» »మీరు ఐశ్వర్యవంతులు కావాలా...ఈ 8 ముఖాల శివుడిని దర్శించుకోండి

మీరు ఐశ్వర్యవంతులు కావాలా...ఈ 8 ముఖాల శివుడిని దర్శించుకోండి

Written By: Beldaru Sajjendrakishore

సాధారణంగా శివుడు లింగ రూపంలో దర్శనమిస్తాడు. అయితే భారత దేశంలో అతి తక్కువ చోట్ల మాత్రమే విగ్రహ రూపంలో మనకు కనిపిస్తాడు. అయితే మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతి ఎనిమిది ముఖాలతో శివుడు దర్శనమిచ్చే చోటు ఒకే ఒక దర్గర ఉంది. ఈ అష్ట ముఖ అంటే ఎనిమిది ముఖాలు (8 ముఖాల) కలిగిన లింగమయ్యను దర్శించుకుంటే ఐశ్వర్యం సిద్ధిస్తుందనేది భక్తుల విశ్వాసం. 

భారత దేశంలో ఉత్తర దిశ నుంచి పశ్చిమ కొనకు తూర్పు తీరం నుంచి పశ్చిమాన అరేబియా సముద్రం వరకూ అనేక శివాలయాలను మనం చూడవచ్చు. అయితే ఇక్కడ ఉన్నటు వంటి శివాలయం అందులో ఉన్నటు వంటి ఎనిమిది ముఖాలు కలిగిన శివుడు మనకు ఎక్కడా కనిపించడు. ఈ శివాలయం విశిష్టత, దీనిని నిర్మాణం, ఎప్పుడు సందర్శిస్తే మంచిది తదితర వివరాలు నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం ఈ కథనంలో ....

1.ఎక్కడ ఉంది

1.ఎక్కడ ఉంది

Image source:


ఈ మహిమాన్వితమైన దేవాలయం మధ్యప్రదేశ్ లోని మంద్ సౌర్ పట్టణంలో సిన్మా నదీ తీరం వద్ద ఉంది. పశుపతి దేవాలయం ఎంతో విశిష్టమైనది. ఇటు వంటి దేవాలయం ప్రపంచంలో మరెక్కడా లేదు. శివుడు మానవ రూపంలో అందులోనూ అష్టముఖుడిగా (8 ముఖాల) దర్శనమిచ్చే చోటు ఇది మాత్రమే. అందుకే ఈ దేవాలయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఇది కూడా ఒకటిగా ఉంటోంది.

2.ఎప్పుడు నిర్మించారు

2.ఎప్పుడు నిర్మించారు

Image source:


ఇప్పటి వరకూ దొరికిన ఆధారాలను అనుసరించి ఈ దేవాలయాన్ని 5వ లేదా 6వ శతాబ్దంలో నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ ఆలయ నిర్మాణంలో దీనిని మాండసోర్ శివాలయం అని కూడా అంటారు. ఇక్కడి దొరికిన పదిశాసనాల్లో తొమ్మిది శాసనాలు సంస్కృత పద్యాలు ఉన్నాయి. వీటి ద్వారా వాసుదేవ మరియు శివుడు వంటి హిందూ దేవతలకు ప్రార్థనలు ఉన్నాయి.

3. ఇలా ఉంటుంది.

3. ఇలా ఉంటుంది.

Image source:


ఇది 4.5 మీటర్ల (15 అడుగుల) పొడవైనది. ఇది ఆలయంలోకి పునర్నిర్మించబడింది. లింగా యొక్క ఎగువ భాగంలో ఒక పంక్తిలో నాలుగు తలలు ఉంటాయి, అయితే ఇతర నాలుగు తలలు రెండో వరుసలో వాటి క్రింద చెక్కబడ్డాయి. వారి ముఖంపై మూడో కన్ను కనిపించే ముఖాలకు తెరలు ఉన్నాయి. ప్రతి ముఖం విస్తృతమైన జుట్టును కలిగి ఉంది. చూడటానికి ఎంతో ముచ్చటగానే కాకుండా భక్తి భావంతో ఉంటుంది.

4.ప్రపంచంలో మరెక్కడా కనిపించదు.

4.ప్రపంచంలో మరెక్కడా కనిపించదు.

