Search
  • Follow NativePlanet
Share
» »మంత్ర ముగ్ధులను చేసే హేవ్ లాక్ ఐలాండ్ అందాలు !

మంత్ర ముగ్ధులను చేసే హేవ్ లాక్ ఐలాండ్ అందాలు !

అండమాన్ మరియు నికోబార్ దీవులలో గల హేవ్ లాక్ ఐలాండ్ ఒక ఆభరణం వంటిది. గ్రేట్ అండమాన్ లో ఒక భాగమైన హేవ్ లాక్, కేపిటల్ సిటీ పోర్ట్ బ్లెర్ కు 67 కి. మీ. ల దూరంలో కలదు. ఇక్కడ కల సుందరమైన బీచ్ లు, అనేక సాహస క్రీడలు, సముద్రపు వాతావరణం కారణంగా ఈ ద్వీపం అండమాన్ పర్యటన లో ఒక అద్భుత పర్యాటక ప్రదేశం గా నిలిచింది.

హేవ్ లాక్ ఐలాండ్ లో కల స్వల్ప జనాభా చాలా వరకు బెంగాల్ నుండి వచ్చి స్థిరపడిన వారు. ఇక్కడి ప్రజలు పర్యావరణం, సహజ ప్రదేశాల పట్ల ఆసక్తి కలిగి ఉండటంతో పర్యావరణ పర్యాటకం అభివృద్ధికి ఇక్కడ దోహద పడుతోంది. హేవ్ లాక్ ఐలాండ్ లో ఇండియా లోని మూడు అందమైన బీచ్ లు కలవు. రాదా నగర్ బీచ్ తెల్లటి ఇసుక తో కూడి చుట్టూ దట్టమైన పచ్చటి అడవులు కలిగి వుంటుంది.

మీరు కనుక నీటి క్రీడలు స్నోర్కేలింగ్, స్కూబా డైవింగ్ వంటివి ఆసక్తి కలిగి వుంటే ఈ బీచ్ కు తప్పక రావాలి. 2004 లో సంభవించిన సునామి కారణంగా ఎలిఫెంట్ బీచ్ నష్ట పోయింది. కాని అక్కడి పగడపు దిబ్బలు, రంగు రంగుల చేపల లభ్యత కారణంగా పర్యాటకులు దాని పునరుద్ధరణకు కోరుతున్నారు. ఇక్కడి కాలా పత్తర్ విలేజ్ పేరు మీదు గాను, తీరం లో నల్లటి రాళ్ళు వుండటంచే అందుకు అనుగుణంగా, ఇక్కడ కల ఒక బీచ్ కు కాలా పత్తర్ బీచ్ అని పేరు పెట్టారు. ఇక్కడ ఇంకా పేర్లు లేని బీచ్ లు అనేకం కలవు. ఈ ప్రదేశంలో ఏ టి ఎం మెషీన్లు లేని కారణంగాను, ఏవో కొద్ది పాటి హోటల్స్ మాత్రమే కార్డులు అంగీకరిస్తున్న కారణంగా ఇక్కడకు వచ్చే పర్యాటకులు తగినంత నగదు తమ వెంట ఉంచుకోవాలని సూచించవచ్చు. విజయ్ నగర్ బీచ్ మరియు గోవింద్ నగర్ బీచ్ ల వద్దే చాలా వరకు వసతులు, స్థానిక డాబాలు కలవు.

మంత్ర ముగ్ధులను చేసే హేవ్ లాక్ ఐలాండ్ అందాలు !

హేవ్ లాక్ ఎలా చేరాలి ?
హేవ్ లాక్ ఐలాండ్ కు ఫెర్రీ లలో తేలికగా చేరవచ్చు. ఈ ఫెర్రీలు పోర్ట్ బ్లెర్ నుండి బయలు దీరి అందమైన ఈ దీవి చేరేందుకు 2 - 3 గంటలు తీసుకుంటాయి. నీల్ ఐలాండ్ నుండి రాన్గాట్ ద్వారా వచ్చే ఫెర్రీ సర్వీస్ లు కూడా కలవు. ప్రభుత్వ ఫెర్రీలు కూడా కలవు. వీటిని ముందుగా బుక్ చేసుకోవాలి. సీజన్ బట్టి వీటి ప్రయాణపు చార్జీలు వుంటాయి. కాట మరాన్ ఫెర్రీలు కొంచెం ధర ఎక్కువ, మరియు సాహసం తో కూడిన ప్రయాణం కూడాను. వీటిని ఫ్లైట్ సమయాలను బట్టి బుక్ చేసుకోవాలి. పోర్ట్ బ్లెర్ లో బుక్ చేయవచ్చు. హేవ్ లాక్ ఐలాండ్ వెళ్ళాలంటే ముందుగా వాతావరణం పరిశీలించుకోవాలి . అనుకూలించకుంటే, కొన్ని మార్లు ఒకటి లేదా రెండు రోజులు అధికంగా వెయిట్ చేయాలి కూడాను. గతం లో పవన్ హాన్స్ హెలికాప్టర్ ఉపయోగించేవారు. అయితే, ఇపుడు 8 సీట్ల సెస్స్ నా సి ప్లేన్ కలదు. ఇది మిమ్మల్ని పోర్ట్ బ్లెర్ నుండి తీసుకొనే వెళ్లి మరల అదే రోజు వాపసు తీసుకు వస్తుంది. దీని ప్రయాణపు ధర అధికం, అయితే, డిస్కౌంట్ లు కూడా వుంటాయి.
ఒక్కసారి హేవ్ లాక్ ద్వీపం లో దిగితే చాలు, అక్కడి మెత్తటి, తెల్లటి ఇసుకపై నడవటానికి ఇష్టపడతారు. ఐలాండ్ లోపలి భాగాలలో తిరిగేతందుకు జీపులు, బస్సు లు వుంటాయి. రాధానగర్ బీచ్ కు అక్కడ నుండి ఇతర బీచ్ లకు తీసుకుని వెళతాయి.

