Search
  • Follow NativePlanet
Share
» »భారత దేశపు అద్భుత పర్యాటక ప్రదేశాలు !

భారత దేశపు అద్భుత పర్యాటక ప్రదేశాలు !

భారత దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఎన్నో ఆకర్షణీయ పర్యాటక ప్రదేశాలు కలవు. కేరళ లోని బ్యాక్ వాటర్స్, హౌస్ బోట్స్, బెఅచేస్, హిల్ స్తతిఒన్స, వైల్డ్ లైఫ్ ఇంకనూ ఎన్నో రకాల ఆకర్షణలు దేశ విదేశ టూరిస్ట్ లను ఆకర్షిస్తున్నాయి. మన దేశంలోఇతర రాష్ట్రాలలో కూడా ఎన్నో చారిత్రక ప్రాధాన్యత కల గుహలు, జలపాతాలు, వైల్డ్ లైఫ్ సాన్క్చురి లు మొదలైనవి కలవు. వాటిలో కొన్ని ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు మీకు అందిస్తున్నాము. పరిశీలించండి.

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

అరకు లోయ ...బొర్రా గుహలు
బొర్రా గుహలు, భారత దేశంలోని ఆంధ్ర ప్రదేశ్ లో కల అరకు లోయ లోని అనంతగిరి కొండలలో కలవు. ఈ గుహలు ఇండియాలో అతి పెద్దవిగా చెప్పబడతాయి. ఈ గుహలు గబ్బిలాలకు ప్రసిద్ధి.ఈ గుహలలో ఇక్కడి స్థానికులు ఒక దేవాలయం కూడా నిర్మించారు.
Photo Courtesy: Adityamadhav83

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

చిత్రకూట్ వాటర్ ఫాల్స్
అందమైన ఈ చిత్రకూట్ జలపాతాలను ' ఇండియా నయాగర జలపాతాలు ' అని పిలుస్తారు. చత్తీస్ ఘర్ లోని బస్తర్ జిల్లాలో జగదల్పూర్ సమీపం లో ఇంద్రావతి నది పై కల ఈ జలపాతాలు సుమారు వంద అడుగుల ఎత్తునుండి పడి పర్యాటకులను ఆకర్షిస్తాయి.
Photo Courtesy: Iamg at English Wikipedia

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

హావ్ లాక్ ఐలాండ్
హావ్ లాక్ ద్వీపాన్ని బ్రిటిష్ జనరల్ హెన్రీ హావ్ లాక్ పేరుపై పెట్టారు. అండమాన్ ఐలాండ్స్ లో ఇది ఒక ప్రధాన ఆకర్షణ. భూమిపై గల ఈ స్వర్గం ఎపుడు చూసినా పర్యాటకులతో కిక్కిరిసి వుంటుంది. ఈ దీవులలోని బీచ్ లలో సంవత్సరం పొడవునా ఆనందించవచ్చు.
Photo Courtesy: Foreign Devil Correspondent

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

ఎత్తిపోతల వాటర్ ఫాల్స్
ఎత్తిపోతల జలపాతాలు చంద్ర వంక నది పై కలవు. చంద్రవంక నది కృష్ణ నది ఉప నది. ఈ జలపాతాలు సుమారు 70 అడుగుల ఎత్తునుండి పడతాయి. టూరిస్ట్ ల సౌకర్యంకోరకు ఇక్కడ ఆంధ్ర ప్రదేశ్ టూరిజం శాఖ ఒక వ్యూ పాయింట్ ను నిర్మించినది. ఈ జలపాతాల నీటి తో ఏర్పడిన మడుగులో మొసళ్ళు పెంచుతారు.
Photo Courtesy: Rajib Ghosh

