Search
  • Follow NativePlanet
Share
» »సావో జోవో : వినోదం, ఉల్లాసం, ఉత్సాహం !

సావో జోవో : వినోదం, ఉల్లాసం, ఉత్సాహం !

By Mohammad

సావో జోవో పేరు కొత్తగా వింటున్నారా ? గోవాలో ఉన్నవారి కైతే దీని గురించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఇది గోవా లో మాత్రమే నిర్వహించే వేడుక. వారికి దీని గురించే తెలిసి ఉంటుంది. గోవా లో యువకులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు, చిందులేస్తారు, ఆనందిస్తారు. అర్థం కావటం లేదా అయితే దీని గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిందే !

సావో జోవో అనేది ఉత్సవం పేరు. దీనిని సంవత్సరం లో ఒకేరోజు జరుపుకుంటారు. అది కూడా జూన్ 24 న మాత్రమే. సెయింట్ జాన్ బాపిస్ట్ గుర్తుగా ఉత్సవాలను నిర్వహిస్తారు. ఉత్సవంలో భాగంగా గోవాలోని యువకులు సమీపంలోని బావులలో, చెరువులలో, కుంట లలో దూకుతారు. దూకి ఏమి చేస్తారు అనేగా మీ డౌట్ ? గ్రామంలోని ప్రజలు బావిలో పడేసిన గిఫ్ట్ లను తిరిగి పట్టుకుంటారు. ఇదే సావో జోవో ఉత్సవం అంటే . గోవా రాష్ట్రంలో క్రిష్టియన్లు జరుపుకొనే అత్యంత ప్రసిద్ధ వేడుక ఇది.

dying in water stream

చిత్ర కృప : Joegoauk Goa

గోవాలో వర్షాకాలం మొదలయ్యే సమయంలో సావో జోవో ఉత్సవం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో ఊరిలో ఉన్న అన్ని వయసుల వారు చెరువులలో, బావులలో మరియు కుంట లలో దూకుతారు. ఉత్తర గోవా బెర్డెజ్ తాలూకాలోని సియోలిం గ్రామంలో రంగురంగుల బోట్ రేసులు నిర్వహిస్తారు. మాన్సూన్ సీజన్ లో క్రిస్టియన్లు నిర్వహించే ఈ వేడుక, వారికి అత్యంత ప్రధానమైనది మరియు బాపిస్ట్ సెయింట్ జాన్ కు ఈ వేడుకలను అంకితం చేశారు.

సావో జోవో వేడుకల ఆనందాన్ని గోవా ప్రజలు సంవత్సరం పొడవునా గుర్తుంచుకుంటారు. ఆనందం, ఉత్సాహం, రంగులు మరియు సంప్రదాయం తో ఆకర్షణీయంగా జరుపుకొనే ఈ వేడుక ను తిలకించటానికి పోర్చుగీస్, స్పెయిన్ తదితర పాశ్చాత్య దేశాల నుండి యాత్రికులు వస్తుంటారు.

గోవాలోని వివిధ గ్రామాల ప్రజలు రంగురంగుల దుస్తులను ధరించి సమీపంలోని ఒక పెద్ద ప్రదేశంలో సమూహంగా ఏర్పడి ఉత్సవ కార్యక్రమాలను జరుపుకుంటారు. సావో జోవో పండగ ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటారు. దక్షిణ గోవాలో పడవ లను ఒకదాని తో ఒకటి సమంగా కలపబడి నీటిలో వదిలేస్తారు. లేదా రెండు పెద్ద అరటి కాండాలని తీసుకొని వచ్చి అందంగా అలంకరించి నీటి ప్రవాహాల వద్ద వదులుతారు.

people at sao joao

చిత్ర కృప : Joegoauk Goa

ఉత్తర గోవాలో సావో జోవో వేడుకలు అట్టహాసంగా జరుగుతాయి. మీరు ఈ వేడుకను బాగా ఆనందించాలంటే సియోలిం, అంజనా, అస్సగావ్ మరియు కాలన్ గూటే లను తప్పక సందర్శించాలి.

ఉత్సవం రోజు మొదట గ్రామంలోని ప్రజలు దగ్గరలోని బావుల్లో దూకి 'సావో జోవో ... సావో జోవో' అంటూ పాటలు పాడుతారు. సంగోడ్ లు ఉత్సవ ప్రధాన ఆకర్షణ. మనకర్థమయ్యే రీతిలో చెప్పంటే వాలంటీర్లు అన్నమాట. వీరు సంప్రదాయ యూనిఫామ్ డ్రెస్ ను ధరించి గ్రామీణ పాటలను, నృత్యాలను మరియు ఆ రోజున జరిగే అన్ని కార్యక్రమాలను ఓపికతో సమర్ధవంతగా నిర్వహిస్తారు.

boat at christian festival

చిత్ర కృప : Joegoauk Goa

ఉత్తర గోవా లోని బార్డెజ్ వద్ద సావో జోవో ఉత్సవం సుమారు 150 సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తున్నది. పుట్టిన పిల్లల ను ఒకేచోటికి చేర్చి బహుమతులను, ఆట బొమ్మలను ప్రదానం చేస్తారు. కొత్తగా పెళ్ళైన వారికి కూడా సావో జోవో శుభం చేకూరుస్తుందని భావన.

యువకులు సాయంత్రం సంప్రదాయ పాటలు, నృత్యాలను చేస్తూ గ్రామంలో అలరిస్తుంటారు. స్త్రీలు తలకు గుబాళించే పూలను పెట్టుకొని వయ్యారంగా వంపులు తిరుగుతూ ఆనందంలో మునిగితేలుతారు.

మీకు వినోదం, ఉల్లాసం, ఉత్సాహం అన్ని ఒకేసారి అనుభవించాలంటే జూన్ 24 వ తేదీన గోవా లో జరిగే సావో జోవో ఉత్సవాలకు హాజరుకండి.

గోవా చేరుకోవటం చాలా సులభం. రవాణా సౌకర్యాలు అన్ని అందుబాటులో ఉన్నాయి. దగ్గరిలో డబోలిం ఎయిర్ పోర్ట్ మరియు మూడు ప్రధాన రైల్వే స్టేషన్ లు ఉన్నాయి. ముంబై, బెంగళూరు ,హైదరాబాద్ తో పాటు దేశంలోని అన్ని నగరాలతో రోడ్డు మార్గం చక్కగా అనుసంధానించబడింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X