» »మన దేశంలోని అద్భుత సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు !

మన దేశంలోని అద్భుత సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు !

Written By: Venkatakarunasri

సూరీడు ఉదయిస్తున్న, అస్తమిస్తున్న ఆ దృశ్యాలే వేరు. సిటీ కన్నా పల్లెటూర్లలో ... ఇంకా చెప్పాలంటే పంటలపొలాల వద్ద సూర్యోదయం, సూర్యాస్తమం దృశ్యాలు మరింత అందంగా కనపడతాయి. పక్షులకిలకిలారావాలు, వేకువజామున వినిపించే సుప్రభాతం, కోడికొక్కొరోకో శబ్దాలు ... ఇవన్నీ సూర్యుడు ఉదయిస్తున్నాడు అనటానికి సంకేతాలు.

అయితే ఈ సూర్యోదయ, సూర్యాస్తమ దృశ్యాలు చూడటానికి పర్యాటకులు మన పల్లెటూర్ల వరకు రారు. కనుక సిటీలలోనే ఆ దృశ్యాలను చూసి ఆనందిస్తారు. వీటిని చూడటానికి ప్రకృతిప్రేమికులు, ఓత్సాహికులు, ఫొటోగ్రాఫర్లు ఆసక్తిని కనబరుస్తుంటారు. మన భారతదేశంలో ఇటువంటి కోవకే చెందిన ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. అక్కడ సూర్యోదయ, సూర్యాస్తమ దృశ్యాలు అద్భుతంగా కనపడతాయి.

వాటిలో బీచ్లు, హిల్ స్టేషన్లు, చారిత్రక కట్టడాలు వంటివి కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఇక్కడ చెప్పబోతున్న ప్రదేశాలకు చేరుకోవడం చాలా సులభం. ఆల్మోస్ట్ బస్సు, రైలు మరియు విమాన మార్గాలు చేరువలో అందుబాటులో ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు మూడు అందుబాటులో ఉంటాయి. మరికొన్ని సార్లు వాటిలో ఏదైనా ఒకటి అందుబాటులో ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఆ ప్రదేశాలను చూసితరిద్దాం పదండి!!

వర్కాల

వర్కాల

కేరళ రాష్ట్రంలో త్రివేండ్రం నగరానికి సమీపంలో ఉన్న ప్రదేశం వర్కాల. ఈ ప్రాంత ప్రత్యేకత కొండ అంచులు అరేబియా సముద్రంతో కలుస్తాయి. సూర్యోదయం ఇక్కడ చూడవలసిన సన్నివేశం. ఆ సమయంలో బీచ్ లో ఉన్న ఇసుకతిన్నెలు బంగారు రంగులోకి మారినట్లు కనిపిస్తాయి.

మంగళూరు

మంగళూరు

మంగళూరు కర్ణాటక రాష్ట్ర ముఖద్వారం. ఒకవైపు అరేబియా సముద్రం, మరోవైపు పశ్చిమకనుమలు ఈ ప్రాంతానికి అదనపు ఆకర్షణలు. ప్రఖ్యాత ఉల్లాల్ బ్రిడ్జి పై నుండి పర్యాటకులు సూర్యోదయ, సూర్యాస్తమ దృశ్యాలను చూస్తుంటారు.

కన్యాకుమారి

కన్యాకుమారి

తమిళనాడులోని కన్యాకుమారి సన్ సెట్ / సన్ రైస్ లకు ప్రసిద్ధి చెందినది. ప్రత్యేకించి పౌర్ణమి దినాలలో ఈ ప్రాంతం చాలా అందంగా ఉంటుంది. పర్యాటకులు బీచ్ వద్ద నిలబడి ఉదయం సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తమం చూస్తుంటారు. చూడవలసినవి : వివేకానంద రాక్ మెమోరియల్, తిరువళ్ళువార్ విగ్రహం, బీచ్ లు, మ్యూజియం, టెంపుల్, ఫోర్ట్ మొదలుగునవి.

పూరి

పూరి

పూరి బీచ్ జంటలకు, కుటుంబ సభ్యులకు ఒక విహార స్థలం. పర్యాటకులు బీచ్ లో కూర్చొని ఉదయం పూట సూర్యోదయంను, సాయంత్రంవేళ సూర్యాస్తమంను చూస్తుంటారు.

హైదరాబాద్

హైదరాబాద్

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ గురించి తెలియనివారుండరు. మరి అక్కడ సూర్యోదయ, సూర్యాస్తమ దృశ్యాలు ఎంతబాగుంటాయో పక్క ఫొటోలో చూడండి.

ఆరూర్

ఆరూర్

ఆరూర్ కేరళ రాష్ట్రంలో అలప్పుజ జిల్లాలో ఉన్న ఒక చిన్న పట్టణం. ఈ పట్టణంలోని బ్రిడ్జి పై నుండి సూర్యోదయ, సూర్యాస్తమ దృశ్యాలను చూడటానికి అధికసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.

అగుంబే

అగుంబే

కర్ణాటక లో చూడవలసిన మరో ప్రదేశం అగుంబే. ఇక్కడ నిత్యం ఎదో ఒక షూటింగ్ జరుగుతూ ఉంటుంది. సూర్యోదయ, సూర్యాస్తమ దృశ్యాలను ప్రేమికులు ప్రేమ హృదయాలుగా అభివర్ణిస్తుంటారు. ఈప్రాంతపు అదనపు ఆకర్షణలు జలపాతాలు, అడవులు, పశ్చిమ కనుమలు.