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

గోవా బీచ్ లు
గోవా ప్రదేశం ఒకప్పుడు పోర్చుగీస్ పాలకులచే పాలించబడినది. ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. అనేక బీచ్ లు కలవు. పోర్చు గీస పాలకులు నిర్మించిన అనేక చర్చి లు ఇక్కడ ప్రసిద్ధి. వైల్డ్ లైఫ్ సంక్చురి లు, మరియు దూద్ సాగర్ జలపాతాలు ఇక్కడ ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఒక గోవా కార్నివాల్ ఈ ప్రదేశ ప్రత్యేకత.
Photo Courtesy: Hemant meena

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

కేరళ రాష్ట్ర బ్యాక్ వాటర్స్
ఇండియా కు నైరుతి దిశా లో కల మలబార్ కోస్తా తీరంలో కేరళ బ్యాక్ వాటర్స్ ప్రసిద్ధి. ఈ బ్యాక్ వాటర్స్ అనేక నదులు, కాలువలు, సరస్సులు ను కలిపి ఉంచుతాయి. ఈ వాటర్స్ లో కల హౌస్ బోటు లు టూరిస్ట్ లు అమితంగా ఆనందిస్తారు. ఇక్కడ నీటిలో కల తాజా చేపలను బోటు లోనే వండుకు తినటం మరువకండి.
Photo Courtesy: McKay Savage

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

మున్నార్
సముద్ర మట్టానికి సుమారు 1600 మీటర్ల ఎత్తున కల మున్నార్ ఒక అందమైన హిల్ స్టేషన్. ఇది కేరళ రాష్ట్రంలోని పడమటి కనుమలలో కలదు. ఇక్కడ ట్రెక్కింగ్ మరియు మౌంటెన్ బైకింగ్ ప్రసిద్ధ క్రీడలు. పక్షులను కూడా చూసి ఆనందించవచ్చు.
Photo Courtesy: njanam92

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

కాంచన జున్గా
కాంచన జున్గా ప్రపంచంలోని మూడవ ఎత్తైన పర్వతం. హిమాలయాలలోని ఇండియా - నేపాల్ సరిహద్దులో కలదు. ఇది సముద్ర మట్టానికి 8586 మీటర్ల ఎత్తున కలదు. కాన్చేన్ జున్గా అంటే "అయిదు మంచు ఖజానాలు " అని అర్ధం చెపుతారు.

Photo Courtesy: Siegmund Stiehler

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

మొరిరి సరస్సు
ఈ సరసు జమ్మూ కాశ్మీర్ లో సముద్ర మట్టానికి 15,075అడుగుల ఎత్తున కలదు. హిమాలయాల ప్రాంతంలో ఈ సరస్సు అతి పెద్దది. ఈ సరస్సు లడఖ్ మరియు టిబెట్ మరియు, జన్స్కార్ వాలీ లు సరిహద్దులుగా కలిగి వుంది.
Photo Courtesy: Jochen Westermann

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

ఖజ్జార్
ఖజ్జార్ అనేది హిమాచల్ ప్రదేశ్ లో ఒక టూరిస్ట్ ప్రదేశం. కలాతోప్ నుండి మూడు రోజుల ట్రెక్కింగ్ లో దీనిని చేరాలి. ఇక్కడ మీరు హార్స్ రైడింగ్, ఫోటోగ్రఫీ వంటి ఆసక్తి కర క్రీడలు ఆచరించవచ్చు.
Photo Courtesy: SriniG

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

కుద్రేముఖ్
కుద్రేముఖ్ ఒక హిల్ స్టేషన్. ఇది కర్నాటక లోని చిక్ మగలోర్ జిల్లాలో కలదు. అందమైన పడమటి కనుమలలో కల ఈ హిల్ స్టేషన్ వద్ద అనేక అరుదైన జంతువుల నివాసంగా ఒక నేషనల్ పార్క్ కూడా కలదు.

