Search
  • Follow NativePlanet
Share
» »నల్లమల అడవులలో నెలకొన్న మల్లికార్జునుడు

నల్లమల అడవులలో నెలకొన్న మల్లికార్జునుడు

నల్లమలై కొండల పైన నెలకొని వున్న శ్రీశైలం భారతదేశంలో అత్యంత పురాతనమైన క్షేత్రాలలో ఒకటిగా పేరుపొందింది. ఇక్కడ మల్లికార్జునస్వామి

By Venkatakarunasri

నల్లమలై కొండల పైన నెలకొని వున్న శ్రీశైలం భారతదేశంలో అత్యంత పురాతనమైన క్షేత్రాలలో ఒకటిగా పేరుపొందింది. ఇక్కడ మల్లికార్జునస్వామి కొలువై వున్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ లోని నల్గొండ జిల్లాలో కృష్ణా నదికి కుడి వైపున ఉంది. ఈ పర్వతానికి సిరిధాన్, శ్రీగిరి, సిరిగిరి, శ్రీపర్వత మరియు శ్రీనగం అనే పేర్లు వున్నాయి. కొన్ని శతాబ్దాలుగా శైవ పుణ్యక్షేత్రాలలో ఇది ప్రముఖంగా వుంది.

ఈ శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాల లో ఒకటి. ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, శివాజీ లాంటి ఎందరో ఈ క్షేత్రానికి సేవలు చేశారు.శ్రీశైలం ఎలా చేరుకోవాలి ?

శ్రీశైలం నుండి సమీప విమానాశ్రయం 195 కిలోమీటర్ల దూరంలో వున్న హైదరాబాద్ లో కలదు. హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, కర్నూలు పట్టణాలకు శ్రీశైలం నుండి బస్సులు వెళ్తాయి. ఒక ప్రైవేట్ టాక్సీ ఉంటే, నియామకం అయిన డ్రైవర్ కు ఘాట్ రోడ్ లలో డ్రైవింగ్ చేసే అనుభవం వుంటే వెళ్ళవచ్చును. శ్రీశైలం సమీపంలో గల రైల్వేస్టేషన్లు మార్కాపూర్ (62 కిమీ), వినుకొండ (120 కిమీ) మరియు కర్నూలు (190 కి.మీ.) దూరంతో ఉన్నాయి.

స్థల పురాణం

స్థల పురాణం

పూర్వకాలంలో అరుణాసురడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను బ్రహ్మ కోసం తపస్సు చేసి చాలా కాలం పాటు గాయత్రీ మత్రం జపిస్తూ మరణం లేకుండా వరం పొందాడు. భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమయి అరుణాసురుడు తన భక్తుడని, గాయత్రీ మంత్రం జపిస్తున్నంతవరకు అతనిని ఎవరూ ఏమీ చేయలేరని చెపుతుంది. తర్వాత దేవతలు పథకం ప్రకారం దేవతల గురువు అయిన బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురడు దేవ గురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్త పరచగా, బృహస్పతి అందుకు నమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రీ మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి ఈ రాకలో వింత ఏమి లేదని చెపుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేను ఎందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతని సైన్యాన్ని సంహరిస్తాయి

స్థల పురాణం

స్థల పురాణం

శ్రీశైలంలో దేవాలయాలలో భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందినది. ఇక్కడ శివ పార్వతుల విగ్రహాలు వుంటాయి. ఇక్కడ మల్లికార్జున స్వామిని శివుడుగా మరియు, మాత పార్వతి దేవిని భ్రమరాంబగా పూజిస్తారు. శివ భగవానుడికి గల 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైలం ఒకటి కావున, హిందువులు ఈ దేవాలయానికి చాల ప్రాముఖ్యతనిచ్చి దర్శనం చేసుకొంటారు. ఇక్కడ కల మల్లెల తీర్థం అనే జలపాతాలలో స్నానాలు ఆచరిస్తారు. ఈ నీటిలో స్నానాలు ఆచరిస్తే పాపాలు పోతాయని మోక్షం వస్తుందని భావిస్తారు

శ్రీశైలం సందర్శనకు సరైన సమయం

శ్రీశైలం సందర్శనకు సరైన సమయం

ఫిబ్రవరి నుండి అక్టోబర్ నెలల మధ్యలో పర్యాటక కార్యకలాపాలకు మరియు తీర్థయాత్ర చేయుటకు వాతావరణం అనుకూలంగా వుంటుంది. ఈ సీజన్ శ్రీశైలంలోని అభయారణ్యం సందర్శించడానికి మంచి సమయం. జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఆలయ సందర్శనం చేయవచ్చును.

