Search
  • Follow NativePlanet
Share
» »అలీ బాగ్ - 'మహారాష్ట్ర యొక్క గోవా' !!

అలీ బాగ్ - 'మహారాష్ట్ర యొక్క గోవా' !!

కణేశ్వర్ మరియు సోమేశ్వర దేవాలయాలు ఇక్కడ ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రాలు. ఈ రెంటిలోను శివ భగవానుడి అందమైన విగ్రహాలు కలవు.

By Mohammad

అలీ బాగ్ చిన్నది మరియు అందమైనది. ఆలీబాగ్ మహారాష్ట్ర పడమటి తీరంలో ఒక చిన్న పట్టణం. ఇది కొంకణ్ ప్రాంతంలోని రాయ్ గడ్ జిల్లాలో కలదు. ముంబై మెట్రో కు సమీపం. ఆలీబాగ్ ను అలీ గార్డెన్ పేరుపై నిర్మించారు. ఆలీ ఈ ప్రాంతంలో అనేక మామిడి మరియు కొబ్బరి చెట్లు నాటాడని చెపుతారు. ఈ ప్రదేశం సుమారుగా 17వ శతాబ్దానికి చెందినది.

కణేశ్వర్ మరియు సోమేశ్వర దేవాలయాలు ఇక్కడ ప్రసిద్ధి చెందిన పుణ్య క్షేత్రాలు. ఈ రెంటిలోను శివ భగవానుడి అందమైన విగ్రహాలు కలవు. ఈ చిన్న పట్టణం నేడు ఎన్నో వ్యాపారాలకు కేంద్రంగా ఉంది. ఎన్నో కాటేజీలు, ఫారం హౌస్ లు కనపడతాయి.

మహారాష్ట్ర లోని గోవా

ఈ ప్రదేశానికి మూడు వైపులా నీరు కలదు. అనేక బీచ్ లు కలవు. బీచ్ లలో అందమైన వరుసలలో కొబ్బరి, పోక చెట్లు ఉంటాయి. ఇంత అందమైన ప్రదేశమైన అలీ బాగ్ ను మహారాష్ట్రలోని గోవాగా అభివర్ణిస్తారు. కాలుష్యం లేని నీరు, తాజాగాలి, చక్కని ప్రదేశాలు పర్యాటకులకు స్వర్గాన్ని తలిపిస్తాయి.

అక్షి బీచ్

అక్షి బీచ్

ఆలీబాగ్ నందు కల అక్షి బీచ్ మరొక ఆకర్షణ. ఇది ఆలీబాగ్ కు 5 కి.మీ.ల దూరంలో ఉంది. ఈ బీచ్ లో అనేక ప్రకటనలు మరియు సినిమాలు షూటింగ్ చేస్తారు. పిల్లలకు నీటి ఆటలకు ఈ బీచ్ పూర్తి ఆనందం కలిగిస్తుంది. మీ ప్రేయసి లేదా ప్రియుడితో కలసి బీచ్ నది ఒడ్డున నడుస్తూంటే, సూర్యాస్తమయ ఆనందం అమోఘంగా ఉంటుంది.

చిత్రకృప : Raman Patel

ఆలీబాగ్ బీచ్

ఆలీబాగ్ బీచ్

ఆలీబాగ్ పట్టణ పేరునే బీచ్ కు కూడా ఆలీబాగ్ బీచ్ అని పెట్టారు. ఈ బీచ్ నుండి కొలబా ఫోర్ట్ చక్కగా చూడవచ్చు.ఈ బీచ్ లోని ఇసుక నల్లగా ఉంటుంది. సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తూ లే లేత కొబ్బరి నీరు తాగుతూ అద్భుతంగా ఆనందించగల ప్రదేశం ఇది.

చిత్రకృప : Rakesh Ayilliath

కణేశ్వర్ దేవాలయం

కణేశ్వర్ దేవాలయం

కణేశ్వర్ దేవాలయం ఒక శివుడి గుడి. ఆలీబాగ్ నుండి సుమారు 12 కి.మీ.ల దూరంలో సుమారు 900 అడుగుల ఎత్తున ఒక కొండపై కలదు. ఈ దేవాలయాన్ని రాజా రామ్ దేవ్ యాదవ్ నిర్మించారు. భక్తులు దీనిని చేరాలంటే 500 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. శివుడి విగ్రహం సుమారు 54 అడుగుల ఎత్తున ఉండి ఆశ్చర్య పరుస్తుంది.

చిత్రకృప : Vikas Rana

సోమేమేశ్వర దేవాలయం

సోమేమేశ్వర దేవాలయం

ఆలీబాగ్ లో సోమేమేశ్వర దేవాలయం ప్రసిద్ధి చెందినది. సుమారు 3 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయం శాతవాహనుల కాలం నాటిది. సోమేశ్వర దేవాలయంలో శివుడి విగ్రహం పూజించబడుతుంది. ఒకప్పుడు శివుడు పూర్తిగా విషం నిండిన సముద్రాన్ని తాగాడని, అపుడు ఆ నీరంతా తేనెగా మారిందని చెపుతారు. వీటిలో ఒక శిల దీపస్తంభానికి దగ్గిరగా ఉంటుంది.

