» »ఒకే రాతితో నిర్మించిన రథం !!

ఒకే రాతితో నిర్మించిన రథం !!

తమిళ ప్రాచీన కవి, తిరుక్కురళ్ సూక్తులు ద్వారా తమిళానికి సుమారు రెండు వేల సంవత్సరాలకు ముందే ఖ్యాతి కల్పించిన తిరువళ్ళువర్ కు గౌరవం కల్పించే విధంగా చెన్నైలో వళ్ళువర్ కోట్టం ను తమిళనాడు ప్రభుత్వం నిర్మించింది. నగరంలోని కోడంబాక్కంలోని పెరు తెరు (పెద్ద వీధి), విల్లేజ్ వీధుల కూడలిలో 1976 వ సంవత్సరం దీనిని నిర్మించారు. వళ్ళువర్ కోట్టం విశేషాలను ఒకసారి గమనించినట్లయితే ..

ఒకే రాతితో నిర్మించిన రథం !!

ఒకే రాతితో నిర్మించిన రథం !!

రథం

వళ్ళువర్ కోట్టం లో రథం ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తుంది. ప్రసిద్ధి చెందిన తిరువారూరు ఆలయం రథం పోలికతోనే దీనిని నిర్మించారు.

Photo Courtesy: Surajram Kumaravel

ఒకే రాతితో నిర్మించిన రథం !!

ఒకే రాతితో నిర్మించిన రథం !!

ఏనుగులు

128 అడుగులు (39 మీటర్లు) ఎతైన ఈ రథం ఎదుట నల్ల రాతితో చేసిన ఏడు అడుగుల ఎత్తు కలిగిన రెండు ఏనుగు విగ్రహాలు ఉన్నాయి. ఈ రథం చక్రాలు ఒక్కొక్కటి 11 .25 అడుగులు ఎత్తు ఉన్నాయి.

Photo Courtesy: thewhiterabbit11

ఒకే రాతితో నిర్మించిన రథం !!

ఒకే రాతితో నిర్మించిన రథం !!

తిరువళ్ళువర్ విగ్రహం

వళ్ళువర్ కోట్టం లో నిర్మించిన రథం పై భాగంలో 30 అడుగుల ఎత్తులో తిరువళ్ళువర్ విగ్రహం ఏర్పాటు చేశారు. విగ్రహం ఉన్న రథం భాగం మాత్రమే 40 అడుగుల వైశాల్యం కలిగి ఉంది. రథం పక్కనే నిర్మించిన ఆడిటోరియం పై భాగానికి చేరుకుంటే దాని పైనే ఈ తిరువళ్ళువర్ విగ్రహం నిర్మించినట్టు భ్రమ కలుగుతుంది. ఆ విధంగా ఆడిటోరియం, రథాన్ని పక్క పక్కనే నిర్మించారు. రథం కింది భాగంలో తిరుక్కురళ్ పద్యాల భావాలను వివరించే విగ్రహాలు ఉన్నాయి.

Photo Courtesy: thewhiterabbit11

ఒకే రాతితో నిర్మించిన రథం !!

ఒకే రాతితో నిర్మించిన రథం !!

పద్యాలు,సూక్తులు

220 అడుగుల ఎత్తు, 100 అడుగుల వెడల్పుతో ఆడిటోరియం నిర్మించారు. ఆడిటోరియం పై భాగానికి వెళ్ళే మార్గంలో 1330 తిరుక్కురళ్ సూక్తులు చెక్కిన నల్ల రాతి పలకలు ఏర్పాటు చేశారు. ఈ చోటుకు కురళ్ మని మాడం అని పెరు పెట్టారు.

Photo Courtesy : Keerthivasan Rajamani

ఒకే రాతితో నిర్మించిన రథం !!

ఒకే రాతితో నిర్మించిన రథం !!

మైదానం

ఆడిటోరియం పై భాగానికి చేరుకోగానే తిరువళ్ళువర్ విగ్రహం ఉన్న రథం పైకప్పు స్పష్టంగా కనిపించే విధంగా ఆడిటోరియం పైభాగం నేలపై ప్రత్యేక ఏర్పాటు చేశారు.

Photo Courtesy: Yves BENOIT

ఒకే రాతితో నిర్మించిన రథం !!

ఒకే రాతితో నిర్మించిన రథం !!

పార్కు

వళ్ళువర్ కోట్టం ప్రాంగణంలో అందమైన చెట్లు, మొక్కలు ఏర్పాటు చేయటంతో ఈ చోటు ఓ అందమైన పార్కు తరహాలో కూడా భావన కల్పిస్తుంది. పర్యాటకులతో పాటు స్థానికులు కూడా కాలక్షేపం కోసం ఇక్కడకు వచ్చి సేద తీరుతూ ఉండటంతో ఈ ప్రాంతం నిత్యం కళకళలాడుతూ కనిపిస్తుంది.

