Search
  • Follow NativePlanet
Share
» »పరమహంసకు, కాళీమాతకు ఈ దేవాలయానికి సంబంధం తెలుసా?

పరమహంసకు, కాళీమాతకు ఈ దేవాలయానికి సంబంధం తెలుసా?

హుగ్లీ నది ఒడ్డున ఉన్న బేలూరు మఠం, దక్షిణేశ్వర్ కాళీ దేవాలయం గురించి కథనం.

భారత దేశంలో అత్యంత పూజనీయ గురువుల్లో రామకృష్ణ పరమ హంస ఒకరు. చిన్న వయస్సులోనే ఆయన కాళీమాత భక్తుడిగా మారిపోయారు. వీరికి ఆ కాళీ మాత స్వయంగా దర్శనమిచ్చిన ప్రాంతమే దక్షిణేశ్వర్. అదేవిధంగా పరమహంస ప్రియశిష్యుల్లో వివేకానంద స్వామి ముందు వరుసలో ఉంటారు. ఈయన స్థాపించిన మఠమే బేలూరు. వీటితో పాటు కొలకత్తాలో చూడదగిన పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన వివరాలన్నీ మీ కోసం...

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

P.C: You Tube

రామక`ష్ణ పరమహంస ద్వారా భారతీయ సనాతన ధర్మాలను నేర్చుకొని దేశ, ప్రపంచ వ్యాప్తం చేయడానికి స్వామివివేకానంద భారతదేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు అమెరికా, జర్మని, యూరప్ తదితర దేశాల్లో పర్యటించారు.

ఈ వజ్రేశ్వరిని పూజిస్తే తాంత్రిక శక్తులు, అంతులేని సంపద మీ వశంఈ వజ్రేశ్వరిని పూజిస్తే తాంత్రిక శక్తులు, అంతులేని సంపద మీ వశం

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

P.C: You Tube

అక్కడి వస్తుశైలితో నిర్మించిన కట్టడాలు స్వామివారిని ఆకర్షించాయి. దీంతో స్వామివివేకానంద భారత దేశం తిరిగివచ్చి కొలకత్తాలోని హుగ్లీనది ఒడ్డున బేలూరు మఠాన్ని స్థాపించాడు. ఈ మఠంలో హిందూ, ముస్లీం, క్తైస్త ధర్మాల సమ్మిళితంగా నిర్మించిన ఈ బేలూరు మఠం రామక`ష్ణ మిషన్ కేంద్ర కార్యాలయం.

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

P.C: You Tube

ఈ కార్యాలయం వాస్తుశైలిని చూడటానికి ఒక రోజు మొత్తం సరిపోదంటే నమ్మండి. అంతేకాకుండా స్వామివివేకానంద ఉత్తరాఖాండ్ లోని చంపావత్ లో అద్వైత ఆశ్రమాన్ని కూడా స్థాపించారు. వివేకానంద సహోదరుడైన స్వామి విజ్జానానంద గతంలో ఒక సివిల్ ఇంజనీర్.

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

P.C: You Tube

దీంతో ఈ బేలూరు మఠం వాస్తుశైలి, నిర్మాణ బాధ్యతలను స్వామివారు విజ్జానానందకు అప్పగించారు. ఈ ఆశ్రమంలో భారతీయ సనాతన ధర్మం పై ఆసక్తి కలిగిన వారిని శిష్యులుగా స్వీకరిస్తారు. అటు పై వారికి భారతీయ సనాధన ధర్మాలను నేర్పించి వాటిని ప్రజలకు తెలియజెప్పడానికి దేశ, విదేశాలకు పంపిస్తారు.

గోవాలో ఫ్రీగా దొరికే సరుకు గురించి తెలుసుకోవాాలా?గోవాలో ఫ్రీగా దొరికే సరుకు గురించి తెలుసుకోవాాలా?

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

P.C: You Tube

ఈ బేలూరుమఠం దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఇక్కడ రామక`ష్ణ పరమహంస, స్వామివివేకానంద, శారదా దేవికి ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మ్యూజియం కూడా ఉంది. ఈ మ్యూజియంలో రామక`ష్ణ పరమహంస, స్వామివివేకానందకు చెందిన ఎన్నో వస్తువులను సంరక్షిస్తున్నారు.

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

P.C: You Tube

ఇక ఈ బేలూరు మఠం భారత దేశంలో అన్ని ధర్మాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఇక్కడ ఈ మఠాన్ని ఒక్కొక్క దిక్కు నుంచి చూస్తే ఒక్కొక్క ఆకారంలో కనిపిస్తుంది. ఒక దిక్కు నుంచి మసీదు ఆకారంలో కనిపిస్తే మరో దిక్కునుంచి చర్చి మాదిరిగా అగుపిస్తుంది.

