» »వైజాగ్ నుండి సింహాచలం వెళ్ళే మార్గమధ్యంలో చూడవలసిన ప్రదేశాలు

వైజాగ్ నుండి సింహాచలం వెళ్ళే మార్గమధ్యంలో చూడవలసిన ప్రదేశాలు

Posted By: Venkata Karunasri Nalluru

విశాఖపట్నం, సింహాచలం మధ్య దూరం :

విశాఖపట్నం, సింహాచలం మధ్య మొత్తం దూరం 210 కి.మీ వుంటుంది.

విశాఖపట్నం నుండి సింహాచలంనకు ప్రయాణ సమయం :

విశాఖపట్నం నుండి సింహాచలంకు 4 గం.లలో చేరుకోగలం. అయితే ప్రయాణ సమయం మీ బస్సు వేగం, రైలు వేగం లేదా మీరు ఉపయోగించే వాహనం మీద ఆధారపడి మారుతుంది.

విశాఖపట్నం నుండి సింహాచలంకు బస్సు ద్వారా ప్రయాణం : బస్సు గంటకు 60 కి.మీ వేగంతో వెళ్తే విశాఖపట్నం నుండి సింహాచలం బస్సు సమయం దాదాపు 3.5 గం.లలో చేరుకోవచ్చు.

విశాఖపట్నం నుండి సింహాచలంనకు రోడ్ మ్యాప్

విశాఖపట్నం నుండి సింహాచలంనకు రోడ్ మ్యాప్

విశాఖపట్నం నుండి సింహాచలంనకు వెళ్ళుటకు రోడ్డు మార్గం:

విశాఖపట్నం - గోపాలపట్నం రూరల్ - విశాఖపట్నం విమానాశ్రయం - సింహాచలం - సింహాచలం దేవస్థానం

కారులో 45 ని.లలో చేరవచ్చును.

PC : google maps

సింహాచలం సందర్శించడానికి మంచి సీజన్

సింహాచలం సందర్శించడానికి మంచి సీజన్

సింహాచలం సందర్శించడానికి జనవరి మరియు ఫిబ్రవరి నెలలు లేదా అక్టోబర్, నవంబర్ మరియు డిసెంబర్ నెలలు ఉత్తమం.

మార్గమధ్యంలో అల్పాహారం చేయగలిగే ఉత్తమ స్థలాలు :

సేలిబ్రేషన్స్ : ఇది చైనీస్ కుషన్, ఇక్కడ ఇద్దరికీ రు. 450 వుంది. ఉదయం 9:00 గం. నుండి రాత్రి 10:30 గం.ల వరకు తెరిచి వుంటుంది.

భార్గవ్స్ ఫుడ్ రెస్టారెంట్ : ఇది నార్త్ ఇండియా, చైనీస్ కుషన్. ఇక్కడ ఇద్దరికీ రు. 350 వుంది. మధ్యాహ్నం 12:00 నుండి రాత్రి 10:30 గం.ల వరకు తెరిచి వుంటుంది.

ఈ రకంగా మార్గమధ్యంలో అనేక హోటల్స్ వున్నాయి.

PC:Adityamadhav83

వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం

వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం

విశాఖపట్నం నుండి సింహాచలం 16 కి.మీ.ల దూరంలో వుంది. ఇది పదకొండవ శతాబ్దపు వరాహ నరసింహ స్వామి యొక్క పాత ఆలయం. దీనిని "సింహగిరి" లేదా "సింహాచలం" అని పిలుస్తారు. విశాఖపట్టణానికి ఉత్తర దిశలో వుంది. ఇది అత్యంత ప్రఖ్యాతి గాంచిన ఆలయం మరియు ఇక్కడ అనేక శిల్పకళా నైపుణ్యం కల్గిన అనేక విగ్రహాలు కూడా కలవు. ఇక్కడ "శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి" కొలువై వున్నారు. సింహాచలం ఆలయం తిరుపతి తర్వాత ఆదాయ సంపాదనలో రెండో సంపన్న దేవాలయంగా చెప్పవచ్చును. ఇక్కడ విష్ణువు భక్తులకు అత్యంత ప్రజాదరణ ఉంది. దేవాలయ నిర్మాణంలో ఒరిస్సా మరియు ద్రావిడ శైలి కలయిక కనిపిస్తుంది.

PC: Krishnachaitu

ఎలా చేరుకోవాలి ?

ఎలా చేరుకోవాలి ?

విమాన మార్గం : సమీప విమానాశ్రయం విశాఖపట్నంలో కలదు. ఇక్కడ నుండి ప్రధాన నగరాలకు విమానాలు అనుసంధానించబడి ఉంది.

రైలు మార్గం : సమీప రైల్వేస్టేషన్ విశాఖపట్నం దగ్గర వున్నది.

