Search
  • Follow NativePlanet
Share
» »తెలంగాణాలోని ఈ దేవాలయాన్ని ఒక్క సారి సందర్శిస్తే చాలు దురదృష్టం వెళ్లి పోయి అదృష్టం కలుగుతుంది

తెలంగాణాలోని ఈ దేవాలయాన్ని ఒక్క సారి సందర్శిస్తే చాలు దురదృష్టం వెళ్లి పోయి అదృష్టం కలుగుతుంది

త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మకు సృష్టికర్త పేరుంది. ఈ భూ మండలం పై ఉన్న సకల ప్రతి జీవి పుట్టుకకు ఆయనే కారణం. అయితే ఆయనకు భారత దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీదా వేళ్లమీద లెక్కపెట్టగలిగిన దేవాలయాలు ఉన్నాయి. రాజస్థాన్ లోని పుష్కర్ లో మాత్రమే భారత దేశంలో బ్రహ్మకు చెప్పొకోదగ్గ దేవాలయం ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో కూడా బ్రహ్మకు దేవాలయం ఉంది. ఇక్కడ బ్రహ్మమనకు తొమ్మిది రూపాల్లో కనిపిస్తారు. ఇటువంటి దేవాలయం మరెక్కడా లేదు. ఈ దేవాలయాన్ని సందర్శిస్తే అంతులేని జ్జానం, సంపద మన సొంతమవుతుందని స్థానికులు విశ్వసిస్తూ ఉంటారు. అంతే కాకుండా దురదృష్టం పోగొట్టి అదృష్టం కలుగజేస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఆ దేవాలయం విశిష్టత, ఆ దేవాలయం ఎక్కడ ఉంది తదితర వివరాలన్నీ మీ కోసం...

ఇక్కడ బ్రహ్మ మొత్తం తొమ్మిది రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు.

ఇక్కడ బ్రహ్మ మొత్తం తొమ్మిది రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు.

ఇక్కడ బ్రహ్మ మొత్తం తొమ్మిది రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఇలా బ్రహ్మ తొమ్మది వేర్వేరు రూపంలో ఉండటం ప్రపంచంలో మరెక్కడా మనకు కనిపించదు.ఆ బ్రహ్మ పరమశివుడి గురించి తపస్సు చేసిన ప్రదేశంగా ఈ ప్రాంతాన్ని చెబుతారు. అందువల్లే ఈ పుణ్యక్షేత్రాన్ని పరమ పవిత్రమైన స్థలంగా భావిస్తారు. ఇక్కడ బ్రహ్మ దేవాలయంతో పాటు శివుడికి కూడా గుడి ఉంది.

RaghukiranBNV

అనేక పురాణ కథలను అద్భుతమైన శిల్పాలుగా మలిచిన తీరు

అనేక పురాణ కథలను అద్భుతమైన శిల్పాలుగా మలిచిన తీరు

బాలబ్రహ్మేశ్వర, విశ్వబ్రహ్మ, కుమారబ్రహ్మ, అర్థబ్రహ్, తారక బ్రహ్మ, గరుడ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, స్వర్గ బ్రహ్మ, వీరబ్రహ్మ పేర్లతో భక్తులకు బ్రహ్మ దేవుడు దర్శనమిస్తాడు.ఇక్కడి దేవాలయాలు అద్భుతమైన శిల్పకళకు నిలయం. అనేక పురాణ కథలను అద్భుతమైన శిల్పాలుగా మలిచిన తీరు ఎటువంటి వారికైనా ఇట్టే నచ్చుతుంది. ఇక్కడి శిల్ప కళ పై అధ్యయనం చేయడానికి దేశ విదేశాల నుంచి ఎంతో మంది ఇక్కడకు వస్తుంటారు. అదే విధంగా ఇక్కడ శాసననాల పై నిత్యం అధ్యయనం జరుగుతూ ఉంటుంది.

PC: wikipedia.org

అయితే మరో కథనం ప్రకారం

అయితే మరో కథనం ప్రకారం

అయితే మరో కథనం ప్రకారం బ్రహ్మ తపస్సు చేయడంతో పాటు ఇక్కడ తొమ్మిది లింగాలను ప్రతిష్టించి పూజించాడని చెబుతారు. అవే బ్రహ్మ రూపంలో పూజించబడుతున్నాయని కూడా చెబుతారు. ఇక ఈ దేవాలయాన్ని ఒక్క సారి సందర్శిస్తే మన దురదృష్టం వెళ్లి పోయి అదృష్టం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.

PC: wikipedia.org

జోగుళాంబదేవాలయం

జోగుళాంబదేవాలయం

ఆలంపూర్ లో నవబ్రహ్మ ఆలయంతో పాటు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన జోగుళాంబదేవాలయం కూడా ఉంది. హిందువులు పార్వతీ దేవిని ఆరాధించే దేవాలయాలలో పురాణ గాధల, ఆచారాల పరంగా ప్రాధాన్యత సంతరించుకొన్న కొన్ని ప్రాంతాలను 'శక్తి పీఠాలు' అంటారు. ఈ శక్తి పీఠాలు ఏవి, ఎన్ని అనే విషయాన్ని ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెబుతారు. కొంత మంది 18 అనీ, 51 అనీ, మరి కొందరైతే 52 అనీ, 108 అనీ ఎవరికి తోచింది వారు చెబుతారు. అయితే ఎవరెన్ని చెప్పిన 18 ప్రధానమైన శక్తి పీఠాలను అష్టాదశ శక్తి పీఠాలు అంటారన్నది సత్యం.

PC: wikipedia.org

సతీదేవి దంతాలు ఇక్కడ పడ్డాయని ప్రతీతి.

సతీదేవి దంతాలు ఇక్కడ పడ్డాయని ప్రతీతి.

వాటిలో ఒకటి తెలంగాణలో ప్రసిద్ది చెందినది. ఆలంపూర్, ఆంధ్రప్రదేశ్ -కర్నూల్ నుండి 27కిలోమీటర్ల దూరంలో తుంగ, భద్ర నదులు తుంగభద్రా నదిగా కలిసే ప్రదేశంలో ఉంది. జోగులాంబ దేవాలయం చాలా ప్రాచీన ఆలయం. సతీదేవి దంతాలు ఇక్కడ పడ్డాయని ప్రతీతి. ఆలయంలోని గర్భగుడిలో ఆసీన ముద్రలో కొలువై ఉంటుంది జోగులాంబ.

Youtube

జోగులాంబ ఆలయం అలంపురంలో ఆగ్నేయదిశగా

జోగులాంబ ఆలయం అలంపురంలో ఆగ్నేయదిశగా

జోగులాంబ ఆలయం అలంపురంలో ఆగ్నేయదిశగా నెలకొని ఉంది. జోగులాంబ ఆలయాన్ని 14వ శతాబ్దంలో బహమనీ సుల్తానులు ధ్వంసం చేయగా, జోగులాంబ, చండి, ముండి విగ్రహాలను బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో భద్రపర్చారు. కొద్ది సంవత్సరాల క్రితం జోగులాంబ ఆలయాన్ని ప్రత్యేకంగా నిర్మించారు. ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన (ఐదవ శక్తిపీఠం) జోగుళాంబ ఆలయం ఉంది. అమ్మవారిపై దవడ పంటితో ఇక్కడ పడినట్టు పురాణకథనం.

youtube

జోగులాంబ మహాదేవి, రౌద్ర వీక్షణ లోచన

జోగులాంబ మహాదేవి, రౌద్ర వీక్షణ లోచన

జోగులాంబ మహాదేవి, రౌద్ర వీక్షణ లోచన, అలంపురం స్థితమాత, సర్వార్థ ఫల సిద్ధిద అని జోగులాంబ దేవిని ప్రార్థిస్తారు. అమ్మవారు ఉగ్రరూపంతో ఉన్నప్పటికీ, ఆలయంలో గల కోనేరు ఈ ప్రాంతంలో వాతావరణాన్ని చల్లబరుస్తూ ఉంటుందని స్థానికుల విశ్వాసం. ఇక్కడ అమ్మవారు ఉగ్రస్వరూపిణి. మొదట అమ్మవారి విగ్రహం బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉండేది. 2008 లో ప్రత్యేకంగా ఆలయ నిర్మాణం చేసి అమ్మవారిని అక్కడకు తరలించారు. బాల బ్రహ్మేశ్వరాలయంలో ఉన్నప్పుడు అమ్మవారిని కిటికీ గుండా చూసేవారు.

PC: wikipedia.org

అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడాన పురాణగాథ

అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడాన పురాణగాథ

అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడాన పురాణగాథ ప్రాచుర్యమంలో ఉంది. బాలబ్రహ్మేశ్వర స్వామి ప్రధాన దైవంగా నవబ్రహ్మాలయాలు నెలకొన్ని ఉన్న పుణ్యక్షేత్రం ఆలంపురం, శిల్పరిత్యా, చరిత్ర రీత్యా పౌరాణిక రిత్యా కూడా ఇది ఒక పవిత్ర క్షేత్రం. ఉత్తర వాహినియై ప్రవహిస్తున్న తుంగభద్రా తీరంలో వెలసిన ఈ క్షేత్రానికి మరొక ప్రశస్తి ఉంది. భారత దేశంలో అత్యంత పవిత్రమైన అష్టాదశ శక్తిపీఠాలలో ఐదవ శక్తిపీఠమే ఆలంపురం.

PC: wikipedia.org

జోగుళాంబాదేవిగా కొలువై ఉన్న అమ్మవారి పేరుతో కూడా ఈ క్షేత్రం

జోగుళాంబాదేవిగా కొలువై ఉన్న అమ్మవారి పేరుతో కూడా ఈ క్షేత్రం

జోగుళాంబాదేవిగా కొలువై ఉన్న అమ్మవారి పేరుతో కూడా ఈ క్షేత్రం ప్రసిద్ది చెందినది. పరమేశ్వరుడుని భార్య సతీదేవి శరీరాన్ని శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధంతో ఖండించిప్పుడు మన పవిత్ర భారత భూమిపై ఆ శరీరం నుందు పద్దెనిమిది ఖండములు పడిన ప్రదేశాలే అష్టాదశ శక్తిపీఠాలుగా వెలశాయి. ప్రసిద్దమైన ఈ శక్తిపీఠాలు మన దేశంలో వివిధ ప్రాంతాలలో ఉన్నట్లు పురాణ ఆధాఱాలను బట్టి తెలుస్తున్నది. దేశంలోని అపూర్వశక్తి సంపన్నమైన శక్తి పీఠాలలో ఇది ఒకటి అన్న విషయం తెలిసిందే.

RaghukiranBNV

జోగుళాంబా అమ్మవారి ఆలయం అతి ప్రాచీనమైనది

జోగుళాంబా అమ్మవారి ఆలయం అతి ప్రాచీనమైనది

జోగుళాంబా అమ్మవారి ఆలయం అతి ప్రాచీనమైనది. క్రీ.శ 7వ శతాబ్దంలో ఈ ప్రాచీనాలయం నిర్మించారని చారిత్రకుల భావన. 9వ శాతాబ్దంలో శ్రీ శంకర బాగవత్సదుల వారు శ్రీ చక్ర ప్రతిష్ట చేసినట్టు తెలుస్తున్నది. 14వ శతాబ్దంలో జరిగిన ముస్లిం దండయాత్రల కాలంలో ఈ ప్రాచీన ఆలయం ధ్వంసం అవ్వడం చేత అమ్మవారి మూల మూర్తిని బ్రహ్మేశ్వ రాలయంలోని ఒక మూలలో ప్రతిష్టించి పూజలు జరిపించారు.అలాగే ఇంకా ఇతర ఆలయాలు ధ్వంసం కాకుండా విజయనగర చక్రవర్తి రెండో హరిహరరాయల కుమారుడు మొదటి దేవరాయలు తన తండ్రి ఆజ్ఞ పాటించి ఆ ముస్లిం సైన్యాన్ని చెదరగొట్టి దేవాలయాల్ని రక్షించాడు. ఇటీవలె తిరిగి ఆ స్థలంలోని ప్రాచీన ఆలయ వాస్తు రీతిలో నూతన దేవాలయం నిర్మించి తిరిగి అమ్మవారి ప్రతిష్ఠ జరిపించడం విశేషం.

Arun Kota

ఈ నూతన ఆలయం పైకప్పుపై పద్మం,

ఈ నూతన ఆలయం పైకప్పుపై పద్మం,

ఈ నూతన ఆలయం పైకప్పుపై పద్మం, నాగంవంటివి మిగతా ఇక్కడి ఆలయాల్లో ఉన్నట్టే చెక్కడానికి ప్రధాన కారణం నాగం కుండలినీ శక్తికి, పద్మం సహస్రారానికి సంకేతాలు కావడమేనని పెద్దల అభిప్రాయం. ఆలయ స్తంభాలపై అష్టాదశ, శక్తిపీఠాలలో కొలువైన అమ్మవార్ల శిల్పాలు కూడా చెక్కి ఈ శక్తి పీఠ ప్రాశస్త్యాన్ని మరింత శక్తివంతం చేశారు.

Youtube

 అలంపూర్ ఎలా చేరుకోవాలి ?

అలంపూర్ ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం అలంపూర్ కు 200 కి. మీ ల దూరంలో హైదరాబాద్ విమానాశ్రయం కలదు. క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి అలంపూర్ చేరుకోవచ్చు. రైలు మార్గం అలంపూర్ లో జోగులాంబ హాల్ట్ (అలంపూర్ రోడ్డు) పేరుతో రైల్వే స్టేషన్ కలదు. బెంగళూరు - హైదరాబాద్ రైల్వే లైన్ లో ఈ స్టేషన్ కలదు. కర్నూలు, హైదరాబాద్, గద్వాల్ నుండి ప్యాసింజర్ రైళ్లు, కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లు వస్తుంటాయి. బస్సు / రోడ్డు మార్గం జాతీయ రహదారి అలంపూర్ గుండా వెళుతుంది. హైదరాబాద్, కర్నూలు, గద్వాల్, మహబూబ్ నగర్, జడ్చర్ల మరియు సమీప పట్టణాల నుండి ప్రభుత్వ బస్సులు నడుస్తుంటాయి.

PC: Naidugari Jayanna

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X