• Follow NativePlanet
Share
» »చుట్టి రండి.. కొత్త ప్రదేశాలను!!

చుట్టి రండి.. కొత్త ప్రదేశాలను!!

ఉత్తర భారతంలో చల్లని ప్రదేశాలు, హిల్ స్టేషన్ లు, ఆహ్లాదకరమైన ప్రకృతి ప్రదేశాలు ఉన్నాయి. జమ్మూమరియు కాశ్మీర్ రాష్ట్రం అనేక ప్రకృతి అందాలకు నెలవు. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి అంతేకాదు హిమాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రం గురించి చాలామందికి తెలీసే ఉంటుంది. హిల్ స్టేషన్ లు ఇక్కడ ప్రధాన ఆకర్షణ. అలాగే పక్కనున్న పంజాబ్, హర్యానా మరియు ఉత్తరాఖండ్ లు ఇతర ఆకర్షణలు.

సెలవులకి ఎక్కడికి వెళ్ళాలని తల పట్టుకున్నారా? మీకు విశ్రాంతి,వినోదం కావాలంటే ఉత్తర భారత దేశ పర్యటనలు మేలు.ఎందుకంటే ఉత్తర భారత దేశం చాలావరకు హిమాలయ పర్వతాలతో కప్పబడి ఉంటుంది.ఇక రానురాను వేసవి కాలం వస్తుంది కనక దక్షిణ భారత దేశం పర్యటన కంటే కూడా ఉత్తరభారత పర్యటనలు కొంతవరకు స్వాంతన లభిస్తుంది.

చుట్టి రండి.. కొత్త ప్రదేశాలను!!

చుట్టి రండి.. కొత్త ప్రదేశాలను!!

చండీఘర్

చండీఘర్ లో చూడవలసిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి.ఈ నగరాన్ని లే కార్బ్యూసియర్ అనే ఫ్రెంచ్ వాస్తు శిల్పి నిర్మించాడు.ఈ నగరాన్ని చూసేందుకు పర్యాటకులు చాలా మంది దేశం నలుమూలల నుంచి వస్తుంటారు.భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, ఆధునిక పద్ధతులలో ఈ నగర నిర్మాణం జరిగింది.చండీఘర్‌లోని అద్భుతమైన ఆధునిక కట్టడాలు మరియు విశాలమైన స్థలాలు ఇక్కడ కల ప్రధాన ఆకర్షణలు.ఆధునిక కట్టడాలతో నిర్మించిన నగరం కనుకనే కొద్దిపాటి ఆకర్షణలు కలిగి ఉంది.శివాళిక్ పర్వత శ్రేణులకు చండీఘర్ దూరంలో నిలుస్తుంది.ఇక్కడ చూసేది కొద్దిపాటి ప్రదేశాలు అయినప్పటికీ పర్యాటకులు మంచి అనుభూతి పొందుతారు.

Photo Courtesy: Rod Waddington

చుట్టి రండి.. కొత్త ప్రదేశాలను!!

చుట్టి రండి.. కొత్త ప్రదేశాలను!!

కర్నల్

కర్నల్! ఈ ప్రాంతం గురించి చాలా తక్కువ మందికి తెలుసు.కర్నల్ హర్యానా రాష్ట్రం లో ఉన్నది.ఈ ప్రాంతం తనకున్న కొద్దిపాటి ఆకర్షణలతో పర్యాటకులను తనవైపు తిప్పుకుంటుంది.మహాభారతంలో ఉన్న కర్ణుని పేరు మీద ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. ఇక్కడున్న స్థానికులు కర్ణుడు ఇక్కడున్న సరస్సులో స్నానం చేశారని చెబుతుంటారు.కర్నల్ ప్రాంతం వ్యవసాయ గ్రామంగా,కొద్దిపాటి పరిశ్రమలతో మరియు పర్యాటక ప్రదేశాలతో ఆకర్షిస్తున్నది.

Photo Courtesy: Parneet Singh

చుట్టి రండి.. కొత్త ప్రదేశాలను!!

చుట్టి రండి.. కొత్త ప్రదేశాలను!!

భుంటర్

భుంటర్ హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న చిన్న పట్టణం మరియు కుల్లు లోయకు ముఖద్వారం అనికూడా అంటారు.ఇది దాని ధార్మిక ప్రదేశాలకు, చుట్టూ ఉన్న దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది.ఇక్కడకు వస్తున్న పర్యాటకులకు దేవాలయాలు, వాటి కట్టడాలు, నిర్మాణ శైలిలు మరియు ప్రకృతి అందాలు ఆశ్చర్యపరుస్తున్నాయి.

