Search
  • Follow NativePlanet
Share
» » పర్యావరణ పరి రక్షణలో పులికాట్ సరస్సులు !

పర్యావరణ పరి రక్షణలో పులికాట్ సరస్సులు !

నెల్లూరు నగరం పెన్నా నది ఒడ్డున కలదు. ఈ ప్రాంతం లో ఎన్నో రకాల పంటలు పండుతాయి. ఈ నగరం విజయవాడ, తమిళనాడు రాజధాని అయిన చెన్నైల రహదారి లో వుండటం వలన వ్యాపారం, వాణిజ్యంలకు సంబంధించి ఎంతో ప్రధానమైనది. నగరంలో మౌలిక వసతులు కూడా అభివృద్ధి చెందటం చేత, ఇది ఆంధ్ర ప్రదేశ్ లో ఒక మంచి నగరంగా తయారు అవుతోంది. నెల్లూరుని అనేక రాజ వంశాలు పాలించాయి. ఇక్కడ కల పులికాట్ సరస్సు ప్రతి సంవత్సరం వివిధ రకాల వలస పక్షులను స్వాగతిస్తూ స్థానికులకు, పర్యాటకులకు కను విందు చేస్తుంది.

 వలస పక్షులు

వలస పక్షులు

నెల్లూరు సమీపంలో ప్రసిద్ధి చెందిన పులికాట్ సరస్సు సుమారు 350 కి. మీ. ల విస్తీర్ణం లో వ్యాపించి ఉంది. ఇక్కడకు వలస పక్షులు కూడా వచ్చి చెట్లపై నివాసం పొందుతాయి.
Photos Courtesy : en.wikipedia.org

రెండవ అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు

రెండవ అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు

అరుదైన వలస పక్షి జాతులకు నిలయంగా వుంటుంది. ఒరిస్సా లోని చిలకా లేక్ తర్వాత ఇది రెండవ అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు. ఈ ప్రదేశం శ్రీ హరి కోట ద్వీపం అనే పేరుతో బంగాళాఖాతం నుండి వేరుపడినది.
Photos Courtesy : en.wikipedia.org

చక్కటి పిక్నిక్ ప్రదేశం

చక్కటి పిక్నిక్ ప్రదేశం

పులికాట్ సరస్సు పర్యాటకులకు చక్కటి పిక్నిక్ ప్రదేశం. ఈ ప్రదేశం పక్షి సందర్శకులకు కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. సంవత్సరంలో చాలా భాగం పక్షి సందర్శకులు ఇక్కడకు వస్తారు.
Photos Courtesy : en.wikipedia.org

లేక్ లో బోటు విహారం

లేక్ లో బోటు విహారం

లేక్ లో బోటు విహారం కూడా చేయవచ్చు. ఇక్కడి మత్స్య కారుల వద్దనుండి రూ.500 కు ఒక బోటు అద్దెకు తీసుకొని, సరస్సు అంతా చుట్టి రావచ్చు. ఇక్కడ వాటర్ ఫౌల్, పెలికన్లు, హేరన్లు, ఫ్లమింగోలు వంటి పక్షులు తరచుగా కనపడతాయి.
Photos Courtesy : en.wikipedia.o

నేలపట్టు బర్డ్ సంక్చురి

నేలపట్టు బర్డ్ సంక్చురి

నేలపట్టు బర్డ్ సంక్చురి పులికాట్ సరస్సు కు 20 కి. మీ.ల దూరంలో నెల్లూరు జిల్లాలో తూర్పు కోస్తా ప్రాంతంలో కలదు. దీనికి చెన్నై మరియు, నెల్లూరుల నుండి చేరవచ్చు. ఇక్కడకు చెన్నై 50 కి. మీ.ల దూరం మాత్రమె వుంటుంది. ఈ శాంక్చురి ఎన్నో రకాల అరుదైన పక్షులకు జన్మస్థలంగా కలదు.
Photos Courtesy : en.wikipedia.org

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X