Search
  • Follow NativePlanet
Share
» »అందమైన జలపాతానికి చిరునామా .. అతిరాప్పిల్లి !

అందమైన జలపాతానికి చిరునామా .. అతిరాప్పిల్లి !

By Mohammad

సినిమాలలో ఇప్పుడు ఈ జలపాతం చాలా ఫెమస్. దాదాపు ప్రతి తెలుగు సినిమాలలో ఈ జలపాతం కనిపిస్తుంది. చుట్టూ అడవులు, అద్భుతమైన జీవ వైవిధ్యం ఇక్కడి విశిష్టత. జంతుజాలం తో విరాజిల్లుతూ ...అత్యంత హరిత ప్రదేశం గా, ఉజ్వలమైన వన్యప్రాణుల తావుగా పేరు గాంచిన ఈ ప్రదేశమే అతిరాప్పిల్లి. కేరళ లోని త్రిస్సూర్ జిల్లా ముకుందాపురం తాలూకా లో ఉంది. ఇది కొచ్చి కి 70 కి.మీ లు, త్రిస్సూర్ కి 60 కి.మీ లు దూరంలో కలదు.

ఇది కూడా చదవండి : సుల్తాన్ బతేరి - కొండల మధ్యలో పరవశం !

అతిరాప్పిల్లి వళచల్ ప్రాంతంగా సుపరిచితమైన అడవులకు ప్రసిద్ధిగాంచాయి. ఈ అడవులు అంతరించే, అరుదైన జాతులకు చెందిన అనేక జంతువులూ, పక్షులకు ఆలవాలమయ్యాయి. ఇక్కడ వైవిధ్యమైన వృక్షజాలం మరియు జంతుజాలం కనిపిస్తుంది. అతిరాప్పిల్లి చుట్టూ దాని చుట్టుపక్కల చూడటానికి అనువైన పర్యాటక ప్రదేశాల వివరాలలోకి వెళ్తే .. !

వళచల్ జలపాతం

వళచల్ జలపాతం

వళచల్ జలపాతం అతిరాపిల్లి నుండి 7 కిలోమీటర్ల దూరంలో కలదు. నగరజీవితంలో ఎప్పుడూ ఉండే పని ఒత్తిడి నుండి కాస్త విరామం తీసుకోవటానికి ఈ జలపాతం దోహదపడుతుంది. వళచల్ ప్రాంతం నదీతీర సంబంధిత వృక్షసంపద తో, వేలాది జీవజాతులతో అలరారుతుంది. వర్షాకాలంలో జలపాతం నిండుగా కనిపిస్తుంది.

చిత్ర కృప : Thangaraj Kumaravel

షోలయార్ డ్యాం

షోలయార్ డ్యాం

షోలయార్ డ్యాం అతిరాప్పిల్లి - వాల్పరై రోడ్డు మార్గంలో కలదు. ఈ డ్యాం ఆసియా ఖండంలోనే రెండవ అతి పెద్ద రాతి డ్యాం. దీని పొడవు 20 కిలోమీటర్ల వరకు ఉంటుంది. చుట్టూ అందమైన తోటలు, మందపాటి అడవులు, ఆకుపచ్చ కొండలు, పచ్చిక భూములు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.

చిత్ర కృప : siraj thyagarajan

ఎడమలయార్ డ్యాం

ఎడమలయార్ డ్యాం

ఈ డ్యామ్ అతిరాప్పిల్లి నుండి 40 కి. మీ. ల దూరంలో కలదు. డ్యాం చుట్టూ ఉన్న అడవులు వివిధ జీవ, వృక్ష, జంతు జాలాలకు ఆశ్రయం కల్పిస్తున్నది. డ్యాం లో బోట్ విహారం మరువలేని అనుభూతి .... !

