Search
  • Follow NativePlanet
Share
» »వారణాసి - పవిత్ర పుణ్య క్షేత్రం !!

వారణాసి - పవిత్ర పుణ్య క్షేత్రం !!

కాశీకి పోయాను రామా హరి గంగ తీర్థమ్ము తెచ్చాను రామా హరి గంగ తీర్థము తెచ్చాను రామా హరి .... అనే పాట మీకు గుర్తుందా?? ఆ... కాశీ గురించే మీకు ఇప్పుడు చెప్పబోతున్నది. కాశీనే వారణాసి అని బెనారస్ అని పిలుస్తుంటారు. ఈ కాశీ చాలా పురాతనమైన పట్టణం ఎంత పురాతనమైనదంటే, సుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారణాసి అలియాస్ కాశీ నగరాన్ని స్థాపించాడని పౌరాణిక గాధల సారాంశం. గౌతమ బుద్ధుని కాలంలో ఇది కాశీ రాజ్యానికి రాజధానిగా ఒక వెలుగు వెలిగింది. వారణాసి నగరం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం తూర్పు భాగంలో గంగా మైదానంలో, గంగానది ఒడ్డున ఉంది. ఇక్కడ గంగానది వంపు తిరిగి ఉంది. ఇది వారణాసి జిల్లాకు కేంద్రం కూడాను. ఇక్కడ ప్రవహించే ఎంతో పవిత్రమైన గంగానదిలో వరుణ, అసి అనే రెండు నదులు కలుస్తాయి. దీంతో దీనికి వారణాసి అనే పేరు వచ్చింది. ఇంతటి పవిత్రమైన ఆ పుణ్యక్షేత్ర నగరంలో సందర్శించడానికి చాలానే వున్నాయి. ఇక ఎందుకు ఆలస్యం ఇక్కడున్న పవిత్ర స్థలాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలు గబగబ తెలుసుకుందాం పదండి.

గంగా నది

గంగా నది

ఇక్కడ ముందుగా తెలుసుకోవలసింది గంగా నది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం చేసుకోవడం వల్ల... మనం పుట్టుకనుండి చేసిన సర్వపాపాలు నశించి, పుణ్యులవుతారని హిందువుల ప్రగాఢ నమ్మకం. అంతేకాదు.. ఇక్కడ మరణించడం వల్ల ముక్తి లభిస్తుందని విశ్వశిస్తారు. అందుకేకాబోలు గంగా నదిలో స్నానం చేయటం అనేది కాశీ యాత్రలో అతి ముఖ్యమైన అంశంగా పరిగణిస్తారు.

Photo Courtesy: bot

గంగా హారతి

గంగా హారతి

గంగామాతకు నదీతీరక్షేత్రాలలో నిర్వహించే ఈ హారతి పవిత్ర కాశీలో కూడా ఘనంగా ప్రతిరోజూ నిర్వహిస్తుంటారు. ఈ హారతి దృశ్యాలను పతిరోజూ వేలాది మంది తిలకిస్తుంటారు. వీరిలో విదేశీయులు అధికంగా ఉండడం ఒక ప్రత్యేకత. ఈ హారతులను దశాశ్వమేధ్ ఘాటులో నిర్వహిస్తారు కనుక యాత్రీకులు దశాశ్వమేధ ఘాటుకు చేరుకోవడం అవసరం. ఈ హారతి దృశ్యాన్ని గంగాతీరంలో మరియు పడవలలో కూర్చుని వేలాదిమంది యాత్రికులు తిలకిస్తుంటారు.

Photo Courtesy: Jorgeroyan

దశాశ్వమేధ ఘాట్

దశాశ్వమేధ ఘాట్

దశాశ్వమేధ ఘాట్ చాలా పురాతనది మరియు వారణాసిలో గంగా నది యొక్క ఒడ్డున ఉన్న అన్ని ఘాట్ లలో అద్భుతమైనది. దాని చరిత్ర వేల సంవత్సరాల నాటిది. దశాశ్వమేద్ అంటే పది గుర్రాల త్యాగం అని అర్థం. పురాణం ప్రకారం, రెండవ శతాబ్దంలో అశ్వమేధ యాగాలను భారా శివ నాగ పాలకులు చేసారు. వారణాసిలో ప్రధాన ఘాట్ గా పరిగణించబడుతుంది. ఇది చాలా పెద్దది మరియు ఎక్కువ మంది సందర్శిస్తారు. హారతి ప్రతి ఉదయం మరియు సాయంత్రం పూజారులు నిర్వహిస్తారు. గంగా హారతి తో రూపొందించిన అద్భుత ప్రదర్శన ఉంటుంది. భక్తులు కాంతి చిన్న దీపములు వెలిగించి వాటిని నీటి ప్రవాహంలో వదులుతారు. ఈ ప్రదర్శన సాయంత్రం వేళలో జరిగి మనల్ని మంత్రముగ్దులను చేస్తుంది.