వేసవి కాలం (మార్చి - జూన్) : ఈ కాలంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ గా వుంటుంది. ఈ సమయంలో అనేక మంది భక్తులు శ్రీశైలం సందర్శన కోసం వస్తూ వుంటారు. మీరు మే మరియు జూన్ నెలల్లో సందర్శించాలనుకుంటే వాతావరణం చాలా వేడిగా మరియు తేమగా వుంటుంది.

PC : Official Website

నల్లమల అడవులలో నెలకొన్న మల్లికార్జునుడు

నల్లమల అడవులలో నెలకొన్న మల్లికార్జునుడు

ఋతుపవనాలు (జూలై - సెప్టెంబర్) : సాధారణంగా ఈ కాలంను వర్షాకాలంగా చెప్పవచ్చును. భారీ వర్షాలు కురుస్తూ ఉన్నప్పటికీ ఈ సీజన్ కూడా సందర్శనకు చాలా మంచిది.

శీతాకాలం (అక్టోబర్ - ఫిబ్రవరి) : వాతావరణం ఆహ్లాదకరంగా మనోహరంగా ఉంటుంది. అక్టోబర్ నుండి ఫిబ్రవరి నెల వరకు గల శీతాకాలం శ్రీశైలం సందర్శనకు ఒక మంచి సమయం. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో శివుని సందర్శించుటకు ఈ కాలం పీక్ సీజన్.

PC : Official Website

 స్థలం యొక్క ప్రాముఖ్యత

స్థలం యొక్క ప్రాముఖ్యత

శ్రీశైల మల్లికార్జునస్వామి దేవాలయము : ఈ దేవాలయం అపూర్వమైన శిల్పకళా సంపద కలిగిన దృఢమైన ప్రాకారము మరియు లోపల నాలుగు మండపములతో అలరారే అందమైన దేవాలయము. ప్రధాన గర్భాలయము మాత్రము ఎటువంటి శిల్పాలు లేకుండా సాధారణంగా వుంటుంది.

భ్రమరాంబిక అమ్మవారి గుడి

భ్రమరాంబిక అమ్మవారి గుడి

భ్రమరాంబికా అమ్మవారి దేవాలయము అందమైన శిల్పాలు చెక్కబడిన స్థంబాలతోనూ మరియు అద్భుతమైన శిల్పకళతో అత్యద్భుతంగా ఉండును. ఈ ఆలయము ఆంధ్రప్రదేశ్ లోనే అత్యంతగా శిల్ప కళ ప్రాముఖ్యత కలిగిన దేవాలయముగా ప్రసిద్ధి కెక్కినది. ఈ దేవాలయములో గర్భాలయం వెనుక గల గోడకు చెవి ఆనిచ్చి వింటే ఝమ్మనే భ్రమరనాధం వినిపిస్తుంది.

మనోహర గుండము

మనోహర గుండము

శ్రీశైలములో తప్పకుండా చూడవలసిన వాటిలో "మనోహర గుండము" ఒకటి. దీనిలో గొప్పతనము ఏమిటంటే దీనిలో నీరు చాలా స్వచ్చంగా ఉంటుంది. శ్రీశైలము చాలా ఎత్తైన ప్రదేశములో ఉంది. మహానంది లోని కోనేటి నీటిలో క్రింద రూపాయి వేస్తే పైకి స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఈ చిన్ని గుండంలో కూడా కనిపిస్తుంది.

నల్లమల అడవులలో నెలకొన్న మల్లికార్జునుడు

నల్లమల అడవులలో నెలకొన్న మల్లికార్జునుడు

శ్రీశైలంలో గల ఆకర్షణ గల ప్రధాన కేంద్రాల్లో శ్రీశైలం డ్యాం కూడా ఒకటి. భారతదేశంలో గల 12 జలవిద్యుత్ ప్రాజెక్టులలో ఇది ఒకటి. శ్రీశైలం డ్యామ్ కృష్ణానది వెంబడి నల్లమల అడవుల్లో విస్తరించి వుంది. కృష్ణా నది, ఆనకట్ట, లోతైన లోయ, గుషింగ్, నీటి శబ్దం, అడవులు మొదలైన చుట్టూ గల ఈ దృశ్యాలు చూచుటకు చాలా మనోహరంగా వుంటుంది.