Photo Courtesy: RameshSharma1

చుట్టి రండి.. కొత్త ప్రదేశాలను!!

చుట్టి రండి.. కొత్త ప్రదేశాలను!!

డల్హౌసీ

జీవితపు ఒత్తిడి నుండి తప్పించు కోవాలని చూస్తున్నారా? ప్రశాంత వాతావరణం ఎక్కడ ఉందా? అని వెతుకుతున్నారా? అయితే, అద్భుత అందాల హిల్ స్టేషన్ డల్హౌసీ గురించి ఒక్క క్షణం ఆలోచించండి.డల్హౌసీ చంబల్ జిల్లాలో ఎంతో పురాతన హిల్ స్టేషన్ డల్హౌసీ లో నైట్ లైఫ్ అనేది వుండదు.సాయంత్రం ఏడు గంటలు అయిందంటే చాలు అంతా సద్దు మనుగుతుంది.అంతేకాదు, డల్హౌసీ పట్టణం షాపింగ్ ప్రియులకు ఒక స్వర్గం కూడా కాదు. ఇక్కడ కొనుగోలు చేసేందుకు మాల్సు, మల్టీప్లెక్సు వంటివి అస్సలు ఉండవు.మరి డల్హౌసీ లో ఏమి చూడాలి? ఏమి చేయాలి? ప్రకృతి ఒడిలో సేద తీరాలి.విశ్రాంతి పొందాలి.ప్రతి ఒక్క క్షణం ప్రకృతికి దగ్గరగా గడపాలి.ఆధునిక జీవిత ఒత్తిడులనుండి దూరంగా విశ్రాంతిగా గడిపేందుకు డల్హౌసీ ఒక ఉత్తమ పర్యాటక ప్రదేశం.

Photo Courtesy: Srinivasan G

చుట్టి రండి.. కొత్త ప్రదేశాలను!!

చుట్టి రండి.. కొత్త ప్రదేశాలను!!

గుల్మర్గు

ఉత్తర భారత దేశంలో మరో పర్యాటక ప్రదేశం గుల్మార్గు.గుల్మార్గు పట్టణం జమ్మూ & కాశ్మీర్ లోని బారాముల్ల జిల్లాలో సముద్ర మట్టానికి 2730 అడుగుల ఎత్తున కలదు.ఈ పట్టణాన్ని బ్రిటిష్ వారు 1927 లో కనిపెట్టారు.గుల్మార్గు అనే పదానికి అర్ధం చెప్పాలంటే 'పూవుల మార్గం ' అని చెప్పాలి.ప్రపంచంలో ఎత్తైన శిఖరాలలో ఒకటైన నంగ ప్రభథ్ పర్వతాన్ని ఇక్కడ నుంచి చూసి ఆనందం పొందవచ్చు.పర్యాటకులు ప్రశాంతత కొరకై, శబ్ద కాలుష్యాల నుండి దూరంగా ఉండటానికై ఈ ప్రదేశాన్ని ఎంచుకుంటారు.

Photo Courtesy: Abhishek Shirali

చుట్టి రండి.. కొత్త ప్రదేశాలను!!

చుట్టి రండి.. కొత్త ప్రదేశాలను!!

పహాల్గాం

అందరికి సుపరిచితమైన పహాల్గాం జమ్మూ&కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లాలో గల ఒక ప్రసిద్ద పర్యాటక ప్రదేశం మరియు సముద్రమట్టానికి 2740 మీ.ఎత్తులో ఉన్నది కూడా. ఇక్కడ దట్టమైన అడవులు, అందమైన సరస్సులు, స్వచ్ఛమైన ప్రవాహాలు, పువ్వులు మరియు పచ్చిక బయళ్లు సమృద్ధిగా ఉన్నాయి.మ్యాటన్, తర్సర్ సరస్సు, షికరాఘ్, సూర్య దేవాలయం, అష్ముఖం, లిద్దెర్వాత్, మామలేశ్వర్ దేవాలయంలు ప్రముఖ పర్యాటక ప్రదేశాలుగా ఉన్నాయి.ఇక్కడ బాలీవుడ్ సినిమా షూటింగులు జరుగుతుంటాయి.

Photo Courtesy: Native Planet

చుట్టి రండి.. కొత్త ప్రదేశాలను!!

చుట్టి రండి.. కొత్త ప్రదేశాలను!!

