Search
  • Follow NativePlanet
Share
» »పెరియార్ వైల్డ్ లైఫ్ స్యాంక్చురి, తేక్కడి !

పెరియార్ వైల్డ్ లైఫ్ స్యాంక్చురి, తేక్కడి !

పెరియార్‌ శాంక్చురీ లోగల సరస్సులో పడవమీద ప్రయాణిస్తూ... దానికి ఇరువైపులా ఉండే అడవిలో సంచరించే జంతువులను, వాటి ప్రవర్తనను అతి దగ్గరగా చూసే అవకాశం కలుగుతుంది.

By Mohammad

పెరియార్ స్యాంక్చురీ ఒక టైగర్ రిజర్వ్ ఫారెస్ట్. ఈ స్యాంక్చురీ చుట్టూ దట్టమైన అడవులు, పచ్ఛియబయళ్ళు, దారిపొడవునా సెలయేర్లు .. అందులోని నీటిని తాగటానికి వచ్చే వన్య జంతువులు, వాటిని చూస్తూ బోటు షికారు ... ఇవన్నీ అనుభవించాలంటే తేక్కడి పెరియార్ స్యాంక్చురీ కి వెళ్ళి తీరాల్సిందే ! పక్షి ప్రేమికులు, జంతు ప్రేమికులు ... మరీ ముఖ్యంగా నేచర్ ను ఆస్వాదించాలనుకొనే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కేరళ రాష్ట్రానికి వెళితే ఈ స్యాంక్చురీ చూసిరావాల్సిందే!.

కేరళ రాష్ట్రంలోని ఇడుక్కి జిల్లాలో, తమిళనాడు బార్డర్ పట్టణమైన కుమిలీ కి నాలుగు కిలోమీటర్ల దూరంలో తేక్కడి అటవీ ప్రాంతం కలదు. ఇది పెరియార్ సరస్సు ఒడ్డున కలదు. ఇది ఒక కృతిమ సరస్సు. అభయారణ్యం ఎల్లప్పుడూ పచ్చగా ఉండే దట్టమైన అడవులు, ఉన్నతమైన పర్వత భూభాగాల మరియు పచ్చని పచ్చిక తో సరిహద్దులుగా ఉంటుంది.

పెరియార్‌ శాంక్చురీ

చిత్రకృప : Anand2202

ఈ పెరియార్‌ శాంక్చురీలోగల సరస్సులో పడవమీద ప్రయాణిస్తూ... దానికి ఇరువైపులా ఉండే అడవిలో సంచరించే జంతువులను, వాటి ప్రవర్తనను అతి దగ్గరగా, సురక్షితంగా చూసే అవకాశం పర్యాటకులకు కలుగుతుంది. తేక్కడి అటవీ ప్రాంతంలోని జంతువుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం 1978వ సంవత్సరంలో పెరియార్‌ శాంక్చురీని ఏర్పాటు చేసింది.ఇందుకోసం అటవీ ప్రాంతంలోని సరస్సుకు ఇరువైపులా 777 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్న అడవినంతటినీ వన్యప్రాణులకు ఆవాసంగా మార్చివేసింది.అధికారికంగా 1982 లో నేషనల్ పార్క్ హోదా కల్పించబడింది మరియు తర్వాత ఒక టైగర్ రిజర్వ్ గా ప్రకటించబడింది.

పెరియార్‌ శాంక్చురీ

చిత్రకృప : Appaiah

అటవీశాఖ అధికారుల లెక్కల ప్రకారం పెరియార్‌ శాంక్చురీలో సుమారుగా 600 ఏనుగులు, 450 జింకలు, 550 ఎలుగుబంట్లు, 180 పొడవైన నీలగిరి కోతులు, 45 పులులు, 15 చిరుత పులులు, పెద్ద సంఖ్యలో నక్కలు, ఎగిరే ఉడతలు, రంగు రంగుల పక్షులు... తదితరాలు పర్యాటకులను అలరిస్తున్నాయి.వృక్షజాలం మరియు జంతుజాలం తో, పెరియార్ వన్యప్రాణుల అభయారణ్యం వన్యప్రాణుల ఔత్సాహికుల మరియు ప్రకృతి ప్రేమికులకు ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది.

పెరియార్‌ శాంక్చురీ

చిత్రకృప : Jean-Pierre Dalbéra

పర్యాటకులు

పెరియార్ స్యాంక్చురీ ని సందర్శించటానికి ప్రతి ఏటా దేశం నలుమూలల నుంచే కాకుండా, విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. ఏటా 20 లక్షల మందికి పైగా స్యాంక్చురీ ని సందర్శిస్తుంటారని అంచనా. ఈ సంరక్షణ కేంద్రంలో వివిధ రకాల పక్షులు, జంతువులను చూడవచ్చు.

