» »శ్రీకృష్ణుడి ఐదు దివ్య ధామాలు !!

శ్రీకృష్ణుడి ఐదు దివ్య ధామాలు !!

Written By:

శ్రీకృష్ణుడు హిందూమత దేవుడు. ఈయన శ్రీమహావిష్ణువు అవతారాలలో తొమ్మిదవ అవతారం. 'కృష్ణ' అనగా నలుపు అని అర్థం. అందుకే కృష్ణుడు అంటే నలుపు రంగు కలిగిఉన్నవాడని ఐతిహ్యం. అనేక దేవాలయాల విగ్రహాలలోనూ, శిల్పాలలోనూ, చిత్రాలలోనూ, ప్రార్థనలోనూ, సాహిత్యం, పురాణాలు, కావ్యాలు ఇలా అన్ని చోట్ల శ్రీకృష్ణుని రూప స్వభావాల చిత్రణ ఉన్నది.

రాధాకృష్ణుల ప్రేమందిరం ... బృందావనం !

భారతదేశంతో శ్రీకృష్ణ ఆరాధన ఎప్పటినుంచో ఉంది. దానికి కొనసాగింపుగా ఇస్కాన్ సంస్థ కూడా భారతదేశం అంతటా శ్రీకృష్ణ మందిరాలు నిర్మించింది. దాదాపు ప్రతి నగరంలోనూ వీరి మందిరాలు ఉన్నాయి అక్కడ నిత్యం భక్తులు కృష్ణ జపాన్ని పఠిస్తుంటారు, ఆరాధిస్తుంటారు.

ఇలా భారతదేశంలో ఎన్ని కృష్ణ ఆలయాలు ఉన్నా ముఖ్యమైనవి మాత్రం ఐదు ఉన్నాయి. ఇవి పంచ దివ్యధామాలు గా కీర్తించబడుతున్నాయి. అందులో ఒకటి మన తెలుగు రాష్ట్రంలో కూడా ఉన్నది. ఉత్తర భారతదేశం నుండి దక్షిణ భారతదేశం వరకు వ్యాపించి ఉన్న ఆ దివ్య ధామాలను, వారి చుట్టుప్రక్కల ఉన్న సందర్శనీయ స్థలాలను ఒకసారి గమనిస్తే ...

మీకు తెలియని కృష్ణపరమాత్ముని విషయాలు !

మధుర

మధుర

శ్రీకృష్ణుడు జన్మించిన ప్రదేశం ఉత్తరప్రదేశ్ లోని మథుర. ఇక్కడి కేశవ్దేవ్ దేవాలయం హిందువులకు అత్యంత పవిత్రం. ఈ దేవాలయాన్ని శ్రీకృష్ణుడి మునిమనుమడైన వజ్రనాభుడు ఐదువేల ఏళ్ళ కిందట నిర్మించాడని స్థలపురాణం.

పండుగలు : జన్మాష్టమి, వసంత పంచమి, మహాశివరాత్రి, గోపాష్టమి, దీపావళి మొదలైనవి ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

చిత్రకృప : Diego Delso

మధుర - చూడదగిన ప్రదేశాలు

మధుర - చూడదగిన ప్రదేశాలు

శ్రీకృష్ణ జన్మభూమి దేవాలయం, గర్భ గుహ, భాగవత భవన్, గోకులం, బృందావనం, గోవర్ధన పర్వతం, వంటి ప్రదేశాలు. వీటితోపాటు మొఘలుల కాలంనాటి జామా మసీదు, కుసుమ సరోవరం, రాధా కుండ్, మధుర మ్యూజియం సందర్శనీయ స్థలాలు.

చిత్రకృప : Bhavishya Goel

మధుర ఎలా చేరుకోవాలి?

మధుర ఎలా చేరుకోవాలి?

హైదరాబాద్ నుంచి మధుర 1375 కి.మీ. దూరం. హైదరాబాద్ నుంచి నేరుగా రైలు సదుపాయం ఉంది. మధురకు సమీపాన 147 కి.మీ దూరంలో న్యూఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం, 49 కి.మీ. ల దూరంలో ఆగ్రా విమానాశ్రయం కలదు.

చిత్రకృప : Adityavijayavargia

ద్వారక

ద్వారక

ద్వారక, గుజరాత్ గోమతీ నదీ తీరంలో ఉంది. సంస్కృతంలో ద్వారక అంటే ‘స్వర్గానికి ద్వారం' అని అర్థం. కృష్ణుడు పరిపాలించిన ప్రాంతం ద్వారక. ఇక్కడ దాదాపు 2500 సంవత్సరాల కిందట నిర్మించిన ద్వారకాధీశుడి దేవాలయం ప్రధానమైనది.

పండుగలు : జన్మాష్టమి వేడుకలను తిలకించేందుకు దేశ విదేశాలకు చెందిన వేలాది మంది భక్తులు హాజరవుతారు.

చిత్రకృప : Scalebelow

ద్వారక - చూడదగిన ప్రదేశాలు

ద్వారక - చూడదగిన ప్రదేశాలు

రుక్మిణీ దేవి దేవాలయం, గోమతీ ఘాట్, బెట్ ద్వారక, నాగేశ్వర జ్యోతిర్లింగం, ద్వారక లైట్ హౌస్, గీతామందిరం, సముద్ర నారాయణ దేవాలయం.

చిత్రకృప : AmitUdeshi

ద్వారక ఎలా చేరుకోవాలి?

ద్వారక ఎలా చేరుకోవాలి?

హైదరాబాద్ నుంచి ద్వారక 1581 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా రైలు సదుపాయం ఉంది. సమీప విమానాశ్రయం జామ్నగర్ (137 కి.మీ). జామ్నగర్, అహ్మదాబాద్ల నుంచి ద్వారకకు బస్సులో చేరుకోవచ్చు.

చిత్రకృప : Asdelhi95

ఉడిపి

ఉడిపి

కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి క్షేత్రంలో కొలువైన చిన్ని కృష్ణుని ఆలయం హిందువులకు పరమ పవిత్రమైన ప్రాంతం. మఠాధిపతులు తప్ప ఇతరులెవరికీ మూలమూర్తిని తాకే అవకాశం లేదు. ఈ ఆలయం వెనుక భాగంలో ఉన్న కిటికీ నుంచి స్వామిని దర్శించుకోవడం ప్రత్యేకత.

చిత్రకృప : Magiceye

ఉడిపి - చూడదగిన ప్రదేశాలు

ఉడిపి - చూడదగిన ప్రదేశాలు

చంద్రేశ్వర, అనంతేశ్వర దేవాలయాలు, సెయింట్ మేరీస్ ఐలాండ్, అనెగుడ్డె వినాయక దేవాలయం, కొడి బీచ్, కుద్లు ఫాల్స్, ఇంద్రాణి పంచదుర్గ పరమేశ్వరి దేవాలయం, మట్టు బీచ్, బ్రహ్మి దుర్గ పరమేశ్వరి దేవాలయం, కుండేశ్వర దేవాలయం, బెల్కల్ తీర్థ ఫాల్స్.

చిత్రకృప : syam

ఉడిపి - ఎలా చేరుకోవాలి?

ఉడిపి - ఎలా చేరుకోవాలి?

హైదరాబాద్ నుంచి ఉడిపి 780 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా రైలు సదుపాయం లేదు. మంగళూరు వరకు రైల్లో వెళ్లి అక్కడ నుంచి ఉడిపి (54 కి. మీ) రైలు లేదా బస్సులో వెళ్ళవచ్చు. సమీప విమానాశ్రయం మంగళూరు (137 కి.మీ).

చిత్రకృప : Anoop Kumar

గురువాయూర్

గురువాయూర్

కేరళ రాష్ట్రం గురువాయూర్ లోని శ్రీకృష్ణ దేవాలయాన్ని 'భూలోక వైకుంఠం' గా పేర్కొంటారు. ఈ దేవాలయంలో స్వామి నాలుగు చేతులతో... పాంచజన్యం, సుదర్శన చక్రం, కౌమోదకి, తామర పువ్వును ధరించి దర్శనమివ్వడం విశేషం. ఇక్కడి స్వామిని గురువాయూరప్పన్ గా కొలుస్తారు.

చిత్రకృప : Pyngodan

గురువాయూర్ - చూడదగిన ప్రదేశాలు

గురువాయూర్ - చూడదగిన ప్రదేశాలు

రుద్రతీర్థం, మమ్మియూర్ మహాదేవ క్షేత్రం, ఎలిఫెంట్ క్యాంప్ శాంక్చురీ, వెంకటాచలపతి, పార్థసారథి, చాముండేశ్వరి దేవాలయాలు, 80 కి. మీ దూరంలో జగద్గురు ఆదిశంకరాచార్యుల జన్మస్థలమైన కాలడి గ్రామం సందర్శింవచ్చు.

చిత్రకృప : Visdaviva

గురువాయూర్ ఎలా చేరుకోవాలి?

గురువాయూర్ ఎలా చేరుకోవాలి?

హైదరాబాద్ నుంచి గురువాయూర్ 975 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాద్ నుంచి నేరుగా రైళ్ళు లేవు. త్రిసూర్ వరకు రైల్లో వెళ్లి అక్కడ నుంచి రైలు లేదా బస్సులలో (30 KM) గురువాయూర్ వెళ్లొచ్చు. సమీప విమానాశ్రయం కొచ్చిన్లో ఉంది (80 కి.మీ).

చిత్రకృప : Aruna

నెమలి

నెమలి

ఆంధ్రప్రదేశ్,కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం నెమలి గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయం ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఒకటి. ఇక్కడి స్వామి ఎంతో మహిమ కలిగిన స్వామిగా భక్తులు భావిస్తుంటారు. సంతానం లేనివారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఎక్కువగా ఈ ఆలయానికి వస్తుంటారు.

చిత్రకృప : Sumanthk

నెమలి ఎలా చేరుకోవాలి?

నెమలి ఎలా చేరుకోవాలి?

విజయవాడకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలోను, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మధిరకు 16 కిలో మీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది. ఆలయానికి చేరుకునేందుకు బస్సు సౌకర్యంతో పాటు రైలు సౌకర్యం కూడా ఉంది. విజయవాడ, మధిర రోడ్డు మార్గం ద్వారా నెమలి ఆలయానికి చేరుకోవచ్చు.

చిత్రకృప : Rajasekhar1961

మరికొన్నిప్రసిద్ధి చెందిన దేవాలయాలు

మరికొన్నిప్రసిద్ధి చెందిన దేవాలయాలు

పురీ, ఒడిషా - జగన్నాథ మందిరం

నాథద్వార, గుజరాత్ - శ్రీనాధ్ జీ మందిరం

మన్నార్ గుడి - తమిళనాడు - రాజగోపాల మందిరం

హరేకృష్ణ మందిరాలు - మాయాపూర్, బెంగళూరు, ముంబై, తిరుపతి

నార్కెట్ పల్లి - నల్గొండ - తెలంగాణ - వారిజాల వేణుగోపాలస్వామి మొదలుగునవి.

చిత్రకృప : Chitrinee

Please Wait while comments are loading...