చిత్రకృప : Vikas Rana

కొలబా కోట

కొలబా కోట

కొలబా కోటనుముంబైవాసులు తరచుగా ఆనందించే కొలబా మార్కెట్ అని భావించకండి. ఈ కొలబా కోట వేరు ప్రదేశంలో సముద్ర తీరంలో కలదు. సమీపంలో అనేక దేవాలయాలు కూడా కలవు. వాటి ప్రవేశ ద్వారాలకు వివిధ రకాల ఏనుగుల, పులుల చిత్రాల చెక్కడాలను గమనించవచ్చు. సముద్రపు పోటు అధికంగా లేని సమయంలో బీచ్ నుండి కోటకు కాలిమార్గంలో చేరవచ్చు.

చిత్రకృప : Rakesh Ayilliath

కంధేరి కోట

కంధేరి కోట

కంధేరి కోటను సుమారుగా 320 సంవత్సరాల క్రిందట అంటే 1678లో నిర్మించారు. కొంతకాలం అది బ్రిటీష్ పాలనలో కూడా ఉంది. పీష్వా వంశస్ధులు కోటను బ్రిటీష్ పాలకులకు అప్పగించారు. ధాయ్ బీచ్ నుండి ఈ కోట 3 కి.మీ.లు మాత్రమే ఉంటుంది. సమీపంలో ఒక లైట్ హౌస్ కూడా కలదు.

చిత్రకృప : Vikas Rana

మండవ బీచ్

మండవ బీచ్

మండవ బీచ్ కూడా ఏ మాత్రం కాలుష్యం లేని బీచ్ లలో ఒకటి. ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఇది ఆలీబాగ్ కు 20 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఈ బీచ్ ప్రాంతంలో బాలీవుడ్ నటుల నివాసాలు అనేకం కలవు. దూరంనుండి గేట్ వే ఆఫ్ ఇండియాని కూడా చూడవచ్చు.

చిత్రకృప : Sobarwiki

ఖిమ్ మరియు నాగొంవ్ బీచ్

ఖిమ్ మరియు నాగొంవ్ బీచ్

ఖిమ్ మరియు నాగొంవ్ బీచ్ లు టవున్ కు సుమారు 10 కి.మీ.ల దూరంలో ఉంటాయి. ఖిమ్ బీచ్ లో పోక మరియు కొబ్బరి చెట్లు అందంగా వరుసలో పేర్చబడి ఉంటాయి. ఎన్నో రకాల పక్షులు, సీతాకోక చిలుకలను కూడా చూసి ఆనందించవచ్చు.

చిత్రకృప : Tomas Belcik

స్థానిక రుచులు - విహారాలు

స్థానిక రుచులు - విహారాలు

ఆలీబాగ్ ఒక బీచ్ టవున్ కావటం వలన, ఇక్కడి ఆహారాలు అన్ని స్ధానిక రుచుల ఆహారాలుగా ఉంటాయి. ఇక్కడి బీచ్ లు వారాంతపు సెలవుల వినోదాలకు అందుబాటులో ఉండి నగర జీవనంలో ఒత్తిడికల వారికి ఎంతో ఆనందాన్నిస్తాయి. బీచ్ విహారం, నీటి ఆటలు, సూర్యాస్తమయ సాయంత్రాలు ఎంతో ఆనందం కలిగిస్తాయి.

చిత్రకృప : Sankarshan Mukhopadhyay

చేరటం ఎలా?

చేరటం ఎలా?

విమాన ప్రయాణం
ముంబై లోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం 102 కి.మీ.ల దూరం. ఈ విమానాశ్రయంనుండి ఆలీబాగ్ కు అనేక క్యాబ్ లు టాక్సీలు దొరుకుతాయి.

రైలు ప్రయాణం
పెన్ రైలు స్టేషన్ ఆలీబాగ్ కు 30 కి.మీ.ల దూరంలో కలదు. ముంబై, చెన్నై, ఢిల్లీ మొదలగు పట్టణాలు, నగరాలనుండి అనేక రైళ్ళు పెన్ రైలు స్టేషన్ కు అనుసంధానించబడి ఉన్నాయి. పెన్ రైలు స్టేషన్ నుండి ఆలీబాగ్ కు టాక్సీ సర్వీసులు కలవు.

రోడ్డు ప్రయాణం
రోడ్డు ప్రయాణం చేయాలనుకునే వారికి కూడా పెన్ నుండి లేదా ముంబై నుండి ప్రభుత్వ మరియు ప్రయివేటు వాహనాలు దొరుకుతాయి. ఆలీబాగ్ కు ముంబై 110 కి.మీ.ల దూరంలో కలదు.

చిత్రకృప : Dinesh Valke

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X