సందర్శన సమయం మరియు ప్రవేశ రుసుము :

పెరియార్ స్యాంక్చురీ ని ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు సందర్శించవచ్చు. వారంలో అన్ని రోజులూ వైల్డ్ లైఫ్ తెరిచే ఉంటుంది. ఇండియన్స్ కు 25 రూపాయలు, ఫారెనర్స్ కు 300 రూపాయలు, కెమెరా ఉంటె 100/-, వీడియా కెమెరా ఉంటె 250 రూపాయలు చెల్లించాలి.

పెరియార్ స్యాంక్చురీ సందర్శించటానికి పట్టే మొత్తం సమయం : 2 నుండి 3 గంటలు.

పెరియార్‌ శాంక్చురీ

చిత్రకృప : Neon

వసతి

పెరియార్ స్యాంక్చురీ లో బస చేయటానికి పార్క్ లో హోటళ్ళు ఉన్నాయి. వాటిలో లేక్ ప్యాలెస్ (కేరళ గవర్నమెంట్), అరణ్య నివాస్, పెరియార్ హౌస్ లు ముఖ్యమైనవి. బడ్జెట్ ఎక్కువగా అనిపిస్తే సమీపంలోని తేక్కడి లో బస చేయవచ్చు. ఇక్కడ అందుబాటు ధరలలో గదులు దొరుకుతాయి.

కెమెరా కు పని చెప్పండి!

ఉదయం పూట ఫొటోగ్రఫీకి కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో పర్యటిస్తే బాగుంటుంది.చల్లని వాతావరణం మరియు అద్భుతమైన రిసార్ట్స్ మరియు అడవి మధ్యలో నిర్మించిన కాటేజీ లుఉంటాయి.హనీమూన్ జంటలకు, పిక్నిక్ లకు ఇది ఒక మంచి స్పాట్. ట్రెక్కింగ్ ట్రయల్స్ సర్పిలాకార కొండ ప్రాంతాలు, పొడవుగా సాగుతుంది అధిరోహణ మరియు పర్వతారోహకులు ఒక మంచి అనుభవాన్ని పొందుతారు.ఈ ప్రాంతంలో సరిహద్దులో నడక, వన్యప్రాణుల రైలు, పర్వతారోహణ మరియు వెదురుబొంగులలో తెప్ప నడపడం సహా అనేక వినోద కార్యక్రమాలతో సందర్శకులను ఆకట్టుకొంటుంది.

పెరియార్‌ శాంక్చురీ

చిత్రకృప : Bernard Gagnon

పెరియార్ స్యాంక్చురీ చుట్టుప్రక్కల చూడవలసిన ఇతర పర్యాటక ప్రదేశాలు:

పెరియార్ స్యాంక్చురీ చుట్టుప్రక్కల అబ్రహం స్పైస్ గార్డెన్, మంగళాదేవి ఆలయం, మురిక్కడి, కధతనాధన్ కలారీ సెంటర్ , వందనమేడు, వంది పెరియార్ మొదలుగునవి చూడవచ్చు. ట్రెక్కింగ్, వెదురు తెప్పల ప్రయాణం ఆస్వాదించవచ్చు.

తేక్కడి లో సాహస కార్యక్రమాలు, విశ్రాంతి, ఆనందం అన్నీ ఉన్నాయి. ఇక్కడికి వచ్చే ప్రతి పర్యాటకుడు తప్పక ఆనందంగా గడుపుతాడు. తేక్కడి వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదకరంగా .. పర్యటనకు అనుకూలంగా ఉంటుంది. కేరళ సంప్రదాయ వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయి.

పెరియార్‌ శాంక్చురీ

చిత్రకృప : Anand2202

పెరియార్ స్యాంక్చురీ ఎలా చేరుకోవాలి ?

పెరియార్ స్యాంక్చురీ తేక్కడి పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తేక్కడికి కేరళ రాష్ట్రంలోని కొచ్చి, తిరువనంతపురం, కొట్టాయం నుండి నిరంతరం బస్సులు బయలుదేరుతుంటాయి. తేక్కడికి వెళ్ళటానికి టూర్ ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉంటాయి.

మధురై విమానాశ్రయం (140 KM) తేక్కడి కి సమీపాన ఉన్న విమానాశ్రయం.

రైల్వే స్టేషన్ : తేక్కడి కి సమీపాన 120 KM ల దూరంలో కొట్టాయం రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడ దేశం నలుమూలల నుండి వచ్చే పలు ఎక్స్ ప్రెస్ రైళ్ళు, సూపర్ ఫాస్ట్ రైళ్ళు ఆగుతాయి. కొట్టాయం నుండి బస్సు లేదా టాక్సీ లలో ఎక్కి తేక్కడిలోని స్యాంక్చురీ చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X