» »భాగ్యనగరంలో భయపెట్టే ప్రాంతాలు !

భాగ్యనగరంలో భయపెట్టే ప్రాంతాలు !

Written By: Venkatakarunasri

భాగ్యనగరంలో భయపెట్టే ప్రాంతాలు ఇవి దెయ్యాల ఆవాసాలు.హైదరాబాద్ అనగానే చార్మినార్, ట్యాంక్ బండ్, బిరియానీ, రంగురంగుల గాజులు గుర్తొస్తాయి. దేశంలో అభివృద్ది చెందిన నగరాలలో ఇది ఒకటి. ఎన్నో అపురూప కట్టడాలు, అత్యాధునిక భావంతులకు నిలయం ఈ రాజధాని. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు స్వర్గధామం భాగ్యనగరం.

అయితే 400 ఏళ్ల క్రితం నిజాం పాలనలో ఏర్పడిన ఈ సిటీలో ఇప్పటికీ ప్రజలకు ముచ్చెమటలు పోయిస్తున్న కొన్ని ప్రాంతాలు వున్నాయి. 24 గంటలు జనులు సంచరించే హైటెక్ నగరంలో దెయ్యాలు కులాసాగా తిరిగేస్తున్నాయి. వారి ఆవాసంలోకి అడుగు పెడితే అంతు చూస్తామని బెదిరిస్తున్నాయి. ఇంతకీ ఈ విశాలమైన నగరంలో డెవిల్స్ ఎక్కడున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ? అయితే మీ కోసం !

1. దేవుడి పటాలు పెట్టుకుని భయంగా

1. దేవుడి పటాలు పెట్టుకుని భయంగా

నగరంలోని సీతాఫలం మండీ వద్ద గల రవీంద్రనగర్ లో 2012వ సంవత్సరంలో జరిగిన సంఘటన. అప్పుడు చాలామంది ఆ ప్రాంతం వదలి వెళ్ళిపోయారు. దెయ్యాలు చేసే రచ్చకి భయపడి కొంతమంది దగ్గరలో వున్న గుడిలో నిద్రిస్తే, మరికొంతమంది ఇంటి తలుపులై దేవుడి పటాలు పెట్టుకుని భయంగా గడిపారు.

pc:youtube

2. పురాతనమైన ఆలయం

2. పురాతనమైన ఆలయం

ఈ ప్రాంతంలో వున్న పురాతనమైన ఆలయాన్ని కూర్చడంతో దెయ్యాలు ఇక విజ్రుంభించవని ప్రజల నమ్మకం. ఎన్ని పూజా కార్యక్రమాలు చేసినా ఇప్పటికీ రాత్రి ఎనిమిది దాటితే ఇంట్లో నుంచి ఒకరు కూడా బయటికి రారు.

pc:youtube

3. బంజారా హిల్స్ రోడ్ నెం.12

3. బంజారా హిల్స్ రోడ్ నెం.12

హైదరాబాద్ లోని ధనవంతులు నివశించే ప్రాంతాలలో బంజారాహిల్స్ ఒకటి. ఇక్కడ రోడ్ నెం.12 లో స్మశానం వుంది. ఈ రోడ్లో దెయ్యాలు చిలిపిపనులు చేస్తుంటాయి. అర్ధరాత్రి కాగానే ఈ రోడ్లోని వీధి దీపాలు, ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోతుంటాయి. ఈ ప్రాంతం మొత్తం ఉన్నట్లుండి చల్లబడి పోతుంది.

pc: youtube

4. వాహనాలు

4. వాహనాలు

12గంటలు దాటినప్పుడు ఈ దారిలో వెళ్ళే వాహనాలు పంచర్ అవుతుంటాయి. మంచి కండీషన్ లో వున్న కారు సైతం ఇక్కడకి రాగానే ట్రబులిస్తుంది. ఇలా ఇక్కడ దెయ్యాలు కనిపించకుండా ఆటపట్టిస్తుంటాయి.

pc:youtube

5. ఉప్పల్ స్టేడియం

5. ఉప్పల్ స్టేడియం

నగరంలో అతి పెద్ద క్రీదామైదానం ఉప్పల్ స్టేడియం. ఇందులో అప్పుడప్పుడూ అంతర్జాతీయ మ్యాచ్ లు జరుగుతుంటాయి. అయితే ఈ స్టేడియంలో ఎవరూ లేని సమయంలో నల్లని ఆకారాలు సంచరిస్తున్నాయని అక్కడ పనిచేసే వారు చెప్తున్నారు. అవి దెయ్యాలేనని వారి నమ్మకం.

pc:youtube

6. శంషాబాద్ ఎయిర్ పోర్ట్

6. శంషాబాద్ ఎయిర్ పోర్ట్

దేశంలోని అత్యాధునిక అతి పెద్ద విమానాశ్రయం శంషాబాద్ ఎయిర్ పోర్ట్. ఇక్కడ ఆత్మలు సంచరిస్తున్నాయని చాలా మంది చెబుతున్నారు. విమానాశ్రయం ఏర్పాటు సమయంలో ఇక్కడ కార్మికులు ప్రమాదవశాత్తు మరణించాయని,వారి ఆత్మలు ఇక్కడే తిరుగుతున్నాయని వెల్లడించారు.

pc:youtube

7. సిసి కెమెరా

7. సిసి కెమెరా

ఇక్కడే సిసి కెమెరాలో ఒక మనిషి ఆకారంలో కూర్చొన్న ఒక దెయ్యం తన తలను 360డిగ్రీలలో తిప్పటం రికార్డ్ అయ్యింది. అంతేకాదు రన్వే పైన తెల్లచీర కట్టుకుని ఒక లేడీ డెవిల్ అప్పుడప్పుడూ డాన్స్ చేస్తూ వుండటం చాలా మంది గమనించారు.

pc:youtube