Photo Courtesy: Keerthivasan Rajamani

ఒకే రాతితో నిర్మించిన రథం !!

ఒకే రాతితో నిర్మించిన రథం !!

సందర్శించే వేళలు

చెన్నై లో ఉన్న వళ్ళువర్ కోట్టం ప్రదేశాన్ని సంవత్సరంలో అన్నివేళలా చూసిరావచ్చు. ప్రతిరోజు ఉదయం సరిగ్గా ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు తెరిచి, సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మూసివేస్తారు. ఈ వళ్ళువర్ కోట్టం ప్రదేశాన్ని పూర్తిగా చూడాలంటే రెండుగంటల సమయం పడుతుంది.

Photo Courtesy: Robynne

ఒకే రాతితో నిర్మించిన రథం !!

ఒకే రాతితో నిర్మించిన రథం !!

చెన్నైలోని కోయంబేడు బస్ స్టాండ్

వళ్ళువర్ కోట్టం చేరుకోవాలంటే మీరు ముందుగా చెన్నై చేరుకోవాలి అవునా, కాదా ?? మరి చెన్నై ఎలా చేరుకోవాలి ??

చెన్నై చేరుకోవడానికి విమాన మార్గం

చెన్నైలో ఉన్న 'అన్న ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ' లో జాతీయ మరియు అంతర్జాతీయ విమానాల రాకపోకలు జరుగుతుంటాయి. ఈ నగరం ఇండియా లో ఉన్న ఇతర ప్రాంతాలకు బాగా అనుసంధించబడి ఉన్నది. సింగపూర్ మరియు కొలంబో నుండి చెన్నైకి విమానాలు అందుబాటులో ఉన్నాయి. చెన్నై నుండి హైదరాబాద్, ఢిల్లీ, పోర్ట్ బ్లెర్ మరియు ముంబై వంటి నగరాలకు కామరాజ్ డొమెస్టిక్ ఎయిర్ పోర్ట్ విమానాలను నడుపుతున్నది.

చెన్నై చేరుకోవడానికి రైలు మార్గం

చెన్నైలో సెంట్రల్, ఎగ్మూరు, తంబరం అనే మూడు ప్రధాన రైల్వే స్టేషన్ లు ఉన్నాయి. చెన్నై దేశంలోని అన్ని ప్రముఖ నగరాలను దక్షిణ రైల్వే ద్వారా అనుసందించబడింది. ఇక్కడ నుండి ఢిల్లీ, కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్ మరియు ముంబై వంటి సూదూరప్రాంతాలకు రోజూ మరియు నేరుగా రైళ్ళు ఉన్నాయి. ఇక్కడ దక్షిణ రైల్వే ప్రధాన కార్యాలయం కలదు.

చెన్నై చేరుకోవడానికి బస్సు మార్గం

చెన్నై నగరానికి దేశంలోని బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిన్ వంటి నగరాల నుంచి ప్రతిరోజు ఆయా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలతో పాటుగా ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి. మన రాష్ట్రం నుంచైతే ప్రత్యేకంగా చెప్పాలా?? తిరుపతి నుంచి రోజు ప్రతి గంటకి బస్సులు చెన్నై మహానగారానికి నడుస్తుంటాయి. నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, కర్నూలు వంటి నగరాలనుంచి కూడా బస్సులు నడుస్తుంటాయి. విజయవాడ, వైజాగ్ వంటి మహా నగరాలనుంచి చెన్నైకి ప్రైవేట్ బస్సులు పోటీ పడి మరీ నడుపుతుంటాయి.

Photo Courtesy: Sudhamshu Hebbar

ఒకే రాతితో నిర్మించిన రథం !!

ఒకే రాతితో నిర్మించిన రథం !!

వళ్ళువర్ కోట్టం ఇలా చేరండి

చెన్నై మహా నగరంలో కోడంబాక్కంలోని ఉన్న ఈ ప్రదేశాన్ని చేరుకోవాలంటే, కోయంబేడు బస్ స్టాండ్ ( ప్రధాన బస్ స్టాండ్ - మన తెలుగు బస్సులన్ని ఇక్కడే ఆగుతాయి) నుంచి వళ్ళువర్ కోట్టం రావటానికి సుమారుగా ట్రాఫిక్ లేకపోతే పావుగంట , ఒకవేళ ట్రాఫిక్ ఉంటే అర్ధగంట సమయం పడుతుంది. నాకు తెలిసి 7 కి. మీ. దూరంలో ఉంది.

Photo Courtesy: STV