• Follow NativePlanet
Share
» »హిమాలయాల చివర శ్రేణులు !

హిమాలయాల చివర శ్రేణులు !

సిటీ లో చాలా భాగం మసీదులు మరియు బౌద్ధ మత కండరాలు. ఇవన్నీ సుమారు 16 లేదా 17 శతాబ్దాల నాటివి. మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలు. నగర అందాలకు మరింత మెరుగులుదిద్దాయి. సాహసికులు ఎగుడు దిగుడుగా వుండే ఈ మంచు పర్వత ప్రాంతాలలో ట్రెక్కింగ్ చేసి ఆనందించవచ్చు. ట్రెక్కింగ్ తో పాటు ప్రకృతి అందాలు చూసి తనివి తీరా ఆనందించ వచ్చు.లెహ్ ఎయిర్ పోర్ట్ సాధారణంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు అంటే జమ్మూ, ఢిల్లీ, శ్రీనగర్ మొదలైన పట్టణాలకు రిటర్న్ జర్నీ టికెట్ లు కూడా ఇచ్చేస్తుంది. హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు లలో మనాలి నుండి లెహ్ చేరవచ్చు. లెహ్ నగరం కారకోరం మరియు హిమాలయ పర్వత శ్రేణుల మధ్య ఇండస్ నది ఒడ్డున కలదు. ఈ ప్రదేశ ప్రకృతి అందాలు సుదూర పర్యాటకులను సైతం ఆకర్షిస్తాయి.

 ఎలా చేరాలి ?

ఎలా చేరాలి ?

లెహ్ ఎయిర్ పోర్ట్ సాధారణంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు అంటే జమ్మూ, ఢిల్లీ, శ్రీనగర్ మొదలైన పట్టణాలకు రిటర్న్ జర్నీ టికెట్ లు కూడా ఇచ్చేస్తుంది. హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సు లలో మనాలి నుండి లెహ్ చేరవచ్చు.

Photo Courtesy: Ville Hyvönen

హేమిస్ మొనాస్టరీ

హేమిస్ మొనాస్టరీ

హేమిస్ మొనాస్టరీ లెహ్ ప్రదేశానికి ఆగ్నేయంగా 45 కి. మీ. ల దూరంలో కలదు. ఈ బౌద్ధ విహారం పూర్తిగా బౌద్ధ సంస్కృతి కూడి టిబెట్ శిల్ప శైలి నిర్మాణం కలిగి వుంటుంది. ఈ బౌద్ధ విహారం చుట్టూ అనేక ఇతర క్షేత్రాలు కూడా కలవు. అన్నిటికంటే ప్రధాన ఆకర్షణ ఇక్కడ కల రాగి బౌద్ధ విగ్రహం. వరండా గోడలపై కల పెయింటింగ్ లు కాల చక్ర, జీవిత చక్రాలు వంటి బౌద్ధ మత ఆకర్షణలు కలిగి వుంటాయి.

Photo Courtesy: WoodElf

లెహ్ పాలస్

లెహ్ పాలస్

లెహ్ రాజ భవనాన్ని సేన్గ్గీ నమగ్యాల్ రాజు 17 వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ పాలస్ మొత్తంగా 9 అంతస్తులు పై అంతస్తులలో రాచ కుటుంబీకులు నివాసం వుంటారు. కింది అంతస్తులలో వారికి సంబంధించిన వాహనాలు వుంటాయి. ఈ ప్రదేశం చూసే పర్యాటకులు అందమైన స్టాక్ కాంగ్రి , ఇండస్ వాలీ, లడఖ్ పర్వత శ్రేణులు కూడా చూడవచ్చు. శాంతి స్తూప శాంతి స్తూప జమ్మూ కాశ్మీర్ లోని లెహ్ జిల్లాలో కలదు.

స్తూఫం ప్రత్యేకత

స్తూఫం ప్రత్యేకత

దానికి గల ధగ ధగ మెరిసే బుద్ధుడి కధలు చెప్పే కుడ్య చిత్రాలు. అద్దె జీపులు లేదా టాక్సీ లలో ఇక్కడకు తేలికగా చేరవచ్చు. సాహసికులకు ట్రెక్కింగ్ వంటివి కూడా ఇక్కడ కలవు.

Photo Courtesy: Michael Goodine

స్పితూక్ మొనాస్టరీ

స్పితూక్ మొనాస్టరీ

స్పితూక్ మొనాస్టరీ ని స్పితూక్ గోమ్పా అని కూడా అంటారు. ఇది లెహ్ నగరం నుండి 8 కి. మీ. ల దూరంలో కలదు. ఇక్కడ మీరు అనేక పురాతన మాస్క్ లు, విగ్రహాలు, పురాతన ఆయుధాలు, అనేక టిబెట్ సిల్క్ పెయింటింగ్ లు చూడవచ్చు. స్తోక్ పాలస్ స్తోక్ పాలస్ లెహ్ నగరం నుండి సుమారు 15 కి. మీ. ల దూరంలో కలదు. ఈ పాలస్ మొదట్లో రాయల్ ఫ్యామిలీ నివాసం గా వుండేది. దీనిని సాంప్రదాయక రీతిలో అందమైన శిల్ప శైలితో నిర్మించారు.

పాలస్ నుండి

పాలస్ నుండి

పాలస్ నుండి , అక్కడ కల గార్డెన్ ల నుండి సూర్యోదయం, సూర్యాస్తమయాలు అద్భుతంగా వుంటాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే ముసుగు వేష డాన్స్ ఫెస్టివల్ ఒక ప్రత్యేకత. ఈ సమయంలో టూరిస్ట్ లు పాలస్ లోని అరుదైన రాచ కుటుంబీకుల వస్తువులు చూడవచ్చు. ఈ పాలస్ చూసేందుకు కనీసం నాలుగు నుండి అయిదు గంటల సమయం పడుతుంది. పాలస్ లోపలి భాలలోనే స్పితూక్ మొనాస్టరీ కలదు. ఇది కూడా ఒక టూరిస్ట్ ఆకర్షణ.

sts. Photo Courtesy: Baldiri

తిస్కేయ్ మొనాస్టరీ

తిస్కేయ్ మొనాస్టరీ

తిస్కేయ్ మొనాస్టరీ లెహ్ పట్టణానికి తూర్పు దిశగా 19 కి. మీ. ల దూరంలో కలదు. ఇది మధ్య యుగ కాలం నాటి శిల్ప శైలి కలిగి ఆకర్షణీయంగా వుంటుంది. ఇది ఈ ప్రాంతంలో అతి పెద్ద బౌద్ధ ఆరామం. 12 అంతస్తులు కలిగి వుంటుంది. అందమైన కుడ్య చిత్రాలు , స్తూపాలు, విగ్రహాలు, కత్తులు, మొదలనవి లోపలి భాగంలో ప్రదర్శిస్తారు. ఈ మొనాస్టరీ లో కల అతి పెద్ద స్తంభంపై కల బుద్ధుడి బోధనల చెక్కడాలు పర్యాటకులకు ఒక ప్రత్యేక ఆకర్షణగా వుంటాయి.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి