Search
  • Follow NativePlanet
Share
» »పాపులర్ టూరిస్ట్ ట్రీ హౌస్ వైతిరి రిసార్ట్ : వయనాడ్

పాపులర్ టూరిస్ట్ ట్రీ హౌస్ వైతిరి రిసార్ట్ : వయనాడ్

విహార యాత్రల్లోనూ వింత అనుభవాల కోసం అన్వేషించే వారికోసం కేరళలోని వైతిరి ప్రాంతం అనువైనది. ఎందుకంటే ఇక్కడ యాత్రికుల కోసం ప్రత్యేకంగా కట్టిన ఇళ్లుంటాయి. అందులో విశేషమూ, వింతా ఏముందని అనుకుంటున్నారా? ఆ ఇళ్లు చెట్లమీద ఉండడమే విశేషం. ఆ చెట్లు దట్టమైన అరణ్యంలో ఉండడమే మరో విశేషం.

వైతిరీ రిసార్ట్ కు భారత దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాపంగా పేరుంది. కేరళలోని వాయనాడ్ కు దగ్గర్లోని అటవీ ప్రాంతంలో ఈ రిసార్ట్ ఉంది. సతత హరితారణ్యాల్లో అంటే నిత్యం పచ్చగా ఉండే అటవీ ప్రాంతంలో ఈ రిసార్ట్ ను ఏర్పాటుచేశారు. చెట్టు కొమ్మల చిటారున స్థానికంగా దొరికే కలప, ఆకులు, చెట్టు బెరడు, వేళ్లు వంటి సహజ పదార్థాలతోనే ఇక్కడి రిసార్ట్ లోని ట్రీ హౌస్ లను నిర్మించారు.

వైతిరి చాలా ఎత్తైన ప్రదేశం

వైతిరి చాలా ఎత్తైన ప్రదేశం

వైతిరి చాలా ఎత్తైన ప్రదేశం. సుమారు పదమూడు వందల మీటర్ల ఎత్తున్న ఈ హిల్ స్టేషన్ ఎటు చూసిన కాఫీ, తేయాకు, యాలకులు, మిరియాలు, రబ్బరు తోటలతో కనువిందు చేస్తుంది. కళ్ళకే కాదు, ఆ తోటల నుండి వచ్చే సుగంధ పరిమలాలు మనస్సుకు ఆహ్లాదాన్ని మంచి అనుభూతిని కలిగిస్తాయి.

Photo Courtesy: Vanya resorts

 ఆహ్లాదకరమైన వాతావరణం

ఆహ్లాదకరమైన వాతావరణం

ఇక రిసార్ట్ చేరుకోవడానికి అడవిలో కాలినడకన నడుస్తుంటే గలగల పారే నది జలాలు, కుహు...కుహు అంటూ వింతైన శబ్ధం చేసే పక్షుల ధ్వనులు, గాలికి చెట్ల సవ్వడులు నిజంగా అనుభవిస్తే గానీ అసలు ఆనందం తెలియదు. ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం మధ్య మన వారంలోని మొదటి ఐదు రోజుల అలసటను ఇట్టే మరిచిపోతామనడంలో అతిశయోక్తి లేదు.

Photo Courtesy: Vythiri resort

ఆయుర్వేద స్పా

ఆయుర్వేద స్పా

ఇక్కడ మనకు ఆయుర్వేద స్పా కూడా అందుబాటులో ఉంటుంది. సహజంగా మసాజ్‌ అంటే కేరళనే గుర్తుకొస్తుంది. ఇక్కడి మసాజ్‌ లకు అంత ప్రాచుర్యం ఉంది. మసాజ్‌తో చాలా ప్రశాంతతను పొందుతారు.

P.C: You Tube

వైతిరికీ సమీపంలో మర్ని చూడదగ్గ ప్రదేశాలు కూడా ఉన్నాయి

వైతిరికీ సమీపంలో మర్ని చూడదగ్గ ప్రదేశాలు కూడా ఉన్నాయి

పూకోట్ సరస్సు:

వైతిరికి సుమారు అరకిలోమీటరు దూరంలో పూకోట్ సరస్సు ఉంది. చుట్టూ దట్టమైన వనసంపదతో, స్వచ్ఛంగా కనిపించే సరససులో బోటు షికారు మరో ఆకర్షణ. ఈ సరస్సులో నీలిరంగు తామరపూలు అద్భుతంగా కనబడుతాయి. పడవలో ప్రయాణించేటప్పుడు వాటిని అందుకుని కోసుకోవాలనిపించినా , కోయలేని పరిస్థితి అదే వాటిని తాకడం నిషేధమని ఒక బోర్డ్. ఏదేమైనా ఇక్కడ కాసేపు గడిపితే చాలు మానసిక ఒత్తిళ్ళు, ఉద్వేగాలు అన్నీ దూరమైపోయి ఏదో తెలియని ప్రశాంతత ఆవరించినట్లు అనిపిస్తుంది.పర్యాటకుల కోసం బోట్లు ఎప్పుడూ సిద్దంగా ఉంటాయి.

