» »హనీమూన్ అనే మధురఘట్టాన్ని ఆస్వాదించటానికి వెళ్తున్నారా! అయితే వెంటనే ఈ ప్రదేశాలను చూడండి !

హనీమూన్ అనే మధురఘట్టాన్ని ఆస్వాదించటానికి వెళ్తున్నారా! అయితే వెంటనే ఈ ప్రదేశాలను చూడండి !

Posted By: Venkata Karunasri Nalluru

హనీమూన్ అంటే తియ్యని వెన్నెల అని అర్థం. హనీమూన్ అనేది ప్రతి జంటకు చాలా ముఖ్యమైనది. కుటుంబం మరియు స్నేహితుల నుండి దూరంగా వెళ్లి అందమైన క్షణాలు ఆనందిస్తారు. కొత్తగా పెళ్ళయిన భార్యాభర్తలు ఉల్లాసంగా గడపడానికి నెల రోజుల పాటు లేదా కొన్ని రోజులపాటు అందమైన ప్రదేశాలకు వెళ్ళి వస్తుంటారు.

నూతన వధూవరులు ఒకటైయెందుకు జరుపుకునే మొదటి ఉల్లాస యాత్రని హనీమూన్ అంటారు. భారతదేశంలో ఈ ప్రేమపక్షులు విహరించే హనీమూన్ ప్రదేశాలు చాలా వున్నాయి. అయితే ప్రయాణాలకు ముందుగా ప్లాన్ చేసుకోవాలి. దక్షిణ భారతదేశంలో చూడదగిన ప్రసిద్ధ హనీమూన్ ప్రదేశాలు వున్నాయి.

దక్షిణ భారతదేశంలోని హనీమూన్ ప్రదేశాలు

1. అందమైన ఊటీ

1. అందమైన ఊటీ

ఊటీ అందమైన నీలగిరి పర్వతాలలో ఉన్న అద్భుతమైన పట్టణం. ఊటీ "క్వీన్ ఆఫ్ హిల్‌స్టేషన్‌"గా పేరుగాంచింది. ఊటీలో వధూవరులు ఉన్నతమైన పర్వతాల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణం ఆనందించటానికి రిసార్ట్ వద్ద బసచేయవచ్చును.

2. ఊటీలో చూడదగిన ప్రదేశాలు

2. ఊటీలో చూడదగిన ప్రదేశాలు

ఈ అందమైన హిల్ స్టేషన్ లో ఊటీ తోటలు, ఊటీ లేక్, పెళ్లి డౌన్స్, ముకుర్తి మరియు దొడబెట్ట తప్పకుండా చూడవలసిన ప్రదేశాలు. మీరు ఇక్కడ హోం మేడ్ చాక్లెట్లు మరియు కొన్ని ఆహార వస్తువులు షాపింగ్ చేసి ఇంటి తిరిగి తీసుకొని వెళ్ళవచ్చును.

3. కూర్గ్ - కొత్త జంటల స్వర్గం

3. కూర్గ్ - కొత్త జంటల స్వర్గం

హనీమూన్ జంటలలు ఒకరికొకరు అర్థంచేసుకొనుటకు కూర్గ్ ఒక వేదికగా వుంది. ఇక్కడ కొండలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో హాయిగొలిపే వాతావరణం కలిగివుంటుంది.

4. కూర్గ్ లో చూడదగిన ప్రదేశాలు

4. కూర్గ్ లో చూడదగిన ప్రదేశాలు

కూర్గ్ ఒక అందమైన ప్రదేశం. వల్నుర్ ఫిషింగ్ క్యాంప్, అబ్బే జలపాతాలు, ఇరుప్పు జలపాతం మరియు హొన్నమన కెరె సందర్శించవలసిన అందమైన ప్రదేశాలలో కొన్ని.

5. కేరళ పడవ ఇళ్ళ ద్వారా ప్రకృతి అందాలను ఆస్వాదించండి.

5. కేరళ పడవ ఇళ్ళ ద్వారా ప్రకృతి అందాలను ఆస్వాదించండి.

మీకు ఇష్టమైన వారితో వుంటూ అందమైన అలలు మిమ్మల్ని మరింత దగ్గరకు చేరుస్తూ వుంటే అంతకంటే ఆనందించే శృంగారం ఏమీ వుండదు. కేరళలోని పడవ ఇళ్ళ ఫ్లోటింగ్, హనీమూన్ జంటలు నూతన మధురానుభూతులు అనుభవించడానికి తగినంత అవకాశం అందిస్తాయి.