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

P.C: You Tube

అదే విధంగా ఒక దిశలో దేవాలయం మాదిరి, మరో దిశలో గురుద్వార్ వలే కనిపిస్తుంది. క్రీస్తుశకం 1938 జనవరి 14 మకర సంక్రాంతి రోజున ఈ బేలూరు మఠాన్ని ప్రారంభించారు. ప్రవేశ ద్వారంలో కూడా అన్ని మతాలకు చెందిన చిహ్నాలు ఉంటాయి.

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

P.C: You Tube

ఈ మఠంలోని ప్రముఖ శిఖరం ఎత్తు 112.5 అడుగులు. ఈ శిఖరం దక్షిణ భారత దేశంలో అత్యంత ఎత్తైన శిఖరాల్లో ఒకటి. ఇక ఈ మఠంలోని స్తంభాలు బౌద్ధ ధర్మాన్ని సూచిస్తూ అనేక శిల్పాలను కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ స్వామి వివేకానంద సమాధి కూడా మనం చూడవచ్చు.

నవకైలాస క్షేత్రాలు చూశారా?నవకైలాస క్షేత్రాలు చూశారా?

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

P.C: You Tube

ఇక ఇదే దేవాలయంలో రామక`ష్ణ పరమహంస భార్య శారదాదేవి ఉపాలయాన్ని కూడా మనం చూడవచ్చు. ఈమె కూడా ఆధ్యాత్మిక మార్గంలోనే ప్రయాణించారు. బేలూరు మఠాన్ని చేరుకోవడానికి అవసరమైన రవాణా సౌకర్యాలు బాగున్నాయి.

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

P.C: You Tube

ముఖ్యంగా కొలకత్తా నగర కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల దూరంలోనే బేలూరు మఠం ఉంటుంది. ట్యాక్సీలు, ఆటోలు అందుబాటులో ఉంటాయి. అదే విధంగా సల్డా రైల్వే స్టేషన్ కు లోకల్ ట్రైన్ లో చేరుకొని అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న బేలూరు మఠాన్ని చేరుకోవచ్చు.

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

P.C: You Tube

బేళూరు మఠం సందర్శన తర్వాత హుగ్లీ నదిలో తెప్పల పై ప్రయాణం జీవితంలో మరిచిపోలేని ఆనందాలను మిగులుస్తుంది. ఈ తెప్పలద్వారానే కేవలం అరగంట ప్రయాణం చేస్తే దక్షిణేశ్వరం కాళీ మాత మందిరానికి చేరుకోవచ్చు.

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

P.C: You Tube

ఈ కాళీ మాత ఆరాధకులు రామక`ష్ణ పరమహంస. అంతేకాకుండా ఈ దేవాలయం ప్రధాన అర్చకులుగా కూడా పనిచేశారు. ఈ దేవాలయంలోని కాళీమాతను నిత్యం రామక`ష్ణ పరమహంస ధ్యానించేవారని చెబుతారు. అందువల్లే కాళీమాత ఆయనకు దర్శనమిచ్చిందని చెబుతారు.

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

P.C: You Tube

ఈ కాళీమాతను భవతారిణి అని పిలుస్తారు. అంటే సంసార చక్రం నుంచి ముక్తి కల్పించి మోక్షాన్ని ప్రసాదించే మాత అని అర్థం. ఇప్పటికీ ఈ దేవాలయంలో ధ్యానంలో కుర్చొన్నవారికి ఈ కాళీమాత ప్రత్యక్షమవుతుందని చెబుతారు.

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

P.C: You Tube

ఈ దేవాలయం రంగురంగులతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. ఈ దేవాలయన్ని రాణి రాష్మోణి దేవి నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ దేవాలయానికి మొదట రామకుమార్ చటోపాధ్యాయ అర్చకుడిగా ఉండేవాడు.

హైదరాబాద్ యల్లమ్మ గురించిహైదరాబాద్ యల్లమ్మ గురించి

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

బేలూరు మఠం, దక్షిణేశ్వరం

P.C: You Tube

అటు పై రామక`ష్ణ పరమహంస అర్చకబాధ్యతలనున స్వీకరించారు. ఈయన కాలంలో ఈ దేవాలయం విశిష్టత ప్రపంచ వ్యాప్తమయ్యింది. దేవి నవరాత్రుల సమయంలో ఈ దేవాలయాన్ని లక్షలాది మంది బెంగాళీలు సందర్శించుకొంటూ ఉంటారు.

కుమారస్వామి ముడుపులుగా మేకలు, కోళ్లుకుమారస్వామి ముడుపులుగా మేకలు, కోళ్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X