జలంధర్

పంజాబ్ రాష్ట్రం లో కల జలంధర్ ఒక పురాతన నగరం.ఈ నగరం పేరు జలంధరుడు అనే రాక్షసుడి పేరుపై పెట్టబడింది.జలన్ధరుడి పేరు పురాణాల లోను, మహాభారతం లోను కూడా పేర్కొనబడింది.హిందీ భాషలో జలంధర అంటే నీటి అడుగున వున్న ప్రాంతం అని అర్ధం చెపుతారు.స్థానికుల మేరకు ఈ ప్రాంతం రెండు నదులు (బియాస్ మరియు సట్లేజ్) మధ్యగల ప్రదేశంగా చెపుతారు.పట్టణానికి గల సంస్కృతి సాంప్రదాయాలు టూరిస్టు లను అధిక సంఖ్యలో ఆకర్షిస్తూ, జలంధర్ ను ఒక ఆకర్షణీయ పర్యాటక ప్రదేశం గా తీర్చిదిద్దాయి. ఈ సిటీలో అనేక కోటలు దేవాలయాలు, మ్యూజియంలు కలవు.వాటిలో శివ మందిర్, తులసి మందిర్, దేవి తాలాబ్ మందిర్, సెయింట్ మేరీ కేథడ్రాల్, పుష్ప గుజ్రాల్ సైన్సు సిటీ, భగత్ సింగ్ మ్యూజియం మరియు వండర్ ల్యాండ్ తీం పార్కు ప్రధానమైనవి.

Photo Courtesy: Gopal1035

చుట్టి రండి.. కొత్త ప్రదేశాలను!!

చుట్టి రండి.. కొత్త ప్రదేశాలను!!

కపుర్తల

కపుర్తలని జైసల్మీర్ రాజపుత్రుల పాలకుల యొక్క వారసుడు రాణా కపూర్"సిటీ ఆఫ్ ప్యాలెస్ మరియు గార్డెన్" అని పిలిచాడు.ఒక గొప్ప చరిత్ర, శక్తివంతమైన సంస్కృతి గల ఈ నగరం యాత్రికులను ఆకర్షిస్తున్నది.ఇక్కడ చూడవలసిన కొన్ని ప్రాంతాలలో పంచ మందిర్, కంజ్‌లీ చిత్తడి నేలలు, జగతజిత్ ప్యాలెస్ వంటివి ప్రధాన ఆకర్షణలు మరియుఅంతే కాక ఇక్కడున్న చరిత్ర, సంస్కృతి విడదీయలేనిది.మతపరంగా చెప్పుకున్నట్లయితే ఇది ఒక సిక్కుల పవిత్ర ప్రదేశం.పర్యాటకులు ఇక్కడకు వచ్చి సహజ అందాలనూ, దీని చుట్టూ ఉన్న కట్టడాలను చూసి ఆనందించవచ్చు.

Photo Courtesy: Paul Hamilton

చుట్టి రండి.. కొత్త ప్రదేశాలను!!

చుట్టి రండి.. కొత్త ప్రదేశాలను!!

ఆగ్రా

భారత దేశ మాజీ రాజధానులలో ఒకటి, ప్రస్తుత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆగ్రా ఒక గొప్ప పర్యాటక ప్రదేశం.అమెరికా ప్రెసిడెంట్ అయిన సరే ఇక్కడున్న అందాలకు దాసోహం కావలసిందే!.తాజ్ మహల్, ఆగ్రా ఫోర్టు, చీని కా రౌజా లు ఆగ్రా లోని ప్రజాదరణ పొందిన స్మారక చిహ్నాలు.ఈ యొక్క ప్రదేశాలను సందర్శించినట్లయితే మనసుకి ఆహ్లాదం,సంతోషం కలుగుతుంది.

Photo Courtesy: Jungpionier

చుట్టి రండి.. కొత్త ప్రదేశాలను!!

చుట్టి రండి.. కొత్త ప్రదేశాలను!!

ఛోప్త

చోప్త అనే ప్రాంతం ఉత్తరాఖండ్‌లో ఉన్న ఒక హిల్ స్టేషన్.దీనిని "మినీ స్విజర్లాండ్" అని పిలుస్తారు.ఇక్కడ చవఖంబ, త్రిశూల్ మరియు నందా దేవి వంటి పర్వత శ్రేణులు ఇక్కడ గల ప్రధాన ఆకర్షణలు.ఇక్కడ పురాతన దేవాలయం తుంగ్‌నాథ్ పర్వత శ్రేణి మీద కలదు. ఈ మందిరాన్ని శివునికి అంకితం చేశారు.ఇక్కడకు వచ్చి ఎంతో మంది ప్రార్థనాలు చేస్తారు. ట్రెక్కింగ్ ద్వారా కూడా ఈ మందిరానికి చేరుకోవచ్చు.

Photo Courtesy: Vvnataraj

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి