Search
  • Follow NativePlanet
Share
» »రాజస్థాన్ యొక్క రాచరిక పట్టణం .... కోట !!

రాజస్థాన్ యొక్క రాచరిక పట్టణం .... కోట !!

ప్రతి ప్రయాణీకుడు అన్వేషించడానికి రాజస్థాన్ రాష్ట్రంలో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చెప్పుకోదగ్గ ప్రాంతాలలో కోట ముఖ్యమైనది. ఈ కోట రాష్ట్రంలోనే మూడవ అతి పెద్ద జిల్లాగా గుర్తింపు పొందినది. ఈ ప్రాంతం చంబల్ నది సమీపాన విస్తరించినది మరియు అనేక స్మారక కట్టడాలకు నెలవు కూడానూ!!. ఈ స్థలంలో ఎన్నో సుందరమైన తోటలు అంతేకాక రాజభవనాలకు ప్రసిద్ది చెందినది.

ఈ ప్రాంతం ఎడారి భాగంలో ఉన్నప్పటికీ నీటి వసతుల విషయంలో ఎటువంటి ఢోకా లేదు. ఇది ప్రస్తుతం ఒక 'ఎడ్యుకేషన్ సిటీ' గా మారిపోయింది. ఇక్కడ భారతదేశంలో గల ఎన్నో ప్రతిష్టాత్మకమైన విద్యాలయాలు నెలకొల్పబడ్డాయి అంతేకాదు గుజరాత్, ఢిల్లీ ల మధ్యన జరిగే వాణిజ్యానికి ఈ ప్రాంతం ఒక ప్రధాన కేంద్రం. ఈ ప్రాంతంలో కొన్ని చెప్పుకోదగిన పర్యాటక ప్రదేశాలు...

జగ్ మందిర్ ప్యాలెస్

రాజస్థాన్ రాష్ట్రాంలోకెల్ల అత్యంత ప్రజాదరణ పొందిన కోటలలో జగ్ మందిర్ ప్యాలెస్ ఒకటి. ఈ ప్యాలెస్ కారెక్ట్ గా చెప్పాలంటే కీషోర్ సాగర్ మధ్యలో ఉంది. ఈ కోట గనక మనం చూడినట్లయితే ఒక ద్వీపంలో ఉన్నట్టు ఉంటుంది. ఈ కోట ఎరుపు ఇసక రాయితో నిర్మించిన ఒక భారీ కట్టడం. ఈ కట్టడం చాలా ప్రసిద్ది చెందినది. చుట్టూ ఉన్న నీలం రంగు నీళ్ళు దీనికి అదనపు ఆకర్షణ. ఈ ప్యాలెస్ రాత్రిపూట చూసినట్లయితే జిగెల్ ... జిగెల్ మంటూ కళ్ళకు కనులవిందుగా ఉంటుంది. ఈ కోటను చూస్తూ ఉన్నంతసేపు ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది.

కీషోర్ సాగర్

కోట పట్టణంలో చూడవలసిన ప్రదేశాలలో మానవ నిర్మిత సరస్సు కీషోర్ సాగర్ తప్పక చూడవలసినదే. ఇక్కడ ఒక్కటే జగ్ మందిర్ ఉంది అదికూడా సరస్సు మధ్యలో ద్వీపంలో కలదు. ఇది ప్రయాణీకులకు వినోదాన్ని కూడా అందిస్తుంది. ఇక్కడ ఉన్న కోట ఎంతో సుందరమైనది ఈ కృతిమ సరస్సులో గనక ఒకసారి బోట్ లో షికారుకెళితే చాలా థ్రిల్లింగా ఉంటుంది మరి!!. ఇది పర్యాటకులకే కాక చుట్టూ పక్కల ఉన్న అక్కడి వాసులకు ఆకర్షిస్తుంది.

రాజస్థాన్ యొక్క రాచరిక పట్టణం .... కోట !!

మానవ నిర్మిత సరస్సు ముఖ చిత్రం

Photo Courtesy: Arian Zwegers

సిటీ ఫోర్ట్ ప్యాలెస్

కోట లోని చంబల్ నది తూర్పు అంచున వుండే సిటీ ఫోర్ట్ ప్యాలెస్ రాజస్థాన్ లోని అతి పెద్ద కోటల సముదాయానికి ప్రసిద్ది. కోట నగరం లో ఇది ప్రధాన పర్యాటక ఆకర్షణ. ధృడమైన ఈ కోట గోడలు, గోపురాలతో, రైలింగ్ తో అలంకరించిన కోట బురుజు, ఆ నాటి రాజుల వైభవాన్ని ప్రదర్శిస్తాయి. 17వ శతాబ్దం లో నిర్మించిన హాథీ పోల్ లేదా ఏనుగు ద్వారం ఈ కోట కు ప్రధాన ప్రవేశ ద్వారం.

గరడియా మహాదేవ ఆలయం

చంబల్ నది వద్ద గల గరడియా ఆలయం కోట లోని ఒక పేరొందిన దేవాలయం. ఈ ప్రాంతం నుండి కనబడే చంబల్ నదీ ముఖద్వారం, మైదానాలు మంత్రముగ్ధుల్ని చేస్తాయి. ఇది ఈ ప్రాంతపు ప్రసిద్ధ విహార కేంద్రాలలో ఒకటిగా పరిగణింపబడుతున్నది. ప్రశాంత, నిర్మల ప్రకృతి లో సేదతీరాలనుకొనే పర్యాటకులు ఈ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో వస్తారు.

కోట మ్యూజియం

కిషోర్ సాగర్ సరస్సుకు దగ్గరగా వున్న బిర్జ్ విలాస్ ప్యాలెస్ లో వుండే ప్రభుత్వ మ్యూజియం కోట లోని ప్రసిద్ధ యాత్రిక ఆకర్షణ. ఈ మ్యూజియంలో పాత నాణేలు, పురాతన వ్రాత ప్రతులు, హదోటి శిల్పాల అరుదైన సంగ్రహం వుంది. ఇక్కడ ప్రదర్శించిన శిల్పాలన్నిటిలోకి బరోలి నుంచి తెచ్చిన శిల్పం ఆశ్చర్యం గొల్పుతుంది. అది చాలా అందంగా చెక్కిన కళాకృతి. ఇక్కడ ప్రదర్శించిన కొన్ని శిల్పాలు దాదాపు 4వ శతాబ్దం నాటివి. ఇవే కాక ఇక్కడ అందమైన దుస్తులు, చేతిపని తో చేసిన వస్తువులు కూడా చూడవచ్చు. ఇది శుక్రవారం నాడు, ప్రభుత్వ సెలవు దినాల్లోను మూసి వుంటుంది. పని దినాల్లో రెండు రూపాయల నామమాత్రపు రుసుము చెల్లించి ఉదయం 10నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఈ మ్యూజియంను చూడవచ్చు. మ్యూజియం ఆవరణలో ఫోటోలు తీయడానికి అనుమతి లేదు.

రాజస్థాన్ యొక్క రాచరిక పట్టణం .... కోట !!

మ్యూజియం ముఖ చిత్రం

Photo Courtesy: native planet

కోటకు ఎలా చేరుకోవాలి?

యాత్రికులు రైలు, రోడ్డు, వాయు మార్గాల ద్వారా కోట చేరుకోవచ్చు.

రోడ్డు మార్గం ద్వారా

కోట మంచి రోడ్డు మార్గాన్ని కలిగి ఉంది. ఈ ప్రాంతం గుండా విశాలమైన రోడ్డు వ్యవస్థ ఉంది. కోట నుంచి చిత్తోర్ ఘర్, జైపూర్, అజ్మీర్, జోధ్పూర్, బికానేర్, ఉదయపూర్ లాంటి నగరాలకు నిత్యం కోట నుంచి బస్సులు తిరుగుతాయి.

రైలు మార్గం ద్వారా

కోటలో రైల్వే స్టేషన్ ఉంది. ఇది ముంబై - ఢిల్లీ రైలు మార్గంలో ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి.

విమాన మార్గం ద్వారా

కోట కి దగ్గరలో ఉన్న విమానాశ్రయం జైపూర్. ఇది సుమారుగా 248 కి. మీ .దూరంలో ఉంది.

రాజస్థాన్ యొక్క రాచరిక పట్టణం .... కోట !!

కోట పట్టణం రైల్వే స్టేషన్

Photo Courtesy: Balajijagadesh

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X