Search
  • Follow NativePlanet
Share
» »కలపెట్ట - ఇదో అందమైన ప్రకృతి ప్రదేశం !!

కలపెట్ట - ఇదో అందమైన ప్రకృతి ప్రదేశం !!

కలపెట్ట ఒక చిన్న ప్రశాంతమైన గ్రామం. ఇది సుందరమైన ప్రకృతి దృశ్యాలు మరియు ఎత్తైన పర్వతాలు కలిగి, చుట్టూ విశాలమైన కాఫీ తోటలు కలిగి ఉంది.

By Mohammad

పర్యాటక ప్రదేశం : కల్పెట్ట లేదా కలపెట్ట

జిల్లా : వయనాడు

రాష్ట్రం : కేరళ

ప్రధాన ఆకర్షణలు : మీన్ ముట్టి జలపాతాలు, బాణసుర సాగర్ డ్యాం, లవ్ ఆకృతి కోనేరు - చెంబర శిఖరం, సూచిప్పర జలపాతం, కరపూజా డ్యాం మొదలగునవి.

కలపెట్ట ఒక చిన్న ప్రశాంతమైన గ్రామం. ఇది సుందరమైన ప్రకృతి దృశ్యాలు మరియు ఎత్తైన పర్వతాలు కలిగి, చుట్టూ విశాలమైన కాఫీ తోటలు కలిగి ఉంది. ఈ ప్రదేశం వయనాడ్ జిల్లలో సముద్ర మట్టానికి సుమారు 780 మీ. ల ఎత్తులో కలదు. ప్రకృతి ప్రియులకు ఇది ఒక అద్భుత ప్రదేశం. మతపర అభిమానులకు పూజలు చేయుటకు ఎన్నో దేవాలయాలు కూడా కలవు.

ఇది కూడా చదవండి : కేరళలో ప్రసిద్ధి చెందిన 10 పర్యాటక ప్రదేశాలు !!

ఈ ప్రదేశం అందాలు ఇక్కడ కల మీన్ ముట్టి, సూచీ పర మరియు కంతా పర జలపాతాలతో మరింత ఆకర్షణీయంగా కనపడతాయి. ఈ జలపాతాలు అన్నీ సమీపం లోనే కలవు. పుణ్య క్షేత్రాలు, మరియు ప్రాంత సహజ అందాలు, కలపెట్ట ని ఒక పర్యాటక ప్రదేశం గా తీర్చి దిద్దాయి. వీటికి తగినట్లు కలపెట్ట వాతావరణం సంవత్సరం పొడవునా అనుకూలంగానే ఉంటుంది.

కూట్టముండు గ్లాస్ టెంపుల్

కూట్టముండు గ్లాస్ టెంపుల్

కలపెట్ట లో కూత్తముండు గ్లాస్ టెంపుల్ కూడా ఒక జైన దేవాలయమే. వేల్లరిమల కొండలపై కలదు. ఈ టెంపుల్ జైన రుషి పర్శవనత స్వామి గౌరవార్ధం నిర్మించబడింది. దీనిలో వేలాది గ్లాస్ అద్దాలు ఉంటాయి. కనుకనే ఈ దేవాలయానికి ఆ పేరు వచ్చింది. ఇది కలపెట్ట పట్టణానికి 20 కి. మీ. దూరంలో కలదు.

చిత్రకృప : Praveen.P

మీన్ ముట్టి జలపాతాలు

మీన్ ముట్టి జలపాతాలు

మీన్ ముట్టి జలపాతాలు చాల అందమైనవె కాక కేరళ లో రెండవ అహి పెద్ద జలపాతాలు.ఈ జలపాతాలు సుమారు 300 మీ. ఎత్తునుండి మూడు దశల లో కిందకు పడతాయి. ఈ ప్రదేశం కలపెట్ట నుండి 29 కి.మీ. ఉంటుంది. వెళ్ళే దోవలో కొన్ని పురాతన గుహలు కూడా చూడవచ్చు.

చిత్రకృప : Anantharamvanchiprakash

పూకోట్ లేక్

పూకోట్ లేక్

పూకోట్ లేక్ లేదా పూకోడే లేక్ స్వచ్చమైన మంచి నీటి సరస్సు. దట్టమైన అడవులలో ఈ సరస్సు ఉండడం వల్ల ప్రసిద్దమైన పిక్నిక్ స్పాట్ గా కేరళలో ఈ సరస్సు గుర్తింపు పొందింది. ఈ సరస్సు ఒడ్డున కూర్చుని, నిటి అందాలను చూస్తూ కొన్ని గంటలు ప్రశాంతంగా గడపవచ్చు.

చిత్రకృప : Prof tpms

సూచిప్పర జలపాతాలు

సూచిప్పర జలపాతాలు

సూచిప్పర జలపాతాలు సెంటినెల్ రాక్ వాటర్ ఫాల్స్ గా ప్రసిద్ధి చెందాయి. ఇవి 100 నుండి 300 అడుగుల ఎత్తులో కిందకు పడుతూంటాయి. ఈ ప్రదేశంలో కల నీటి ప్రాంతం లో నీటి ఆటలు అంటే రాఫ్టింగ్, స్విమ్మింగ్, బాతింగ్ వంటివి ఆచరిస్తారు. మీరు ఇక్కడ చెట్ల పై కల గుడిసెలలో వసతి పొంది ప్రకృతిని చూస్తూ ఆనందించవచ్చు.

