» »అస్థిపంజరాల సరస్సు ఎక్కడ వుందో మీకు తెలుసా ?

అస్థిపంజరాల సరస్సు ఎక్కడ వుందో మీకు తెలుసా ?

By: Venkata Karunasri Nalluru

ఈ భూమి మీద ఎన్నో విషయాలు ఇప్పటికీ మిస్టరీలుగానే మిగిలిపోయాయి. కొన్ని మిస్టరీలు ఆశ్చర్యకరంగా వుంటే మరికొన్ని విషాదకరమైనవి వుంటాయి.ఇంతటి విషాదంలోనూ ఎన్నో రహస్యాలు ఆ ఘటనలో దాగి వుంటాయి. ఆ రహస్యాలు ఏమిటి?వింత సంఘటనలు ఎలా జరిగాయి?అనేవి ఇప్పటికీ అంతు చిక్కని మిస్టరీలుగానే మిగిలిపోయాయి.మన దేశంలో వున్న అలాంటి ఓ మిస్టరీ రూప్ఖుండ్ లేక్.అసలు ఆ లేక్ ఏమిటి?అక్కడ అంతు చిక్కని విషాద రహస్యం ఏమిటి?

రూప్ఖుండ్ లేక్ ఉత్తరాఖండ్ లోని హిమాలయా పర్వతాల మధ్య నరమానవుడు సంచరించలేని,ఒంట్లో రక్తాన్ని సైతం గడ్డకట్టించే చల్లటి వాతావరణంలో సముద్రమట్టానికి 16500 అడుగుల ఎత్తులో వుంది. ఈ రూప్ఖుండ్ లేక్ కి వున్న మరో పేరు స్కెలిటన్ లేక్. ఆ పేరు రావటానికి కారణం అందులో దొరికిన 600అస్థి పంజరాలు అని చెప్పాలి.ఈ లేక్ ని నందా దేవి అటవీ రేంజర్,హెచ్ .కె మద్వాల్ అనే వ్యక్తి మొదటిసారి
1942లో కనుగొన్నాడు.అప్పటినుంచీ ఈ లేక్ పై దేశవిదేశీ సంస్థలు ఎన్నో పరిశోధనలు చేశాయి.

ఇది కూడా చదవండి:కేదార్ నాద్ ...మంచు కొండల్లో మహా రహస్యాలు !

ఆ సరస్సు నిండా అస్ధిపంజరాలే

1. సరైన ఆధారాలు

1. సరైన ఆధారాలు

అక్కడికి ఆ ప్రజలు ఎందుకు వచ్చారు?ఎక్కడినుంచి వచ్చారు అనే దానిపై ఇంకా సరైన ఆధారాలు దొరకలేదు. ఆ అస్థి పంజరాలలో కొన్ని పొట్టిగాను, మరికొన్ని పొడవుగాను వున్నాయట.

pc:youtube

2. మృతదేహాలు

2. మృతదేహాలు

ఆ ప్రదేశం కాలుష్యరహితం కావడం విపరీతమైన మంచులో కప్పబడి వుండటం చేత అక్కడ వున్న కొన్ని మృతదేహాలు ఇంకా పాడవకుండా అలాగే వున్నాయని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.

pc:youtube

3. డి.ఎన్.ఏ పరీక్షలు

3. డి.ఎన్.ఏ పరీక్షలు

ఆ మృతదేహాలపై డి.ఎన్.ఏ పరీక్షలు చేసిన శాస్త్రవేత్తలు అక్కడ చనిపోయిన వారు ఒక సమూహానికో లేదా ఒక ప్రాంతానికో చెందినవారు కాదు. వారందరూ వివిధ ప్రాంతాలకు చెందినవారుగా చెప్పారు.

pc:youtube

4. అస్థి పంజరాల సరస్సు

4. అస్థి పంజరాల సరస్సు

అస్థి పంజరాల సరస్సు దీనినే మనం రూప్ఖుండ్ సరస్సు అని కూడా అంటుంటాం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో వుండే సరస్సు అస్థి పంజరాల సరస్సుగా ప్రఖ్యాతి చెందింది.

pc:youtube

5. 16500 ఎత్తు

5. 16500 ఎత్తు

సముద్రమట్టానికి 16500 ఎత్తున్న ఈ సరస్సు హిమాలయాల మధ్య జనావాసాలు లేని ప్రాంతంలో వుంది. ఈ సరస్సులో అస్థిపంజరాలు ఉన్నాయన్న విషయం మొదటగా 1942లో వెలుగులోనికొచ్చింది.

pc:youtube

6. బ్రిటీష్ అధికారి

6. బ్రిటీష్ అధికారి

చలికాలంలో దాదాపుగా ఘనీభవన స్థానంలో వుండే ఈ సరస్సు నడి వేసవిలో నీటితో నిండుగా వున్న సమయంలో ఒక బ్రిటీష్ అధికారి అందులో తేలియాడుతున్న అస్థిపంజరాలను గమనించాడు.

pc:Ashokyadav739

7. జపాన్ సైనికులు

7. జపాన్ సైనికులు

దీనితో ఇక్కడ జరక్కూడనిదేదో జరిగిందని భయాందోళనలకు లోనయ్యాడు. తొలుత యుద్ధంలో మరణించిన జపాన్ సైనికుల అస్థిపంజరాలుగా వీటిని భావించారు.

pc:Schwiki

8. దారితీసిన పరిస్థితులు

8. దారితీసిన పరిస్థితులు

తర్వాత 2004వ సంవత్సరంలో కొందరు పరిశోధకులు ఈ అస్థిపంజరాలు 850క్రితం నాటివని తేల్చారు. అయితే ఒకేసారి వందలాదిమంది మృత్యువాత పడటానికి దారితీసిన పరిస్థితులేమిటన్నది ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది.

pc:Ashokyadav739

9. ఇనుప గుండ్ల లాంటి తుఫాను

9. ఇనుప గుండ్ల లాంటి తుఫాను

అక్కడి నదులను కలుషితం చేస్తూ హిమాలయాల పవిత్రతను భంగపరచటంపై ఆగ్రహించిన ఒక దేవత అక్కడి ప్రజలపై ఇనుప గుండ్ల లాంటి తుఫాను అందరినీ బలి తీసుకున్నదని స్థానికులు విశ్వసిస్తున్నారు.వేసవిలో సరస్సులోని మంచు కరిగి నీరైన సందర్భాలలో మంచు కప్పిన ఈ అస్థిపంజరాలను మనం ఇప్పటికీ చూడొచ్చు.

pc:wikimedia.org

Please Wait while comments are loading...