Search
  • Follow NativePlanet
Share
» »విగ్రహారాధన ఉండని ఏకైక శక్తి పీఠం ఇక్కడ ఉయ్యలకే పూజలు

విగ్రహారాధన ఉండని ఏకైక శక్తి పీఠం ఇక్కడ ఉయ్యలకే పూజలు

భారత దేశం అత్యంత పురాతన నరాలకు నిలయమన్న విషయం తెలిసిందే. అటువంటి నగరాల్లో ఒకటైన ప్రయాగలో శక్తి పీఠం ఉంది. ఈ ప్రయాగనే ప్రస్తుతం అలహాబాద్ అని పిలుస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఓ శక్తిపీఠం విలక్షణమైనది. ఈ శక్తి పీఠంలో విగ్రహారాధనే ఉండదు. ఇలా విగ్రహారాధన లేని శక్తి పీఠం భారత దేశంలో ఇదొక్కటే.

గంగా, యుయున, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలోని ఈ అలహాబాద్ ను త్రివేణి సంగమం అని కూడా అంటారు. ఇక్కడ పవిత్ర స్నానాలు చేసి పెద్దలకు శ్రాద్ధకర్మలు కూడా నిర్వహిస్తారు. ఇందుకోసం దేశంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఇక్కడి వేల మంది నిత్యం వస్తుంటారు. 12 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ కుంభమేళ జరుగుతుంది. ఇంత విశిష్టత కలిగిన ఆ శక్తిపీఠానికి సంబంధించిన పూర్తి కథనం మీ కోసం

హిందూ పురాణాలను అనుసరించి

హిందూ పురాణాలను అనుసరించి

P.C: You Tube

హిందూ పురాణాలను అనుసరించి దక్షుడు తన కుమార్తె అయిన దాక్షాయని అల్లుడైన ఈశ్వరుడిని ఆహ్వానించకుండానే యాగం చేయాలని భావిస్తాడు. అయితే పుట్టింటి పై మమకారం వీడని దాక్షాయణిఆహ్వానం లేకపోయినా యాగానికి వెళ్లి అవమానించబడుతుంది.

దాక్షాయణి

దాక్షాయణి

P.C: You Tube

దీంతో ఆత్మాహుతికి పాల్పడుతుంది. విషయం తెలిసిన పరమేశ్వరుడు రుద్రడైపోయి తన జఠాజూటం నుంచి వీరభద్రుడిని స`ష్టిస్తాడు.దక్షయాగాన్ని నాశనం చేసి దక్షుడిని సంహరించాల్సిందిగా సూచిస్తాడు.

వీరభద్రుడు

వీరభద్రుడు

P.C: You Tube

దీంతో వీరభద్రుడు తన వెంట ప్రమద గణాలను తీసుకువెళ్లి దక్షయాగన్ని నాశనం చేసి అనంతరం దక్షుడిని కూడా సంహరిస్తాడు. ఇక పరమేశ్వరుడు ఆ దాక్షాయణి శరీరాన్ని భుజం పై వేసుకొని ప్రళయ తాండవం చేస్తూ ఉంటాడు.

సుదర్శన చక్రంతో

సుదర్శన చక్రంతో

P.C: You Tube

దీంతో స`ష్టి కార్యం ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. సమస్య పరిష్కారం కోసం విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆమె శరీరాన్ని 52 ముక్కులుగా కత్తిరిస్తాడు. ఇలా కత్తిరించిన శరీర భాగాలు భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లో పడి కాలక్రమంలో శక్తిపీఠాలుగా మారాయి.

శక్తిపీఠాలుగా

శక్తిపీఠాలుగా

P.C: You Tube

ప్రస్తుతం ఈ శక్తిపీఠాలు పుణ్యక్షేత్రాలుగా భక్తుల కోరికలను నెరవేరుస్తున్నాయి. ఈ క్రమంలో శక్తి పీఠాల్లో 14వ శక్తి పీఠమే అలహాబాదులోని శ్రీ మాధవేశ్వరీ దేవి శక్తి పీఠం. ఇక్కడ దాక్షాయణి చేతివేలు పడిందని చెబుతారు.

