» »పురుషులకు ఈ పుణ్యక్షేత్రల్లోకి ప్రవేశం నిషిద్ధం

పురుషులకు ఈ పుణ్యక్షేత్రల్లోకి ప్రవేశం నిషిద్ధం

Written By: Beldaru Sajjendrakishore

హిందూ సంస్కృతిలో దేవాలయాల పాత్ర చాలా ఎక్కువ. హిందూ సనాతన ధర్మంలో దైవారాధనకు ప్రథమ స్థానం ఉంటుంది. అందువల్ల మన దేశంలో ఆలయాలు ఎక్కువ. ఒక్కొక్క ఆలయం ఒక్కో శైలిలో నిర్మితమై ఉండటమే కాకుండా అక్కడ నియమ నిబంధనలు కూడా చాలా ఎక్కువ. ఈ నియమల్లో కొన్ని వింతగాను, విచిత్రంగాను ఉంటాయి. ఆ నియమ నిబంధనలను చాలా ఏళ్లుగా తూచా తప్పక పాటిస్తున్నారు. అయితే కొన్ని క్షేత్రాలకు సంబంధించి ఆ నిబంధనలు ఎందుకొచ్చాయన్న విషయం ఆసక్తి కరం. మరికొన్నింటి క్షేత్రాల్లో ఎందుకు అటువంటి నిబంధన ఉందన్న విషయం పై సరైన సమాచారం దొరకడం లేదు. అలాంటి క్షేత్రాల వివరాలను ఈ రోజు నేటివ్ ప్లానెట్ మీకు అందిస్తోంది. మరింకెందుకు ఆలస్యం చదవడం మొదలు పెట్టండి...

1. బ్రహ్మకు శాపం...

1. బ్రహ్మకు శాపం...

Image source

ప్రపంచంలో బ్రహ్మకు అతి తక్కువ దేవాలయాలు ఉన్న విషయం తెలిసిందే. అందులో ఒకటి రాజస్థాన్ లో పుష్కర్ లో ఉంది. ఈ ఊరికి ఆ పేరు పుష్కర్ అనే తటాకం వల్ల వచ్చింది. ఈ గుడిలోకి పెళ్లికాని మగవారు ప్రవేశించడం నిషిద్ధం. ఇందుకు గల కారణాలను స్థానికులు కథల రూపంలో చెబుతారు. వేల ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో బ్రహ్మ ఒక యాగం చేపట్ట దలిచాడు. యాగం ప్రారంభించ దలిచిన సుమూర్త ఘడియలు సమీపిస్తున్న బ్రహ్మ భార్య సరస్వతి యాగ ప్రాంతానికి చేరుకోలేదు. హిందూ సంప్రదాయం ప్రకారం సతీసమేతంగా యాగం చేయాలి. అయితే సమయం మించి పోతుండటంతో బ్రహ్మ గాయిత్రి దేవిని పెళ్లి చేసుకుని యాగం ప్రారంభించాడు.

2. బ్రహ్మచారులకు ప్రవేశం నిషిద్ధం...

2. బ్రహ్మచారులకు ప్రవేశం నిషిద్ధం...

Image source

కొద్ది సేపు తర్వాత వచ్చిన సరస్మతి కోపం పట్టలేక ఈ యాగ ప్రాంతం పుణ్యక్షేత్రంగా మారినా ఇక్కడకు భక్తులు ఎవరూ రాని ఒకవేళ వస్తే తీవ్ర ఇబ్బందులు పడుతారని శాపం పెడుతుంది. దీంతో బ్రహ్మతో పాటు దేవతులు సరస్వతికి ఇది సరికాదని చెప్పడంతో కేవలం పెళ్లి కాని బ్రహ్మచారులకు మాత్రమే ఇది వర్తిస్తుందని సరస్పతి చెప్పింది. దీంతో అప్పటి నుంచి ఈ క్షేత్రంలో పెళ్లికాని మగవారికి ప్రవేశం నిషేదం.

3. అటుకల్ దేవాలయం

3. అటుకల్ దేవాలయం

Image source

అటుకల్ దేవాలయం కేరళలోని తిరువనంతపురంలో ఉంది. ఇక్కడ ప్రధానంగా పూజలు అందుకునేది కన్యకా పరమేశ్వరీ దేవి. పార్వతీ దేవి స్వరూపంగా ఈ కన్యకాపరమేశ్వరిని కొలుస్తారు. ఇక్కడ సంక్రాంతి పర్వదినాల్లో మగవారికి ప్రవేశం నిషిద్ధం. సంక్రంతిని ఇక్కడ మూడు రోజుల పాటు నిర్వహిస్తారు.

4. సంక్రాంతి సమయంలో....

4. సంక్రాంతి సమయంలో....

Image source

ఆ సమయంలో పూజాది కార్యక్రమాలన్నీ మహిళలే నిర్వహిస్తారు. ఈ మూడు రోజుల్లో ఈ ఆలయాన్ని దాదాపు 30 లక్షల మంది భక్తులు సందర్శిస్తారు. వీరంతా మహిళలే కావడం విశేషం. ఇందుకు గల కారణాలు ఏమిటన్న విషయం పై సరైన సమాధానం లభించడం లేదు. ఇదిలా ఉండగా ఇక్కడ జరిగే సంక్రాంతి సంబరాలు గిన్నిస్ బుక్లో కూడా స్థానం సంపాదించుకున్నాయి.

