Search
  • Follow NativePlanet
Share
» » శృంగార‌భ‌రిత‌మైన క్ష‌ణాలను చేరువచేసే మేఘమలై టూర్‌!

శృంగార‌భ‌రిత‌మైన క్ష‌ణాలను చేరువచేసే మేఘమలై టూర్‌!

శృంగార‌భ‌రిత‌మైన క్ష‌ణాలను చేరువచేసే మేఘమలై టూర్‌!

కొత్త జంట‌లు ఏకాంతంగా గ‌డిపేందుకు ఎక్కువ ఆస‌క్తి చూపిస్తాయి. అందుకే ప్ర‌కృతి ఒడిలో విహ‌రిస్తూ.. జీవిత‌పు తియ్య‌ని అనుభ‌వాల‌ను ప‌దిల‌ప‌రిచేందుకు హ‌నీమూన్ ప్లాన్ చేసుకుంటారు. అలాంటి వారి కోసం ఆహ్వానం పలుకుతోంది తమిళనాడులోని ఏకాంత హనీమూన్ ప్రదేశం మేఘ‌మ‌లై. ఇది ప్ర‌శాంత‌త‌ను.. ఏకాంతాన్ని ఇక్క‌డకు వ‌చ్చే జంట‌ల‌కు చేరువ చేస్తుంది.

ప్ర‌కృతి అందాల‌ను ఆస్వాదించడానికి ఇదే స‌రైన ప‌ర్యాట‌క ప్ర‌దేశం. దీనినే 'పచ్చా కుమాచి' లేదా గ్రీన్ పీక్స్ అని కూడా పిలుస్తారు. ప్రకృతి అందించే ప్రశాంతమైన సమయాన్నిశృంగార‌భ‌రిత‌మైన క్ష‌ణాలుగా మార్చేందుకు మేఘ‌మ‌లై టూర్ ప్లాన్ స‌రైన ఎంపిక‌. మీ భాగస్వామి చేతిని పట్టుకుని అందమైన మేఘాలతో కప్పబడిన శిఖరాలను చూడండి. అంతేకాదు, పచ్చటి టీ మరియు ఏలకుల ఎస్టేట్‌ల చుట్టూ ఉన్న ఒంపుసొంపుల మార్గంలో అడుగులు వేస్తూ.. ప్ర‌తీ క్ష‌ణాన్ని ఆస్వాదించండి.

ప్ర‌కృతి మ‌ల‌చిన దృశ్యాలు

ప్ర‌కృతి మ‌ల‌చిన దృశ్యాలు

సముద్ర మట్టానికి 1,500 మీటర్ల ఎత్తులో ఉన్న మేఘమలైకి "పచ్చా కొమాచి" అనే తమిళ పేరు పెట్టారు. "ఆకుపచ్చ శిఖరాలు" అని దీనికి అర్థం. ఎందుకంటే ప‌చ్చ‌ని తివాచీ ప‌ర‌చిన‌ట్లు ఆకుపచ్చ రంగులో ఉంటుంది ఈ ప్రాంతం. మేఘమలై, తమిళనాడులోని పశ్చిమ కనుమలలోని తేని జిల్లాలో ఉంది. మేఘ‌మ‌లై ప‌ర్య‌ట‌న అంటే జీవితంలో మ‌ర్చిపోల‌నే ఓ రోమాంటిక్ ట్రిప్‌గా నిలిచిపోతుంది. అందుకే ఇది బెస్ట్ హ‌నీమూన్ స్పాట్‌గా పేరుగాంచింది.

అంతేకాదు, ఇక్క‌డి థ్రిల్లింగ్ ట్రెక్ మార్గాలు సాహ‌స క్రీడ‌లపై ఆస‌క్తి చూసేవారికి ఆహ్వానం ప‌లుకుతాయి. ఎటు చూసినా అద్భుతమైన ప్ర‌కృతి మ‌ల‌చిన దృశ్యాలు సంద‌ర్శ‌కుల‌ను మంత్ర‌ముగ్దుల‌ను చేస్తాయి. అలా ప్రకృతి మధ్య విశ్రాంతి తీసుకోవడానికి గొప్ప అవకాశం క‌ల్పిస్తాయి ఇక్క‌డి ప్ర‌దేశాలు. పోన్సీవా ప్లాంటేషన్స్, ది హైవే ఎస్టేట్స్ మరియు ఆనంద ప్లాంటేషన్స్ వంటి కొన్ని ప్రైవేట్ టీ మరియు కాఫీ తోటలు ఇక్క‌డికి చుట్టుపక్కల ఉన్నాయి. వీటిని సంద‌ర్శించ‌డం ద్వారా ప‌ర్యాట‌కులు విభిన్నమైన అనుభూతిని పొందవచ్చు.

వన్యప్రాణుల అభయారణ్యం

వన్యప్రాణుల అభయారణ్యం

మేఘమలై వన్యప్రాణుల అభయారణ్యాన్ని సంద‌ర్శించ‌డం అస్స‌లు మ‌ర్చిపోవ‌ద్దు. ఇక్క‌డ ఎన్నో అరుదైన అట‌వి జంతువులు మిమ్మ‌ల్ని ప‌ల‌క‌రిస్తాయి. ఇటీవ‌ల కాలంలోనే ఈ అర‌ణ్యాన్ని టైగ‌ర్ జోన్‌గా కూడా గుర్తించారు. ఇక్క‌డి చుట్టుప‌క్క‌ల ప్రాంతాలు జ‌ల‌పాతాల‌కు నెల‌వుగా చెబుతారు. మేఘమలై జలపాతం, మురుగన్ ఆలయం, మంజలార్ డ్యామ్, సురుళి జలపాతం, వెల్లమలై, వన్నియార్ డ్యామ్ ఇక్క‌డి కొత్త జంట‌ల‌ను ఆక‌ర్షించే సంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాలుగా చెప్పుకోవ‌చ్చు.

ఎలా చేరుకోవాలి

ఎలా చేరుకోవాలి

మేఘమలైకి సమీప విమానాశ్రయం, అలాగే దాని సమీప రైలు స్టేషన్ రెండూ మధురైలో ఉన్నాయి. మ‌దురై విమానాశ్ర‌యం మేఘ‌మ‌లైకు క‌నీసం వంద కిలోమీట‌ర్ల వ‌ర‌కూ ఉంటుంది. మీరు మదురై లేదా తేని నుండి మేఘమలైకి కారును అద్దెకు తీసుకుని కూడా ప్రయాణించవచ్చు. ఈ రోడ్డు మార్గంలో జ‌ర్నీని త‌ప్ప‌కుండా ఆస్వాదించ‌వ‌చ్చు.

తేని నగరం నుండి, గంటన్నర స‌మ‌యం పడుతుంది. మదురై నుండి, మూడు గంటల సమయం పడుతుంది. చిన్నమనూరు నుండి స్థానిక బస్సులు 4:30 AM, 6 AM మరియు 10 AM కు బయలుదేరుతాయి. మధురై, బెంగుళూరు వంటి సుదూర ప్రాంతాల నుండి కూడా లాంగ్ రూట్ బస్సులు అందుబాటులో ఉంటాయి.

సందర్శించడానికి ఉత్తమ సమయం: అక్టోబర్-మార్చ్‌

Read more about: paccha kumachi theni meghamalai
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X