Search
  • Follow NativePlanet
Share
» »మీ ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లాలనుకొంటే ఇక్కడికి వెళ్లండి

మీ ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లాలనుకొంటే ఇక్కడికి వెళ్లండి

ఎటు చూసిన సుందరం. నయన మనోహరం. అనువణువునా ప్రేమను నింపుకొన్న ప్రేమాలయం ఈ ప్రేమ మందిరం. ప్రేమలోని మాధుర్యాన్ని ఔనత్యాన్ని అనుభూతి చెందాలంటే ఈ ప్రేమమందిరాన్ని సందర్శించాల్సిందే. అంతేకాదు మీ ప్రేమను పెళ్లివరకు తీసుకెళ్లి ఆ ప్రేమను పరిపూర్ణం చేసుకోవాలంటే ఈ ప్రేమ మందిరాన్ని తప్పక సందర్శించాల్సిందే. మరి అలంటి ప్రేమ మందిరం ఎక్కడ ఉంది ఆ విశేషాలేమిటి తెలుసుకొందాం పదండి

ప్రేమ మందిరం

ప్రేమ మందిరం

P.C: You Tube

సుందరం, నయన మనోహరం అయిన ఈ ప్రేమ దేవాలయం ఉత్తర ప్రదేశ్ లోని మధురానగరి పట్టణంలో బ`ందావనంలో ఉంది. ఈ ప్రేమ మందిరంలో విష్ణువు రెండు అవతారాలను సందర్శించవచ్చు..

ప్రేమ మందిరం

ప్రేమ మందిరం

P.C: You Tube

రాధాక`ష్ణ, సీతారాముల మూర్తులను ఈ ప్రేమాలయంలో సందర్శించవచ్చు.. క`ష్ణుని నిష్కల్మషమైన ప్రేమ, రాముడి సాత్మిక గుణం అంతటా ప్రసరించాలనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని నిర్మించారు.

ప్రేమ మందిరం

ప్రేమ మందిరం

P.C: You Tube

దాదాపు 12 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా నిర్మించిన ఈ ఆలయం అద్భుత వాస్తుశైలిని సొంతం చేసుకొంది. అంతేకాదు సుమనోహరమైన శిల్పకళ కూడ ఈ ఆలయం సొంతం.

ప్రేమ మందిరం

ప్రేమ మందిరం

P.C: You Tube

ఎలాంటివారినైనా మరోహర భావనలకు లోనుచేసే ఈ ఆలయ శిల్ప సంపద భారతీయ శిల్ప కళా చాతుర్యానికి అద్ధం పడుతుంది.

ప్రేమ మందిరం

ప్రేమ మందిరం

P.C: You Tube

మధుర జిల్లాలోని పవిత్ర ధార్మిక యాత్రా కేంద్రమైన బ`ందావనంలో ఈ మందిం అత్యంత మనోహరంగా ఇక్కడ కేంద్రీక`తమయ్యింది.

ప్రేమ మందిరం

ప్రేమ మందిరం

P.C: You Tube

బ`ందావనానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాల్లో ఈ ప్రేమ మందిరం అతి ముఖ్యమైనది. మధుర నుంచి కేవలం 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని చేరుకొనేందుకు బస్సులు, కార్లు, రిక్షాలు తదితర వాహన సౌకర్యం అందుబాటులో ఉంది.

ప్రేమ మందిరం

ప్రేమ మందిరం

P.C: You Tube

ఇక ఢిల్లీ నుంచి మధురకు చేరుకోవడానికి రోడ్డు, రైలు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఈ సుందరమైన ప్రేమ మందిరాన్ని జగద్గురు శ్రీ క`పాలు జీ మహరాజ్ నిర్మించారని చరిత్రకారులు చెబుతారు.

ప్రేమ మందిరం

ప్రేమ మందిరం

P.C: You Tube

ప్రేమ తత్వంతో ఈ ఆలయాన్ని సందర్శించే ప్రతి ఒక్కరినీ ఈ ఆలయం ప్రభావితం చేస్తుంది. భారత దేశంలో కనిపించే ఏకైక ఆధ్యాత్మిక సాంస్క`తిక అంశాల కలయికగా ఈ ప్రేమ మందిరాన్ని భావించవచ్చు..

ప్రేమ మందిరం

ప్రేమ మందిరం

P.C: You Tube

బ`ందావనంలో జరిగిన ఓ ఘటన ఈ ఆలయ నిర్మాణానికి ప్రేరణగా నిలిచింది. క్రుపాలు మహారాజ్ ఒక సారి భక్త సాగరాన్ని ఉద్దేశించి ప్రవచనాలను వినిపిస్తుండగా ఈ జీవితంలో శాశ్వత ఆనందం అవసరం.

ప్రేమ మందిరం

ప్రేమ మందిరం

P.C: You Tube

దీనిని పొందేందుకు క`ష్ణుడి భక్తిలో తన్మయత్వం పొందడం అత్యంత ఆవశ్యకమని అలాంటి భక్తి మార్గాన్ని ఎంచుకునేందుకు అనుకూలమైన ఒక ఆలయాన్ని నిర్మించాల్సిందిగా భక్తుల నుంచి వచ్చిన కోరిక ఈ ఆలయ నిర్మాణానికి నాంధిగా నిలిచింది.

ప్రేమ మందిరం

ప్రేమ మందిరం

P.C: You Tube

ఉత్సవాల సందర్భంగా మరిముఖ్యంగా రాత్రివేళల్లో ఈ ఆలయాన్ని విభిన్న రంగుల విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. ఆ సమయంలో ఈ ప్రేమ మందిరం మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

ప్రేమ మందిరం

ప్రేమ మందిరం

P.C: You Tube

ఈ ఆలయాన్ని పూర్తిగా ఇలాలియన్ మార్బల్ తో నిర్మించారు. ఆలయంలోని ప్రతి రాతి స్తంభం పై చెక్కిన శిల్పాలు జీవం పోసుకొన్నట్లుగా నయన మనోహరంగా పర్యాటకులను ఆకర్షిస్తాయి.

ప్రేమ మందిరం

ప్రేమ మందిరం

P.C: You Tube

కేవలం ఆలయమే కాదు. ఆలయం చుట్టు పక్కల ప్రాంతం కూడా నిజంగానే ఉద్యానవనంలో శ్రీ క`ష్ణుడితో కలిసి ఉన్నామా అనే అనుభూతికి లోను చేస్తుంది.

ప్రేమ మందిరం

ప్రేమ మందిరం

P.C: You Tube

ఇక్కడి ఉద్యానవనాల పచ్చదనం, స్వచ్ఛత మనసుకు మరింత ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రస్తుతం ఈ ప్రేమ మందిరం నిర్వహణ జగద్గురు క్రుపాలు పరిషత్ అనే ట్రస్టు నిర్వహిస్తోంది.

ప్రేమ మందిరం

ప్రేమ మందిరం

P.C: You Tube

ఈ ప్రేమ మందిరాన్ని సందర్శిస్తే ప్రేమించిన వారితో తాము ప్రేమించిన వారితోనే వివాహం జరుగుతుందని చాలా మంది విశ్వసిస్తారు. క`ష్ణాష్టమి రోజున చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X