Search
  • Follow NativePlanet
Share
» »కోడిగుడ్డును నైవేద్యంగా సమర్పించే పెరాలస్సరి సుబ్రహ్మణ్య దేవాలయం గురించి విన్నారా

కోడిగుడ్డును నైవేద్యంగా సమర్పించే పెరాలస్సరి సుబ్రహ్మణ్య దేవాలయం గురించి విన్నారా

పెరలస్సరి సుబ్రహ్మణ్య ఆలయం పురాణ కాలం నాటిది. ఈ ఆలయంకు చాలా విశేషం ఉంది. ఈ ఆలయం ప్రాంగణంలో ఉండే కోనేరు చాలా అందంగా ఉంది. ఇలా అందమైన బావి ఉన్న ఆలయం చరిత్ర విశేషాలేంటో ఒకసారి తెలుసుకుందాం..

అయ్యప్ప అయిన సుబ్రహ్మణ్య :

అయ్యప్ప అయిన సుబ్రహ్మణ్య :

ఈ ఆలయం కొని విషయాలలో చాలా విశేషంగా ఉంది. త్రేతా యుగంలో శ్రీ రాముడు ఈ దేవాలయంలో సుబ్రహ్మణ్య విగ్రహాన్ని ప్రతిష్టించారని ప్రతీతి. అయితే దానికి ముందే ఇక్కడ అయ్యప్ప దేవాస్థానం ఉన్నది. ప్రస్తుతం ఇప్పుడు ఒకే ప్రాంగణంలో రెండు దేవాలయాలున్నాయి, అయ్యప్ప మరియు సుబ్రహ్మణ్య దేవాలయాలున్నాయి. ఈ ఆలయాలతో పాటు గణపతి, నాగ, భగవతి ఆలయాల సమూహం ఉన్నాయి.

ఈ ఆలయం ఎక్కడ ఉంది

ఈ ఆలయం ఎక్కడ ఉంది

కేరళ నుండి కన్నూర్ నుండి సుమారు 15 కిలో మీటర్ల దూరంలో పరాలస్సరి నగరం పరాలస్సరి సుబ్రహ్మణ్య దేవాస్థానం ప్రసిద్ది చెందినది.

మెట్ల బావి :

మెట్ల బావి :

ఈ దేవాలయం ప్రాంగణంలో ఉన్న కోనేరుకు చాలా ప్రత్యేకత ఉంది. లెక్కపెట్టలేనన్ని మెట్టు ఉన్నాయి. ఇది కేరళలోని నిర్మాణ శైలిలో చాలా అరుదుగా నిర్మించబడినది. ఇటువంటి కోనేరు లేదా బావి యొక్క నిర్మాణ శైలి సాదారణంగా ఉత్తర భారతదేశంలో కనిపిస్తాయి. ఇటువంటి నిర్మాణ శైలి ఢిల్లీ, రాజస్తాన్, గుజరాత్ మరియు కర్నాటక రాష్ట్రాల్లో చూడవచ్చు

ఈ గుడిలో మురుగన్ లేదా సుబ్రమణ్య స్వామీ కొలువై ఉంటారు.

ఈ గుడిలో మురుగన్ లేదా సుబ్రమణ్య స్వామీ కొలువై ఉంటారు.

ఈ గుడిలో మురుగన్ లేదా సుబ్రమణ్య స్వామీ కొలువై ఉంటారు. ఈ ఆలయంలో కనబడే రాగి మరియు కాంస్యం తో తయారు చేసిన నాగ విగ్రహాలు ప్రధాన విశేషం. ఇక్కడ ఉన్న దిగుడు బావి తన నిర్మాణ శైలితో పర్యాటకులని ఆకర్షిస్తుంది.

పరాలస్సరి లోని కోనేరులోని మెట్డు రాతితో నిర్మించబడినవి

పరాలస్సరి లోని కోనేరులోని మెట్డు రాతితో నిర్మించబడినవి

పరాలస్సరి లోని కోనేరులోని మెట్డు రాతితో నిర్మించబడినవి. ప్రతి తుల సంక్రమణ' లో కావేరీ నది నీరు ఈ కొలనులోనికి చేరుతుందని ఇక్కడ వారు ఎక్కువగా నమ్ముతారు. కేరళలో మలయాళ ధనుర్మాసం ఇక్కడ పండుగ వాతావరణంతో నిండుకుంటుంది. ధనుర్మాసంలో 6 రోజులు జరుపుకుంటారు. థనుర్మాసం 4వ రోజు నుండి ప్రారంభమై 11తేదీన ముగుస్తుంది.

