Search
  • Follow NativePlanet
Share
» »నవంబర్ లో ఈ ప్రదేశాలను చూసారా ?

నవంబర్ లో ఈ ప్రదేశాలను చూసారా ?

By Mohammad

నవంబర్ అంటే అందరికీ గుర్తుకొచ్చేది వింటర్. ఈ నెలలోనే వింటర్ మెల్లమెల్లగా మొదలవుతుంది. వింటర్ లో శుభకార్యాలు బాగా జరుగుతాయి ముఖ్యంగా పెళ్ళిళ్ళు. కొత్తగా పెళ్ళైన వారికి ఈ వింటర్ కొత్త కొత్తగా అనిపిస్తుంది. ఎక్కడికైనా హనీమూన్ కు వెళ్ళి హాయిగా ఓ మూడు రాత్రులు గడపాలని అనుకుంటారు. ఇది కొత్తగా పెళ్లైన అందరిలో ఉండే కోరికే!

హనీమూన్ జంటలు ఏకాంత ప్రదేశాలను బాగా ఇష్టపడతారు. హిల్ స్టేషన్ లు, ఆధ్యాత్మిక ప్రదేశాలు .. ఇలా ఏదైనా సరే ఏకాంతం దొరికిందా ? అదే పదివేలు. కొత్తగా వివాహం అయినవారికి అప్పుడున్న కోరికలు మరెప్పుడొస్తాయో ? ఏమో ? కనుక ఈ వింటర్ సీజన్ లో వివాహం జరుపుకునేవారు, వివాహానంతరం ఈ గిలిగింతలుపెట్టే ప్రదేశాలలో హాయిగా, సుఖంగా గడిపేసిరండీ ..!

పుష్కర్

పుష్కర్

పుష్కర్, రాజస్థాన్ లోని అజ్మీర్ కు 14 కి. మీ ల దూరంలో కలదు. ఇక్కడ దేశంలోనే ప్రసిద్ధిచెందిన బ్రహ్మ దేవాలయం ఉన్నది. నవంబర్ మాసంలో ప్రత్యేకంగా నిర్వహించే ఒంటెల ఉత్సవం, పుష్కర్ మేళా లు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఎడారిలో సఫారీ, పుష్కర్ సరస్సు లో స్నానం చేసి బ్రహ్మదేవుని ఆలయాన్ని సందర్శించడం వంటివి ఇతర ఆకర్షణలు.

చిత్రకృప : Sheshagiri Shenoy

కోహిమా

కోహిమా

కోహిమా, నాగాలాండ్ రాష్ట్ర రాజధాని. ఇది ప్రకృతి అందచందాలతో, గిరిజన సంప్రదాయాలతో పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. స్థానిక ఆహారాలు రుచిగా ఉండి, మరువలేనివిగా ఉంటాయి. కోహిమా వార్ సిమెట్రీ, మొనదేలిన కొండ శిఖరాలు, జూ, మ్యూజియం మొదలుగునవి చూడదగ్గవి.

చిత్రకృప : PP Yoonus

వారణాసి

వారణాసి

యూపీ లో ఎన్నికల వేడి కాక పుట్టిస్తుంటే, తూర్పు భాగంలో ఉన్న వారణాసి(కాశీ) మాత్రం పర్యాటకులను ఆనందపరుస్తున్నది. ఇది పవిత్ర గంగా నది ఒడ్డున ఉన్నది. ఉదయం, సాయంత్రం ధూపదీపాలతో గంగమ్మకు హారతి ఇస్తుంటారు. మహా శివరాత్రి, దీపావళి ఘనంగా జరుపుకొనే పండుగలు.

చిత్రకృప : Juan Antonio F. Segal

గోవా

గోవా

గోవా, పడమటి తీరంలో ఉన్న ఒక ప్రసిద్ధ విహార స్థలం. వింటర్ లో కూడా వేడి పుట్టించే సత్తా గోవా కు ఉంది. చవకగా లభించే ఆల్కాహాలు, ఆహ్లాదపరిచే సముద్ర తీరాలు, బీచ్ లు, రెస్టారెంట్ లు, విదేశీ పర్యాటకులు, చర్చిలు ఈ ప్రాంతపు అదనపు ఆకర్షణలు.

చిత్రకృప : Ian D. Keating

మనాలి

మనాలి

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం లోని మనాలి ఒక హిల్ స్టేషన్. సముద్ర మట్టానికి 1950 మీటర్ల ఎత్తులో ఉండే ఈ ప్రదేశం లో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో సోలాంగ్ లోయ ప్రధానమైనది. మొనాస్టరీ లు, జలపాతాలు, మందిరాలు, పర్వతారోహణ, ట్రెక్కింగ్ లకు కూడా శీతల స్వర్గంగా ఉంటుంది.

