» »ప్రపంచంలోనే యముడికి వున్న ఒకే ఒక్క ఆలయం - ధర్మేశ్వర్ మహాదేవ్ ఆలయం

ప్రపంచంలోనే యముడికి వున్న ఒకే ఒక్క ఆలయం - ధర్మేశ్వర్ మహాదేవ్ ఆలయం

Written By: Venkatakarunasri

మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలాచోట్ల హిందూ దేవతలు కొలువైవున్నారు.

స్వయంభూగా వెలసిన దేవుళ్ళు, దేవతలు, వింత ఆలయాలు, వింత ఆచారాలు ఇలా ఎన్నిటినో చూసాం.

ఇక్కడ చెప్పుకునే ఆలయం మీరెక్కడా చూసివుండరు.

మనం గుడికి వెళ్ళినప్పుడు దేవుడిని దగ్గరగా చూడాలని,గర్భగుడి లోకి వెళ్లి దేవుడిని దర్శించుకుని పూజలుచేస్తే మనం అనుకున్న కోరికలు తీరుస్తాడని నమ్మకం.

ఈ ఆలయం గర్భగుడిలోకి వెళ్ళితే మాత్రం భయంతో వణికిపోతారు.

ఈ ఆలయం ఎక్కడుంది?అందులో ఉన్నది ఎవరో ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం.

ఎక్కడ ఉంది?

ఎక్కడ ఉంది?

హిమాచలప్రదేశ్ లోని చంబా జిల్లాలోగల బార్మర్ ప్రాంతంలో కొలువైవున్న ఆ ఆలయమే యమధర్మరాజు ఆలయం.

pc: youtube

లార్డ్ ఆఫ్ డెత్

లార్డ్ ఆఫ్ డెత్

ధర్మేశ్వర్ మహదేవ్ టెంపుల్ గా ప్రసిద్ధిచెందిన ఈ ఆలయాన్ని "లార్డ్ ఆఫ్ డెత్" అని కూడా పిలుస్తున్నారు.

Image Courtesy : Varun Shiv Kapur

స్థల పురాణం

స్థల పురాణం

దేవుళ్ళు, దేవతలు కొన్ని కొన్ని ప్రదేశాలలో కొలువైవున్నట్లుగా ఈ ఆలయంలో 14సంల నుండి యముడే సాక్షాత్తూ కొలువైవున్నారని అక్కడి స్థల పురాణం చెబుతుంది.

Image Courtesy : Varun Shiv Kapur

పర్యాటకులు

పర్యాటకులు

ఈ ఆలయాన్ని సందర్శించుకున్న వారు గర్భగుడిలోకి వెళ్ళకుండా బయటనుండే దణ్ణం పెట్టుకుని వెళ్ళిపోతారంట.

Image Courtesy : Varun Shiv Kapur

యమ ధర్మరాజు

యమ ధర్మరాజు

ఈ ప్రాంతంవారు యమ ధర్మరాజును దేవుడుగా భావిస్తున్నారు.

Image Courtesy : Varun Shiv Kapur

గర్భగుడి

గర్భగుడి

గర్భగుడిలోకి వెళితే ఏం జరుగుతుంది.ఈ పాటికి మీకు అనుమానం వచ్చే వుంటుంది.

pc: youtube

 రహస్యమందిరం

రహస్యమందిరం

మనకు కలలో యమధర్మారాజు కనిపిస్తే ఎలా వుంటుంది. పీడ కలలు లేదా దెయ్యం మన ముందు వుందేమో అన్నప్పుడు ఎలా భయపడతామోఅంతకు మించి భయం కలుగుతుందిఅంటున్నారు.

pc: youtube

రహస్యమందిరం

రహస్యమందిరం

ఇక యమధర్మరాజు పక్కన ఎప్పుడూ వుండే చిత్రగుప్తుడు ఇక్కడే ఒక రహస్యమందిరంలో వున్నాడని అక్కడి 4ద్వారాలు ఎవరికీ కన్పించ విధంగా వుంటాయని అక్కడ నాల్గుద్వారాల నుండి మనిషి చనిపోయినతర్వాత మనిషిఆత్మ స్వర్గానికి వెళ్ళాలా?లేక నరకానికి వెళ్ళాలా?అని చూపుతాయని అంటున్నారు.

pc: youtube

ప్రపంచంలో యముడికి వున్న ఒకేఒక్క ఆలయం

ప్రపంచంలో యముడికి వున్న ఒకేఒక్క ఆలయం

గర్భగుడిలోకి భక్తులు వెళ్ళలేని ఆలయంగా చెప్పుకుంటున్న ఈ ఆలయం ప్రపంచంలో యముడికి వున్న ఒకేఒక్క ఆలయం.

pc: youtube

ఎలా వెళ్ళాలి?

ఎలా వెళ్ళాలి?

హైదరాబాద్ నుండి హిమాచలప్రదేశ్ కు లక్నో, న్యూడిల్లీ మార్గంలో 10గం లు పడుతుంది. కారులో 33గంటలు పడుతుంది.

హైదరాబాద్ నుండి జైపూర్, హర్యానా మార్గంలో బస్సులో 1రోజు,23గంటలు పడుతుంది.

pc: google maps