Eggs

కోడి గుడ్డు:

కేరళలోని అత్యంత ప్రసిద్ది చెందిన నాగదేవతలున్న ఆలయాల్లో ఇది ఒకటి. సుబ్రమణ్యస్వామి రూపంలో నాగపాము ఇక్కడకి వస్తుందని ఇక్కడ ప్రజల నమ్మకం. ఇక్కడ నాగ విగ్రాహాలకి గుడ్లను నైవేద్యంగా పెట్టె సంప్రదాయం ఉంది. దీనిని, ముట్ట ఒప్పికల్ అని అంటారు.

పెరాలస్సరి సుబ్రహ్మణ్య దేవాలయం గురించి విన్నారా

ఇక్కడ నాగదేవలతలకు కోడి గుడ్డును సమర్పిస్తారు. ఇలా ఎక్కువ మంది అనుసరిస్తుంటారు. ఇక్కడ అశోక చెట్టు క్రింద నాగదేవతల గుహ ఉంది. భక్తులు ఈ గుహలోపలి గుడ్డును వదులుతారు. గుడ్డును ఇంటినుండి కూడా తీసుకుని రావచ్చు ఇక్కడ ఉండే దేవాలయంలో నాగదేవతలకు కచేరి నడుస్తుంది,కార్యాలయంలో గుడ్డు అందుబాటుల ఉండిచ గడ్డు తిరిగి పొందవచ్చు.లేదా ఆలయ ప్రంగణంలోనే అందుబుటులో ఉంది. అలాగే ఆలయంలో కూడా గుడ్డును రోజులో ఎప్పుడైనా సమర్పించవచ్చు.

సర్పదోష నివారణకు

సర్పదోష నివారణకు

వీటితో పాటు సర్పదోష నివారణకు బలి ,ఆరాధన, సర్పం ఆరాధనలు వంటి పూజలు ఇక్కడ నిర్వహిస్తారు. ఇవన్నీ కూడ నాగదేవుళ్ళకు ప్రత్యేకమైన పూజలు ద్వారా జరుపబడుచున్నవి. నాగదేవునికి గుడ్డు కాకుండా,
పసుపు అన్నం, పాలు, నీరు వంటివి నివేదిస్తుంటారు. దేవాలయానికి దక్షిణ భాగంలో పశ్చిమ దిక్కున గణేష దేవాలయం ఉంది.

స్థల పురణం ప్రకారం:

స్థల పురణం ప్రకారం:

సీతాదేవిని వెతికే క్రమంలో రామ, లక్ష్మణ మరియు హనుమంతుడు ఇక్కడ వచ్చి బసచేశారాని స్థలపురాణం తెలుపుతున్నది. ఇక్కడ సుబ్రహ్మణ్య దేవుడి విగ్రహాన్ని శ్రీరాముడు ప్రతిస్ఠాపన చేశారని స్థలపురాణం తెలుపుతున్నది. సుబ్రహ్మణ్యని విగ్రహ ప్రతిష్టాపన చేయాలని హనుమంతునికి ఆదేశించారు శ్రీరాముడు. అయితే సమయానికి విగ్రం తీసుకురాలేనదని రాముడు తన చేతి వేళ్ళేనే సుబ్రహ్మణ్యునిగా భావించి ప్రతిష్టించాడని , దాన్ని చూసిన హనుమంతుడు ఆ వేళ్ళను పెకళించడానికి చూశాడు. అయితే ఆ వేలు ఒకటి కదిలినట్లు అనిపించింది. అయితే ఆ వేళు మొదలు నుండి సర్పం పైకి రావడంలాగే అనిపించింది. దాంతో దాన్ని అలాగే ఉంచినట్లు స్థలపురాణం తెలుపుతున్నది.

Misc. trains

ఎలా చేరుకోవాలి:

ఇక్కడకి సమీపంలో కోజికోడ్ విమానాశ్రయం దగ్గరలో ఉంది. విమానాశ్రయం నుండి ఇది సుమారు 110కి.మీ దూరంలో ఉంది.అలాగే కన్నూర్ కి 16కిమీ దూరంలో రైల్వేస్టేషన్ ఉంది. కన్నూర్ నుండి పెరలస్సరికి అనేక బస్ సర్వీస్ లు అందుబాటులో ఉన్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X