చిత్ర కృప : Parvathisri

త్రిస్సూర్

త్రిస్సూర్

త్రిస్సూర్ ఒక ఆధ్యాత్మిక పట్టణం. ఇది అతిరాప్పిల్లి నుండి 55 కిలోమీటర్ల దూరములో కలదు. తిరు శివ పెరూర్ (మహా శివుని పేరుతో ఉన్న ప్రాంతం) వడ్డ క్కుం నాథన్ క్షేత్రంలో కొలువైన దేవిని పేరుమీద ఈ ప్రాంతం పాచూర్యం పొందింది.

చిత్ర కృప : Brian Holsclaw

వాల్పరై

వాల్పరై

వాల్పరై హిల్ స్టేషన్ అతిరాప్పిల్లి నుండి 60 కిలోమీటర్ల దూరంలో కలదు. ఇక్కడ టీ మరియు కాఫీ తోటలు సమృద్ధిగా పండిస్తారు. అడవులు, అభయారణ్యాలు మరియు జలపాతాలు ఇక్కడి ప్రధాన ఆకర్షణలు.

చిత్ర కృప : Thangaraj Kumaravel

చర్ప ఫాల్స్

చర్ప ఫాల్స్

అంతగా సందర్శకులు రారు కనుక ఏకాంతన్ని కోరుకునేవారు చర్ప ఫాల్స్ ను సందర్శించవచ్చు. చలకురి నది పైన ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటకులు సందర్శించడం అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. గురు, దిల్ సే, ఇరువర్ వంటి ఎన్నో సినిమాలలో ఈ జలపాతాన్ని చిత్రీకరించారు.

చిత్ర కృప : Amitra Kar

అతిరాప్పిల్లి జలపాతం

అతిరాప్పిల్లి జలపాతం

అతిరాప్పిల్లి జలపాతానికి భారతదేశ నయాగరా గా పేరు. ఈ జలపాతం 24 మీటర్ల ఎత్తు నుండి కింద పడుతూ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. జలపాత దృశ్యాన్ని చాలా చోట్ల నుండి చూడవచ్చు, అద్భుతంగా ఫోటోలు తీసుకోవచ్చు. యాత్రికులు విశ్రమించటానికి టీ షాప్ లు, కాఫీ షాప్ లు, చిన్న చిన్న రెస్టారెంట్లు ఉన్నాయి.

చిత్ర కృప : Dilshad Roshan

ఇతర ఆకర్షణలు

ఇతర ఆకర్షణలు

మీరు ఇక్కడ ట్రెక్కింగ్, పిక్నిక్, షాపింగ్, రివర్ రాఫ్టింగ్, ఇంకా ఇతర వినోద కార్యక్రమాలలో పాలుపంచుకోవచ్చు. దగ్గరలో డ్రీం వరల్డ్ , సిల్వర్ స్టార్మ్ అని రెండు అమ్యూజ్ మెంట్ పార్కులు ఉన్నాయి. అతిరాప్పిల్లి లోని ఈ రెండు పార్కులు ఒక విలక్షణమైన ఉత్సాహభారితమైన వినోదాన్ని అందిస్తాయి.

చిత్ర కృప : Thangaraj Kumaravel

అతిరాప్పిల్లి ఎలా చేరుకోవాలి ?

అతిరాప్పిల్లి ఎలా చేరుకోవాలి ?

వాయు మార్గం : కొచ్చి సమీపాన ఉన్న ఎయిర్ పోర్ట్( 55 కి. మీ)

రైలు మార్గం : త్రిశూర్, కొచ్చి రైల్వే స్టేషన్ లు అతిరాప్పిల్లి కి సమీపాన ఉన్నాయి.

రోడ్డు మార్గం : కొచ్చి, త్రిశూర్, వాల్పరై తదితర సమీప పట్టణాలతో పాటు తిరువేండ్రం, బెంగళూరు, మంగళూరు నుండి కూడా పలు ప్రభుత్వ / ప్రవేట్ బస్సులు అతిరాప్పిల్లి కి వస్తుంటాయి.

చిత్ర కృప : Jan J George

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X