చిత్రకృప : Sankara Subramanian

వరంబెట్ట మసీదు

వరంబెట్ట మసీదు

కలపెట్ట పట్టణానికి ఈ మసీదు 15 కి.మీ. ల దూరంలో కలదు. ఈ మసీదు సుమారు 300 సంవత్సరాలకు పైగా కలది. ఈ మసీదు ముస్లిమ్ లది అయినప్పటికీ అన్ని మతాల వారు దీనిని సందర్శిస్తారు. ప్రతి ఏట మార్చ్ నెలలో ఈ మసీదు లో ఉత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి.

చిత్రకృప : Kazzwani

బనసుర సాగర్ డ్యాం

బనసుర సాగర్ డ్యాం

కాబిని నది ఉప నది పైన ఉన్న బనసుర సాగర్ డ్యాం కలపెట్ట పట్టణం నుండి 21 కి మీ ల దూరం లో ఉంది. ఈ డ్యాం భారత దేశం లో ఉన్న అతి పెద్ద ఆనకట్టగా మరియు ఆసియా లోనే రెండవ పెద్ద ఆనకట్టగా ఘనత సాధించింది. వెస్ట్రన్ ఘాట్స్ లో ఉండే అందమైన పర్వతాల్ని చూసేందుకు ఈ డ్యాం నుండే పర్యాటకులు ట్రెక్కింగ్ ప్రారంభిస్తారు.

చిత్రకృప : Karkiabhijeet

చెంబర శిఖరం

చెంబర శిఖరం

చెంబర శిఖరం కలపెట్ట లో మాత్రమే ఎత్తైనది కాక, వయనాడ్ జిల్లాలోనే ఎత్తైనది గా పేరు పడింది. ఇది సముద్ర మట్టానికి సుమారు 2100 ఎత్తు లో ఉంటుంది. ట్రెక్కర్ల కు ఇది చాల ఇష్టమైన ప్రదేశం. శిఖరం పై భాగంలో శిబిరాలు కూడా వసతి కొరకు గలవు. శిఖరం పై ఒక సరస్సు కలదు. మెప్పాడి లో కల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అనుమతులు ముందస్తు గా తీసుకోవాలి.

చిత్రకృప : Tanuja R Y

కరపూజ డాం

కరపూజ డాం

కరపూజ డాం దేశం లోనే అతి పెద్ద మట్టి డాం. కలపెట్ట పట్టణానికి ఇది 16 కి. మీ. ల దూరం లో వుంటుంది. దీనిని కరపూజ సరస్సు పై నిర్మించారు. సుమారు ఒక డజన్ సరస్సులు కలసి ఈ సరస్సు ఏర్పడింది. ఈ ప్రదేశం లో అనేక నీటి పక్షులు చూడవచ్చు. మీరు ఫోటోగ్రఫీ ఇష్టపడే వారైతే ఈ ప్రదేశాన్ని తప్పక చూడాలి.

చిత్రకృప : Anil R.V

కన్తాపర జలపాతాలు

కన్తాపర జలపాతాలు

కన్తాపర జలపాతాలు చూచే వారికి ఒక విందు వలె వుంటాయి. ఈ జలపాతాలు కలపెట్ట కు 12 కి. మీ. ల దూరంలో కలవు. ౩౦ మీ. ల ఎత్తు నుండి ఇవి ప్రవహిస్తాయి. దీనికి ఇరువైపులా గల తేయాకు తోటలు వీటి అందాన్ని మరింత పెంచాయి. ఈ ప్రదేశం పిక్నిక్ ప్రదేశంగా, కామ్పింగ్ మరియు ట్రెక్కింగ్ ప్రదేశంగా బాగుంటుంది.

చిత్రకృప : Rineeshrv

పులియార్మాల జైన దేవాలయం

పులియార్మాల జైన దేవాలయం

పులియార్మాల జైన దేవాలయం దాని కఠినమైన స్థంభాలకు మరియు శిల్ప శైలి కి ప్రసిద్ధి గాంచింది. దీనిలో అనంతనాద స్వామి విగ్రహం ఉంటుంది. జైనుల ఈ పుణ్య క్షేత్రం కలపెట్ట నుండి 6 కి. మీ. ల దూరం లో ఇది కలదు. దేవాలయానికి ఒక స్తూపం ఉనుంది. ఇది సంప్రాదాయక ద్రావిడ తీరులో ఉంటుంది.

చిత్రకృప : Jafarpulpally

కలపెట్ట ఎలా చేరుకోవాలి ?

కలపెట్ట ఎలా చేరుకోవాలి ?

కలపెట్ట కు సమీపాన కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడికి నుండి మైసూర్ 140 కిలోమీటర్ల దూరంలో, కాలికట్ 74 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. కలపెట్ట కు కేరళ రోడ్డు రవాణా సంస్థ బస్సులతో పాటు, ఇతర ప్రవేట్ బస్సులు కూడా నడుస్తుంటాయి.

చిత్రకృప : Rineeshrv

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X