Search
  • Follow NativePlanet
Share
» »12 ఏళ్ల తర్వాత పూచిన పువ్వుంట పలు రోగాలను నయం చేసేనంట. అక్టోబర్ వరకు మాత్రమే ఫ్రీ

12 ఏళ్ల తర్వాత పూచిన పువ్వుంట పలు రోగాలను నయం చేసేనంట. అక్టోబర్ వరకు మాత్రమే ఫ్రీ

సృష్టి కర్త బ్రహ్మ రాతలను అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అన్నింటినీ సృష్టించించేది ఆ బ్రహ్మే. అయితే ఒక్కొక్క దానిలో ఒక్కొక్క వైవిద్యత ఉంటుంది. ఇది మనుషులకు, జంతువులకు చివరికి మొక్కలు వాటికి పూజే పువ్వులకు కూడా వర్తిస్తుంది. అటువంటి కోవకు చెందినదే నీల్ కురంజి మొక్క. ఈ మొక్కకు పూచే పువ్వును చూడాలంటే 12 ఏళ్లు వేచి చూడాలి. రూపంలోనే కాదు గుణంలో కూడా ఈ పుష్పం మిన్న . ఇక ఈ పుష్పం పేరు పై ఓ దేవాలయంమే ఉంది. దీనిని ఓ విదేశీయురాలు నిర్మించడం విశేషం. ఈ కథనంలో సదరు నీల్ కురంజీ పుష్పానికి సంబంధించిన మరికొన్ని వివరాలతో పాటు పాటు ఆ దేవాలయానికి సంబంధించిన విశేషాలు మీ కోసం

నీల్ కురంజి

నీల్ కురంజి

P.C: You Tube

గుబురు పొదకు చెందిన చిన్న మొక్క నీల్ కురంజి. దీని శాస్త్రీయ నామం స్టోబిలాంతస్ కుంతియానస్. అయితే వీటిని అందరూ నీల్ కురంజీ అనే పేరుతోనే పిలుస్తుంటారు.

నీల్ కురంజి

నీల్ కురంజి

P.C: You Tube

ఇది దక్షిణ భారత దేశంలో పశ్చిమ కనుమల్లోని షోలా అడవుల్లో కనిపిస్తుంది. సాధారణంగా నీలం రంగులో ఉంటుంది. అదువల్లే దీనికి నీల్ కురంజి అని పేరు వచ్చింది. అదే పేరుతో ఇది ప్రాచూర్యం చెందింది.

నీల్ కురంజి

నీల్ కురంజి

P.C: You Tube

రికార్డుల్లో ఉన్న వివరాల ప్రకారం నీల్ కురంజీ క్రీస్తు శకం 1838, 1862,1874, 1886,1898,1910,1922,1934,1926,1958,1970,1982,1994,2006,2018 లో పూచాయి. ఈ పూత పూసిన తర్వాత ఇవి విత్తనాలు వెదజల్లి చనిపోతాయి.

నీల్ కురంజి

నీల్ కురంజి

P.C: You Tube

ఈ మొక్క 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే పూస్తుంది. ఆ సమయంలో ఈ మొక్కలు ఉన్న ప్రాంతం మొత్తం నీలం రంగులో ఉండి ప్రక`తిలోని అందం మొత్తం అక్కడే ఉందా? అన్న రీతిలో భ్రమింపజేస్తుంది.

నీల్ కురంజి

నీల్ కురంజి

P.C: You Tube

అందువల్లే ఈ నీల్ కురంజి ఎక్కువగా మొక్కలు ఎక్కువగా కేరళలోని మున్నార్ ప్రాంతం, తమిళనాడులోని కొడైకెనాల్ ప్రాంతాంల్లో ఉన్నాయి. దీంతో ఈ నీల్ కురంజీ పువ్వలు అందాలను చూడటానికి ప్రక`తి ప్రేమికులు ఆయా ప్రాంతాలకు క్యూ కడుతున్నారు.

నీల్ కురంజి

నీల్ కురంజి

P.C: You Tube

నీల్ కురంజీ మొక్కలు పశ్చిమ కనుమలతో పాటు తూర్పుకనుమల్లో అక్కడక్కడ కనిపిస్తాయి. ముఖ్యంగా కర్నాటకలోని సండూరు పర్వత ప్రాంతాల్లో కూడా ఈ నీల్ కురంజి మొక్కలు ఇటీవల కాలంలో పూయడం విశేషం.

నీల్ కురంజి

నీల్ కురంజి

P.C: You Tube

మరోవైపు ఈ నీల్ కురంజీ పువ్వులకు అనేక రకాల వ్యాధులను నయం చేసే శక్తి ఉందని నమ్ముతున్నరు. అందువల్లే అయుర్వేద వైద్యులు, పరిశోధకులు కూడా ఆయా ప్రాంతాలకు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారు.

నీల్ కురంజి

నీల్ కురంజి

P.C: You Tube

ఇలా నీల్ కురంజి అటు పర్యాటక లోకంలోనూ, ఇటు వైద్యలోకంలోనూ తనదైన ముద్రను వేసుకొంది. అంతేనా అంటే ఈ నీల్ కురంజితో ముడిపడిన ఆధ్యాత్మిక క్షేత్రం కూడా తమిళనాడులో ఉంది.

నీల్ కురంజి

నీల్ కురంజి

P.C: You Tube

ఈ క్షేత్రం కూడా ప్రముఖ పర్యాటక కేంద్రంగా అలరారుతోంది. అదే కురింజీ ఆండవార్ దేవాలయం. ఇది ప్రముఖ పర్యాటక కేంద్రం, హిల్ స్టేషన్ అయిన కొడైకెనాల్ లో ఉంది.

నీల్ కురంజి

నీల్ కురంజి

P.C: You Tube

కొడైకెనాల్ సరస్సుకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయంలో ప్రధాన దైవం మురుగన్. అంటే సుబ్రహ్మణ్యస్వామి. కురింజి అంటే పర్వతం అని, ఆండవర్ అంటే దేవత లేదా దేవుడు అని అర్థం.

నీల్ కురంజి

నీల్ కురంజి

P.C: You Tube

అంటే కురింజిఆండవార్ అంటే పర్వత దేవుడు అని అర్థం. కుమారస్వామి మొదట భూమి పై అడుగు పెట్టినప్పుడు ఆయన భార్య వల్లీ నీల్ కురంజీ మొక్కలతో చేసిన దండతో ఆయనకు స్వాగతం పలికింది ఇక్కడేనని చెబుతారు.

నీల్ కురంజి

నీల్ కురంజి

P.C: You Tube

అందువల్లే ఇక్కడ దేవాలయాన్ని నిర్మించారు. ఆ దేవాలయం కూడా ఒక యురోపియన్ మహిళ 1936 లో ఈ దేవాలయాన్ని నిర్మించి హిందువుగా మారిపోయారు.

నీల్ కురంజి

నీల్ కురంజి

P.C: You Tube

అంతేకాకుండా రామనాథన్ ను పెళ్లిచేసుకొని ఇక్కడే స్థిరపడి పోయారు. ఆమె పేరు లేడి రామనాథన్ గానే అందరికి సుపరిచయం. ఇదే దేవాలయంలో నవగ్రహ విగ్రహాలు కూడా ఉంటాయి.

నీల్ కురంజి

నీల్ కురంజి

P.C: You Tube

అందువల్ల నవగ్రహ పూజ కూడా చేయించుకోవచ్చు. ప్రతి రోజూ పర్యాటకుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తెల్లవారుజామునే వెళ్లడం మంచిది. ఫొటోగ్రఫి, విడియోగ్రఫీలను అనుమతించరు.

నీల్ కురంజి

నీల్ కురంజి

P.C: You Tube

పార్కింగ్ కోసం రూ.5 చెల్లించాల్సి ఉంటుంది. కొడైకెనాల్ బస్ స్టేషన్ నుంచి దేవాలయం 5 కిలోమీటర్లు కాగా, కొడైకెనాల్ సరస్సు నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఈ దేవాలయం ఉంటుంది. ఇక్కడికి దగ్గర్లో ఉన్న వాగయ్ డ్యామ్, పలనీ హిల్స్ చూడదగిన ప్రాంతాలు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X