మాధవేశ్వరీ పేరుతో

మాధవేశ్వరీ పేరుతో

P.C: You Tube

ఇక్కడ అమ్మవారిని శ్రీ మాధవేశ్వరీ పేరుతో కొలుస్తారు. అంతేకాకుండా అలోపి మాత, అలోపి శాంకరీ అని కూడా పిలుస్తారు. ఇక్కడ విగ్రహారాధన లేదు. గర్భగుడిలో మీద కేవలం ఒక ఊయల మాత్రం ఉంటుంది.

 విగ్రహారాధన లేని

విగ్రహారాధన లేని

P.C: You Tube

దీనికే ప్రజలు పూజలు చేస్తారు. ఇలా శక్తి పీఠాల్లో విగ్రహారాధన లేదని ఏకైక దేవాలయం ఇక్కడ మాత్రమే మనం చూడవచ్చు. ఇక పురాణాలను అనుసరించి శ్రీరామ చంద్రుడు కూడా ఈ మాతను ఆరాదించినట్లు చెబుతారు.

చిత్రకూటం

చిత్రకూటం

P.C: You Tube

తన తమ్ముడైన లక్ష్మణుడు, భార్య సీతతో చిత్రకూటంలోని పర్ణశాల నిర్మించడానికి ముందు ప్రయాగలో కొద్ది రోజుల పాటు ఉన్నాడు. అదే సమయంలో ఈ మాతను కొలిచాడని చెబుతారు.

 జానపథ కథనం ప్రకారం

జానపథ కథనం ప్రకారం

P.C: You Tube

ఇదిలా ఉండగా స్థానిక జానపద కథనం ప్రకారం అలోపి అనే రాణి పెళ్లి చేసుకొని కొత్తగా అత్తవారింటికి కాపురానికి వస్తూ ఉంటుంది. ఆమె ప్రయాణిస్తున్న పల్లకి ప్రయాగ వద్దకు రాగానే దోపిడి ముఠా దాని పై దాడి చేస్తుంది.

పల్లకి నుంచి మాయమై పోతుంది

పల్లకి నుంచి మాయమై పోతుంది

P.C: You Tube

దీంతో ఆమె ఆ పల్లకి నుంచి మాయమై పోతుంది. అటు పై తాను ఇక్కడే కొలువుంటానని అయితే తనకు ఆకారం ఉండదని ఒక అశరీర వాణి ద్వారా వినిపిస్తుంది. అందువల్లే ఇక్కడి మాతను అలోపి మాత పేరుతో కొలుస్తున్నారు.

ప్రయాగ అని పేరు

ప్రయాగ అని పేరు

P.C: You Tube

అలహాబాదును గతంలో ప్రయాగ అనేవారు. ప్రళయం తర్వాత జీవ స`ష్టి జరగడానికి ముందు ఇక్కడ బ్రహ్మ అనేక యాగాలు చేశఆడు కావట్టి దీనికి ప్రయాగ అని పేరు వచ్చింది. ప్ర అంటే గొప్ప అని యా అంటే యాగమని అర్థం నేపథ్యంలో ఈ ప్రాంతాన్ని ప్రయాగ అని పిలుస్తారు.

త్రివేణి సంగమం

త్రివేణి సంగమం

P.C: You Tube

మరో కథనం ప్రకారం ప్రయాగ అంటే నదీ సంగమ ప్రదేశం. దీనిని త్రివేణి సంగమ ప్రదేశం అని కూడా అంటారు. పవిత్ర నదులైన గంగా, యమున, సరస్వతి నదులు ఇక్కడ సంగమిస్తాయి కాబట్టే దీనిని అతి పవిత్రమైన నగరంగా పేర్కొంటారు. గంగ, యమున నదులు కలిసే చోట రెండు రంగుల్లో నీళ్లు కనిపిస్తాయి.

అక్బర్

అక్బర్

P.C: You Tube

నల్లగాను, ఎర్రగాను కనిపించే ఈ నీళ్లు కలిసే ప్రాంతంలో లోతు తక్కువగా ఉంటుంది. ప్రవేశ వేగం కూడా తక్కువగానే ఉంటుంది. భక్తులు ఇక్కడ పుణ్యస్నానాలు చేయడం కోసం పడవుల్లో వెలుతూ ఉంటారు. ఈ ప్రయాగను అలహాబాద్ గా పేరు మార్చినది మొఘల్ చక్రవర్తి అక్బర్.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X