ ప్రాంగణంలో అద్భుతమైన కళా చిత్రాలను పొందుపరిచారు.

ప్రతి అంతస్తులోనూ ధ్యానమండపాలు

ప్రతి అంతస్తులోనూ ధ్యానమండపాలు

ప్రతి అంతస్తులోనూ ధ్యానమండపాలు కలిగిన ఈ శివలింగం లోపలి భాగాలుంటాయి. అందులో పరశురాముడు, అగస్త్యుడు తదితరులు తపస్సు చేస్తున్నట్లు కొన్ని ప్రతిమలు ఏర్పాటు చేశారు.

ఈ శివలింగం లోపలి నుండి పైకి ఎక్కడానికి

ఈ శివలింగం లోపలి నుండి పైకి ఎక్కడానికి

ఈ శివలింగం లోపలి నుండి పైకి ఎక్కడానికి మెట్లు ఏర్పాటు చేశారు. శివలింగం పైకి ఎక్కితే హిమాలయాల్లో ఉన్న కైలాస పర్వత నమూనాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ శివపార్వతులను దర్శించుకోవచ్చు

 మెట్ల ద్వారా పైకి ఎక్కుతుంటే గుహలోకి వెళ్తున్న అనుభూతి

మెట్ల ద్వారా పైకి ఎక్కుతుంటే గుహలోకి వెళ్తున్న అనుభూతి

శివలింగం లోపల మెట్ల ద్వారా పైకి ఎక్కుతుంటే గుహలోకి వెళ్తున్న అనుభూతి కలుగుతుంది. ఈ ఆలయానికి మరో విశిష్టత ఏంటంటే ఈ గుడిలో 12 జ్యోగిలర్లింగాలు, 32 వినాయకుడి రూపాలున్నాయి. ఇలా 12జ్యోతిర్లింగాలను ఓకే చోట దర్శించుకునే భాగ్యం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ గుడిలోనే ఆ భాగ్యం దక్కుతుంది.

శివలింగాన్ని దర్శించుకుంటే

శివలింగాన్ని దర్శించుకుంటే

కాశీ, రామేశ్వరం, గోముఖ్, వారణాసి, ధనుష్ కోటి, గంగోత్రి, బద్రినాథ్ , కైలాసం సహా పలు హిందూ శైవ పుణ్య క్షేత్రాల నుండి మట్టి, జలాన్ని తీసుకొచ్చి శివలింగ నిర్మాణానికి ఉపయోగించి నిర్మించారు. అందుకే ఈ శివలింగాన్ని దర్శించుకుంటే దేశంలోని అన్ని శైవక్షేత్రాలన్నీ దర్శించుకున్న భాగ్యం కలుగుతుందని ఆలయ పూజారులు తెలుపుతున్నారు.

గిన్నీస్ బుక్ రికార్డులో చోటు

గిన్నీస్ బుక్ రికార్డులో చోటు

2012లో ప్రారంభమైన శివలింగ నిర్మాణం ఆరు సంవత్సరాల పాటు జరిగింది. దేశంలోనే ప్రఖ్యాత శివాలయాలను సందర్శించిన తర్వాత మఠాధిపతులు శ్రీ మహేశ్వరానంద స్వామి, తంత్రి దేవనారయణ్ లు ఈ శివలింగాన్ని డిజైన్ చేశారు. ప్రస్తుతం లిమ్కా బుక్ లో రికార్డ్ ఎక్కిన ఈ శివలింగం గిన్నీస్ బుక్ రికార్డులో చోటు సంపాదించాలని ఆశిస్తున్నట్లు అధికారులు చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X