శ్రీశైలం పులుల అభయారణ్యం

శ్రీశైలం పులుల అభయారణ్యం

శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఇండియాలోనే అతిపెద్ద పులుల అభయారణ్యం. ఈ టైగర్ రిజర్వ్ యొక్క మొత్తం వైశాల్యం 3568 ఎకరాలు. శ్రీశైలం డ్యాం మరియు నాగార్జునసాగర్ ఆనకట్ట ఈ రిజర్వు ప్రాంతంలో ఉన్నాయి. ఇక్కడ పులులతో పాటు, చిరుతలు, ఎలుగు బంట్లు, డోలు, భారత అలుగు, మచ్చల జింకలు, సాంబార్ జింక, చేవ్రోట్రైన్, కృష్ణ జింక, చింకారా, మరియు చౌసింఘ మొదలైన జంతువులు వున్నాయి. ఇతర సరీసృపాలు మరియు ఉభయచరాలైన మొసళ్ళ, భారతదేశ కొండచిలువ, కైండ్ కోబ్రా మరియు ఇండియన్ పీఫౌల్ సహా ఈ ప్రాంతంలో కనిపిస్తాయి

సాక్షి గణపతి ఆలయం

సాక్షి గణపతి ఆలయం

సాక్షి గణపతి ఆలయం శ్రీశైలం పట్టణం కొండ వద్ద కలదు. ఈ ఆలయం చూచుటకు చాలా మనోహరంగా వుండును. ఇక్కడ సహజంగా కనిపించే నల్లని రంగులో గల గణేషుని విగ్రహం వుంది.

సాధారణంగా యాత్రికులకు శ్రీశైలంలో మొట్టమొదటిగా అత్యంత ప్రీతికరమైన గణపతి దేవాలయాన్నిదర్శించుకొని తర్వాత శ్రీశైలం సందర్శన చేస్తారు. ఇక్కడ ఈ ఆలయ గర్భగుడి చేరుకోవడానికి 10 మెట్లు ఎక్కవలసి వస్తుంది.

ఇక్కడ అత్యంత ఆకర్షణ ఏమిటంటే ఈ ఆలయం దట్టమైన అడవుల మధ్య వెలసినది. పరిసరాలు ప్రశాంతంగా మరియు పర్యావరణం పర్యాటకులని మంత్రముగ్ధులను చేస్తుంది.
ప్రాంతం ధ్యానం చేయటానికి అనువైన ప్రదేశం. చాలా నిశ్శబ్ధకరమైన ప్రదేశం.

పాతాళ గంగ

పాతాళ గంగ

కొండ క్రింద దిగువభాగాన గల కృష్ణా నదిలోని ఈ పవిత్ర జలాలు చర్మ వ్యాధులు నయం కోసం ఔషధ లక్షణాలు కలిగి వుంది. ఇక్కడ చుట్టూ వున్న దృశ్యాలు చూసి ఆనందించవచ్చు. కారు రైడింగ్ ఇక్కడ చాలా బాగుంటుంది. ప్రయత్నించండి. ఈ ప్రదేశంలో చుట్టూ మనోహరంగా వుండే నది మరియు ఆకుపచ్చగా వుండే వృక్షాల అందం అట్టే కట్టిపడేస్తుంది.

అక్కమహాదేవి గుహలు

అక్కమహాదేవి గుహలు

అక్కమహాదేవి గుహలు చేరుకోవడానికి కృష్ణా నది ద్వారా పడవలో ప్రయాణించాలి. చుట్టూ దృశ్యాలు, అడవులు మరియు కొండలు చాలా మనోహరంగా వుంటుంది. ఈ గుహల లోపల చీకటిగా వుంటుంది. అక్కడ వెలసిన పవిత్ర శివలింగం దర్శించుకునేందుకు టార్చ్ లేదా కొవ్వొత్తుల సహాయంతో వెళ్ళాలి.

తినడానికి వసతులు

తినడానికి వసతులు

ఇక్కడ శాఖాహారం మాత్రమే అందుబాటులో వుంటుంది. ఇది ఒక అటవీ ప్రదేశం కాబట్టి ఇక్కడ హోటల్స్ ఏమీ అందుబాటులో వుండవు. దక్షిణ భారతదేశానికి చెందిన స్ట్రీట్ ఫుడ్ లభిస్తుంది. ఇక్కడ ఆలయంలో పెట్టే భోజనం చేయవచ్చును. ప్రజలు అటవీ ప్రదేశం కాబట్టి తమ వెంట కార్బోహైడ్రేట్స్ కలిగిన ఆహారం మరియు అధిక మొత్తంలో నీరు వెంట తీసుకుపోవటం మంచిది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X