Search
  • Follow NativePlanet
Share
» » వేసవిలో మాంచి పిక్నిక్ స్పాట్ నాగోవా..

వేసవిలో మాంచి పిక్నిక్ స్పాట్ నాగోవా..

మామూలు రోజుల్లోనే డయ్యూ ఓ సందర్శనా ప్రాంతం. విదేశీ పర్యాటకులకు గమ్యస్థానం. దీని సముద్ర తీరాల్లో సేద తీరడమంటే అది ప్రపంచాన్ని కాసేపు మరిచిపోయి ప్రశాంతంగా మనసును విహరింపజేయడమే. ఎప్పుడూ బద్దకంగా నిద్దురేనా కాసేపు చిందేయమని నాగోవా పిలుస్తోంది. ఈ బీచ్ కు చేరాలంటే డయ్యు నుండి 20 నిముషాల సమయం పడుతుంది.

ఆహ్లాదకరమైన వాతావరణంతో, సహజ ప్రకృతి సౌందర్యంతో సందర్శకులకు డయ్యు ఒక నిష్కల్మషమైన మరియు రిలాక్స్డ్ స్పాట్ అని నిరూపిస్తుంది. డయ్యులో వాతావరణం సంవత్సరమంతా అనుకూలంగా ఉండటం వలన, ఈ ప్రాంతాన్ని సందర్శకులు ఎప్పుడైనా దర్శించవొచ్చు. డయ్యులో బీచులు దర్శకులతో ఎప్పుడూ చాలా ఆనందోత్సంగా ఉంటుంది. డయ్యు-అభివృద్ధి చెందుతున్న సంస్కృతిడయ్యు టూరిజం ఒక గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉన్నది మరియు ఇది కతియావాది లేదా సౌరాష్ట్ర సంప్రదాయం మరియు పోర్చుగీసు సంస్కృతుల గొప్ప కలయికతో ఉన్న సంస్కృతిని కలిగి ఉన్నది.

డయ్యులో దేవ్‌కా బీచ్‌,జంపోరే బీచ్‌,చక్రతీర్థ బీచ్‌,ఘోఘలా బీచ్‌,జలంధర్‌ బీచ్‌, నగోవా బీచ్‌లు ప్రసిద్దిచెందినవి. తప్పక సందర్శించాల్సిన బీచ్ లో వీటిలో నాగోవ పూర్తిగా నగరానికి వేరుగా ఉండటంవలన ఇక్కడ నిశబ్ద మరియు ప్రశాంత వాతావరణంతో నిండి ఉంటుంది. నగర గందరగోళానికి, ఒత్తిడికి దూరంగా ప్రశాంతమైన వాతావరణం కోరుకునేవారికి ఈ బీచ్ లో గడపటం సరిఅయినది. ఈ నాగోవా బీచ్ చాలా క్లీన్ గా మనోహరంగా ఉంటుంది.

అరేబియా ఒడ్డున ఉన్న దీవి డయ్యూ

అరేబియా ఒడ్డున ఉన్న దీవి డయ్యూ

గుజరాత్‌ అంచున, అరేబియా ఒడ్డున ఉన్న దీవి డయ్యూ. ఒకప్పుడు పోర్చుగీసువారి విడిదిగా పేరున్న ఈ కేంద్రపాలిత ప్రాంతం.. ఇప్పుడు ఆటవిడుపులకు అందమైన కేంద్రం. ఏడాదంతా ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడానికి వేలమంది ఔత్సాహికులు డయ్యూ తీరానికి చేరుకుంటారు. అందమైన రిసార్టుల్లో బస చేస్తారు. బడ్జెట్‌ హోటళ్లు కూడా ఉంటాయి. ఎవరెక్కడ ఉన్నా.. ఆనందం గ్యారెంటీ. సంగీత ప్రియులను మ్యూజిక్‌ కాన్సర్ట్‌లు, సాహస యాత్రికులను జలక్రీడలు అలరిస్తాయి. సర్ఫింగ్‌, కయాకింగ్‌, స్కూబాడైవింగ్‌, పారాసెయిలింగ్‌ తదితర క్రీడలు క్షణం తీరిక లేకుండా చేస్తాయి.