పొడవునా పొగ మంచు

పొడవునా పొగ మంచు

ఇక దారి పొడవునా పొగ మంచుతో ప్రకృతి అందాలను దాచేయాలనట్లుగా ప్రయత్నిస్తున్నట్లు కనబడుతుంది. ఇక్కడ ప్రయాణం మొత్తం చిరుజల్లుల మధ్య కొనసాగుతుంది. దట్టమైన అడవి మధ్యలో నిశ్చలమైన సరస్సులో చిరు జల్లులు పడుతూ ఉంటే బోట్‌ షికార్‌ చేయడం ఎవరికైనా ఓ మధుర జ్ఞాపకంగా గుర్తుండి పోతుంది.

చిరుజల్లులు పెట్టే గిలిగింతలు

చిరుజల్లులు పెట్టే గిలిగింతలు

చిరుజల్లులు పెట్టే గిలిగింతలకు సరస్సులోని నీళ్ళు సిగ్గుతో సుడులు తిరుగుతున్నట్లు కనబడుతుంది. ఇక్కడ ఒక్క ఆకాశం తప్ప చెట్లు, నీళ్ళు అంతా ఆకుపచ్చగా కనబడుతాయి. వంకలు తిరుగుతూ వయ్యారాలు పోయే ఈ రహదారిపై అలా ముందుకు సాగిపోతుంటే ఎంత దూరమైనా అలసట తెలియదు, సమయం తెలియదు. పుకోట్ సరస్సు రిసార్ట్ చాలా అద్భుతంగా అన్ని రకాల కాలుష్యాలకు దూరంగా, ముగ్ధమనోహరంగా ఉంటుంది.

చెంబ్రా పీక్ :

చెంబ్రా పీక్ :

వైతిరి ప్రాంతంలోని తేయాకు తోటల్లో నుండి, అరణ్యం మార్గం గుండా వెళ్ళే మార్గంలో చెంబ్రా పీక్ అనే కొండ ఉంది. ఈ ప్రాంతంలో ఇది ఎత్తైన కొండ అని చెబుతారు. దీని ఎత్తు సుమారు 2100 మీటర్లకు పైమాటే. దీనిపైకి ఎక్కడానికి ఒక రోజైనా పట్టొచ్చు. మరో విశేషమేమింటే చెంబ్రా పీక్ కొండపైన మరో సరస్సు ఉంటం. ఈ సరస్సు హృదయం ఆకారంలో ఉండటం వల్ల దీని పేరు హృదయ సరస్సు. ఇక్కడ ట్రెక్కింగ్ ఫూట్ హిల్స్ నుంచి ప్రారంభమవుతుంది. ఫూట్ హిల్స్ నుంచి కొండ మీదికి ట్రెక్ నెమ్మదిగా అధిరోహించటం చాలా ముఖ్యం. వాచ్ టవర్ వద్ద మొదటి బ్రేక్ తీసుకోవచ్చును. వాచ్ టవర్ నుండి అలా వెళ్తే హార్ట్ షేప్ లో వుండే ఒక సరస్సువస్తుంది. ఈ సరస్సును దాటిన తర్వాత శిఖరం చేరుటకు కొంచెం కష్టంగా వుంటుంది.

మీన్ ముట్టి జలపాతాలు

మీన్ ముట్టి జలపాతాలు

మీన్ ముట్టి జలపాతాలు ఒక మంచి టూరిస్ట్ ఆకర్షణ. మీన్ ముట్టి అంటే చేపులు గుంపుగా చేరి అడ్డగింఛిన ప్రదేశం అని చెపుతారు. కొన్ని సహజ కారణాలుగా ఈ ప్రదేశం నుండి చేపలు ఈత కొట్టలేక నిలబడి పోతాయని చెపుతారు.

సూచిపార జలపాతాలు

సూచిపార జలపాతాలు

ఎగిసిపడే సూచిపార జలపాతాలు వయనాడ్ లో మరొక ప్రధాన ఆకర్షణ. వీటిని సెంటి నెల్ రాక్ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. ఇవి కలపెట్ట కు 22 కి. మీ. ల దూరం.