చిత్రకృప : Biswarup Ganguly

రాజస్థాన్

రాజస్థాన్

రాజస్థాన్ లో నవంబర్ మాసం చాలా విశిష్టత కలది. ఏ నెలలో లేనట్టు పండుగలు, ఉత్సవాలు ఈ నెలలో ఉంటాయి. రాజపుత్రుల కోటలు, రాజమందిరాలు అందంగా ముస్తాబై పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఎడారిలో ఎడారి పండుగలు కూడా నిర్వహిస్తారు.

చిత్రకృప : Tony

కోవలం

కోవలం

కోవలం, కేరళ త్రివేండ్రం కు 16 కి. మీ ల దూరంలో ఉన్న ప్రసిద్ధ కోస్తా తీర విహారకేంద్రం. కొబ్బరి చెట్లు, తాటిచెట్ల వరుసలు, ఆహ్లాదపరిచే వాతావరణం ఆనందపరుస్తాయి. సాయంత్రంవేళ సూర్యాస్తమం తిలకించేందుకు పర్యాటకులు, స్థానికులు తరలివస్తుంటారు.

చిత్రకృప : Tanweer Morshed

భుజ్

భుజ్

భుజ్, గుజరాత్ లోని కచ్ జిల్లాలో కలదు. భుజ్ లో సందర్శించటానికి అనేక చారిత్రక స్థలాలు ఉన్నాయి. మహల్ లు, ప్యాలెస్ లు, బ్లాక్ హిల్స్, మ్యూజియం, కేరా, ఖావ్డా, కచ్ అభయారణ్యం మొదలుగునవి చూడదగ్గవి. భుజ్ ను సందర్శించటానికి వింటర్ ఉత్తమ సమయం.

చిత్రకృప : Rahul Zota

కార్బెట్ నేషనల్ పార్క్

కార్బెట్ నేషనల్ పార్క్

కార్బెట్ నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయాల పర్వత పాదాలు దిగువన ఉన్నది. ఇండియాలో పెరిన్నికగల అటవీ సంపద మరియు 160 పులుల సంరక్షణ కేంద్రంగా ఈ పార్క్ ప్రఖ్యాతి పొందినది. అద్భుతమైన సైట్ సీఇంగ్ లు మరియు సాహసవంతమైన సఫారీలు ఇతర ఆకర్షణలు.

చిత్రకృప : netlancer2006

ఉదైపూర్

ఉదైపూర్

ఈ వింటర్ లో ఉదైపూర్ పర్యటనకు వెళ్లలేకపోతే, మీరు ఒక గొప్ప నగరాన్ని మిస్సవుతున్నట్లే. శృంగారభరిత, ప్రశాంత వాతావరణాలు గల ఉదైపూర్ లో వారసత్వ హోటళ్లు, రాజమందిరాలు కలవు. పిచోలా సరస్సు నుండి జగ మందిర్ వరకు మీ ప్రియమైన వారితో కలిసి బోట్ షికారు చేయటం మరిచిపోవొద్దు ..!!

చిత్రకృప : Benoy

సోనేపూర్

సోనేపూర్

ఇది ఒడిశా లో కలదు. నవంబర్ లో సందర్శించవలసిన ప్రదేశాలలో ఇది ఒకటి. ప్రతిఏటా వింటర్ ప్రారంభంలో నిర్వహించే 'పశువుల ఉత్సవం' ను చూడటానికి దేశం నలుమూలల నుండి పర్యాటకులు వస్తుంటారు.

చిత్రకృప : Swagat K

గారో హిల్స్

గారో హిల్స్

గారో హిల్స్ మేఘాలయ ప్రాంతాన్ని రక్షిస్తున్న కొండలు. ప్రపంచంలో అతి తేమగా ఉండే ప్రదేశాల్లో ఈ ప్రాంతం ఒకటి. ఈ కొండలు గారో - ఖాసి రేంజ్ లో ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా మైదాన ప్రాంతాలతో, కొండలతో నిండి ఉంటుంది.

చిత్రకృప : Rikynti Marwein

ముస్సోరి

ముస్సోరి

ఇది ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ జిల్లాలో కలదు. అన్ని కాలాలలోనూ ఈ ప్రదేశం ఆహ్లాదకరంగా ఉంటుంది అయినప్పటికీ నవంబర్ నెల ఉత్తమమైనది. సచిన్ టెండూల్కర్ కూడా తన కుటుంబంతో ఇక్కడికి తరచూ వస్తుంటాడు.సహస క్రీడలు, శివాలిక్ పర్వత శ్రేణులు, రోప్ వే ప్రయాణం మొదలుగునవి ఆస్వాదించవచ్చు.

