Search
  • Follow NativePlanet
Share
» »ప్రకృతి ఒడిలో కొలువై ఉన్న ఈ సర్పరాజ ఆలయ సందర్శనంతో....

ప్రకృతి ఒడిలో కొలువై ఉన్న ఈ సర్పరాజ ఆలయ సందర్శనంతో....

By Karthik Pavan

భారత దేశంలో ఎన్నో ఆలయాలు కొలవై ఉన్నాయి. దేశంలోని నలుమూలల ఒక్కో ప్రాంతంలో, ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకంగా, ఆయా సాంప్రదాయాలను అనుసరించి ఆలయాలు మనకు దర్శనమిస్తాయి. అయితే చాలా ఆలయాల్లో మానవ రూపంలో భగవంతుడు కొలువై ఉంటే, కొన్ని ఆలయాల్లో మాత్రం జంతువులు సైతం భగవత్ స్వరూపాలుగా పూజలు అందుకుంటాయి.

అయితే ఇలాంటి కోవకు చెందిందే తక్సకేశ్వర్ ఆలయం. సాధారణంగా దేవాలయాల్లో ప్రధాన దేవతలు పూజలు అందుకుంటాయి. అయితే ఈ తక్సకేశ్వర్ ఆలయంలో మాత్రం ఓ సర్పరాజు ఆరాధ్య దైవంగా పూజలు చేస్తున్నారు. అందమైన ప్ర‌కృతి అందాల నడుమ మధ్యప్రదేశ్ లో మాండ్‌సౌర్ జిల్లాలో ఉన్న ఈ ఆలయం అటు భక్తులతో పాటు పర్యాటకులను కూడా ఆకట్టుకుంటోంది.

తక్షకేశ్వర్ వెళ్లేందుకు అనువైన సమయం :

తక్షకేశ్వర్ వెళ్లేందుకు అనువైన సమయం :

P.C: You Tube

మాండ్‌సౌర్ జిల్లాలో వేసవి చాలా తీవ్రంగా ఉంటుంది. అయినప్పటికీ దాదాపు అన్ని కాలాల్లో తక్షకేశ్వర్ ను దర్శించుకోవచ్చు. చుట్టూ పచ్చదనం ఈ ఆలయం ప్రత్యేకత. సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకూ తక్షకేశ్వర్ దర్శించుకునేందుకు అనువైనదని స్థానిక గైడ్స్ సూచిస్తున్నారు.

ఈ ప్రాంతం గురించి..

ఈ ప్రాంతం గురించి..

P.C: You Tube

తక్షజిగా గుర్తించే తక్షకేశ్వర్ మాండ్‌సౌర్ జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతం, స్థానికులు ఈ దేవాలయాన్ని తక్షకేశ్వర్ అని పిలుస్తారు. గాంధీ సాగర్ అభయారణ్యంలో ఈ ఆలయం ఉంది. అంతేకాదు ఆలయం సమీపంలోని ఒక చిన్న జలపాతం కూడా సందర్శకులను ఆకర్షిస్తుంది. పురాణాల్లో నాగ జాతికి చెందిన సర్పరాజు ఈ ఆలయాన్ని శతాబ్దాలుగా కాపాడుతున్నాడని స్థానికుల విశ్వాసం. ఈ ఆలయంలో తక్షకుడితో పాటు ధన్వంతరి కూడా పూజలు అందుకుంటాడు. అలాగే చిన్న శివలింగం కూడా ఇక్కడ కనిపిస్తుంది. ధన్వంతరిని ఆయుర్వేద పితామహుడని పిలుస్తారు.

ఆలయం పుట్టుపూర్వోత్తరాలు..

ఆలయం పుట్టుపూర్వోత్తరాలు..

P.C: You Tube

ఈ ఆలయం పూర్వచరిత్ర ఏంటి అనేది ఇప్పటికీ ఎవరికీ తెలీదు. ఈ ఆలయం కొన్ని వేల సంవత్సరాల క్రితమే కొలువైందని భక్తుల విశ్వాసం. పురాణాల ప్రకారం పాండవుల వంశానికి చెందిన జనమేజయుడు తన తండ్రి చావుకి కారణమైన సర్పరాజు తక్షకుడిని అంతం చేసేందుకు సర్పయాగం చేస్తాడు. ప్రపంచంలోని అన్ని సర్పాలను బలిగొన్నప్పటికీ భగవాన్ విష్ణుమూర్తి అనుగ్రహంతో తక్షకుడు రక్షించబడతాడు. అప్పటి నుంచి తక్షకుడు అడవుల్లోనే జీవిస్తున్నట్లు భక్తుల విశ్వాసం. తక్షకుడు తమ కోరికలను తీరుస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

తక్షకేశ్వర్ చుట్టుపక్కల దర్శనీయ స్థలాలు..

తక్షకేశ్వర్ చుట్టుపక్కల దర్శనీయ స్థలాలు..

P.C: You Tube

తక్షకేశ్వర్ చుట్టు పక్కల ఉన్న దర్శనీయ స్థలాల విషయానికి వస్తే భన్ పురా మ్యూజియం, గాంధీసాగర్ అభయారణ్యం, హింగ్లాజ్ గడ్ కోట, కెథులి జైన్ మందిర్, 5 శతాబ్దంలో నిర్మించిన పశుపతి నాథ్ ఆలయం చూడదగ్గవి.

తక్షకేశ్వర్ ఎలా చేరుకోవాలి..

తక్షకేశ్వర్ ఎలా చేరుకోవాలి..

P.C: You Tube

విమాన మార్గం..

మాండ్ సౌర్ సమీప విమానాశ్రయం ఇండోర్ లో కలదు. ఇండోర్ ఎయిర్ పోర్ట్ నుంచి మాండ్‌సౌర్ కు మధ్య దూరం 200 కి.మీ.

రైలు మార్గం..

మాండ్‌సౌర్ లోని రైల్వే జంక్షన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో కనెక్ట్ అయి ఉంది. ఈ జంక్షన్ నుంచి ఆలయం చేరుకునేందుకు ట్యాక్సీలు అందుబాటులో ఉన్నాయి.

రోడ్డు మార్గం..

తక్షకేశ్వర్ కు చేరుకునేందుకు ప్రధాన రహదారులతో మంచి కనెక్టివిటీ ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X