Search
  • Follow NativePlanet
Share
» »మ‌న‌సుదోచే ప‌ర్యాట‌క వెన్నెల‌.. తెన్మెల‌

మ‌న‌సుదోచే ప‌ర్యాట‌క వెన్నెల‌.. తెన్మెల‌

మ‌న‌సుదోచే ప‌ర్యాట‌క వెన్నెల‌.. తెన్మెల‌

ప్రకృతిలో పొదిగిన సుందరసీమ 'తెన్మెల'.. మనదేశపు తొలి పర్యావరణ కేంద్రంగా గుర్తింపు పొందింది 'తెన్మెల'. దీనిని ప్రకృతి పొదిగిన సుందరసీమగా వర్ణించవచ్చు. ప‌చ్చ‌ని ప్ర‌కృతి సోయ‌గ‌పు అందాల చిరునామాగా నిలిచే ఈ ప్రాంతం నిత్యం ప‌ర్యాట‌కులను ఆక‌ర్షిస్తోంది.

ప‌ర్యాట‌క రాజ‌ధాని కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లాలోని ప్రదేశమిది. 'తెన్మెల' అంటే 'తేనె గుట్ట' అని అర్థం. ఒకప్పుడు ఈ ప్రాంతం తేనెకు పుట్టిల్లుగా ఉండేది. దీనికితోడు ఈ ప్రదేశం ఔషధమూలికల నిధి. నగరాల రణగొణ ధ్వనులకు చాలా దూరంగా ఉండే తెన్మెల, అరణ్య జీవన సంస్కృతికి, సమకాలీన జీవన చిత్రానికీ నిలువుటద్దంగా ఉంటుంది. ఇదొక ఎడతెగని ఆకర్షణల జాబితా. ఎంతో శోభాయమానంగా ఉండే ఇక్కడి లోయలు సందర్శకుల హృదయాన్ని కట్టిపడేస్తాయి. అయితే ఎంతో సువిశాలమైన తెన్మెలను పర్యాటకుల సౌకర్యార్థం కల్చర్ జోన్, లీజర్ జోన్, అడ్వెంచర్ జోన్ అంటూ మూడు జోన్ ల కింద విభజించారు. ఒక విలక్షణమైన, అరుదైన అనుభూతిని సొంతం చేసుకోవాలనుకుంటే తెన్మెలను సందర్శించాల్సిందే!

గార్గియస్ నేచర్ ట్రేల్

గార్గియస్ నేచర్ ట్రేల్

సుందర దృశ్యాల్ని చూడాలనుకునే ప్రకృతి ప్రేమికులకు, సాహసోపేత విషయాలను తెలుసుకోవాలనుకునే వారికి, సంప్రదాయ విలువలకు ప్రాధాన్యత ఇచ్చేవారికి తెన్మెలలోని ఈ నేచర్ ట్రేల్ ఊహకు మించిన అనుభూతినిస్తుంది. పర్వతశ్రేణుల మీదుగా, పచ్చ పచ్చని అరణ్యాల మీదుగా వీచే ఇక్కడి గాలి హృదయాన్ని తన్మయత్వంలో ముంచుతుంది. మధ్యమధ్యన ఎదురయ్యే విశ్రాంతి మందిరాలు పర్యాటకులకు ఎంతో సౌలభ్యంగా ఉంటాయి. ఇక్కడి జ‌ల‌పాతాల స‌వ్వ‌డులు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. శీతాకాలంలో తెన్మెల్ ప‌ర్యాట‌క అందాలు రెట్టింపు అవుతాయి.

తెన్మెల పరప్పర్ వంతెన

తెన్మెల పరప్పర్ వంతెన

లీజర్ జోన్ లోంచి నడిచి వెళుతున్నప్పుడు తెన్మెల పరప్పర్ వంతెన ఎదురవుతుంది. నీటిపారుదల ప్రాజెక్టుల‌తో పోలిస్తే కేరళ రాష్ట్రంలోనే ఇది రెండవ అతి పెద్ద, అతి పొడవైన వంతెన. ఇక్కడ షెండుర్ని అటవీమృగాల ప్రదేశం తెన్మెల ప్రకృతి పర్యాటనలోకెల్లా ఎంతో విశేషమైనది. అరుదైన జీవ‌రాశుల విడిది కేంద్రంగా ఈ ప్రాంతం ప్ర‌సిద్ధిగాంచింది. ఇక్క‌డి ప‌క్షుల కిల‌కిలారావాలు ప‌ర్యాట‌కుల‌ మ‌న‌సును క‌ట్ట‌ప‌డేస్తాయంటే ఆతిశ‌యోక్తికాదు.

ట్రీ హౌజ్ ఓ మంచి సెల్ఫీస్పాట్‌..

ట్రీ హౌజ్ ఓ మంచి సెల్ఫీస్పాట్‌..

వృక్ష శిఖరాన జీవించడం అన్నది మనం ఊహించి ఉండం. కానీ, ఇక్కడ అలాంటి అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. చెట్టు కొమ్మ మీద ఉండే కుటీరంలాంటి గుహ చూస్తే ఎవరికైనా అందులో కొన్నాళ్లు బస చేస్తే బావుండుననిపిస్తుంది. నిరంతరం చల్లచల్లని గాలులు వీచే ఈ చోట వేలాది పక్షుల గుంపులు, వాటి కేరింతల నాదాలు హృదయాన్ని ఊయలలూపుతాయి. ఇది ఓ మంచి సెల్ఫీ స్పాట్‌గా గుర్తింపు పొందింది.

వేలాడే వంతెన ఓ అద్భుతం..

వేలాడే వంతెన ఓ అద్భుతం..

'తెన్మెల'లో 1877వ ఏట నిర్మితమైన ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇంజనీర్లు సృష్టించిన ఒక అద్భుతం. బ్రిటిష్ ఇంజనీర్ ఆల్బర్ట్ హెన్రీ సారథ్యంలో నిర్మాణమైన ఈ వంతెన 400 అడుగుల పొడవుతో ఉంటుంది. కల్లాడ నది మీద కట్టిన ఈ వంతెనను కలప పలకలను బిగించడం ద్వారా ఏర్పరిచారు. రెండు చివర్లలో కేవలం రెండు స్థంభాలతో ఈ వంతెనను పూర్తిచేశారు. ష‌ర‌తుల‌తో కూడిన సంద‌ర్శ‌న‌కు ఈ వంతెన ఆహ్వానం ప‌లుకుతోంది.

Read more about: tenmela kerala
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X