Photo Courtesy: FlickreviewR

మణికర్ణిక ఘాట్

మణికర్ణిక ఘాట్

వారణాసి లో ఉన్న పురాతన ఘాట్స్ లలో ఒకటి. మణికర్ణిక ఘాట్ అనేక పౌరాణిక ఇతిహాసాలతో ముడిపడి ఉంది. ఒక పురాణం ప్రకారం, శివుడు తన పార్వతిని ఒంటరిగా వదిలి తన భక్తులు సందర్శించడం కోసం తన మొత్తం సమయంను వెచ్చించేవాడు. అప్పుడు పార్వతీదేవి తన చెవిపోగు (మణికర్ణిక)ను ఇక్కడ దాచిపెట్టి దానిని వెతకమని శివుడిని కోరింది. దానికోసం వెతుకుతూ అక్కడే శివుడు ఉండిపోవడం వల్ల అతడు దేశదిమ్మరి కాడని పార్వతి ఆలోచన అట. ఇక్కడ దహనమైన శరీరం తాలూకు ఆత్మను శివుడు స్వయంగా మణికర్ణిక కనిపించిందేమోనని అడుగుతాడట. అతను చెవిపోగు శోధన సమయంలో శివుడు తవ్వినట్లు భావిస్తున్న మణికర్ణిక అని పిలిచే ట్యాంకు కూడా ఉంది. మణికర్ణిక ఘాట్ ను వారణాసి 'డెత్ టూరిజం' అని పిలుస్తారు.

Photo Courtesy: Noopur28

మన్ మందిర్ ఘాట్

మన్ మందిర్ ఘాట్

మన్ మందిర్ ఘాట్ 1585 లో నిర్మించబడింది. అంబర్ దాని నిర్మాణకర్త అయిన సవై రాజా మన్ సింగ్ పేరు పెట్టబడింది. మన్ మందిర్ ఘాట్ ను ముందు సోమేశ్వర ఘాట్ అని పిలిచేవారు. ఇక్కడ నాలుగు ఖగోళ సంబంధ పరికరాలు మంచి ఆకారంలో ఇప్పటికీ ఉన్నాయి. మన్ మందిర్ ఘాట్ లో వినాయక,రామేశ్వర మరియు సోమేశ్వర ఆలయం వంటి పలు ముఖ్యమైన ఆలయాలు ఉన్నాయి. తరువాత గుజరాత్ లోని సోమనాథ ఆలయం యొక్క ప్రతిరూపంగా ఒక సోమేశ్వర లింగం ఉంది. ఇది భారతదేశంలో ఉన్న తొమ్మిది ప్రముఖ జ్యోతిర్లింగం లలో ఒకటిగా భావిస్తున్నారు.

Photo Courtesy: varanasi city

అస్సీ ఘాట్

అస్సీ ఘాట్

గంగా నదిలో దక్షిణ ప్రాంతంలో ఉన్న అస్సీ ఘాట్ ముఖ్యంగా విదేశీ పర్యాటకులను మరియు పరిశోధకులు తరచుగా తప్పనిసరి సందర్శిస్తుంటారు. అస్సీ ఘాట్ నదులు అస్సీ మరియు గంగా సంగమం వద్ద ఉన్నది. ఒక పురాణం ప్రకారం, దుర్గాదేవి శుంభ -నిశుంభ రాక్షసులను చంపి ఆ తర్వాత ఇక్కడ ఆమె కత్తిని దూరంగా విసిరి వేసెను. ఆ కత్తి పడిన ప్రదేశము అస్సీ నదిగా ప్రాచుర్యంలోకి వచ్చింది. రెండు నదుల సంగమ పాలక దేవుడైన లార్డ్ అసిసంగమేశ్వర ఆలయం ఉన్నది. పీపాల్ చెట్టు క్రింద శివలింగం ఉన్నది.

