Search
  • Follow NativePlanet
Share
» »దక్షిణ భారత దేశంలో మార్చ్ పర్యటన ఎలా !

దక్షిణ భారత దేశంలో మార్చ్ పర్యటన ఎలా !

మార్చ్ నెల వచ్చేసింది. అంటే వింటర్ సీజన్లో వెళ్లి సమ్మర్ వచ్చేసినట్లే. ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. ఇండియాలో పర్యటించేందుకు ఈ నెలలో కొన్ని ప్రదేశాలు వేడి గా వుంటాయి. అయితే, దక్షిణ భారత దేశంలో కొన్ని ప్రదేశాల పర్యటనకు మార్చ్ నెల కూడా అనువుగానే వుంటుంది. మరి ఆ ప్రదేశాలు ఏమిటో పరిశీలిద్దాం.

ఊటీ

ఊటీ

అధిక వేడి, లేదా అధిక చలి కాని ఈ మార్చ్ నెలలో ఊటీ వాతావరణం బాగుంటుంది. ఆహ్లాదకరంగా వుండి ఆనందింప చేస్తుంది. తమిళనాడు లో కల సుందరమైన ఈ నీలగిరి కొండలు దక్షిణ భారత దేశంలో తప్పక చూడదగినవి. ఊటీ సమీపంలో మీరు ఇంకనూ చూడవలసినవి, దోద్దబెట్ట, బొటానికల్ గార్డెన్, ఊటీ లేక్, హిమపాతం వంటివి.

జోగ్ ఫాల్స్

జోగ్ ఫాల్స్

జోగ్ ఫాల్స్ సందర్శనకు ఆగష్టు మంచి సమయం అయినప్పటికీ, ఈ అందమైన జలపాతాలు చూసి ఆనందించేందుకు మార్చ్ నెల కూడా బాగుంటుంది. వేసవి ఇపుడిపుడే వస్తోంది కనుక, ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగానే వుంటుంది.

గోవా

గోవా

మార్చ్ లో గోవా లో కొద్దిపాటి వేడి, తేమ ఉన్నప్పటికీ, ఈ ప్రదేశం కూడా మార్చ్ లో సందర్శనకు అనుకూలమినదే. ఇక్కడ కల వసతులు ఈ నెలలో మంచి చవక ధరలలో కూడా వుంటాయి.

తేక్కడి

తేక్కడి

కేరళ రాష్ట్రంలోని తేక్కడి ప్రదేశం కూడా మార్చ్ నెల సందర్శనకు అనువైనదే. కేరళ లో సమ్మర్ మార్చ్ లో మొదలైనప్పటికి, వాతావరణం అనుకూలంగానే వుంటుంది. మార్చ్ నెలలో వచ్చే చైత్ర త్ర పౌర్ణమి ఇక్కడ కల మంగళ దేవి టెంపుల్ చూసేందుకు బాగుంటుంది.

శ్రీరంగపట్న

శ్రీరంగపట్న

కర్నాటక లోని శ్రీరంగపట్న చూసేందుకు సెప్టెంబర్ నుండి మార్చ్ వరకూ అనుకూలమైన నెలలే. ఈ సమయంలో ఇక్కడి వాతావరణం మీ సెలవులు పూర్తిగా ఆనందింప చేస్తుంది.

అరకు వాలీ

అరకు వాలీ

ఆంద్ర ప్రదేశ్ లోని అరకు వాలీ మార్చ్ నెల తరవాత వేడి గా వుంటుంది. మార్చ్ నెల గడిస్తే, మే చివరి వరకూ ఇక్కడి వాతావరణం సందర్శనకు అనువైనది కాదు. అరకు వాలీ లో మీరు చూసి ఆనందించేందుకు అనేక ఆకర్షణలు కలవు.

మున్నార్

మున్నార్

మున్నార్ వంటి అద్భుత ప్రదేశం చూసేందుకు, నెల తో పని లేదు. అందమైన, మంచి వాతావరణం కల ఈ ప్రదేశ సందర్శనకు ఏ కాలమైనా అనుకూలమే. మున్నార్ లో ఎన్నో పర్యాటక ఆకర్షణలు కలవు.

వయనాడ్

వయనాడ్

కేరళ రాష్ట్రంలోని వయనాడ్ ప్రదేశం వేసవి మొదలైనప్పటికి చూడ దాగిన ప్రదేశమే. సాయంకాలాలు, చల్లని గాలులు, మూసుకు వచ్చే మబ్బులతో వాతావరణం హాయి గా వుంటుంది. వయనాడు లో కూడా అనేక పర్యాటక ఆకర్షణలు కలవు.

మార్చ్ నెల పర్యటన ఎలా ?

మార్చ్ నెల పర్యటన ఎలా ?

మార్చ్ లో కొడైకెనాల్ లో వేసవి మొదలవుతుంది. అయినప్పటికీ సాహస క్రీడలైన ట్రెక్కింగ్, వంటివి చేసేందుకు ఈ సమయం అనుకూలమైనది. కొడైకెనాల్ లో ఎన్నో సైట్ సీయింగ్ ప్రదేశాలు కలవు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X