» »ఇండియాలో ఏడు మిస్టరీ టెంపుల్స్ !

ఇండియాలో ఏడు మిస్టరీ టెంపుల్స్ !

Posted By:

బహుశా మీరు బులెట్ బాబా పేరు వినే వుంటారు. వింత అయిన అంతు లేని అనేకమైన మనం ప్రార్ధించే టెంపుల్స్ లో బులెట్ బాబా టెంపుల్ ఒకటి. అంటే, దీనిలో బులెట్ బాబా విగ్రహం వుండదు. ఒక రాయల్ ఎన్ ఫీల్డ్ బులెట్ వుంది. ఇది పూజించబడుతుంది. నమ్మండి నమ్మకపోండి, ఇండియాలో ఇటువంటి వింత అయిన టెంపుల్స్ అనేకం కలవు.

ప్రాఛీన కాలం నుండి మన హిందూ మతం తన భక్తులకు ఈ రకమైన ఎన్నో టెంపుల్స్ ను అందిస్తోంది. ఆయా కాలలో పాలించిన రాజులు కూడా ఈ టెంపుల్స్ ను ఒక ఉత్తమ నిర్మాణాలుగా తీర్చి దిద్దేవారు. తమ గొప్పతనం చాటుకోనేవారు. ఇండియా లో పురాతన మైన టెంపుల్స్ అంటే రెండువేల నాటి చరిత్ర లు కలవి వాటి ప్రత్యేకతలతో ఎన్నో వున్నాయి. ప్రతి ఒక్కదానికి దాని విశిష్టత దానిదిగా చెపుతారు.

ఇండియా లో గాఢమైన మత విశ్వాసాలు, చరిత్ర కల టెంపుల్స్ మాత్రమేకాక, బైక్ లు లాంటి వింత అయిన వస్తువులను గూడా దేముళ్ళు గా పూజించే అంతు పట్టని చరిత్రలు కల నిగూఢ టెంపుల్స్ కూడా కలవు. వాటిని పరిశీలిద్దాం.

మిస్టరీ టెంపుల్స్

మిస్టరీ టెంపుల్స్

వారణాసిలోని సిందియా ఘాట్ కు సమీపంలో, లీనింగ్ టవర్ అఫ్ పైజా వలే ఒక వైపుకు వాలిపోయిన ఒక టెంపుల్ కలదు. ఈ టెంపుల్ కూడా దూరం నుండే పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ టెంపుల్ వాస్తవంగా 1830 లో నిర్మించిన అక్కడి ఘాట్ కారణంగా నది లో మునిగిందని చెపుతారు. నేడు ఈ శివ టెంపుల్ ను మూసి వేశారు. ఎలా మునిగింది ? ఎందుకు మునిగింది ? అనేది ఒక మిస్టరీ గా మిగిలిపోయింది.


Photo Courtesy: Antoine Taveneau

మిస్టరీ టెంపుల్స్

మిస్టరీ టెంపుల్స్

ఇదొక గొప్ప ఆసక్తికల టెంపుల్. బ్రహ్మ దేముడికి గల ఒకే ఒక్క దేవాలయం పుష్కర్ లో కలదు. ఈ టెంపుల్ ను 14 వ శతాబ్దంలో నిర్మించారు. దీనిలో నాలుగు తలల బ్రహ్మ దేముడి విగ్రహం వుంటుంది. ఈ టెంపుల్ నిర్మాణం వెనుక ఆసక్తి కర కధ కలదు.


Photo Courtesy: Vberger

మిస్టరీ టెంపుల్స్

మిస్టరీ టెంపుల్స్

కలకత్తా లో చైనా టవున్ అనే పేరుతో తాన్గ్రాలో ఒక చిన్న టవున్ కలదు. ఈ ప్రదేశంలో వుండేవారు చైనా వారు అవటంతో ఈ ప్రదేశానికి చైనా టవున్ అని పేరు వచ్చింది. చైనీయులు ఈ గుడికి వచ్చి నూడుల్స్, చౌప్సూ వంటి పదార్ధాలు నైవేద్యంగా పెట్టి ప్రసాదం గా పంచుతారు. ఈ చైనీయులు కాళి మాత భక్తులు.

Photo Courtesy: Xianzi Tan

మిస్టరీ టెంపుల్స్

మిస్టరీ టెంపుల్స్

ఒక టెంపుల్ అదృశ్యం అవటం మరల కొంతకాలం తర్వాత తిరిగి రావటం వంటివి నమ్ముతారా ? వదోదర కు 40 మైళ్ళ దూరంలో స్తంబెశ్వర్ మహాదేవ టెంపుల్ కలదు. ఈ టెంపుల్ అరే బియా మహాసముద్రంలో వుంటుంది. అలలు తక్కువగా వుండే సమయంలో దీనిని చూడగలం, అంటే అది సముద్రంలో మునిగి వుంటుంది అన్నమాట. అలలు ఎత్తులో వుంటే టెంపుల్ కనపడదు.


Photo Courtesy: sgbhagwat

మిస్టరీ టెంపుల్స్

మిస్టరీ టెంపుల్స్

రాజస్తాన్ లోని జోద్ పూర్ లో బులెట్ బాబా లేదా ఓం బన్న గుడి కలదు. ఇక్కడ గుడి లో రాయల్ ఎన్ ఫీల్డ్ బులెట్ వుంటుంది. దానినే ఇక్కడి వారు ఒక దేముడిగా పూజిస్తారు. ఈ దేముడికి లిక్కర్ కూడా నైవేద్యం గా పెడతారు. గ్రామస్తులు ఈ దేముడు తమను రోడ్ ఆక్సిడెంట్ ల నుండి కాపాడతాడని నమ్ముతారు.


Photo Courtesy: Sentiments777

మిస్టరీ టెంపుల్స్

మిస్టరీ టెంపుల్స్

రాజస్తాన్ లోని బికనీర్ కు దక్షిణంగా 30 కి. మీ. ల దూరంలో దేశ్నోక్ అనే ప్రదేశంలో కర్ని మాత టెంపుల్ కలదు. ఈ ఎలుకలు కర్ని మాత అవతారంగా అంటే దుర్గా మాత అవతారంగాను, ఆమె కు గల నలుగురు పిల్లల అవతారాలుగాను నమ్ముతారు. టెంపుల్ ఆవరణలో ఎలుకలు స్వేచ్చగా తిరుగుతాయి. వీటికి పాలు, ఇతర ఆహారాలు నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచుతారు.


Photo Courtesy: Shakti

మిస్టరీ టెంపుల్స్

మిస్టరీ టెంపుల్స్

మనాలి లోని నాలుగు అంతస్తుల హిడింబా టెంపుల్ ఒక ప్రత్యేక పగోడా ఆకారంలో వుంటుంది. దీని శిల్ప తీరు తెన్నులు ఇతర ఆలయాలతో పోలిస్తే విభిన్నంగా వుంటాయి. ఈ టెంపుల్ లో హిడింబ దేవి అంటే రాక్షసి హిడింబ సోదరి విగ్రహం వుంటుంది. ఈ దేవతను ఆనాటి కుల్లు రాజ వంశీయులు కుల దేవతగా పూజించేవారు.
Photo Courtesy: Wordsmith86

Please Wait while comments are loading...