రోడ్డు మార్గం : ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్, విజయవాడ, రాజమండ్రి, తిరుపతి మొదలైన అన్ని ముఖ్యమైన పట్టణాలు / నగరాలకు బస్సులు నిర్వహిస్తూ వుంది. ప్రతి 10 లేదా 15 ని.లకు ఆలయం కొండ పాదాల నుండి బస్సు సౌకర్యం ఉంది.

లక్ష్మి దేవి ఆలయం :

లక్ష్మి దేవి ఆలయం సింహాచలం పొలిమేరలో ఉంది. ఇక్కడ దేవత లక్ష్మి దేవి మరియు విష్ణుమూర్తి కొలువై వున్నారు. ఆలయం చుట్టూ లోయలు మరియు పర్వత శిఖరాలు కలిగి వున్నాయి. ప్రదక్షిణలు లేదా ఆలయ ప్రాంగణంలో విష్ణుమూర్తితో సహా అనేక చిన్న విగ్రహాలు కూడా వున్నాయి. ఇది అనేక శతాబ్దాల క్రితం ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన దేవాలయం. ఆలయంలో వివిధ విగ్రహాలు, చిత్రాలు మరియు చిత్రలేఖనాలతో అలంకరించబడి వుంటుంది.

సింహవల్లి తాయారు ఆలయం :

సింహవల్లి తాయారు ఆలయం వరాహ లక్ష్మీ నరసింహ ఆలయం యొక్క ఆలయ ప్రాంగణంలో ఉంది. ఈ విగ్రహం సముద్ర మట్టానికి సుమారుగా 800 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ సింహవల్లి తాయారు కొలువై వున్నది. ఈ దేవాలయంలో వైష్ణవ పండగల సమయంలో ఆచారాలు, ధ్యానం మరియు ప్రత్యేక ప్రతిపాదనలను నిర్వహిస్తారు. ఈ ఆలయంలో దక్షిణ భారత నిర్మాణ శైలికి ప్రాతినిధ్యం వహిస్తారు.

PC : Adityamadhav83

బొజ్జనకొండ బుద్ధుని స్థూపం

బొజ్జనకొండ బుద్ధుని స్థూపం

బొజ్జనకొండ అనేది ఒక బౌద్ధ రాతి గుహ. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో గల అనకాపల్లి నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న శంకరం అనే గ్రామం సమీపంలో ఉన్నాయి. ఈ కొండ 4 నుండి 9 వ శతాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ లో గల గొప్ప బౌద్ధ స్థావరాలలో ఒకటి. ఇక్కడ అనేక ఏకశిలా స్థూపాలు, రాతి గుహలు మరియు మఠాలు వున్నాయి.

బొజ్జనకొండ: ఇది తూర్పువైపున వున్న కొండ. ఇక్కడ ఒక మహా స్థూపం వుంది. స్తూపాన్ని ఇటుకలతో నిర్మించినట్లు కనబడుతుంది. ఇక్కడ ఏకశిలా స్థూపాలు ఒక పెద్ద సమూహంతో నిండి ఉంది. ఈ స్థూపం చుట్టూ రాక్ కట్ మరియు ఇటుక స్థూపాలు గల చిన్న చైత్యాలు సమూహాలు వున్నాయి. పురవాస్తు మూలాలు ప్రకారం కొండ పాదాల వద్ద దేవత హరితి యొక్క చిత్రం కనబడుతుంది.

ఈ కొండ మీద కొన్ని శిల్ప ప్యానెల్లు కలిగిన ఆరు రాతి గుహలు ఉన్నాయి. ఒక ముఖ్య గుహలో పదహారు స్తంభాలు దాని మధ్యలో ఒక ఏకశిలా స్థూపం వుంది. పదహారు స్తంభాలు కలిగిన ఈ గుహలో చెక్కబడిన కూర్చున్న బుద్ధుడు మరియు పరిచారకులను చూడవచ్చును.

PC: Jvsnkk

రిషికొండ బీచ్

రిషికొండ బీచ్

రిషికొండ బీచ్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల బంగాళాఖాతం తీరంలో ఉన్న వైజాగ్ నగరంలో ఉంది. బీచ్ రాష్ట్ర పర్యాటక బోర్డు ద్వారా నిర్వహించబడుతుంది. రిషికొండ బీచ్ బంగారు ఇసుకతో మరియు చక్కనైన తరంగాలతో నిండి వుంటుంది. ఇక్కడ నీటిలో విస్తారమైన సాగు కలిగి వుంది. ఈ రిషికొండ బీచ్ ఈత, నీరు స్కీయింగ్ మరియు విండ్ సర్ఫింగ్ లాంటి వివిధ వాటర్ స్పోర్ట్స్ కు అనువైన బీచ్.
బీచ్ లో ఆకుపచ్చని మొక్కలు మరియు చెట్లతో అనేక మంది ప్రకృతి ప్రేమికులను మరియు సాహస ప్రేమికులను ఆకర్షిస్తుంది.

PC : Adityamadhav83