Photo Courtesy: varanasi city

దర్భాంగా ఘాట్

దర్భాంగా ఘాట్

దశాశ్వమేధ ఘాట్ మరియు రానా మహల్ ఘాట్ మధ్య దర్భాంగా ఘాట్ ఉన్నది. దర్భాంగా అనే రాజ కుటుంబం నుండి ఈ ఘాట్ కు ఈ పేరు పెట్టబడింది. . ప్రముఖ హిందూ మతం నమ్మకం ప్రకారం మరణించే వారిని ఈ ఘాట్ లో దహనం చేస్తే మోక్షానికి మార్గం అని తెలుస్తోంది. దర్భాంగా ఘాట్ కూడా ఒక బహిరంగ శ్మశానం వలె సేవలు అందిస్తుంది. ఘాట్ కొంచెం నిటారుగా మరియు సన్నగా ఉంటుంది . ఈ ఘాట్ లో కూడా పరమశివుడికి అంకితమైన ఒక ఆలయం ఉంది.

Photo Courtesy: Bot

హనుమాన్ ఘాట్

హనుమాన్ ఘాట్

హనుమాన్ ఘాట్ వారణాసి లో ప్రసిద్ధ మతపరమయిన ఘాట్. ఇది తన విశ్వాస భక్తుడు అయిన హనుమంతుడు గౌరవార్దం రాముడు స్వయంగా నిర్మించారు అని నమ్మకం. దీనిని ముందు రామేశ్వరం ఘాట్ అని పిలిచేవారు. హనుమంతుడు ఎక్కువ శారీరక బలం గల దేవుడు. ఈ ఘాట్ బాడీ బిల్డర్లు మరియు కుస్తీ అభిమానులతో సందడిగా ఉంటుంది. ఇక్కడ కుస్తీ మరియు శరీరం బిల్డర్లు వ్యాయామాలు చేస్తారు. హనుమాన్ ఘాట్ లో గొప్ప కృష్ణ భక్తుడు అయిన వైష్ణవ శాఖకు చెందిన వల్లభాచార్య యొక్క ప్రసిద్ధ సెయింట్ నివాసం ఉంది. ఈ ఘాట్ లో ప్రపంచ ప్రసిద్ధ కావ్యమైన రామాయణంను రాసిన కవి తుల్సిదాస్ ఒక ఆలయంను స్థాపించారు. ఈ ఘాట్ లో వారణాసిలో శ్రీ కంచి కామకోటి పీఠం, శ్రీ శంకరాచార్య మఠం కూడా ఉన్నది.

Photo Courtesy: varanasi city

పంచగంగ ఘాట్

పంచగంగ ఘాట్

ఇది ఐదు పవిత్ర నదులైన గంగా, సరస్వతి, దుపపాప, యమునా మరియు కిరణ నదుల సంగమం వద్ద నిర్మించబడింది. అందుకే దీనికి పంచగంగ ఘాట్ అని పేరు వచ్చింది. ఈ ఐదింటిలో ఒక గంగ మాత్రమే కనపడుతుంది. మిగతా నాలుగు భూమిలో అదృశ్యమయ్యాయని నమ్ముతారు. ఈ పంచగంగ ఘాట్ వారణాసిలో అత్యంత పవిత్రమైన ఘాట్ లలో ఒకటిగా గుర్తించబడుతుంది.

Photo Courtesy: varanasi city

రానా మహల్ ఘాట్

రానా మహల్ ఘాట్

రానా మహల్ ఘాట్ పేరును సూచించిన విధంగానే 1670 లో రాజ్పుత్ నాయకుడు అయిన ఉదయ్ పూర్ మహారాణా నిర్మించారు. ఇది దర్భాంగా ఘాట్ మరియు చౌసైతి ఘాట్ మధ్య ఉన్నది. ఈ ఘాట్ నిర్మాణం రాజ్పుత్ శైలిలో ఉంటుంది.ఇది ప్యాలెస్ నివాసంగా ఉంది. రాజభవనం యొక్క గోధుమ నిర్మాణం యొక్క అడుగు భాగం వద్ద ఘాట్ ఉన్నది. ఘాట్ యొక్క దాని పైభాగంలో నిర్మించబడిన అద్భుతమైన పుణ్యక్షేత్రం ప్రధాన ఆకర్షణగా ఉంది.పిల్లలు మరియు పెద్దలు ఈత కొట్టటానికి వేసవిలో ఇక్కడకు వస్తారు. ఘాట్ లో రాత్రి సమయంలో దయ్యాలు ఉంటాయని ఒక కథ ప్రచారంలో ఉన్నది.

Photo Courtesy: Ekabhishek

విశ్వనాధ ఆలయం

విశ్వనాధ ఆలయం

కాశీ విశ్వనాధ మందిరం వారాణసిలో ప్రధాన ఆలయంగా చెప్పుకోవచ్చును. దీని గోపురంపైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని "బంగారు మందిరం" అని కూడా అంటుంటారు. ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న దేవుడు "విశ్వేశ్వరుడు" , "విశ్వనాధుడు" పేర్లతో పూజలందుకొంటుంటాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం తక్కిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో ఈ మందిరం విధ్వంసం చేయబడింది. తరువాత సమీపంలో మరొక మందిరం కట్టబడింది. అదే కొత్త విశ్వనాధ ఆలయం. కొత్త విశ్వనాధ ఆలయం ఒక పెద్ద ప్రాంగణం. ఇందులో వివిధ దేవీ దేవతలకు చెందిన ఏడు ఆలయాలు ఉన్నాయి. అయితే ఈ ఆలయ నేలపై ఉన్న అంతస్తులో శివుని విగ్రహం ఉంది, లక్ష్మీ నారాయణ, దుర్గా ఆలయాలు మొదటి అంతస్థులో ఉన్నాయి. తెల్లని చలువరాయితో చేయబడిన పొడవైన శిఖరం ఈ ఆలయ విశిష్ట లక్షణం. ఈ ఆలయ గర్భగుడిలో ఒక శివలింగం ఉంది.

Photo Courtesy: Ken Wieland

జైన్ ఆలయం

జైన్ ఆలయం

జైన్ ఆలయం జైనమత ఇరవై మూడవ తీర్దంకరుడైన పార్స్వనాద్ కి అంకితం చేయబడింది, ఈయన క్రీ.శ. 800 లో వారణాసిలో జన్మించాడు. ఈ అద్భుతమైన ఆలయ సందర్శన కళ్ళకు యదార్ధ స్థితిని అందిస్తుంది. దాని ప్రకాశవంతమైన బంగారు శిఖర౦ దూరం నుండి దృష్టిని ఆకర్షిస్తుంది. భక్తులు ఈ ప్రాంతంలో ప్రవేశించి ఈ ఆలయాన్ని సందర్శి౦ఛి పరమానందకరమైన శాంతిని, ప్రశాంతతను పొందుతారు. అయినప్పటికీ ఈ ఆలయాన్ని సంవత్సరంలో ఎప్పుడైనా సందర్శించవచ్చు.

Photo Courtesy: telugu nativeplanet

దుర్గ ఆలయం

దుర్గ ఆలయం

దుర్గా మాతకు అంకితం చేసిన దుర్గా ఆలయం వారణాసిలోని రామనగర్ లో ఉంది. ఈ ఆలయాన్ని 18 వ శతాబ్దంలో బెంగాలీ మహారాణి నిర్మించారని నమ్ముతారు, ప్రస్తుతం ఈ ఆలయం బనారస్ రాజ కుటుంబం అధీనంలో ఉంది. ఈ ఆలయం ఉత్తర భారత నిర్మాణశైలి నగర శైలిలో నిర్మించారు. ఇది దుర్గా కుండ్ అని పిలవబడే కొలను ఎదురుగా ఒక చదరపు పునాదిపై నిలవబడి ఉంది. ఈ ఆలయం నాలుగు మూలల్లో ప్రతిదీ ఎత్తైన గడియార స్తంభాలు, బహుళ అంతస్తుల గోపురం లేదా శిఖరాలను కలిగిఉంది. దేవత ధరించిన దుస్తుల లాగానే భవనానికి కూడా కాషాయ రంగు వేసారు.

Photo Courtesy: bot

కాశీ విద్యాపీఠం

కాశీ విద్యాపీఠం

కాశీ విద్యాపీఠ్ బ్రిటీషు వారికి వ్యతిరేకంగా జరిగిన భారత స్వాతంత్ర్య ఉద్యమానికి కేంద్రంగా ఉండేది. ఈ విద్యాపీఠ౦ ఒక ప్రఖ్యాత జాతీయవాది, విద్యావేత్త అయిన బాబు శివ ప్రసాద్ గుప్తా గారి ఆధ్వర్యంలో ఏర్పడింది. దీని మొదటి నిర్వహణా బోర్డులో మహాత్మా గాంధీ, లాలా లజపతి రాయ్, పండిట్ జవహర్ లాల్ నెహ్రు, జమునాలాల్ బజాజ్, ఆచార్య నరేంద్ర దేవ్ తోపాటు పి.డి.టాండన్, బాబు శివ ప్రసాద్ గుప్తా, డాక్టర్.భగవాన్ దాస్ వంటి ప్రముఖ దేశభక్తులు ఉండేవారు. ఈ విద్యాపీఠ ప్రముఖ పూర్వ విద్యార్ధులు కొందరు చంద్రశేఖర ఆజాద్, పండిట్ కమలాపతి త్రిపాఠి, లాల్ బహదూర్ శాస్త్రి, బి.వి.కేస్కర్, మననత్నాథ్ గుప్తా, భోల పాశ్వాన్ శాస్త్రి, రామకృష్ణ హెగ్డే, ప్రొఫెసర్.రాజా రామ్ శాస్త్రి మరికొందరు వీరితోపాటు ఉండేవారు.

Photo Courtesy: telugu nativeplanet

బనారస్ హిందూ యూనివర్సిటీ

బనారస్ హిందూ యూనివర్సిటీ

ప్రముఖంగా బి హెచ్ యు అని పిలువబడే బనారస్ హిందూ యూనివర్సిటీ ప్రముఖ దేశభక్తుడు, సంఘ సంస్కర్త, విద్యావేత్త, భారతదేశ రాజకీయ వేత్త భారతరత్న పండిట్ మదన్ మోహన్ మాల్వియ ఆయనే దీనికి కర్త, కర్మ ,క్రియ. ఇరవైవేల కంటే ఎక్కువమంది విద్యార్ధులతో, అరవై కంటే ఎక్కువ వసతిగ్రుహాలతో, ఇది ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ విశ్వవిద్యాలయంగా పరిగణించబడుతుంది. నిజానికి దీనిని ఒకప్పుడు ‘ఆక్స్ఫార్డ్ ఆఫ్ ఈస్ట్' అని పిలిచేవారు. ఇది ప్రపంచంలోని 34 కంటే ఎక్కువ దేశాల నుండి విద్యార్ధులను ఆకర్షిస్తుంది.

Photo Courtesy: Divya4india

వారణాసి చేరుకోవడం ఎలా

వారణాసి చేరుకోవడం ఎలా

విమాన మార్గం

వారణాసి కి సొంత అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అదే విధంగా ఢిల్లీ, లక్నో, ముంబై, ఖజురహో మరియు కోలకతా వంటి భారతీయ నగరాలతో ప్రత్యక్ష విమానాలు ద్వారా అనుసంధానించబడింది.

రైలు మార్గం

వారణాసి లో వారణాసి జంక్షన్ మరియు మొఘల్ సారాయ్ జంక్షన్ అనే రెండు ప్రధాన రైల్వే స్టేషన్లు ఉన్నాయి. ఇవి నగరంనకు తూర్పున 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఢిల్లీ, ఆగ్రా, లక్నో, ముంబై మరియు కోలకతా వంటి నగరాలు నుండి వారణాసికి ప్రతి రోజు అనేక సర్వీసెస్ ఉన్నాయి.

రోడ్డు మార్గం

బస్సుల ద్వారా లక్నో (5 గంటలు), కాన్పూర్ (5 గంటలు) మరియు అలహాబాద్ (2 గంటలు) వంటి నగరాలు నుండి వారణాసిని చేరుకోవచ్చు. బస్సులు సాధారణంగా నెమ్మదిగా మరియు అసౌకర్యంగా ఉండుట వలన మీరు రైలు లేదా విమాన మార్గాల ద్వారా వస్తే ప్రయాణం సులువుగా సాగుతుంది.

Photo Courtesy: Bot

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X