ఆటో రిక్షాలు ఖచ్చితమైన ధరలతో వివిధ ప్రదేశాలు, మార్కెట్లకు తీసుకు వెళతాయి. సైకిళ్ళు, స్కూటర్లు, మోటార్ సైకిళ్ళు వివిధ మొత్తాలలో అద్దెకు దొరుకుతాయి. బీచ్ లలో నిదానంగా ఈ వాహనాలపై జారిపోతూ సుందర దృశ్యాలను ఆనందించవచ్చు. ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా ప్రైవేటు టాక్సీ లు బుక్ చేసికొనవచ్చు.

సాహస పర్యాటకులకు హేవ్ లాక్ ఐలాండ్ ఒక సవాలు గా వుంటుంది. స్కూబా డైవింగ్ ఇక్కడ తప్పక ఆనందించాలి. అండమాన్ బాబులేస్, బేర్ ఫుట్ స్కూబా, దూంగి దైవ్స్, డైవ్ ఇండియా వంటి గుర్తింపు పొందిన సంస్థలు ఇక్కడ మీకు ట్రైనింగ్ ఇచ్చి ఆనందింప చేస్తాయి. స్కూబా డైవింగ్ ఆనందించాలంటే, సౌత్ బటన్ మరియు ఎలిఫెంట్ బీచ్ లు ప్రధాన ప్రదేశాలు.

రాదా నగర్ బీచ్ లోని స్నార్కెలింగ్ సాహసికులకు మరొక ఆనంద క్రీడా. ఇక్కడ మాస్క్ లు ఫైన్ లు ఇస్తారు. వీటి తో మీరు నీటి లోని పగడపు చిప్పలు, రంగు రంగుల చేపలు చూడవచ్చు.

ఎలిఫెంట్ బీచ్ మరొక ఆకర్షణ. స్థానిక మత్స్యకారులు వివిధ ప్రదేశాలలో స్నార్కెల్ కు సహకరిస్తారు. సాహసికులు హేవ్ లాక్ లో ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు. మీరు కనుక వైల్డ్ ఆర్కిడ్ రిసార్ట్ లేదా ఎమేరల్ద్ జేకొ రిసార్ట్ ల లో దిగినట్లయితే, మీరు అడవి లో ట్రెక్కింగ్ చేయవచ్చు. నైట్ కేమ్పింగ్, స్నోర్కేలింగ్, కయకింగ్, వంటివే కాక, కాలి నడక ట్రెక్ టూర్లు కూడా ఏర్పాటు చేస్తారు.

మాన్ గ్రోవ్ సఫారి, ఫిషింగ్ లు మీరు మిస్ కావద్దు. ఇక్కడ తినేందుకు, తాగేందుకు, అనేక ఎంపికలు కలవు. స్థానిక డాబాలు తాజా సి ఫుడ్ అందిస్తాయి. వాటి ధరలు కూడా సమంజసం గానే వుంటాయి. ఆరోగ్యకర విధాన వంటకాలే. ఇక్కడ వివిధ బీచ్ లలో కల బార్ లు మిమ్మల్ని ప్రకృతి తో మరింత మమేకం అయ్యేలా చేస్తాయి. బీచ్ లోని తాటి ఆకుల గుడిసెలు, పాకలు, మీకు నూతన వసతి అనుభవాలను అందిస్తాయి. ఇంతే కాక, ఇక్కడ వివిధ వర్గాల పర్యాటకులకు అవసరమైన రీతిలో మంచి ఖరీదైన లేదా మీ బడ్జెట్ కు సరి పడే రీతిలో కొన్ని హోటళ్ళు, కాటేజ్ లు కూడా కలవు.

Read more about: beach adventure andaman
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X