Search
  • Follow NativePlanet
Share
» »సమ్మర్ వెకేషన్స్ కి కోవలం సముద్రా బీచ్ లో ఆనందకేళీ

సమ్మర్ వెకేషన్స్ కి కోవలం సముద్రా బీచ్ లో ఆనందకేళీ

బీచ్ లకి ప్రకృతికి ఏదో సంభంధం ఉంది, లేకుంటే పర్యాటకులను అంతగా ఆకర్షించవు అవునా?కాదా? అవును! ఎందుకంటే మనిషి తన జీవితంలో ఆనందాన్ని,ఆహ్లాదాన్ని ఇతరులతో పంచుకోవాలనుకోవడం సహజం. ప్రస్తుతం వేసవికాలం వస్తుంది కనుక పర్యాటకులు, ప్రకృతి ప్రియులు చల్లదనాన్ని ఆస్వాదించాలనుకుంటారు. చల్లదనం ఎక్కడ దొరుకుతుంది? అంటే తీర ప్రాంతాలలో....

భారతదేశంలోని తీరప్రాంతాలలో చెప్పుకోదగ్గ బీచ్ లు ఉన్నాయి. ఇవి ప్రకృతి ప్రియులను,పర్యాటకులను మరియు స్థానికంగా ఉండే వాళ్ళను ఎక్కువ సంఖ్యలో ఆకర్షిస్తున్నాయి. ఇలాంటి సముద్ర తీరాలకు వెళ్ళినప్పుడు మనసు చాలా ఆహ్లాదంగా, సంతోషంగా ఉంటుంది. ఇటువంటి ప్రదేశాలకు కుటుంబసభ్యులతో గాని,స్నేహితులతో గాని వెళితే ఉంటుంది ఆ మాటలు వార్ణించలేము. ముఖ్యంగా సమ్మర్ వెకేషన్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు బీచెస్ ను ఎంపిక చేసుకోవడం మంచిది. సమ్మర్ వెకేషన్స్ కు కేరళలోని కోవలం అనువైన ప్రదేశం.....

కొబ్బరితోటల అందాలకు నిలయమైన కేరళ

కొబ్బరితోటల అందాలకు నిలయమైన కేరళ

కొబ్బరితోటల అందాలకు నిలయమైన కేరళ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ విశేషాలు అనేకం ఉన్నాయి. అయితే ఇక్కడున్న అన్ని విశేషాల గురించి చెప్పుకునే సందర్భంలో కోవలంలో ఉన్న సముద్ర తీరం గురించి చెప్పుకు తీరాలి. కేరళ రాజధాని తిరువనంతపురం (పూర్వపు త్రివేండ్రం) దగ్గరలో ఉన్న ప్రసిద్ధ సముద్ర తీర పట్టణం కోవలం.

 అరేబియన్ మహా సముద్రానికి అభిముఖంగా

అరేబియన్ మహా సముద్రానికి అభిముఖంగా

అరేబియన్ మహా సముద్రానికి అభిముఖంగా ఈ పట్టణం నెలకొనిఉంది.
అందమైన ఈ సముద్రతీరం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటుంది. కేరళ పర్యటనకు వెళ్లిన పర్యాటకులు కోవలం బీచ్‌ను తప్పకుండా సందర్శించాలని అనుకుంటుంటారు. సముద్రతీరం అనగానే ఎగసిపడే పెద్ద అలలు, తీరానికి చాలా దూరం వరకు ఇసుక తప్ప చెట్టూ చేమా కన్పించకపోవడం అనేది మనకు తెలిసిందే. అయితే ఈ విషయాల్లో కోవలం బీచ్ కాస్త ప్రత్యేకమైనదని చెప్పవచ్చు.

చిక్కటి పచ్చదనం, ప్రశాంతమైన నీలిరంగుల మిశ్రమం

చిక్కటి పచ్చదనం, ప్రశాంతమైన నీలిరంగుల మిశ్రమం

చిక్కటి పచ్చదనం, ప్రశాంతమైన నీలిరంగుల మిశ్రమం హృదయానికి హత్తుకొనేంత ఆహ్లాదంగా ఉంటాయి. కోవలం లో మూడు ప్రధాన తీరాలు ఉన్నాయి. వీటిని చూడడానికి తెల్లవారుఝామున కానీ, బాగా సాయంత్రం గానీ వెళ్ళాలి.- అలా అయితే ఇక్కడి అందమైన సూర్యోదయ, సూర్యాస్తమయాలని ఆస్వాదించగలుగుతారు. కోవలంలోని తీరాలలో ఉండే ఇసుక రంగు చాలా విశిష్టతతో కూడినది. కాశ్మీర్ ‘భూమి మీద స్వర్గం'గా దీనికి ఒక ప్రత్యేక పేరు కూడా వుంది. ‘దక్షిణాది స్వర్గం' గా కోవలంకు పేరు వచ్చింది.

కోవలం వెళ్ళినపుడు ఈ మూడు తీరాలను చూడాల్సిందే.