5. దేవీ కన్యాకుమారి...

5. దేవీ కన్యాకుమారి...

Image source

దేవి కన్యాకుమారి క్షేత్రం తమిళనాడులోని కన్యాకుమారిలో ఉంది. ఈ దేవాలయం శక్తి పీఠాల్లో ఒకటిగా చెబుతారు. ఇక్కడి స్థల పురాణం పై పలు కథనాలు వినిపిస్తాయి. అందులో చాలా మంది నమ్మకం ప్రకారం సతీదేవి మరణానంతరం పరమశివుడు తీవ్రం విచారంలో మునిగిపోతాడు. ఈ క్రమంలో సతీదేవి పార్థీవ శరీరాన్ని తీసుకుని కైలాసం వెలుతుండగా ఆమె వెన్నుముక ఇక్కడ పడి శక్తిపీఠంగా మారింది. ఈ ఆలయంలో పర్వతీదేవి అంశ అయిన భగవతి మాత సన్యాసిగా కొలువుదీరింది.

6. సన్యాసులు కాని వారికి నిషేదం

6. సన్యాసులు కాని వారికి నిషేదం

Image source

భగవతి మాతను దేవి కుమారిగా, కన్యాకుమారిగా పిలుస్తారు. శ్రీ బాల భద్ర, శ్రీ బాలగా కూడా పిలుస్తారు. ఇక కన్య అంటే పెళ్లి కాని స్త్రీ అని అర్థం. అందువల్లే ఇక్కడ మగవారికి ప్రవేశం నిషిద్ధం. అయితే సన్యాస్యం స్వీకరించిన వారు మాత్రం అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ దేవి నవరాత్రి ఉత్సవాలు బాగా జరుగుతాయి.

7. ఏడాదికి రెండు సార్లు...

7. ఏడాదికి రెండు సార్లు...

Image source

కేరళలోని ఆల్ఫుజా అనే గ్రామంలో చక్కుల తుకావు అనే దేవాలయం ఉంది. ఈ ఆలయంలో దుర్గా మాతను ఎంతో నియమ నిష్టలతో కొలుస్తారు. శుంభ, నిశింభలను సంహరించిన దేవతగా దుర్గామాత ఇక్కడ పూజలు అందుకుంటారు. ఈ దేవాలయంలో ఏడాదిలో రెండు ప్రత్యే పూజలు జరుపుతారు. ఆ ప్రత్యే సందర్భాల్లో మగవారికి ప్రవేశం ఉండదు.

8. నారీ పూజ, ధనుపూజ సమయంలో...

8. నారీ పూజ, ధనుపూజ సమయంలో...

Image source

అందులో ఒకటి సంక్రాంతి సమయంలో చేసే నారీ పూజా, రెండోది ధనుర్మాసంలో చేసే ధను పూజ. మొదటిది ఏడు రోజుల పాటు చేస్తే, రెండోది పది రోజుల పాటు చేస్తారు. ఆ సమయంలో కొంతమందికి తప్ప మిగిలిన మగవారికి ప్రవేశం నిషిద్ధం. ఆ సమయంలో ఆ దేవాలయంలో జరిగే ప్రతి పనిని ఆడవారే చేస్తారు. ఒక వేళ నియమ నిబంధనలు వీడి మగవారు ఆ సమయంలో అక్కడకు ప్రవేశిస్తే దుర్గామత కోపానికి గురి కావాల్సి వస్తుందని భక్తుల ప్రగాడ విశ్వాసం.

9. మాతా దేవాలయం

9. మాతా దేవాలయం

Image source

బీహార్లోని ముజఫర్ ఫూర్ అనే ప్రాంతంలో మాతా దేవాలయం ఉంది. ఇక్కడ దుర్గా మాత స్వయంగా వెలిసిందని భక్తులు, స్థానికుల ప్రగాడ విశ్వాసం. అమ్మవారి పూజా కార్యక్రమాలన్నీ ఎంతో నియమ నిష్టలతో చేస్తారు. ఆ సమయంలో మహిళలు కఠిన నియమాలను పాఠిస్తూ పరమ పవిత్రంగా ఉంటారు.

10. ఏడాదికేడాది ప్రత్యేక సందర్భాల్లో...

10. ఏడాదికేడాది ప్రత్యేక సందర్భాల్లో...

Image source

ఇక్కడ ప్రతి ఏడాది ఆ సంవత్సరాన్ని అనుసరించి ప్రత్యే పూజలు చేస్తారు. ఆ సమయంలో మగవారికి ప్రవేశం నిషిద్ధం. మగవారు ఆ దేవాలయం దరిదాపుల్లోకి కూడా వెళ్లరు. ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఊరి పెద్దల సమక్షంలో కఠిన శిక్ష ఎదుర్కొనాల్సి వస్తుంది.

Read more about: రాజస్థాన్