Image source:


ప్రపంచంలో ఎక్కడా కనిపించనట్లు ఇక లింగం ముందు పొడుచుకుని వచ్చినట్లు ఉండే ఎనిమిది ముఖాలు కలిగిన శివుడి విగ్రహం ఇక్కడ అగుపిస్తుంది. ప్రపంచం నలుమూలల నుంచి ఈ విగ్రహ దర్శనం కోసం ప్రజలు ఎంతో భక్తిభావంతో ఇక్కడకు వస్తుంటారు. దీని వల్ల నిత్యం ఈ దేవాలయం శివ భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. శివుడికి ఇష్టమైన బిల్వపత్రాలతో ఇక్కడ పూజలు నిర్వహిస్తారు.

5.ఆదాయం పెరుగుతుంది.

5.ఆదాయం పెరుగుతుంది.

Image source:


ఈ అష్టముఖ శివలింగ దర్శనం వల్ల చేసే పనిలో జయం కలుగుతుందని భక్తుల విశ్వాసం ముఖ్యంగా వ్యాపారంలో ఉన్నవారు ఆదాయం పెరిగి ఐశ్వర్యవంతులు అవుతారని ఇక్కడి వారు చెబుతారు. ముఖ్యంగా శివుడికి ఎంతో ఇష్టమైన సోమవారం నాడు ఈ అష్టముఖ (8 ముఖాల) శివుడిని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతారు. ఆ సమయంలో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది.

6.స్వయంభువుడు

6.స్వయంభువుడు

Image source:


ఈ ఎనిమిది ముఖాలతో కలిగిన శిల స్వయంభువమని కొంతమంది భక్తులు వాదిస్తారు. అయితే చరిత్రకారులు, పురావస్తు శాస్త్రజ్జులు మాత్రం భూమి నుంచి ఉద్భవించిన ఏక శిల పై కొంతమంది శివుడి ముఖాన్ని చెక్కారని చెబుతారు. ఇక ఈ దేవాలయం ఉన్న మండసోర్ లేదా మంద్ సౌర్ పట్టణం గురిచి వివరణ ప్రసిద్ధ కవి కాళిదాసు తన రచనలో వర్ణించినట్లు చెబుతారు. అందువల్ల ఈ పట్టణం చాలా పురాతనమైనదని తెలుస్తోంది.

7.ఇతర దేవతా మూర్తులు

7.ఇతర దేవతా మూర్తులు

Image source:


ఈ దేవాలయ ప్రాంగణంలో గణపతి, పార్వతి, కార్తికేయ, గంగ, విష్ణు, లక్ష్మి తదితర దేవతా మూర్తులతో పాటు ఆదిశంకరాచార్యల విగ్రహం కూడా ఉంది. అష్టముఖ శివుడిని దర్శించుకున్న తర్వాత భక్తులు చాలా మంది ఈ దేవతా మూర్తుల విగ్రహాలను కూడా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ధ్యాన కేంద్రంలో భక్తులు ఎక్కువ సమయం గడుపుతారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా ఉన్నాయి.

8.ఎనిమిది పేర్లను సూచిస్తాయి.

8.ఎనిమిది పేర్లను సూచిస్తాయి.

Image source:


శైవ ధర్మంలో శివుడిని ముఖ్యంగా ఎనిమిది పేర్లతో కొలుస్తారు. అవి భవ, పశుపతి, మహాదేవ, ఇసర, రుద్ర, సర్వ, ఉగ్ర, అసని. ఈ అష్టముఖ దేవాలయంలో ఉన్న ఎనిమిది ముఖాలు శివుడి వివిధ పేర్లను సూచిస్తాయని ఇక్కడి పూజారులు చెబుతారు. అత్యంత పురాతన చరిత్ర కలిగిన ఈ దేవాలయం ఉన్న పట్టణాన్ని దశపుర అని కూడా పిలుస్తారు. ఈ దశపుర ప్రస్తావన మనకు వివిధ పురాణాల్లో కనిపిస్తుంది.

