» »లోకంలో ఆశ్చర్యం కలిగించే అద్భుతమైన వేయి శివ లింగాలు !

లోకంలో ఆశ్చర్యం కలిగించే అద్భుతమైన వేయి శివ లింగాలు !

By: Venkata Karunasri Nalluru

వేయి శివ లింగాలని చూచుటకు వెళ్ళటమే ఒక అద్భుతం! నిజానికి వెయ్యి లింగములు కలిగిన పూజ్యమైన నది. ఈ నది మధ్యలో శివలింగాలు ఎలా వచ్చాయి? 1000శివలింగాలుఒకే చోట వుండటం ఆశ్చర్యంగా వుంది కదూ!అసలు ఈ శివలింగాలు ఇక్కడకు ఎలా వచ్చాయి. దానికదే ఉద్భవించాయా?

ఉత్తర కర్నాటకలోని సిర్సీ తాలూకా లో ఉన్న షాల్మలా నది తీరంలో ఉన్న 1000 రాళ్ళ పై చెక్కబడి యున్న శివలింగాలు అద్భుత అనుభూతినిస్తాయి. ప్రతి రాయిపై చెక్కబడిన శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం కూడా ఉంటుంది. సహస్ర లింగాలంటే కన్నడ బాషలో 1000 లింగాలని అర్ధం.ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున వందలాది భక్తులు ఇక్కడికి వస్తారు. నదిలో నీళ్లు తక్కువుగా ఉంటే 1000 లింగాలనూ చూడవచ్చు.శీతాకాలంలో గానీ లేక ఎండాకాలం ప్రారంభంలో గానీ ఈ చోటికి వెడితే నదిలో నీళ్లు తక్కువగా ఉంటాయి గనుక అన్ని లింగాలనూ దర్శనం చేసుకోవచ్చు.

ఇప్పుడు మనం ఆ స్థలం గురించి తెలుసుకుందాం రండి.

1. ఎక్కడ ఉంది?

1. ఎక్కడ ఉంది?

ఈ అద్భుతమైన సంఘటన కర్ణాటకలోని ఒక గ్రామంలో జరిగింది. ఇది సిర్సీ పట్టణం నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ నగరంలో ప్రవహించే నది ఉంది. దాని పేరు షాల్మలా .
1000 లింగములు ఒకే దగ్గర చూడవచ్చును.

PC:youtube

2. ప్రత్యేకత

2. ప్రత్యేకత

ఈ క్షేత్రాన్ని సహస్కర క్షేత్రం అంటారు.

PC:youtube

3. ఈ ప్రదేశం ప్రశాంతంగా వుంటుంది.

3. ఈ ప్రదేశం ప్రశాంతంగా వుంటుంది.

ఇక్కడ శ్రీరాముడు, లక్ష్మి దేవి, బ్రహ్మ విగ్రహాలను కూడా చూడవచ్చును.

PC:youtube

4. చారిత్రక రహస్యాలు

4. చారిత్రక రహస్యాలు

చరిత్రకారులు ప్రకారం, శివ లింగాలని 1678-1718 సమయంలో సదాశివ రాయ సిర్సి రాజుగా పరిపాలించేవాడు. ఇతను విజయనగర రాజ్యానికి చెందిన రాజు. ఇతనే ఈ శివలింగాలను చెక్కించారని నమ్ముతున్నారు.

PC:youtube

5. సహస్ర లింగాలు

5. సహస్ర లింగాలు

సదాశివ రాయ తన రాజ్యంలో ఒక వారసుడి కోసం సహస్ర లింగాలని రూపొందించారని ఒక స్థానిక ఇతిహాసం కూడా ఉంది. ఈ శివ లింగాలన్ని నదీ మార్గం గుండా చెల్లాచెదురు, నది మధ్యలో చాలా ఉన్నాయి. ఇక్కడ శివరాత్రి రోజున మరియు ప్రదోష పూజ చేయు సమయాలలో ఎక్కువమంది భక్తులు వస్తారు.

PC:youtube

6. సంస్కృతంలో శివలింగం

6. సంస్కృతంలో శివలింగం

సంస్కృతంలో లింగం అనగా ఒక 'మార్క్' లేదా చిహ్నం అని అర్థం. శివలింగాన్ని హిందూ మతంలో శివాలయాల్లో ఆరాధన కోసం ఉపయోగిస్తారు.

PC:youtube

7. ఏకాగ్రత

7. ఏకాగ్రత

ప్రకృతి పురుషుడు శక్తుల కలయిక వల్ల సృష్టి ప్రభావితం చేయబడుతుంది అని ఈ శివలింగం సూచిస్తుంది. మనస్సును ఏకాగ్రతగా ప్రేరేపించడానికి వర్ణించలేని శక్తి ఈ శివలింగంలో ఉంది.

PC:youtube

8.ఋషులు

8.ఋషులు

భారతదేశంలో పురాతన ఋషులు సూచించిన శివాలయాల్లో శివలింగాన్ని ప్రతిష్టింపచేసారు.

PC:youtube

9. పెద్ద హోటళ్లు

9. పెద్ద హోటళ్లు

ఈ ప్రదేశం ఇంకా పూర్తిగా అభివృద్ధి కాలేదు. ఇక్కడ మీరు బసచేయటానికి పెద్ద హోటళ్లు లభించకపోవచ్చు. కానీ మిస్టీరియస్ ప్రయాణాలు కోరే వారికి ఈ స్థలం తప్పనిసరిగా సందర్శించాలి.

PC:youtube

10. సందర్శించడానికి ఉత్తమ సమయం

10. సందర్శించడానికి ఉత్తమ సమయం

సందర్శించడానికి వేసవిలో బాగుంటుంది. నీటి ప్రవాహం అధికంగా లేనప్పుడు ఉత్తమ సమయం.

PC:youtube

11. ఎలా వెళ్ళాలి?

11. ఎలా వెళ్ళాలి?

సిర్సీ తాలుకా నుండి యల్లాపూర్ కు వెళ్లేదారిలో 17 వ కిలోమీటర్ దగ్గర ఈ స్థలం ఉన్నది.

PC:youtube

Please Wait while comments are loading...