Photo Courtesy: Ed Sentner

గుర్రపు నాడా ఆకారంలో ఉండే ఈ బీచ్ అలల

గుర్రపు నాడా ఆకారంలో ఉండే ఈ బీచ్ అలల

నాగోవా పల్లెలో ఉన్న నాగోవా బీచ్‌ చాలా సుందరమైన బీచ్. గుర్రపు నాడా ఆకారంలో ఉండే ఈ బీచ్ అలల గుసగుసలతో, బీచ్ నిండా కొబ్బరి చెట్లు, పామ్ వృక్షాలు, హాకా చెట్లు మద్య వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ రకరకాల వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి. . గోగ్లా బీచ్, గేట్‌వే కూడా చూసి, సాయంత్రం గంటసేపు బోట్ క్రూయిజ్ చేయవచ్చు. అలాగే ఈ బీచ్ నీటి అలల మీద ఆడుకోమని నీటిలో ఈత కొడుతూ సమయాన్ని గడపమని సందర్శకులను ఆహ్వానిస్తున్నది. ఈ బీచ్ ఈత మరియు ఇతర జలక్రీడలకు కూడా చాలా సురక్షితం.

PC:Sudhakar Kumawat

https://flic.kr/p/4tn1Gx

ఎంచక్కా ఒంటెక్కి బీచ్‌లో చక్కర్లు కొట్టొచ్చు

ఎంత సేపని తీరంలో నడవటం కాళ్లు నొప్పెడుతున్నాయి అనుకుంటే ఎంచక్కా ఒంటెక్కి బీచ్‌లో చక్కర్లు కొట్టొచ్చు. కుదిరితే గుర్రాలు వెంటొస్తాయి. సందర్శకుల తాకిడి ఎక్కువే ఉన్నా నీరు మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. తీరం లోతు తక్కువ. దేశం మొత్తమ్మీద హోకా పామ్‌ చెట్లు ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. పోర్చుగీసు వారు కోరి మరీ తెచ్చుకున్నవవి. ఇక్కడ ఉన్న లైట్‌ హౌజ్‌ దగ్గర ఓ ఫొటో దిగడం మర్చిపోకూడదు.

ఇంకా ప్రధాన ఆకర్షణలేమంటే ఐఎన్‌ఎస్‌ కుక్రీ మెమోరియల్‌

ఇంకా ప్రధాన ఆకర్షణలేమంటే ఐఎన్‌ఎస్‌ కుక్రీ మెమోరియల్‌

ఇంకా ప్రధాన ఆకర్షణలేమంటే ఐఎన్‌ఎస్‌ కుక్రీ మెమోరియల్‌, భారీ యాంపీ థియేటర్‌, గంగేశ్వర్‌ పోర్ట్‌. ఇవి సరిపోవంటే, ఓ 67 కి.మీ. దూరంలో గుజరాత్‌లోని గిర్‌ అభయారణ్యం ఉంది. సింహాలు, చిరుతలు, మొసళ్లు, పులులు, హైనాలు వంటి వాటిని దగ్గరగా చూసేందుకు జీప్‌ సఫారీలు ఉన్నాయి.

డయ్యూ-డామన్‌ను

డయ్యూ-డామన్‌ను

సోమ్‌నాథ్‌ జ్యోతిర్లింగ శైవ క్షేత్రం కూడా 90 కి.మీ.ల దగ్గరలో ఉంటుంది. డయ్యూ-డామన్‌ను కలేసి పిలుస్తారు గానీ, రెండిటికీ మధ్య సుమారు 650 కి.మీ.ల దూరం ఉంటుంది. ఈ రెంటినీ గుజరాత్‌ పర్యాటకంతో కలిపి అనేక ప్యాకే జీల్ని రూపొందించే కంపెనీలుంటాయి. ప్రయాణ బడలిక మీకు పెద్ద కష్టం కాకపోతే, అసలు యాత్ర ల్లోని మజా అంతా ప్రయాణంలోనే ఉంటుందనే వారైతే బ్యాగులు, ప్యాకులు సర్దేయొచ్చు.

ఎలా వెళ్ళాలి

ఎలా వెళ్ళాలి

అహ్మదాబాద్‌కు 450 కి.మీ.లు, ముంబైకు 815 కి.మీ.ల దూరంలో ఉండే డయ్యూకు నేరుగా విమానంలో చేరుకోవచ్చు. ఫెస్టివల్‌ సందర్భంగా రోజూ ప్రత్యేక విమానాలు నడవనున్నాయి. వేరవల్‌ రైల్వేస్టేషన్‌ డయ్యూకు 90 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ముంబై, అహ్మదాబాద్‌, పూణె, జబల్‌పూర్‌, ద్వారక, తిరువనంతపురం నుంచి డైరెక్ట్‌ ట్రైన్‌లున్నాయి. గుజరాత్‌లోని ఉనా నుంచి లోకల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అందుబాటులో ఉంటుంది.

PC: nagoabeach

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X