కోవలం వెళ్ళినపుడు ఈ మూడు తీరాలను చూడాల్సిందే.

కోవలం వెళ్ళినపుడు ఈ మూడు తీరాలను చూడాల్సిందే. ఎందుకంటే దేని అందం దానిదే. ఈ మూడు తీరాలలో లైట్ హౌస్ బీచ్ అన్నిటికంటే పెద్దది. ఇక్కడ కురుమ్కల్ కొండమీద 35 మీటర్ల ఎత్తున్న లైట్ హౌస్ ఉండడం వల్ల ఈ తీరానికి ఆ పేరు వచ్చింది. లైట్ హౌస్ తీరానికి, హవా తీరానికి అత్యధిక సంఖ్యలో వస్తుంటారు. ఇది నగరానికి దగ్గర్లో ఉన్నందున పర్యాటకులను అధిక సంఖ్యలో ఆకర్షిస్తుంది.

 ఇది రేవులోకి వచ్చి పోయే ఓడలకు మార్గదర్శనం చేసేది.

ఇది రేవులోకి వచ్చి పోయే ఓడలకు మార్గదర్శనం చేసేది.

గతంలో ఈ తీరం పక్కనే ఉన్న కొండమీద విజింజం లైట్ హౌస్ గా పిలువబడే ఒక దీపస్తంభం ఇక్కడ ఉండేది. ఇది రేవులోకి వచ్చి పోయే ఓడలకు మార్గదర్శనం చేసేది. అదృష్టవశాత్తూ, కాలగమనం గానీ, ప్రకృతి వైపరీత్యాలు కానీ ఈ దీపస్తంభాన్ని ప్రభావితం చేయలేదు. రాత్రిపూట ఈ దీపస్తంభం నుంచి వెలువడే కాంతిరేఖలు ఈ తీరానికి ఒక అందమైన లక్షణాన్ని అందించాయి. అందువల్ల, అద్భుతమైన ఈ దృశ్యాన్ని చూడడానికి ఈ తీరాన్ని రాత్రిపూటే సందర్శించాలి.

తీరానికి ఉత్తర భాగంలో బీచ్ ఉంటుంది. స

తీరానికి ఉత్తర భాగంలో బీచ్ ఉంటుంది. స

తీరానికి ఉత్తర భాగంలో బీచ్ ఉంటుంది. సన్ బాతింగ్, ఈత, హెర్బల్ బాడీ టోనింగ్ మసాజ్‌లు, ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు, కాటమరాన్ క్రూసింగ్ వీటిలో కొన్ని ఇతర రెండు తీరాలలాగా ఉంటాయి.

కోవలం లోని మూడు ప్రసిద్ధ బీచ్ లలో సముద్రా బీచ్ ఒకటి. ఈ సముద్రా బీచ్ కోవలం తీరప్రాంత ఉత్తర భాగంలో ఉంది, ఇది మిగిలిన రెండు బీచ్ ల లాగా ఎక్కువమంది పర్యాటకులను ఆకర్షించ లేదు. ఇది ఉత్తర, దక్షిణ తీర రేఖల పర్వత పంక్తులపై ఉండడమే ప్రధాన కారణం.

 మీరు తీరం లోని ఈ వైపు నీటిలోకి దూకే సాహసం చేసేట్లయితే

మీరు తీరం లోని ఈ వైపు నీటిలోకి దూకే సాహసం చేసేట్లయితే

ఇక్కడ పెద్ద పర్యాటక జనాభా లేకపోవడం వల్ల, స్థానిక జాలర్లు ఈ తీరం వెంట చేపలు పడుతూ వారి జీవనం కొనసాగిస్తుంటారు.

అయితే, మీరు తీరం లోని ఈ వైపు నీటిలోకి దూకే సాహసం చేసేట్లయితే రాళ్ళకు కొట్టుకునేలా ఎగసి పడి మళ్ళీ వెనక్కి తగ్గే సౌమ్యమైన అలలను ఇక్కడ చూడవచ్చు.

ఈ తీరం వెంట ఒక గోడ వుంది - దాని పైన కూర్చుని అందమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. ఈ తీరం నిండా కొబ్బరి, తాటి చెట్లు వుండి దీనికి ఒక పచ్చదనాన్ని తీసుకువచ్చాయి.

కోవలం తీరం వెంట ఈ మూడూ కాక అశోక బీచ్ అనే పేరుతో ఇంకో తీరం కూడా ఉంటుంది. హనీమూన్ కి వచ్చేవారు, గోప్యత కోరుకునేవారు ఈ తీరం వెంట తిరుగుతూ సరదగా గడుపుతుంటారు.

https://www.flickr.com/photos/momentsnotice/33073131333

ఎలా వెళ్లాలి:

దగ్గరల్లో ఉన్న రైల్వే స్టేషన్: తిరువనంతపురం సెంట్రల్, సుమారు 16 కిమీ
దగ్గరల్లోని ఎయిర్‌పోర్ట్: త్రివేండ్రం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X