చిత్రకృప : Michael Scalet

నైనిటాల్

నైనిటాల్

నైనిటాల్ దాని అందాలకు, ప్రశాంత వాతావరణానికి గానూ పర్యాటకులకు స్వర్గంగా ఉంటుంది. సరస్సులో బోట్ షికారు హనీమూన్ జంటలకు ఆనందాన్ని కలిగిస్తుంది. నైనాదేవి టెంపుల్, కిల్ బరీ, రోడోడెండ్రాన్ అడవులు ఈ ప్రదేశాన్ని చక్కటి విహార స్థలంగా మార్చివేశాయి.

చిత్రకృప : Krishan09

కురై పాస్ ట్రెక్

కురై పాస్ ట్రెక్

హెరిటేజ్ కట్టడాలు, దేవాలయాలు, వైల్డ్ లైఫ్ వంటివి బోర్ కొడుతున్నాయా ? అయితే కురై పాస్ ట్రెక్ ను ఆస్వాదించండి. గర్వాల్ హిమాలయ ప్రాంతంలో ఉన్న ఈ పాస్ చేరుకోవటానికి దేశ, విదేశీ ఔత్సాహికులు ఉత్సాహం కనబరుస్తుంటారు. పచ్చని లోయలు, చిన్న చిన్న గ్రామాలు, మంచుచే కప్పబడిన అడవుల గుండా ట్రెక్ నడుస్తుంది.

చిత్రకృప : Andrew Kudrin

తిరుచిరాపల్లి

తిరుచిరాపల్లి

'తిరుచిరాపల్లి' పట్టణాన్ని తమిళనాడు గుండెకాయ గా అభివర్ణిస్తారు. తమిళనాడులో జనావాసాలు ఏర్పడ్డ అతి ప్రాచీన నగరాలలో ఇది ఒకటి. ట్రిచీ లో సాంస్కృతిక, చారిత్రక, ధార్మిక నిర్మాణాలు అనేకం ఉన్నాయి. రాక్ ఫోర్ట్ టెంపుల్, రంగనాథ స్వామి ఆలయం మరియు ఇతర దేవాలయాలు, ప్రదేశాలు చూడదగ్గవి. శీతాకాలం చల్లగా ఉన్నప్పటికీ, ఆహ్లాదకరంగా ఉంటుంది.

చిత్రకృప : Emmanuel DYAN

సుందర్బన్స్

సుందర్బన్స్

ఆవాసం. వింటర్ లో కొత్తగా పెళ్ళైన జంటలకి సుందర్బన్ అడవులు చక్కటి విహార కేంద్రం. ఇక్కడ పడవలను అద్దెకు తీసుకొని ఇరుకైన ఉపనదులు, సెలయెర్ల గుండా ప్రయాణించడం ఒక మాధురానుభూతి.

చిత్రకృప : Pratyaya Ghoshal Das

అమృత్ సర్

అమృత్ సర్

అమృత్‌సర్ , భారత వాయువ్య భాగం పంజాబ్ రాష్ట్రంలో ఉన్న ప్రముఖ సిక్కుల మత కేంద్రం. అమృత్‌సర్ లో అనేక గురుద్వారాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది గోల్డెన్ టెంపుల్. ఈ ప్రదేశం కూడా నవంబర్‌లో సందర్శించవలసిన ప్రదేశాలలో చోటు సంపాదించినది.

చిత్రకృప : Oleg Yunakov

ఓర్చా

ఓర్చా

ఓర్చా, మధ్య ప్రదేశ్ లోని చారిత్రక ప్రదేశం. ఇక్కడ గల నిర్మాణాలు ఈ ప్రదేశాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మార్చేశాయి. తాజమహల్, రాణిమహల్, సుందర మహల్, లక్ష్మి నారాయణ ఆలయం తప్పక చూడవలసినవి.

చిత్రకృప : Arian Zwegers

ఢిల్లీ

ఢిల్లీ

ఢిల్లీ దేశ రాజధాని. ఇది ఎన్నో రకాల అద్భుత ప్రదేశాలను కలిగి ఉండి ప్రతి సందర్శకుడిని మంత్ర ముగ్ధులను చేస్తుంది. విభిన్న మతాల పండుగలు, సంస్కృతి, ఉత్సవాలు ఇక్కడ ఏటా జరుగుతుంటాయి. గతించిన చరిత్రకు .. నేటి అధునాతన చరిత్రకు ఢిల్లీ ఒక చక్కటి ఉదాహరణ.

చిత్రకృప : Prateek Rungta

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more