PC: Yjenith

బాణాసుర సాగర్ డాం బాణాసుర సాగర్ డాం

బాణాసుర సాగర్ డాం బాణాసుర సాగర్ డాం

వయనాడ్ లో తప్పక చూడవలసిన ఒక టూరిస్ట్ ప్రదేశం. కాబిని నది ఉప నది పైన ఉన్న బనసుర సాగర్ డ్యాం కలపెట్ట పట్టణం నుండి 21 కి మీ ల దూరం లో ఉంది.ఈ డాం అద్భుత ప్రకృతి దృశ్యాలను చూపుతుంది. డాం వద్ద కల పార్క్ మీరు మీప్రియమైన వారితో కలసి విశ్రాంతి తీసుకొనేందుకు సౌకర్యంగా వుంటుంది.

ఎదక్కాల్ గుహలు

ఎదక్కాల్ గుహలు

ఎదక్కాల్ గుహలు వయనాడులో ప్రత్యేక ఆకర్షణ. ఒక్కసారి మీ ధైర్య సాహసాలు పరీక్షించుకోవాలంటే, మీరు ఈ గుహలు తప్పక అన్వేషించాలి. ఎందుకంటే ఇది దట్టమైన అడవి ప్రాంతంలో కొండలు, కోనలు, వాగులు, వంకలతో అలరారే ప్రదేశం. ప్రాచీనమైన గుహల్లో ఆదివాసీల చిత్రకలలు దర్శనం ఇస్తాయి. ఈ ఎడక్కాల్ గుహలల్లో ఒక రెస్టారెంట్ కూడా ఉండటం విశేషం.

రైన్ ఫారెస్ట్ బొటిక్ రిసార్ట్, అత్తిరపిల్లై

రైన్ ఫారెస్ట్ బొటిక్ రిసార్ట్, అత్తిరపిల్లై

కేరళలోని అతి ఎత్తైన జలపాతంగా పేరుగాంచిన అత్తిరపిల్లై వద్ద ఈ ట్రీ హౌస్ రిసార్ట్ ఉంది. దాదాపు ఏడు ఏడు చదరపు అడుగుల విస్తీర్ణంలోని అడవిలోని ఎతైన చెట్ల చిటారు కొమ్మలు మధ్య ఈ రిసార్ట్ ను ఏర్పాటు చేశారు. జల జల పారే సెలయేటి జలపాత అందాలను చూస్తూమనకున్సన మస్యలను కొద్ది సేపు పక్కన పెట్టి వీకెండ్ లో సేదతీరడానికి దీనికి మించిన మరో ప్రదేశం లేదని చెప్పవచ్చు. వైథిలీ రిసాట్‌ అతిధ్యం, వాతావరణం ఇంటిని మరిచిపోయేట్టు చేస్తాయి. అందుకే ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఎవరికైనా బాధగా అనిపిస్తుంది.

P.C: You Tube

చైన్ ట్రీ, వాయనాడు

చైన్ ట్రీ, వాయనాడు

ఆకర్షించే కథ తో ముడిపడడం వల్ల వాయనాడ్ లో ఉన్న ఈ చైన్ ట్రీ పర్యాటకులని ఆకర్షించే ప్రధాన పర్యాటక ప్రాంతం. ప్రపంచవ్యాప్తంగా ఏంతో మంది పర్యాటకులని ఇక్కడున్న అతిపెద్ద మర్రి చెట్టు ఆకర్షిస్తుంది. బ్రిటిష్ ఇంజనీర్ తనకి సహాయం చేసిన గైడ్ ని చంపివేశాడు. ఈ ప్రాంతాన్ని కనుగున ఘనతని పొందేందుకు బ్రిటిష్ ఇంజనీర్ ఆ గైడ్ ని చంపడానికి ప్రధాన కారణం. అప్పటి నుండి ఈ దారి నుండి ప్రయాణం చేసే ప్రయాణికులని ఆ గైడ్ ఆత్మా వెంటాడుతూ వేధిస్తూ ఉండేది. చివరికి, ఒక పూజారి తన శక్తినంతా ఉపయోగించి ఆ ఆత్మని ఒక గొలుసుతో బంధించి ఈ చెట్టుకి కట్టాడు. అలా ఈ చెట్టుకి 'చైన్ ట్రీ' అనే పేరు వచ్చింది. ఇప్పటికీ, వేలాడుతున్న ఒక చైన్ కనిపిస్తుంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more