Search
  • Follow NativePlanet
Share
» »ఇండియాలోకెల్లా టాప్ లైబ్రరీలు !

ఇండియాలోకెల్లా టాప్ లైబ్రరీలు !

నేడు సాంకేతికత అందుబాటులో రావటంతో .. గ్రంధాలయాలకు వచ్చి చదివేవారి సంఖ్య చాలా వరకు తగ్గింది. అంతర్జాలం (ఇంటర్నెట్) లోనే అన్ని చదివేస్తున్నారు.

By Venkatakarunasri

నేడు సాంకేతికత అందుబాటులో రావటంతో .. గ్రంధాలయాలకు వచ్చి చదివేవారి సంఖ్య చాలా వరకు తగ్గింది. అంతర్జాలం (ఇంటర్నెట్) లోనే అన్ని చదివేస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని పుస్తకాలను డిజిటైజ్ చేసి, ఎక్కడి నుంచైనా పుస్తకాలను చదివే విధంగా వెబ్ సైట్ ల ద్వారా అందజేస్తున్నారు గ్రంధాలయాల సంస్థ వారు.

సామాజిక, సాహితీ, ఆర్థిక, సాంస్కృతిక రక్షణకు కావలసిన జ్ఞాన వాతావరణాన్ని కల్పించటంలో గ్రంధాలయాలు సాధనాలుగా ఉపయోగపడతాయి. భారతదేశంలో లైబ్రెరీ లను చాలా వరకు బ్రిటీషర్లు స్థాపించారు. బ్రిటీషర్లకు రోజూ పుస్తక పఠనం ఒక అలవాటుగా ఉండేదట. అదే అలవాటు క్రీ. శ. 18 వ శతాబ్దంలో కలకత్తాలో లైబ్రెరీ ఏర్పాటు చేసేవిధంగా ప్రేరణ కల్పించింది. ఇండియాలో మొట్టమొదటి లైబ్రరీ కూడా ఇదే.

ఇండియాలోకెల్లా టాప్ లైబ్రరీలు !

ఇండియాలోకెల్లా టాప్ లైబ్రరీలు !

రాంపూర్ రజా లైబ్రెరీ

దీనిని 1904 వ సంవత్సరంలో రాంపూర్ లో కట్టించారు. ఈ భవంతి దేశంలోని స్మారక కట్టడాలతో ఒకటి. 1700 వ సంవత్సరంలో నాటి పుస్తకాలు, 205 చేతితో వ్రాసిన తామ్ర పత్రాలు మరియు 5000 పెయింటింగ్ చిత్రాలు లైబ్రెరీ లో ఉన్నాయి. వివిధ భాషలకు చెందిన సుమారు 30,000 పుస్తకాలు ఉన్నాయి.

చిత్ర కృప : Ariannarama

ఇండియాలోకెల్లా టాప్ లైబ్రరీలు !

ఇండియాలోకెల్లా టాప్ లైబ్రరీలు !

డేవిడ్ సస్సూన్ లైబ్రెరీ

డేవిడ్ సస్సూన్ లైబ్రెరీ ముంబై లో కలదు. ఇది పురాతనమైనది. దీనిని క్రీ. శ. 1870 లో స్థాపించారు. భారతదేశం సంరక్షిస్తున్న స్మారక కట్టడాలతో ఇది ఒకటి. ఇందులో కూడా వేల సంఖ్యలో పుస్తకాలు, పెయింటింగ్ లు ఉన్నాయి.

చిత్ర కృప : Joe Ravi

ఇండియాలోకెల్లా టాప్ లైబ్రరీలు !

ఇండియాలోకెల్లా టాప్ లైబ్రరీలు !

నెహ్రూ మెమోరియల్ మ్యూజియం మరియు లైబ్రెరీ

నెహ్రూ మెమోరియల్ మ్యూజియం ఒక చారిత్రక కట్టడం. ఈ భవంతి దేశ తొట్టతొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నివాసంగా సేవలందించింది. 1964 వ సంవత్సరంలో నెహ్రూ మరణానంతరం దీనిని మ్యూజియం మరియు లైబ్రెరీ గా మార్చారు. నెహ్రూ వాడిన వస్తువులు, పుస్తకాలు మొదలైనవి ఇక్కడ చూడవచ్చు.

చిత్ర కృప : Satish Somasundaram

ఇండియాలోకెల్లా టాప్ లైబ్రరీలు !

ఇండియాలోకెల్లా టాప్ లైబ్రరీలు !

ఇండియన్ నేషనల్ లైబ్రెరీ

సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జాతీయ గ్రంథాలయం కోల్కతాలో వున్నది. దీనిని 1860 లో స్థాపించారు. 17, 18 వశతాబ్దంలో ప్రచురించిన పుస్తకాలు వున్నాయి. 24 లక్షలకు పైగా పుస్తకాలు ఇక్కడ వున్నాయి. వీటిని డిజిటల్ రూపంలోకి మార్చి అందరికి అందుబాటులోవుంచే పని జరుగుతున్నది.

చిత్ర కృప : Avrajyoti Mitra

ఇండియాలోకెల్లా టాప్ లైబ్రరీలు !

ఇండియాలోకెల్లా టాప్ లైబ్రరీలు !

హైదరాబాద్

రాష్ట్ర కేంద్ర గ్రంధాలయం రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం 1891లో అసిఫియా లైబ్రెరీ అనే పేరుతో ఏర్పాటయింది. దీనిలో వివిధ భాషలలో విస్తృతమైన సంఖ్యలో పుస్తకాలున్నాయి. భారత డిజిటల్ లైబ్రరీ ప్రాజెక్టు లో భాగంగా, దీనిలో మరియు నగర కేంద్ర గ్రంథాలయం లోని ఎంపిక చేసిన పుస్తకాలను స్కానింగు చేసి భారత డిజిటల్ లైబ్రరీ ద్వారా అందజేస్తున్నారు. 14,343 తెలుగు పుస్తకాలు లభ్యమవుతున్నాయి.

చిత్ర కృప : Arjunaraoc

ఇండియాలోకెల్లా టాప్ లైబ్రరీలు !

ఇండియాలోకెల్లా టాప్ లైబ్రరీలు !

సరస్వతి మహల్ గ్రంధాలయం

సరస్వతి మహల్ లైబ్రరీ 1535-1675 AD నుండి పాలించిన నాయక్ కింగ్స్ రాయల్ లైబ్రరీ ని ప్రారంభిచారు. తంజావూరు యొక్క సరస్వతి మహల్ లైబ్రరీ ఆసియాలోనే పురాతనమైన వాటిలో ఒకటిగా ఉన్నది. ఇక్కడ తాళపత్ర మరియు తమిళ, మరాఠీ, తెలుగు, మరియు ఆంగ్ల భాషల సమూహంతో వ్రాయబడిన కాగితం పుస్తకాలపై అచ్చు ప్రతుల అసాధారణమైన సేకరణ ఉంది.

చిత్ర కృప : Wiki-uk

ఇండియాలోకెల్లా టాప్ లైబ్రరీలు !

ఇండియాలోకెల్లా టాప్ లైబ్రరీలు !

స్టేట్ సెంట్రల్ లైబ్రెరీ, తిరువనంతపురం

క్రీ.శ. 1829 లో ట్రావెన్కోర్ రాజవంశానికి చెందిన స్వాతి తిరుణాల్ రాజు ఈ లైబ్రెరీ ని స్థానించాడు. ఇండియాలోని మొదటి పబ్లిక్ లైబ్రెరీ ఈ త్రివేండ్రం పబ్లిక్ లైబ్రెరీ. ఇందులో డిజిటల్ లైబ్రెరీ, చిల్డ్రెన్ లైబ్రెరీ మొదలైనవి ఉన్నాయి.

చిత్ర కృప : Rajithmohan

ఇండియాలోకెల్లా టాప్ లైబ్రరీలు !

ఇండియాలోకెల్లా టాప్ లైబ్రరీలు !

కొన్నెమరా పబ్లిక్ లైబ్రరీ, చెన్నై

కొన్నెమరా పబ్లిక్ లైబ్రరీ భారతదేశం నందలి తమిళనాడు రాష్ట్రం లోని చెన్నై పట్టణం లోని ఎగ్మూరు ప్రాంతంలో ఉన్నది. ఇది భారత దేశంలో ప్రచురితమైన అన్ని పుస్తకాలు, వార్తా పత్రికలను భద్రపరిచే నాలుగు గ్రంథాలయాలలో ఒకటి. దీనిని 1890 లో స్థాపించారు. ఈ గ్రంథాలయం లో శతాబ్దాల పాత ప్రచురణలు, భారత దేశంలోని ప్రసిద్ధ పుస్తకాల సేకరణ కలిగి యున్నది.

చిత్ర కృప : SriniG

ఇండియాలోకెల్లా టాప్ లైబ్రరీలు !

ఇండియాలోకెల్లా టాప్ లైబ్రరీలు !

ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబై

ఇండియాలో ఉన్న అందమైన లైబ్రెరీ లలో ఏసియాటిక్ సొసైటీ ఆఫ్ ముంబై ఒకటి. ఇందులో 20,000 పైగా అరుదైన పుస్తకాలను భద్రపరిచారు.

చిత్ర కృప : A.Savin

ఇండియాలోకెల్లా టాప్ లైబ్రరీలు !

ఇండియాలోకెల్లా టాప్ లైబ్రరీలు !

అలహాబాద్ పబ్లిక్ లైబ్రెరీ

అలహాబాద్ పబ్లిక్ లైబ్రెరీ ని తోర్న్ హిల్ మయ్నే మెమోరియల్ అని కూడా పిలుస్తారు. ఈ స్మారక కట్టడం భారతదేశంలోని బ్రిటీష్ కాలానికి గుర్తుగా ఉంది. ఈ భవనాన్ని విస్తృతమైన గోతిక్ శైలి చెక్కడం, ఆకృతులను కలిగిన తెలుపు ఇసుకరాయితో నిర్మించారు. ఇది ఇపుడు స్థానికుల కోసం ప్రజా గ్రంధాలయంగా మార్చబడింది. ఇక్కడికి విద్యార్ధులే కాకుండా చారిత్రికులు కూడా తరచుగా వస్తారు.

చిత్ర కృప : Dananuj

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X