Photo Courtesy: Karunakar Rayker

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

మనాలి
మనాలి హిమాచల్ ప్రదేశ్ లోని కుళ్ళు జిల్లాలో కల ఒక ప్రసిద్ధ టూరిస్ట్ ప్రదేశం. ఈ హిల్ స్టేషన్ లో మంచుతో కూడిన అనేక పర్వత శిఖరాలు చూడవచ్చు. ఇక్కడ సోలాంగ్ వాలీ, రోహాతాంగ్ పాస్, పండో డాం, చంద్రఖని పాస్ వంటి ఇతర పర్యాటక ఆకర్షణలు కూడా కలవు.
Photo Courtesy: sahil

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

ఊటీ
ప్రకృతి అందాలు అనేకం కల ఊటీ హిల్ స్టేషన్ నీలగిరులలో కలదు. ఈ అందాల హిల్ స్టేషన్ కు వచ్చే టూరిస్ట్ లు ఇక్కడే కల ఇతర పర్యాటక ఆకర్షణలు, దోద్దబెట్ట, ఊటీ సరస్సు, బొటానికల్ గార్డెన్స్ వంటివి కూడా చూడవచ్చు.
Photo Courtesy: Hemant meena

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

పహల్గం వాలీ
జమ్మూ కాశ్మీర్ లోని అనంత నాగ జిల్లా లో పహాల్గాం లోయ కలదు. ఈ లోయలో అందమైన అడవులు, సరస్సులు, జలపాతాలు అనేకం కలవు. అమరనాథ యాత్రకు వెళ్ళే యాత్రికులు ఈ లోయ గుండా ప్రయాణించ వలసి వుంటుంది.

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

పాకాల సరస్సు
పాకాల సరస్సు ఆంధ్ర ప్రదేశ్ లోని వరంగల్ జిల్లాలో కలదు. అందమైన ఈ సరస్సు సమీపం లో కల అనేక ప్రకృతి దృశ్యాలు చూస్తూ గంటల కొద్ది సమయం గడిపేయవచ్చు. ఎత్తైన కొండ ప్రదేశం, దట్టమైన అటవీ ప్రాంతం ఈ ప్రదేశాన్ని ఒక గొప్ప టూరిస్ట్ ప్రదేశంగా చేసాయి. Photo Courtesy: Alosh Bennett

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

తవాంగ్ లో హిమపాతం
అరుణాచల్ ప్రదేశ్ లోని వాయువ్య ప్రాంతంలో కల తవాంగ్ ప్రదేశం ఒక బౌద్ధ మత ప్రదేశం. ఇక్కడ పడే మంచు హిమపాతం పర్యాటకులకు అద్భుత ఆనందాలు కలిగిస్తుంది. ఈ చిన్న గ్రామం సమీపంలో బౌద్ధ ఆరామాలు కూడా చూడవచ్చు. ఈ ప్రదేశానికి టూరిస్ట్ లు సంవత్సరం పొడవునా వస్తూనే వుంటారు.
Photo Courtesy: ahinsajain

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

మంచుతో కప్పగ్బడిన హిమాచల్
మంచు తో కప్పబడి, అనేక సుందర దృశ్యాలు కల హిమాచల్ ప్రదేశ్ అనేక అవుట్ డోర్ క్రీడలకు ప్రసిద్ధి. ఇక్కడ రాక్ క్లైమ్బింగ్ మౌంటెన్ బైకింగ్, పారా గ్లైడింగ్ వంటి సాహస క్రీడలు ఆచరించవచ్చు.
Photo Courtesy: Chandramohan B V

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

పర్యాటక ప్రదేశాలు ...ప్రసిద్ధ ఆకర్షణలు!

రుషి కొండ బీచ్
రుషి కొండ బీచ్ ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం లో కలదు. ఈ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం లో స్విమ్మింగ్, వాటర్ స్కయింగ్ , విండ్ సర్ఫింగ్ లు చేయవచ్చు.
Photo Courtesy: Amit Chattopadhyay

మరిన్ని వైజాగ్ ఆకర్షణలకు క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X