» »చిదంబర రహస్యం

చిదంబర రహస్యం

Posted By: Venkata Karunasri Nalluru

శివుడు తాండవం చేసిన ప్రదేశం .. ఆ తాండవ నృత్యాన్ని చూసి విష్ణుమూర్తి పులకించి పోయిన ప్రదేశం ... తమిళనాడులోని చిదంబరం. ఇది సముద్ర తీరానికి 11 కి. మి. దూరంలో మరియు చెన్నై కు దక్షిణంగా 250 కి. మి. దూరంలో కలదు. తమిళనాడులో శివాలయాలకు కొదువలేదు. దీనికి కారణం అప్పటి పాండ్య, చోళ రాజులే. వారికి శివుని మీద ఎంత భక్తి ఉందో అక్కడి దేవాలయాలను చూస్తే ఇట్టే అర్థమవ్వుతుంది. ఆ ఆలయాలలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నది నటరాజ ఆలయం(చిదంబర ఆలయం). ఇది పంచభూత క్షేత్రాలలో ఒకటైన చిదంబరంలో కలదు (భూమి - కాంచీపురం, గాలి - శ్రీకాళహస్తి, నీరు- ట్రిచీ, అగ్ని - తిరువన్ణమలై, ఆకాశం - చిదంబరం).

1000 ఏళ్ల కాలం నాటి శివాలయం ఎక్కడుందో మీకు తెలుసా?

1. ఐదు సభలు లేక వేదికలు

చిత్సబై - గర్భ గుడి కనకసబై - నిత్య పూజలు జరిగే వేదిక నాట్య సబై లేదా నృత్య సబై - శివుడు కాళి తో నాట్యమాడిన ప్రదేశం రాజ్యసబై - భగవంతుని ఆధిపత్యాన్ని చాటి చెప్పిన సభ దేవసబై - పంచమూర్తులు కొలువైన సభ

చిదంబర రహస్యం

చిత్ర కృప : Min Tang

2. చిన్న చిన్న ఆలయాలు

చిదంబర రహస్యం

చిత్ర కృప : meg williams2009

తిరుమూల తనేశ్వరర్, పార్వతి ఆలయం, శివగామి ఆలయం, గణేష్ ఆలయం, పాండియ నాయకం ఆలయం, గోవింద రాజ పెరుమాళ్ ఆలయం, పుండరీగవల్లి తాయార్ ఆలయాలతో పాటు చిదంబర ఆలయ ప్రాంగణంలో ఇంకా చిన్న చిన్న ఆలయాలు అనేకం ఉన్నాయి.

3. ఆలయ రహస్యాలు

చిదంబర రహస్యం

చిదంబర ఆలయం, కాళహస్తి ఆలయం, కంచి లోని ఏకాంబరేశ్వరుని ఆలయం ఒకే రేఖాంశం మీద ఉన్నాయి. అవునండీ ..! కావాలంటే మీరే మ్యాప్ తీసి చూడండి. ఈ మూడు ఆలయాలు 71 డిగ్రీల 41 నిమిషాల రేఖాంశం మీద కనిపిస్తాయి . ఇది ఆశ్చర్యం కాదూ ...!

చిత్ర కృప : Christian Lagat

4. చిదంబర ఆలయం - ప్రతికాత్మకత 01) చిత్స బై మీద ఉన్న 9 కలశాలు - 9 శక్తులను 02) కప్పు పై ఉన్న 64 అడ్డ దూలాలు - 64 కళలను 03) అర్ధ మండపంలోని 6 స్తంభాలు - 6 శాస్త్రాలను 04) పక్కనున్న మరో మండపంలోని 18 స్థంబాలు - 18 పురాణాలను 05) కనక సభ నుండి చిత్ సభ కు దారితీయు 5 మెట్లు - 5 అక్షరాల పంచాక్షర మంత్రం ను (నమః శివాయ) 06) చిత్ సభ పై కప్పుకు ఊతమిచ్చే నాలుగు స్తంభాలను - నాలుగు వేదాలకు ప్రతీకలుగా 07) గర్భ గుడి లోని 28 స్తంభాలు - 28 శైవ ఆగమాల ను సూచిస్తుంది

5. చిదంబరం ఎలా చేరుకోవాలి ?

సమీప విమానాశ్రయం - చెన్నై (250 కి. మీ) రైలు మార్గం చిదంబరం లో రైల్వే స్టేషన్ ఉన్నది. ఇది తిరుచ్చి - చెన్నై మార్గంలో కలదు. చెన్నై నుండి ఇక్కడికి ప్రతి రోజూ రైళ్ళు రాకపోకలు సాగిస్తుంటాయి. రోడ్డు మార్గం చెన్నై - పాండిచ్చేరి మార్గం లో చిదంబరం కలదు. ప్రవేట్, ప్రభుత్వ బస్సులు తరచూ ఈ మార్గం గుండా వెళుతుంటాయి.