6. పడవ ఇళ్ళను గురించిన సమాచారం

6. పడవ ఇళ్ళను గురించిన సమాచారం

పడవ ఇళ్ళను మీ బడ్జెట్ బట్టి ఎంపిక చేయవచ్చు. ఇక్కడ గల అద్భుతమైన ఆకలి పుట్టించే వంటలు మీరు మళ్ళీ ఈ ప్రదేశాన్ని దర్శించడానికి తగినంత ఉత్సాహం నింపుతుంది. పడవ ఇళ్ళకు ప్రసిద్ధిచెందినవి కుమరకోమ్ మరియు అల్లెప్పేయ్.

7. కొడైకెనాల్ లో మీ కలలను నిజం చేసుకోండి.

7. కొడైకెనాల్ లో మీ కలలను నిజం చేసుకోండి.

కొడైకెనాల్ మిమ్మల్ని మరో ప్రపంచానికి తీసుకువెళ్ళే ఒక అందమైన హిల్ స్టేషన్. ఇక్కడ వేగంగా ప్రయాణించే బోటింగ్ మరియు రకరకాల వృక్షాల వద్ద ఏటవాలుగా నడుస్తూ ఆనందించవచ్చును. ఇక్కడి పచ్చని కొండలు, సరస్సులు మొదలైనవి హనీమూన్ కు మంచి ప్రదేశంగా చెప్పుకొనవచ్చును.

8. కొడైకెనాల్ లో ఉత్తమమైనవి

8. కొడైకెనాల్ లో ఉత్తమమైనవి

కోడై సరస్సు, బెరిజం సరస్సు, బేర్ షోలా ఫాల్స్, కోకర్స్, వాక్ బైరంట్ పార్క్ మరియు పిల్లర్ రాక్స్ ఇక్కడ సందర్శించదగ్గవి.

9.మున్నార్ కొండలు చూద్దామా!

9.మున్నార్ కొండలు చూద్దామా!

మున్నార్ పచ్చని కొండలు మరియు అద్భుతమైన ప్రసిద్ధి ప్రదేశాలకు నిలయం. మున్నార్ హనీమూన్ కి హాట్ స్పాట్ అని ఎటువంటి సందేహం లేకుండా చెప్పవచ్చును. జంటలు ఇక్కడ కొండలు మధ్య ట్రెక్కింగ్ వెళ్ళడానికి మరియు బస చేయటానికి రిసార్ట్స్ కూడా అందుబాటులో వున్నాయి.

10. మున్నార్ లో చూడవలసిన ప్రదేశాలు

10. మున్నార్ లో చూడవలసిన ప్రదేశాలు

మీరు ఈ ఆకుపచ్చ కొండల వద్ద చూడవల్సిన ప్రదేశాలలో కొన్ని: పల్లివాసల్ ఫాల్స్, రాజమల, ఎకో పాయింట్, పొతన్మేడు, మీనులి మొదలైనవి వున్నాయి. మీరు ఈ స్థలంలో ట్రెక్కింగ్ మిస్ చేయవద్దు.

11. లక్షద్వీప్ ద్వీపం వద్ద రొమాన్స్

11. లక్షద్వీప్ ద్వీపం వద్ద రొమాన్స్

లక్షద్వీప్ పరిపూర్ణ ఏకాంత ప్రదేశం. ఇక్కడ హనీమూన్ జంటలు పరిపూర్ణ క్షణాలు ఆనందించవచ్చును. అంతేకాకుండా ఈ ద్వీపం సాహసోపేత చర్యలకు కూడా కేంద్రంగా ఉంది.

12. లక్షద్వీప్ వద్ద సాహసోపేత చర్యలు

12. లక్షద్వీప్ వద్ద సాహసోపేత చర్యలు

కవరత్తిలో అగట్టి మరియు కల్పేని అందమైన దీవులలో స్నార్కెలింగ్ మరియు స్కూబా డైవింగ్ వంటి సాహసోపేత చర్యలు చేయవచ్చును.

13. పాండి తీరం

13. పాండి తీరం

పాండిచ్చేరి హనీమూన్ బీచ్ వద్ద హనీమూన్ జంటలకు ఒక వేదికగా చెప్పవచ్చును. ఇక్కడి సహజమైన బీచ్ మీ ప్రియమైన వారితో కలిసి గడపటానికి ఒక మంచి ప్రదేశం.

14. పాండిచ్చేరిలో ఉత్తమమైనవి.

14. పాండిచ్చేరిలో ఉత్తమమైనవి.

భోజన ప్రియులు పాండిచ్చేరి హోటల్స్ లోఅద్భుతమైన వంటకాలు రుచి చూడవచ్చును. అక్కడ సందర్శించవలసిన ప్రదేశాలు అరికెమేడు, ఆరోవిల్ మిగిలినవి ఫ్రెంచ్ యుద్ధ స్మారకాలు.