» »ఢిల్లీ లో అద్భుతమైన మొఘల్ స్మారక కట్టడాలు !

ఢిల్లీ లో అద్భుతమైన మొఘల్ స్మారక కట్టడాలు !

Written By:

మొఘల్ చక్రవర్తుల కాలం కళలకు నిలయం. వీరి కాలంలో ఎన్నో ప్రసిద్ధ కట్టడాలు వెలిశాయి. వాటిలో కొన్ని ప్రపంచ వారసత్వ కట్టడాలుగా గుర్తించబడ్డాయి. తాజ్ మహల్, హుమాయూన్ సమాధి లను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రపంచ వారసత్వ కేంద్రం గా వర్ధిల్లుతున్న దేశ రాజధాని ఢిల్లీ లో మొఘల్ కట్టడాలకు కొదువలేదు.

మంచి పనితనం కలిగిన అద్భుత వాస్తు శిల్పకారులు ఎన్నో ఏళ్ళు శ్రమించి కట్టడాలను నిర్మించారు. ఇవన్నీ ఇండో - ఇస్లామిక్ శైలిలోనే కట్టారు. కొన్ని చరిత్రను సూచిస్తే .. మరికొన్ని నాటి సంఘటనలు గుర్తుకు తెస్తాయి.

దేశ రాజధాని ఢిల్లీ లో ఉన్న కొన్ని అద్భుత మొఘల్ నిర్మాణాలను ఒకసారి పరిశీలిస్తే ..!

అలా -ఇ - దర్వాజా

                                                                         అలా -ఇ - దర్వాజా

                                                                         చిత్ర కృప : stevekc

అలా -ఇ - దర్వాజా

అలా -ఇ - దర్వాజా అనే కట్టడం, కుతుబ్ మినార్ ప్రాంగణంలో కలదు. కువ్వత్ - ఉల్ - ఇస్లాం మసీదు కు ప్రవేశ మార్గం అలా- ఇ - దర్వాజా. ఇది చతురస్త్రాకార ఆకారంలో చూడటానికి ఒక గుమ్మటం వలే అగుపిస్తుంది. అందమైన చెక్కిన శిలా తెరలతో, పాలరాతి మార్బుల్ అలంకరణ లతో కూడిన ఈ నిర్మాణాన్ని అల్లా ఉద్దీన్ ఖిల్జీ కట్టించాడు.

ఎర్ర కోట

                                                                          ఎర్ర కోట

                                                                 చిత్ర కృప : Achyutmisra

ఎర్ర కోట

ఎర్ర కోట అనే అందరికి గుర్తొచ్చేది ఆగస్టు 15. ఎర్ర రాతి తో నిర్మించిన ఈ కోట ప్రపంచంలోనే సుందరమైనది. ఎర్ర కోట ఎన్నో అద్భుత కట్టడాలను కలిగి ఉంది. అందులో ఒకటి దివాన్-ఇ-ఆజమ్. ఈ ప్రదేశంలో రాజు కూర్చొని ప్రజల సమస్యలను పరిష్కరించేవాడు. ఔరంగజేబు వ్యక్తిగత ప్రార్థనా మందిరం మోతీ మసీద్ ను కూడా కోట అద్భుత కట్టడాలలో మరొకటి.

కుతుబ్ మినార్

                                                                        కుతుబ్ మినార్

                                                                    చిత్ర కృప : NID chick

కుతుబ్ మినార్

ఇండియాలోనే అత్యంత ఎత్తైన ఇటుకలతో నిర్మించిన మినార్ గా ప్రసిద్ధి చెందినది కుతుబ్ మినార్. దీనిని కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడు కనుక కుతుబ్ మినార్ అనే పేరొచ్చిందని ప్రతీతి. మొత్తం 5 అంతస్తులుగా ఉండే దీని నిర్మాణం ఎత్తు 72.5 మీటర్లు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే 5 డిగ్రీల వంపు కలిగి ఉన్న ఈ కట్టడం యొక్క నీడ ప్రతి ఏడాది జూన్ 22 న భూమిపై పడదు.

సఫ్దర్ జంగ్ సమాధి

                                                                         సఫ్దర్ జంగ్ సమాధి

                                                                      చిత్ర కృప : Michael Vito

సఫ్దర్ జంగ్ సమాధి

మొఘల్ శిల్ప తీరులో నిర్మించిన చివరి కట్టడం సఫ్దర్ జంగ్ సమాధి. క్రీ. శ. 1753 వ సంవత్సరం లో షియా- ఉద్దౌలా తన తండ్రి సఫ్దర్ జంగ్ జ్ఞాపకార్థం నిర్మించాడు. దీని ప్రవేశం ఎర్రటి రాయితో నిర్మించబడి ఉంటుంది. సమాధి ఉన్న ప్రదేశంలో తొమ్మిది చిన్న బురుజులు వివిధ రంగులలో అలంకరించబడ్డ తెల్లటి సెంట్రల్ ఆర్చ్ ను తాకుతూ కనిపిస్తాయి. మొఘల్ ఉద్యాన వనాలు, ఫౌంటైన్ లు, మండపాలు మొదలైనవి చూడదగ్గవిగా ఉన్నాయి.

హుమాయూన్ సమాధి

                                                                        హుమాయూన్ సమాధి

                                                                           చిత్ర కృప : MPF

హుమాయూన్ సమాధి

క్రీ. శ. 1562 వ సంవత్సరంలో హుమాయూన్ జ్ఞాపకార్థం అతని భార్య హమీదా బాను బేగం, మిరాక్ మీర్జా ఘియాత్ అనే పర్షియన్ వాస్తు శిల్పి సహకారంతో సమాధిని నిర్మించింది. ఈ సమాధి అతను మరణించిన 9 సంవత్సరాలకు నిర్మించారు. సమాధి చుట్టూ మొఘల్ గార్డెన్ లు, వాటర్ ఫౌంటైన్ లు, ఫుట్ పాత్ లు ఉన్నాయి.

ఇషా ఖాన్ సమాధి

                                                                         ఇషా ఖాన్ సమాధి

                                                            చిత్ర కృప : uldeepsingh Mahawar

ఇషా ఖాన్ సమాధి

ఇషా ఖాన్ సమాధి, హుమాయూన్ సమాధి కాంప్లెక్స్ లో కలదు. చదునైన పల్లపు తోటలో సంప్రదాయ శైలిలో దీని నిర్మాణం జరిగింది. సమాధి అందమైన టైల్స్ తో, వరండాలతో మరియు చిన్న చిన్న కిటికీ లతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది.

Please Wait while comments are loading...