9. మరో పశుపతినాథ దేవాలయం కూడా

9. మరో పశుపతినాథ దేవాలయం కూడా

Image source:


ప్రపంచంలో పశుపతి నాథ దేవాలయం మన పొరుగు దేశమైన నేపాల్ లో కూడా ఉంది. ఈ దేవాలయం నేపాల్ దేశ రాజధాని కాఠ్మండు నగరం ఈశాన్య దిక్కు పొలిమేర్లలో బాగమతి నది ఒడ్డున ఉంది. పశుపతి (శివుడు) ప్రధాన దైవంగా ఉన్న ఈ దేవాలయం ప్రపంచంలోనే అతి పవిత్రమైన శైవ దేవాలయంగా భావిస్తారు.భారతదేశం, నేపాల్ నుండి భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. మహాశివరాత్రి రోజు అత్యంత పర్వదినం, వేల సంఖ్యలో భక్తులు పశుపతిని దర్శిస్తారు.

10. వారిని అనుమతించరు.

10. వారిని అనుమతించరు.

Image source:


ఈ దేవాలయంలోకి హిందువులు కాని వారిని అనుమతించరు. ఇక్కడి దేవాలయంలో ఉన్న మూల విరాట్టుని నలుగురు అర్చకులు మాత్రమే స్పృశించే అధికారం ఉంది. శంకరాచార్యులు ప్రారంభించిన ఆలయ సాంప్రదాయం ప్రకారం ఇక్కడి అర్చకులు దక్షిణ భారతదేశం నుండి నియమించబడతారు. శంకరాచార్యులు ఇక్కడ మానవ మరియు జంతు బలిని నిషేధించారు.

11. భారత దేశం నుంచే

11. భారత దేశం నుంచే

Image Source:


దక్షిణ భారతదేశం నుండి అర్చకులు ఇక్కడ పూజలు నిర్వహించడానికి ప్రధాన కారణం నేపాల్ రాజు మరణించినప్పుడు నేపాల్ దేశము సంతాప సముద్రములో ఉంటుంది. నేపాల్ ప్రజలకు పశుపతినాథ్ స్వామి నిత్యకైంకర్యాలు చేసే అవకాశం ఉండదు, పశుపతినాథ్ కి నిత్యకైంకర్యాలు నిరంతంగా కొనసాగాలనే కారణం చేత భారతదేశార్చకులు ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తుంటారు. ఇక్కడ అర్చకుడిగా ఎంపిక కావడానికి కొన్ని పరీక్షలను ఎదుర్కొనాల్సి ఉంటుంది.

12. ఇది స్థానిక కథనం..

12. ఇది స్థానిక కథనం..

Image source:


ఇతిహాసం ప్రకారం నేపాల మహత్యం మరియు హిమవత్‌ఖండం ప్రకారం ఒకరోజు శివుడు కాశి నుండి భాగమతి నది ఒడ్డున ఉన్న మృగస్థలి అనే ప్రదేశంలో పార్వతి సమేతంగా వచ్చి జింక అవతారంతో నిద్రుస్తుండగా దేవతలు శివుడిని కాశి తిరిగి తీసుకొని పోవడానికి జింకని లాగినప్పుడు జింక కొమ్ము విరిగి నాలుగు ముక్కలుగా పడింది. ఈ నాలుగు ఖండాలుగా పడినదే ఇప్పుడు చతుర్ముఖ లింగం గా ఉన్నదని ఇతిహాసం చెబుతారు.

13. ఆలయాన్ని ఎవరు నిర్మించారంటే

13. ఆలయాన్ని ఎవరు నిర్మించారంటే

Image source:


ఆలయ నిర్మాణ కాలం గురించి సరైన ఆధారాలు లేవు. గోపాలరాజ్ వంశవలి అనే చారిత్రాక పత్రిక ప్రకారం లించచ్చవి రాజు శుశూపదేవ క్రీ.శ.753 సంవత్సరంలో ఈ ఆలయనిర్మాణం జరిపాడని, పదకొండవ జయదేవ పశుపతినాథ్ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ద్వారా తెలుస్తొంది.. తరువాతి కాలంలో 1416 సంవత్సరం రాజా జ్యోతి మల్ల ఈ దేవాలయానికి పునరుద్ధరణ పనులు జరిపించాడని, 1697 సంవత్సరంలో రాజా భూపేంద్ర ఈ దేవాలయానికి పునఃనిర్మించాడని తెలుస్తోంది.

శివుడి శిరస్సు పై చంద్రుడితో పాటు సూర్యుడూ కనిపించే క్షేత్రం...మన ఆంధ్రప్రదేశ్ లోనే

శివయ్య తలక్రిందులుగా ఉన్న క్షేత్రం ఇదే...