• Follow NativePlanet
Share
» »బ్రహ్మచారులు ఇటు రాకండి....ఇటువంటి దేవాలయాలు ప్రపంచంలో మరెక్కడా లేవు

బ్రహ్మచారులు ఇటు రాకండి....ఇటువంటి దేవాలయాలు ప్రపంచంలో మరెక్కడా లేవు

Written By: Kishore

ధర్మభూమిగా పేరుగాంచిన భారత దేశంలో పురాణ ప్రాధాన్యత కలిగిన దేవాలయాలతో పాటు కొన్ని విచిత్రమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. ఆ రహస్యాలు కనుగొనడం చాలా కష్టం. ఈ కథనంలో మనం మొత్తం పది దేవాలయాల గురించి క్లుప్తంగా తెలుసుకోబోతున్నాం. అందులో అటు పురాణ ప్రాధాన్యత ఉన్న దేవాలయాలతో పాటు దాదాపు ఐదేళ్ల క్రితం నిర్మించిన దేవాలయాలు ఉన్నాయి. అదే విధంగా దేవతలతో పాటు దెయ్యం, రాక్షసులకు కూడా ఉన్న దేవాలయాల గురించి ఈ కథనంలో ఉంది. మరోవైపు ఆలయ నిర్మాణం వెనుక దాగున్న ఇంజనీరింగ్ ప్రతిభను గురించి ఈ కథనంలో వివరించాం. జంతువులను పూజించే దేవాలయాలు కూడా ఉన్నాయి. అదే విధంగా బ్రహ్మచారులకు, జంటగా దంపతులు వెళ్లకూడని దేవాలయాలు ఇలా అన్ని రకాల దేవాలయాల గురించి ఈ కథనంలో టూకీగా తెలుసుకొందాం. 

రాక్షసరాజు చే ప్రతిష్టించిన స్వామి వారి విగ్రహం..దర్శిస్తే వద్దన్నా వివాహం ఆ పై అన్నీ...

1. ఎందుకు వాలి పోయింది

1. ఎందుకు వాలి పోయింది

Image Source:

పవిత్రమైన నగరం, ప్రళయంలోనూ మునిగిపోనటువంటి నగరంగా పేరుగాంచిన వారణాసిలో అనేక ఘాట్ లు ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడ చనిపోతే నేరుగా స్వర్గానికి పోతారని చెబుతారు. ఇటువంటి వారణాసిలో సింధియాఘాగ్ వద్ద ఒక శివుడి దేవాలయం ఉంది. ఈ శివాలయం ఒక పక్కకు వాలి పోయి ఉంటుంది. ఇలా వాలడానికి కారణం ఏమిటన్న విషయం ఎవరూ చెప్పలేక పోతున్నారు. ఈ దేవాలయం దూరం నుంచి ప్రజలను ఆకర్షిస్తోంది. అలా అని ఈ దేవాలయం లోపలికి వెళ్లాలంటే కుదరదు.

2 బ్రహ్మచారులకు ప్రవేశం నిషిద్దం

2 బ్రహ్మచారులకు ప్రవేశం నిషిద్దం

Image Source:

దేశంలో ఒకే ఒక బ్రహ్మ దేవాలయం ఉంది. ఇక్కడ బ్రహ్మకు నాలుగు తలలు ఉంటాయి. రాజస్థాన్ లోని పుష్కర్ లో ఈ దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని ఎప్పుడు ఎవరు నిర్మించారన్న దానికి సరైన ఆధారాలు లేవు. అయితే ఈ ఆలయంలోకి బ్రహ్మచారులు వెళ్లరు. అలా వెళ్లితే వారికి పెళ్లి కాదని చెబుతారు.

3. న్యూడుల్స్ నైవేద్యం

3. న్యూడుల్స్ నైవేద్యం

Image Source:

కలకత్తాలో కాళీ మాత దేవాలయం ఉంది. ఇక్కడ చైనా దేశం నుంచి వలస వచ్చిన వారు ఎక్కువగా నివశిస్తుంటారు. వారు ఇక్కడి కాళీ మాతను తమ కులదైవంగా భావిస్తారు. నైవేద్యంగా నూడుల్స్ ను కూడా అందజేస్తారు.

4. మాయమయ్యే దేవాలయం

4. మాయమయ్యే దేవాలయం

Image Source:

సాధారణంగా ఒక దేవాలయం ఒక చోట ఉంటుంది. నిత్యం అక్కడకు భక్తులు వెళ్లి వస్తుంటారు. లేదా ఒక చోట ఉన్న దేవాలయం ఏడాదికి కొన్ని రోజులు మాత్రమే దర్శించుకోవడానికి వీలవుతుంది. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయే ఒక దేవాలయం మాత్రం అప్పుడప్పుడు మాయమయ్యి తిరిగి ప్రత్యక్షమవుతూ ఉంటుంది. గుజరాత్ లోని వడోదరకు 40 కిలోమీటర్ల దూరంలో స్తంబేశ్వర మహాదేవ్ అనే దేవాలయం ఉంది. అరేబియా సముద్రం లోపల ఉండే ఈ దేవాలయం అలలు ఎక్కువగా ఉన్నప్పుడు మునిగిపోయి తిరిగి అలలు తగ్గినప్పుడు భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది.

5. బులెట్ బాబా దేవాలయం

5. బులెట్ బాబా దేవాలయం

Image Source:

రాజస్థాన్ లోని జోథ్ పుర్ కు దగ్గరగా ఈ బులెట్ దేవాలయం ఉంది. దీనిని ఓం బన్నా దేవాలయం అని కూడా అంటారు. గతంలో ఒకసారి ఓ యువకుడు బులెట్ పై వెలుతూ ప్రమాదంలో మరణిస్తాడు. సదరు వాహనానాన్ని పోలీసులు ఎన్ని సార్లు పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చినా తిరిగి ఆ వాహనం ప్రమాదం జరిగిన ప్రాంతానికే వెలుతూ ఉంటుంది. దీంతో ఆ వాహనంలో సదరు యువకుడి ఆత్మ ఉందని గ్రామస్తులు భావిస్తారు. అటు పై ఆ వాహనానికి ఒక గుడి కట్టి పూజలు చేస్తున్నారు. కాగా, ఎవరైనా ఈ దారి గుండా వెళ్లాల్సి వస్తే తప్పక ఆ వాహనానికి నమస్కరించి వెలుతుంటారు. లేదంటే తమ ప్రయాణం సరిగా సాగదని వారు నమ్ముతుంటారు.

6. ఎలుకలే దేవతలు

6. ఎలుకలే దేవతలు

Image Source:

సాధారణంగా ఏ దేవాలయంలోనైనా దేవుడు లేదా దేవతను ఆరాధిస్తారు. అయితే ఒక ఒక చోట ఎలుకలను దేవుళ్లుగా భావించి పూజలు చేస్తారు. అంతే కాదు సదరు ఎలుకలు తిని వదిలిన ఆహారాన్ని తమ ప్రసాదంగా భావించి ఆ ఆహారాన్ని తింటారు. అదే కర్ణి మాత దేవాలయం. రాజస్థాన్ లోని బికనీర్ కు 30 కిలోమీటర్ల దూరంలో కర్ణి మాత దేవాలయం ఉంది. ఈ ఎలుకలు ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నాయి అన్న దానికి సరైన సమాధానం మాత్రం లభించడం లేదు.

7. రాక్షసి ఒక కుల దేవత

7. రాక్షసి ఒక కుల దేవత

Image Source:

సాధారణంగా ఎవరైతే మనకు మంచి చేస్తారో వారిని దేవుళ్లతో పోలుస్తాం. వారికి గుళ్లు కట్టి పూజలు చేస్తాం. ఇక చెడు చేసేవారిని దయ్యం, రాక్షసులుగాను భావిస్తాం. వారిని దూరం పెడుతాం. అయితే దేశంలో ఒకే ఒక చోట మాత్రం రాక్షసి అయిన హిడంబిని పూజిస్తారు. అదే మనాలి. ఇక్కడ హిడంబి అనే దేవాలయం ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించే కులు వంశ రాజులు తమ కులదేవతగా పూజించేవారు. ఈ హిడంబి భీముని చేతిలో చనిపోయిన హిడంబాసురుడి దేవతగా చెబుతారు.

8. దంపతులు జంటగా వెళ్ల కూడని దేవాలయం

8. దంపతులు జంటగా వెళ్ల కూడని దేవాలయం

Image Source:

శిమ్లాకు దగ్గరగా ఉనక్న రామ్ పూర్ అనే గ్రామంలో దుర్గామాత ఆలయం ఉంది. ఈ దేవాలయంలోకి జంటగా అంటే ఒకే సారి దంపతులు వెళ్లకూడదని స్థానికులు చెబుతారు. దీనిని దిక్కరించి వెళ్లివారికి విడాకులు వచ్చాయనేది వారి కథనం. ఈ సంప్రదాయం చాలా ఏళ్లుగా అమల్లో ఉంది. స్థానికులే కాకుండా బయట నుంచి వచ్చిన వారు కూడా ఈ నిబంధనను ఎవరూ అతిక్రమించరు.

9. సిగరెట్, మినరల్ వాటర్

9. సిగరెట్, మినరల్ వాటర్

Image Source:

హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి ప్రాంతంలో దాదాపు 1,700 అడుగుల ఎత్తులో అతి అపాయకరమైన మార్గం ఉంది. దీన్ని ఘాటా లూప్ అని అంటారు. ఇక్కడ ఒక చోట చిన్న దేవాలయం ఉంది. ఇక్కడ సిగరెట్, మినరల్ వాటర్ ను పెట్టి ముందుకు కదులు తారు. ఇలా చేయని వారు ప్రమాదానికి లోనయ్యి ఒక్కొక్కసారి ప్రాణాలు కూడా పోగొట్టు కొన్నారని చెబుతారు.

10. గాలిలో తేలే స్తంభం

10. గాలిలో తేలే స్తంభం

Image Source:

హిందూ వాస్తుశాస్త్రం ప్రకారం గుడిలో మండపం ఉంటుంది. ఆ మంటపం అనేక స్తంభాలను కలిగి ఉంటుంది. అయితే లేపాక్షిలోని విరూపాక్ష దేవాలయంలో మాత్రం ఒక స్తంభం గాలిలో తేలి ఉంటుంది. ఒక వేళ ఏవరైనా బలవంతంగా ఆ స్తంభాన్ని కిందికి దించాలని ప్రయత్నిస్తే ఆ దేవాలయం పూర్తిగా కూలిపోతుంది.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి